‘‘ముత్తయ్య మురళీధరన్ బయోపిక్‌గా ‘800’ రూపొందింది. బయోపిక్ కాబట్టి కథలో మార్చడానికి ఏం ఉంటుంది? ఆయన జీవితంలో కమర్షియల్ హంగులన్నీ ఉన్నాయి. ఒక మనిషి జీవితం ఇలా ఉంటుందా? అన్ని అవరోధాలు ఎదుర్కొని ముత్తయ్య ఈ స్థాయికి చేరుకున్నారా? అని ప్రేక్షకులు ఆశ్చర్య΄ోతారు’’ అని నిర్మాత శివలెంక కృష్ణప్రసాద్ అన్నారు.
శ్రీలంకన్ ఆఫ్ స్పిన్నర్ ముత్తయ్య మురళీధరన్ జీవితం ఆధారంగా తెరకెక్కిన చిత్రం ‘800’. ముత్తయ్యగా మధుర్ మిట్టల్, ఆయన భార్య మది మలర్ ΄ాత్రలో మహిమా నంబియార్ నటించగా ఎంఎస్ శ్రీపతి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రమిది. శివలెంక కృష్ణప్రసాద్ సమర్పణలో ఈ నెల 6న ప్రపంచవ్యాప్తంగా తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ఈ చిత్రం విడుదలవుతోంది.
శివలెంక కృష్ణప్రసాద్ మాట్లాడుతూ– ‘‘శ్రీపతిని మా నిర్మాణ సంస్థలోనే దర్శకుడిగా పరిచయం చేయాలనుకున్నాం. అయితే ‘800’కి చాన్స్ వచ్చిందని చెబితే ఆ సినిమా చేసి రమ్మని నేనే చె΄్పాను. ఈ చిత్రాన్ని ఇండియాలో సుమారు 1100 థియేటర్లలో విడుదల చేస్తున్నాం. శ్రీపతితో ఓ సినిమా, ‘యశోద’ చిత్రదర్శకులతో మరో సినిమా చేస్తాను. దర్శకుడు పవన్ సాధినేనితో ఓ చిత్రం కోసం చర్చలు జరుగుతున్నాయి’’ అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment