800 Movie
-
ఈ వారం ఓటీటీల్లోకి రాబోతున్న 25 సినిమాలు
ఎప్పటిలానే మరోవారం వచ్చేసింది. ఈసారి థియేటర్లలో 'యానిమల్' తప్పితే చెప్పుకోదగ్గ మూవీ ఏం లేదు. దీంతో మూవీ లవర్స్ కన్ను ఓటీటీలపై పడింది. వీళ్లని ఎంటర్టైన్ చేసేందుకు 25 వరకు సినిమాలు-వెబ్ సిరీసులు పలు ఓటీటీల్లో స్ట్రీమింగ్ కానున్నాయి. అయితే వీటిలో పలు తెలుగు స్ట్రెయిట్, డబ్బింగ్ సినిమాలు ఉండటం విశేషం. (ఇదీ చదవండి: Bigg Boss 7: రతిక ఎలిమినేట్.. మొత్తం ఎంత సంపాదించిందో తెలుసా?) ఈ వారం ఓటీటీ రిలీజ్ మూవీస్ విషయానికొస్తే.. నాగచైతన్య 'దూత' వెబ్ సిరీస్ చాలా ఇంట్రెస్ట్ కలిగిస్తోంది. దీనితో పాటు 'చిన్నా', 'మార్టిన్ లూథర్ కింగ్', 800, జర హట్కే జర బచ్కే, మిషన్ రాణిగంజ్ చిత్రాలు ఆసక్తి కలిగిస్తున్నాయి. ఇవన్నీ కూడా డిఫరెంట్ డేట్స్‌లో స్ట్రీమింగ్‌లోకి రానున్నాయి. ఇంతకీ ఏ మూవీ ఏ ఓటీటీలోకి రానుందనేది ఇప్పుడు చూద్దాం. ఈ వారం ఓటీటీలో రిలీజయ్యే మూవీస్ (నవంబరు 27- డిసెంబరు 3 వరకు) అమెజాన్ ప్రైమ్ షెహర్ లఖోట్ (హిందీ సిరీస్) - నవంబరు 30 క్యాండీ కేన్ లైన్ (ఇంగ్లీష్ సినిమా) - డిసెంబరు 01 దూత (తెలుగు సిరీస్) - డిసెంబరు 01 నెట్‌ఫ్లిక్స్ లవ్ లైక్ ఏ K-డ్రామా (జపనీస్ సిరీస్) - నవంబరు 28 ఒన్మ్యోజీ (జపనీస్ సిరీస్) - నవంబరు 28 అమెరికన్ సింఫనీ (ఇంగ్లీష్ సినిమా) - నవంబరు 29 బ్యాడ్ సర్జన్: లవ్ అండర్ ద నైఫ్ (ఇంగ్లీష్ సిరీస్) - నవంబరు 29 ఫ్యామిలీ స్విచ్ (ఇంగ్లీష్ మూవీ) - నవంబరు 30 హార్డ్ డేస్ (జపనీస్ చిత్రం) - నవంబరు 30 ఒబ్లిటెరేటడ్ (ఇంగ్లీష్ సిరీస్) - నవంబరు 30 ద బ్యాడ్ గాయ్స్: ఏ వెరీ బ్యాడ్ హాలీడే (ఇంగ్లీష్ షార్ట్ ఫిల్మ్) - నవంబరు 30 వర్జిన్ రివర్ సీజన్ 5: పార్ట్ 2 (ఇంగ్లీష్ సిరీస్) - నవంబరు 30 మామాసపనో: నౌ ఇట్ కెన్ బీ టోల్డ్ (తగలాగ్ సినిమా) - డిసెంబరు 01 మే డిసెంబరు (ఇంగ్లీష్ మూవీ) - డిసెంబరు 01 మిషన్ రాణిగంజ్ (హిందీ చిత్రం) - డిసెంబరు 01 స్వీట్ హోమ్ సీజన్ 2 (ఇంగ్లీష్ సిరీస్) - డిసెంబరు 01 ద ఈక్వలైజర్ 3 (ఇంగ్లీష్ సినిమా) - డిసెంబరు 01 డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ చిన్నా (తెలుగు డబ్బింగ్ మూవీ) - నవంబరు 28 ఇండియానా జోన్స్ అండ్ ద డయల్ ఆఫ్ డెస్టినీ (ఇంగ్లీష్ సినిమా) - డిసెంబరు 01 మాన్స్టర్ ఇన్సైడ్: అమెరికాస్ మోస్ట్ ఎక్స్ట్రీమ్ హాంటెడ్ హౌస్ (ఇంగ్లీష్ చిత్రం) - డిసెంబరు 01 ద షెపార్డ్ (ఇంగ్లీష్ మూవీ) - డిసెంబరు 01 సోనీ లివ్ మార్టిన్ లూథర్ కింగ్ (తెలుగు సినిమా) - నవంబరు 29 జియో సినిమా 800 (తెలుగు డబ్బింగ్ సినిమా) - డిసెంబరు 02 జర హట్కే జర బచ్కే (హిందీ మూవీ) - డిసెంబరు 02 బుక్ మై షో బ్యాక్ ఆన్ ద స్ట్రిప్ (ఇంగ్లీష్ సినిమా) - నవంబరు 28 (ఇదీ చదవండి: యాంకర్ రష్మీకి పెళ్లి కుదిరిందా? అసలు విషయం ఏంటంటే!) -
ఓటీటీకి స్పిన్ మాంత్రికుడి బయోపిక్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
శ్రీలంక స్పిన్ మాంత్రికుడు ముత్తయ్య మురళీధరన్ జీవితం ఆధారంగా తెరకెక్కించి చిత్రం '800'. ఈ చిత్రంలో స్లమ్ గాడ్ మిలియనీర్ ఫేమ్ మధుర్ మిట్టల్, మహిమా నంబియార్, నరేన్ కీలక పాత్రల్లో నటించారు. ఈ మూవీకి ఎంఎస్ శ్రీపతి దర్శకత్వం వహించగా.. మూవీ ట్రైన్ మోషన్ పిక్చర్స్ పతాకంపై శివలెంక కృష్ణ ప్రసాద్ సమర్పణలో వివేక్ రంగాచారి నిర్మించారు. అక్టోబర్ 6న థియేటర్లలో రిలీజైన ఈ మూవీ సినీ ప్రేక్షకులతో పాటు క్రికెట్ అభిమానులను అలరించింది. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ఓటీటీ రిలీజ్‌పై అప్డేట్ వచ్చేసింది. డిసెంబర్ 2 నుంచి జియో సినిమాలో ముత్తయ్య మురళీధరన్ బయోపిక్ స్ట్రీమింగ్ కానుంది. హిందీ, తమిళం, తెలుగుతో పాటు మిగిలిన దక్షిణాది భాషల్లో రిలీజ్ కానుంది. థియేటర్లలో చూడడం మిస్సయినవారు ఎంచక్కా ఓటీటీలో చూసి ఎంజాయ్ చేయండి. 800 కథేంటంటే.. ముత్తయ్య మురళీధరన్ అంటే 800 వికెట్లు తీసిన ఏకైన క్రికెటర్‌గానే అందరికి తెలుసు.అయితే ఈ 800 వికెట్లు తీయడానికి వెనుక ఆయన పడిన కష్టమేంటి? తమిళనాడు నుంచి వలస వెళ్లి శ్రీలంకలో సెటిల్ అయిన మురళీధరన్ ఫ్యామిలీ.. అక్కడ ఎలాంటి వివక్షకు గురైంది? వివక్షను, అవమానాలను తట్టుకొని శ్రీలంక జట్టులో చోటు సంపాదించుకున్న మురళీధరన్.. స్టార్ క్రికెటర్‌గా ఎదిగిన తర్వాత కూడా ఎలాంటి సమస్యలను ఎదుర్కొన్నాడు. తొలిసారి ఇంగ్లాండ్ టూర్‌కి వెళ్లిన మురళీధరన్.. జట్టు నుంచి ఎలా స్థానాన్ని కోల్పోయాడు. ఆస్ట్రేలియా మ్యాచ్‌లో ‘చకింగ్ ’అవమానాలను ఎలా అధిగమించాడు? తన బౌలింగ్‌పై వచ్చిన ఆరోపణలు తప్పని ఎలా నిరూపించుకున్నాడు? శ్రీలంకలోని ఎల్టీటీఈ సమస్యపై ప్రభాకరన్‌తో ఎలాంటి చర్చలు జరిపాడు? ఆ ఆలోచన ఎలా వచ్చింది? 1000 వికెట్లు తీసే సామర్థ్యం ఉన్నప్పటికీ..ముందుగానే ఎందుకు రిటైర్మెంట్ తీసుకున్నాడు? అనే ప్రశ్నలకు సమాధానం కావాలంటే.. ‘800’ సినిమా చూడాల్సిందే. கிரிக்கெட் உலகை புரட்டி போட்ட #MuthiahMuralidaran என்னும் மாமனிதனின் உண்மை கதை. டிசம்பர் 2 முதல் #800 திரைப்படத்தை #JioCinema-வில் இலவசமாய் காணுங்கள்#800onJioCinema@Murali_800 @Mahima_Nambiar #MadhurrMittal @MovieTrainMP pic.twitter.com/as03GoaPyn — JioCinema (@JioCinema) November 14, 2023 -
800 Review: ‘800’ మూవీ రివ్యూ
టైటిల్: 800 నటీనటుటు: మధుర్ మిట్టల్, మహిమా నంబియార్, నరేన్ తదితరులు నిర్మాణ సంస్థ:మూవీ ట్రైన్ మోషన్ పిక్చర్స్ నిర్మాత: వివేక్ రంగాచారి సమర్పణ:శివలెంక కృష్ణ ప్రసాద్ దర్శకత్వం:ఎంఎస్ శ్రీపతి సంగీతం: జీబ్రాన్ విడుదల తేది: అక్టోబర్ 06, 2023 భాషలకు, దేశాలకు అతీతంగా తన ఆటతో కోట్లాది మంది అభిమానులను సొంతం చేసుకున్న లెజెండరీ క్రికెటర్ ముత్తయ్య మురళీధరన్. ఆయన జీవితం ఆధారంగా రూపొందిన సినిమా '800'. టెస్ట్ క్రికెట్ చరిత్రలో 800ల వికెట్లు తీసిన ఏకైక క్రికెటర్ ఆయనే. ఆ రికార్డును గుర్తు చేసేలా టైటిల్ పెట్టారు. ఎంఎస్ శ్రీపతి దర్శకత్వం వహించిన ఈ చిత్రం అక్టోబర్ 6న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతుంది. ఇప్పటికే విడుదలైన ట్రైలర్, ప్రచార చిత్రాలు సినిమాపై అంచనాలు పెంచేశాయి. స్వయంగా ముత్తయ్య మురళీధరన్ సినిమా ప్రమోషన్స్‌లో పాల్గొనడంతో ‘800’పై హైప్ క్రియేట్ అయింది. భారీ అంచనాలతో ఈ నెల 6న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ నేపథ్యంలో తాజాగా మీడియా కోసం ప్రత్యేక షో వేసింది చిత్ర బృందం. మరి మురళీధరన్ బయోపిక్ ఎలా ఉంది? రివ్యూలో చూద్దాం. ‘800’ కథేంటంటే.. ముత్తయ్య మురళీధరన్ అంటే 800 వికెట్లు తీసిన ఏకైన క్రికెటర్‌గానే అందరికి తెలుసు.అయితే ఈ 800 వికెట్లు తీయడానికి వెనుక ఆయన పడిన కష్టమేంటి? తమిళనాడు నుంచి వలస వెళ్లి శ్రీలంకలో సెటిల్ అయిన మురళీధరన్ ఫ్యామిలీ.. అక్కడ ఎలాంటి వివక్షకు గురైంది? వివక్షను, అవమానాలను తట్టుకొని శ్రీలంక జట్టులో చోటు సంపాదించుకున్న మురళీధరన్.. స్టార్ క్రికెటర్‌గా ఎదిగిన తర్వాత కూడా ఎలాంటి సమస్యలను ఎదుర్కొన్నాడు. తొలిసారి ఇంగ్లాండ్ టూర్‌కి వెళ్లిన మురళీధరన్.. జట్టు నుంచి ఎలా స్థానాన్ని కోల్పోయాడు. ఆస్ట్రేలియా మ్యాచ్‌లో ‘చకింగ్ ’అవమానాలను ఎలా అధిగమించాడు? తన బౌలింగ్‌పై వచ్చిన ఆరోపణలు తప్పని ఎలా నిరూపించుకున్నాడు? శ్రీలంకలోని ఎల్టీటీఈ సమస్యపై ప్రభాకరన్‌తో ఎలాంటి చర్చలు జరిపాడు? ఆ ఆలోచన ఎలా వచ్చింది? 1000 వికెట్లు తీసే సామర్థ్యం ఉన్నప్పటికీ..ముందుగానే ఎందుకు రిటైర్మెంట్ తీసుకున్నాడు? అనే ప్రశ్నలకు సమాధానం కావాలంటే.. ‘800’ సినిమా చూడాల్సిందే. ఎలా ఉందంటే.. ఓ క్రికెటర్ బయోపిక్ అంటే..అంతా క్రికెట్ గురించి, ఆ ఆటలో ఆయన సాధించిన రికార్డుల గురించి మాత్రమే ఉంటుంది. కానీ ముత్తయ్య మురళీధరన్ బయోపిక్ ‘800’ అలాంటి చిత్రం కాదు. ఇందులో ఆయన జీవితాన్ని చూపించాడు దర్శకుడు ఎంఎస్ శ్రీపతి . చిన్నప్పటి నుంచి మురళీధరన్ కుటుంబం పడిన కష్టాలు.. వివక్ష, అవమానాలను తట్టుకొని తన దేశం కోసం ఆడిన తీరు.. 500పైగా వికెట్లు తీసిన తర్వాత కూడా తనపై ‘మోసగాడు’అనే విమర్శలు రావడం.. దాని వల్ల మురళీధరన్ పడిన మానసిక క్షోభ.. ఒకవైపు తాను ఏ తప్పు చేయలేదని నిరూపించుకుంటునే..800 వికెట్లు తీసిన వైనం.. ఇలా ఒక్కటేమిని.. మురళీధరన్ జీవితంలోని ప్రతి కోణాన్ని ఈ చిత్రంలో చూపించారు. క్రికెట్ ఆట ఎలా పుట్టింది? ఆంగ్లేయులు ఈ ఆటను వివిధ దేశాల్లో ఎలా విస్తరింపజేయారో తెలియజేస్తూ ‘800’ సినిమా ప్రారంభం అవుతుంది. ఆ తర్వాత మురళీధరన్ తండ్రి ముత్తయ్య బాల్యాన్ని చూపించి.. కాసేపటికే అసలు కథను ప్రారంభిస్తాడు. మురళీధరన్(మధుర్ మిట్టల్) బాల్యం ఎలా గడిచింది? తమిళులు, సింహాళీయులఘర్షణల మధ్య మురళీధరన్ ప్రయాణం కొనసాగిందనేది చూపించారు. ఇంగ్లాండ్ టూర్లో ఆయనకు జట్టు తరపున ఆడే అవకాశం రాకపోవడం.. ఆస్ట్రేలియా మ్యాచ్‌లో అనూహ్యంగా జట్టులో చోటు లభించడం.. ఇక శ్రీలంక జట్టులో చోటు సంపాదించుకున్న తర్వాత సొంత టీం నుంచే ఎలాంటి అవమానాలు ఎదురయ్యాయి అనేది ఫస్టాఫ్‌లో చూపించారు. వ్యక్తిగత జీవితంలో మురళీ ఎదుర్కొన్న సమస్యలను, ఎదుగుతున్న క్రమంలో ఆయన తొక్కేయడానికి చేసిన ప్రయత్నాలను సెకండాఫ్‌లో చూపించారు. ఆస్ట్రైలియాలో చకింగ్ ఆరోపణల సమయంలో కెప్టెన్ అర్జున రణతుంగ వ్యవహరించిన తీరు హృదయాలను హత్తుకుంటుంది. 1998లో ఇంగ్లాండ్ టెస్ట్ మ్యాచ్‌లో 16 వీకెట్లు తీసి శ్రీలంకను గెలిపించిన తీరుని అద్భుతంగా చూపించారు. ఆ తర్వాత మురళీ బౌలింగ్‌పై మళ్లీ అనుమానాలు వ్యక్తం చేయడం.. ఆ సమయంలో కెప్టెన్ అర్జున రణతుంగ అండగా నిలిచిన తీరు.. ఇవన్నీ బయోపిక్‌లో చక్కగా చూపించారు. ఎలాంటి సినిమాటిక్ లిబర్టీ తీసుకోకుండా నిజంగా మురళీధరన్ జీవితంలో ఏం జరిగిందో ఆ విషయాలను కళ్లకు కట్టినట్లు చూపించారు. సినిమాలో హై ఇచ్చే మూమెంట్స్ లేకపోవడం.. స్లో నెరేషన్ ఈ సినిమాకు మైనస్. క్రికెట్ లవర్స్‌కు, మురళీధరన్ ఫ్యాన్స్‌కి ‘800’ అయితే కచ్చితంగా నచ్చుతుంది. ఎవరెలా చేశారంటే.. ముత్తయ్య మురళీధరన్‌గా మధుర్ మిట్టల్ జీవించేశాడు. తెరపై మధుర్గా కాకుండా నిజమైన మురళీ ధరన్ని చూసినట్లుగానే అనిపిస్తుంది. ఎమోషనల్ సన్నివేశాల్లో కూడా అద్భుతంగా నటించాడు. అప్పటి శ్రీలంక్ కెప్టెన్ అర్జున రణతుంగ పాత్రను పోషించిన నటుడు కూడా తన పాత్రలో పరకాయ ప్రవేశం చేశాడు. నిజం చెప్పాలంటే.. ఈ సినిమాలో అర్జున రణతుంగ పాత్ర సెకండ్ హీరో అని చెప్పొచ్చు. మురళీ భార్యగా మహిమ నంబియార్ తన పాత్ర పరిధిమేర చక్కగా నటించింది. సీనియర్ జర్నలిస్ట్‌గా నాజర్ తనదైన నటనతో మెప్పించాడు. ఈ సినిమా కథంతా అతని పాత్ర నెరేట్ చేస్తుంది. మురళీ తల్లిదండ్రులు, నానమ్మ పాత్రలు పోషించిన వారితో పాటు మిగిలిన నటీనటులు కూడా తమ పరిధిమేర చక్కగా నటించారు. ఇక సాంకెతిక విషయాలకొస్తే.. జీబ్రాన్ సంగీతం సినిమాకు ప్లస్ పాయింట్. తనదైన బీజీఎంతో కొన్ని సన్నివేశాలకు ప్రాణం పోశాడు. ఆర్డీ రాజశేఖర్ సినిమాటోగ్రఫి బాగుంది. ఎడిటింగ్ పర్వాలేదు. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టు ఉన్నతంగా ఉన్నాయి. -అంజి శెట్టె, సాక్షి వెబ్‌డెస్క్ . -
థియేటర్లలోకి ఒకేరోజు 10 సినిమాలు.. మీరేం చూస్తారు?
ఎలా చూసుకున్నా సరే థియేటర్లలో ప్రతి శుక్రవారం ఒకటి రెండు అదీ కాదంటే ఓ మూడు సినిమాల వరకు రిలీజ్ అవుతుంటాయి. అంతకు మించి వస్తే మాత్రం థియేటర్ల దగ్గర నుంచి ప్రేక్షకుల వరకు ప్రతిదీ సమస్య అవుతుంది. కానీ అలాంటి వాటిని అస్సలు పట్టించుకోకుండా ఈ శుక్రవారం ఏకంగా 10 సినిమాలు థియేటర్లలోకి వచ్చేస్తున్నాయి. ఇంతకీ వాటి సంగతేంటి? (ఇదీ చదవండి: కన్నీళ్లు పెట్టుకున్న స్టార్ హీరో సిద్ధార్థ్.. తనని అవమానించారని!) ప్రతివారం ఓటీటీల్లో పదుల సంఖ్యలో సినిమాలు-వెబ్ సిరీసులు రిలీజ్ అవుతుంటాయి. ఇప్పుడు వీటికి పోటీ ఇచ్చేలా థియేటర్లలో ఈ శుక్రవారం దాదాపు 10 వరకు కొత్త మూవీస్ విడుదల కాబోతున్నాయి. వీటిలో 'మ్యాడ్', 'రూల్స్ రంజన్', 'మామా మశ్చీంద్ర', 'మంత్ ఆఫ్ మధు', 'ఏందిరా ఈ పంచాయతీ', 'అభిరామచంద్ర', 'గన్స్ ట్రాన్స్ యాక్షన్' లాంటి స్ట్రెయిట్ సినిమాలు ఉన్నాయి. పైన చెప్పిన చిత్రాలకే థియేటర్లు దొరకడం కష్టమనుకుంటే 800, చిన్నా, ఎక్సార్సిస్ట్ అనే డబ్బింగ్ మూవీస్ కూడా ఇదే తేదీకి బిగ్ స్క్రీన్‌పైకి వచ్చేందుకు రెడీ అయిపోయాయి. ఈ మొత్తం లిస్టులో కాలేజీ కామెడీ ఎంటర్టైనర్ స్టోరీతో తీసిన 'మ్యాడ్' కాస్త ఆసక్తి కలిగిస్తుంది. మిగతా వాటిపై పెద్దగా బజ్ లేదు. అయితే వీటిలో ఏది హిట్ అవుతుందో ఏంటనేది తెలియాలంటే మరో మూడు రోజులు ఆగితే సరిపోతుంది. ఇంతకీ వీటిలో మీ ఛాయిస్ ఏంటి? (ఇదీ చదవండి: సల్మాన్‌ఖాన్ బండారం బయటపెట్టిన మాజీ ప్రేయసి) -
800 చూసి ఆశ్చర్యపోతారు
‘‘ముత్తయ్య మురళీధరన్ బయోపిక్‌గా ‘800’ రూపొందింది. బయోపిక్ కాబట్టి కథలో మార్చడానికి ఏం ఉంటుంది? ఆయన జీవితంలో కమర్షియల్ హంగులన్నీ ఉన్నాయి. ఒక మనిషి జీవితం ఇలా ఉంటుందా? అన్ని అవరోధాలు ఎదుర్కొని ముత్తయ్య ఈ స్థాయికి చేరుకున్నారా? అని ప్రేక్షకులు ఆశ్చర్య΄ోతారు’’ అని నిర్మాత శివలెంక కృష్ణప్రసాద్ అన్నారు. శ్రీలంకన్ ఆఫ్ స్పిన్నర్ ముత్తయ్య మురళీధరన్ జీవితం ఆధారంగా తెరకెక్కిన చిత్రం ‘800’. ముత్తయ్యగా మధుర్ మిట్టల్, ఆయన భార్య మది మలర్ ΄ాత్రలో మహిమా నంబియార్ నటించగా ఎంఎస్ శ్రీపతి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రమిది. శివలెంక కృష్ణప్రసాద్ సమర్పణలో ఈ నెల 6న ప్రపంచవ్యాప్తంగా తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ఈ చిత్రం విడుదలవుతోంది. శివలెంక కృష్ణప్రసాద్ మాట్లాడుతూ– ‘‘శ్రీపతిని మా నిర్మాణ సంస్థలోనే దర్శకుడిగా పరిచయం చేయాలనుకున్నాం. అయితే ‘800’కి చాన్స్ వచ్చిందని చెబితే ఆ సినిమా చేసి రమ్మని నేనే చె΄్పాను. ఈ చిత్రాన్ని ఇండియాలో సుమారు 1100 థియేటర్లలో విడుదల చేస్తున్నాం. శ్రీపతితో ఓ సినిమా, ‘యశోద’ చిత్రదర్శకులతో మరో సినిమా చేస్తాను. దర్శకుడు పవన్ సాధినేనితో ఓ చిత్రం కోసం చర్చలు జరుగుతున్నాయి’’ అన్నారు. -
Muttiah Muralitharan: నా జీవితమే సినిమాలా ఉంటుంది
‘‘నా బయోపిక్‌గా ‘800’ అనుకున్నప్పుడు స్క్రిప్ట్ నాలుగైదుసార్లు చదివా. ఇందులో ఎటువంటి మసాలా ఉండకూడదనే విషయాన్ని దర్శక–నిర్మాతలకు ముందుగానే చెప్పాను. నిజమైన కథ లేకపోతే అది బయోపిక్ కాదు. నా జీవితమే సినిమాలా ఉంటుంది. నా జీవితంలో ఎత్తుపల్లాలు ఎలా అయితే ఉన్నాయో.. ‘800’ విడుదల వెనక అలాగే ఎత్తుపల్లాలు ఉన్నాయి’’ అని శ్రీలంక ప్రముఖ క్రికెటర్ ముత్తయ్య మురళీధరన్ అన్నారు. ఆయన జీవితం ఆధారంగా రూపొందిన చిత్రం ‘800’. ముత్తయ్యగా మధుర్ మిట్టల్ నటించారు. ఎంఎస్ శ్రీపతి దర్శకత్వంలో మూవీ ట్రైన్ మోషన్ పిక్చర్స్ నిర్మించింది. నిర్మాత శివలెంక కృష్ణప్రసాద్ సమర్పణలో అక్టోబర్ 6న తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ఈ సినిమా రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా ముత్తయ్య మురళీధరన్ విలేకరులతో పంచుకున్న విశేషాలు. ► మీ బయోపిక్ గురించి చెప్పినప్పుడు ఏమనిపించింది? నా జీవితాన్ని సినిమాగా తీయాలని ఎప్పుడూ అనుకోలేదు. శ్రీలంక ప్రజలకు సహాయం చేయడం కోసం 20 ఏళ్ల క్రితం ఓ ఫౌండేషన్ స్థాపించి, ఎంతో మందికి సాయం అందించాం. శ్రీలంకలోని తమిళ ప్రజలకు సాయం చేయడానికి దర్శకుడు వెంకట్ ప్రభు 2008లో వచ్చారు. ఆయనతో పాటు ‘800’ చిత్రదర్శకుడు శ్రీపతి, ఇంకో ఇద్దరు ఉన్నారు. నా వైఫ్ మదిమలర్, వెంకట్ ప్రభు చిన్ననాటి స్నేహితులు కావడంతో మమ్మల్ని కలిశారు. నా ట్రోఫీలు, సాధించిన ఘనతలు చూసి నా బయోపిక్ తీద్దామంటే ముందు వద్దన్నాను.. ఆ తర్వాత సరే అన్నాను. అప్పుడు శ్రీపతిని కథ రాయమని వెంకట్ ప్రభు చెప్పారు. ► బయోపిక్ అంటే ఫిక్షన్ జోడిస్తారు కదా.. నో ఫిక్షన్. ఈ సినిమాలో క్రికెట్ 20 శాతమే ఉంటుంది. మిగతా 80 శాతం నా జీవితం ఉంటుంది. నా జర్నీ, నేను ఇన్ని ఘనతలు సాధించిన క్రమంలో నా కుటుంబం, దేశం ఎదుర్కొన్న పరిస్థితులు ‘800’లో చూపించాం. నా బాల్యం, సెలెక్టర్లు నన్ను ఎందుకు ఎంపిక చేశారు వంటివి ఎవరికీ తెలియవు. ఆ విషయాలు సినిమాలో ఉంటాయి. ► ‘800’ సినిమా రషెస్ చూశారా? మీ పాత్రకు మధుర్ మిట్టల్ ఎంత వరకు న్యాయం చేశారు? రషెస్ కంటే మూవీ చూడాలనుకున్నాను. అందుకే చూడలేదు. నేను పెద్ద సినిమా అభిమానిని. ఇండియన్ సినిమాలను మిస్ కాను. మధుర్ మిట్టల్‌ని రెండుసార్లు కలిశా. ‘800’ టీజర్, ట్రైలర్ చూశాను. నాలాగా, లుక్స్ పరంగా 70 శాతం మ్యాచ్ అయ్యాడు. ► ‘800’ షూటింగ్‌కి వెళ్లలేదా? ఒక్కసారి మాత్రమే వెళ్లాను. సినిమా నిర్మాణం గురించి నాకేమీ తెలియదు. అది కష్టమైన కళ. కొన్నిసార్లు నిర్మాతలను చూస్తే బాధగా ఉంటుంది. నటీనటులతో పాటు అందరికీ డబ్బులు ఇస్తారు. ఒకవేళ సినిమా ఆడకపోతే నిర్మాతల డబ్బులే పోతాయి కదా. ► సినిమా హిట్ కావచ్చు, ఫ్లాప్ అవ్వొచ్చు. అందుకే చాలామంది క్రికెటర్లు తమ బయోపిక్ తీయాలని కోరుకోరు.. సినిమా విజయంలో చాలా అంశాలు ఉంటాయి. సినిమా ఫ్లాప్ అయితే నా లెగసీ ఏమీ పడిపోదు. నా లెగసీ క్రికెట్. నిజంగా జరిగిన కథను ప్రజలకు చెప్పాలని మేం చేసిన ప్రయత్నం ‘800’. అది కొందరికి నచ్చవచ్చు.. మరికొందరికి నచ్చకపోవచ్చు. ఇదొక మంచి సినిమా. తప్పకుండా అందరికీ నచ్చుతుంది. ► శ్రీలంకలోనూ ఈ సినిమాను విడుదల చేస్తున్నారా? ప్రపంచవ్యాప్తంగా తమిళ, తెలుగు, హిందీ భాషల్లో విడుదలవుతోంది. శ్రీలంకన్ సింహళ భాషలోనూ రిలీజ్ చేస్తున్నాం. ► తెలుగు సినిమాలు చూస్తారా? శ్రీలంకలో తమిళ, హిందీ చిత్రాలు రిలీజవుతాయి. ఆ భాషల్లో డబ్బింగ్ చేసిన తెలుగు సినిమాలు చూస్తా. ‘బాహుబలి, ఆర్ఆర్ఆర్, పుష్ప’ సినిమాలను హిందీ, తమిళ భాషల్లో కూడా విడుదల చేయడంతో చూశా. శ్రీలంకలో బాలీవుడ్ మూవీస్ ఫేమస్. ఇప్పుడు తెలుగు సినిమా టాప్ పొజిషన్‌కు చేరుకుంది. ► మీకు ఇష్టమైన తెలుగు నటుడు ఎవరు? ఇతర భాషలతో పోలిస్తే తెలుగులో సూపర్ హీరోస్, స్టార్ హీరోస్ ఎక్కువ మంది ఉన్నారు. నేను నాని సినిమాలు ఎక్కువ చూశా. ‘ఈగ’, ‘జెర్సీ’, ‘శ్యామ్ సింగరాయ్’ చిత్రాలు బాగున్నాయి. ► మీ బయోపిక్ విడుదలవుతోంది. టెన్షన్ ఏమైనా? ఎందుకు టెన్షన్ పడాలి? నేను వరల్డ్ కప్ ఫైనల్ ఆడుతుంటే టెన్షన్ పడాలి (నవ్వుతూ). ► త్వరలో వరల్డ్ కప్ మొదలవుతోంది. మీ ఫేవరేట్ టీమ్? శ్రీలంక మాత్రమే నా ఫేవరెట్. అయితే ఎవరు గెలుస్తారనేది ఇప్పుడే చెప్పలేం. -
800 మూవీ విజయ్ సేతుపతి చేయాల్సింది, కుటుంబాన్ని బెదిరించడంతో..
టెస్ట్ క్రికెట్ చరిత్రలో 800 వికెట్లు తీసిన ఏకైక బౌలర్, లెజెండరీ ఆఫ్ స్పిన్నర్ ముత్తయ్య మురళీధరన్ జీవితం ఆధారంగా రూపొందిన సినిమా '800'. మూవీ ట్రైన్ మోషన్ పిక్చర్స్ సంస్థ నిర్మించిన ఈ మూవీలో మురళీధరన్ పాత్రలో 'స్లమ్‌డాగ్ మిలియనీర్' ఫేమ్ మధుర్ మిట్టల్, మదిమలర్ పాత్రలో మహిమా నంబియార్ నటించారు. ఎంఎస్ శ్రీపతి దర్శకత్వం వహించిన ఈ చిత్రం అక్టోబర్ 6న తెలుగు, తమిళ, హిందీ భాషల్లో విడుదల అవుతోంది. నాకు బ్రదర్ కంటే ఎక్కువ: లక్ష్మణ్ సోమవారం నాడు హైదరాబాద్‌లో '800' ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన వీవీఎస్ లక్ష్మణ్ చేతుల మీదుగా బిగ్ టికెట్ ఆవిష్కరణ జరిగింది. ఈ సందర్భంగా లక్ష్మణ్ మాట్లాడుతూ ''మైదానంలో మురళీధరన్ సాధించినది మాత్రమే కాదు, అతని జీవితం అంతా ఇన్స్పిరేషన్. సన్ రైజర్స్ హైదరాబాద్ టీంకి మురళీధరన్ మెంటార్ కూడా! అతనితో పాటు క్రికెట్ ఆడాను. అతనికి అపోజిట్ టీంలో ఆడాను. మురళీధరన్ గొప్ప క్రికెటర్ అని అందరికీ తెలుసు. అంత కంటే గొప్ప మనసు ఉన్న వ్యక్తి, నిగర్వి. ఈతరం యువతకు రోల్ మోడల్. నాకు బ్రదర్ కంటే ఎక్కువ. అతనిలాంటి ఫ్రెండ్ ఉండటం లక్కీ. మురళీధరన్ కి క్రికెట్టే జీవితం'' అని అన్నారు. లక్ష్మణ్‌తో అలాంటి అనుబంధం: ముత్తయ్య ముత్తయ్య మురళీధరన్ మాట్లాడుతూ ''1998లో ఫస్ట్ టైమ్ లక్ష్మణ్‌ను చూశా. ఒరిస్సాలోని కటక్‌లో మ్యాచ్ ఆడాం. నా కంటే వయసులో లక్ష్మణ్ చిన్న. అప్పుడు టీనేజర్ అనుకుంట! అప్పుడే తన ఆటతో లక్ష్మణ్ అందరికి షాక్ ఇచ్చాడు. ఈ అబ్బాయి ఇండియన్ టీంలో ఎందుకు లేడని అనుకున్నా. ఆ తర్వాత చాలాసార్లు కలిశాం. స్పిన్ ఆడటంలో లక్ష్మణ్ మేటి. మేం మైదానంలో వేర్వేరు దేశాలకు ఆడినప్పటికీ... మైదానం బయట సచిన్, అనిల్ కుంబ్లే, గంగూలీ అంతా స్నేహితులుగా ఉన్నాం. క్రికెట్ అంటే రికార్డులు కాదు... స్నేహితుల్ని చేసుకోవడం! వెంకటేశ్‌ను కెప్టెన్ చేయాలి హైదరాబాద్ నాకు స్పెషల్... నేను ఐపీఎల్ నుంచి రిటైర్ అయ్యాక సన్ రైజర్స్ హైదరాబాద్ టీంకి పని చేయమని అడిగారు. ఒకసారి టీం అంతా హైదరాబాద్ నుంచి వేరే సిటీకి వెళుతున్నాం. సరదాగా బిర్యానీ అడిగా. అరగంటలో విమానంలో చాలా బిర్యానీలు ఉన్నాయి. లక్ష్మణ్ అంటే అది'' అని చెప్పారు. ఇండియన్ సెలబ్రిటీలతో క్రికెట్ టీం ఏర్పాటు చేయాల్సి వస్తే... ఎవరెవరిని ఎంపిక చేస్తారని అడగ్గా ''వెంకటేష్ ను కెప్టెన్ చేయాలి. ఆయనకు క్రికెట్ అంటే చాలా ఇష్టం. ఆయన ఎప్పుడూ సన్ రైజర్స్ హైదరాబాద్ మ్యాచ్ మిస్ కారు'' అని మురళీధరన్ చెప్పారు. నానితో ఒకసారి మాట్లాడానని ఆయన తెలిపారు. విజయ్ సేతుపతిని బెదిరించారు తాజాగా ఓ ఇంటర్వ్యూలో ముత్తయ్య మురళీధరన్ కీలక విషయాన్ని తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. 'విజయ్ సేతుపతితో '800' తీయాలని అనుకున్నాం. ఆయన కూడా అందుకు ఒప్పుకున్నారు. కానీ ఇది ఇష్టం లేని కొందరు నాయకులు ఆయన మీద ఒత్తిడి తెచ్చారు. తన కుటుంబాన్ని బెదిరించారు. దీంతో ఆయన సినిమా నుంచి తప్పుకున్నారు' అని చెప్పుకొచ్చాడు. చదవండి: రెండుసార్లు బ్రేకప్, డిప్రెషన్లో.. కాంట్రాక్టు మీద సంతకం పెట్టాక రాత్రికి రమ్మనేవాళ్లు! -
స్టార్ క్రికెటర్ బయోపిక్.. ఐదేళ్ల క్రితమే మొదలైంది కానీ
శ్రీలంక దిగ్గజ బౌలర్ ముత్తయ్య మురళీధరన్ జీవితం ఆధారంగా తీస్తున్న సినిమా '800'. ఇందులో మురళీధరన్ పాత్రలో ఆస్కార్ గెలుచుకున్న 'స్లమ్ డాగ్ మిలియనీర్' ఫేమ్ మాదూర్ మిట్టల్ నటించాడు. మహిమా నంబియార్ హీరోయిన్. నాజర్, వేల రామమూర్తి, నరేన్, రమ్యకృష్ణ తదితరులు కీలకపాత్రలు పోషించారు. ఎం.ఎస్ శ్రీపతి కథ రాసి, దర్శకత్వం వహించారు. (ఇదీ చదవండి: భోళా శంకర్ ఓటీటీ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ అప్పటి నుంచే) ఇకపోతే తెలుగు, తమిళ, హిందీ భాషల్లో '800' మూవీని ట్రైన్ మోషన్ పిక్చర్స్ నిర్మించింది. జిబ్రాన్ సంగీతమందించారు. శ్రీదేవి మూవీస్ సంస్థ అధినేత శివలెంక కృష్ణప్రసాద్ సమర్పకులుగా వ్యవహరిస్తున్నారు. తాజాగా చెన్నైలో ప్రెస్ మీట్ పెట్టగా, ముత్తయ్య మురళీధరన్ ముఖ్య అతిథిగా వచ్చారు. ఆయన మాట్లాడుతూ తన బయోపిక్ పై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. '2018లో దర్శకుడు వెంకట్ ప్రభు, శ్రీపతి శ్రీలంకకు వచ్చి నన్ను కలిశారు. నా బయోపిక్ తీయాలనే ఆలోచన ఉందని అప్పుడే చెప్పారు. కానీ నాకు ఇష్టం లేదు. అయితే వారు ఇచ్చే డబ్బు నా స్వచ్ఛంద సంస్థకు ఉపయోగపడుతాయని నా మేనేజరు చెప్పాడు. దీంతో అంగీకరించాను. ఈ చిత్రం నా క్రికెట్ కెరీర్ గురించే కాదు. దాని వెనుక నా లైఫ్‌లో.. అట్టడుగు స్థాయి నుంచి ఎన్నో కష్టాలను, ఆటంకాలను ఎదుర్కొని ఈ స్థాయికి రావడం చూపించారు' అని మురళీధరన్ చెప్పారు. ఈ సినిమా అక్టోబర్ 6న థియేటర్లలోకి రానుంది. (ఇదీ చదవండి: మంచు విష్ణు కొత్త సినిమాలో ప్రభాస్.. ఆ పాత్రలో) -
మరో వందేళ్లయినా సచిన్ లాంటి క్రికెటర్ పుట్టడు: మురళీధరన్
టెస్టు క్రికెట్ చరిత్రలో 800 వికెట్లు తీసిన ఏకైక బౌలర్, దిగ్గజ ఆఫ్ స్పిన్నర్ ముత్తయ్య మురళీధరన్ జీవితం ఆధారంగా తీసిన సినిమా '800'. మురళీధరన్ పాత్రలో 'స్లమ్‌డాగ్ మిలియనీర్' ఫేమ్ మధుర్ మిట్టల్ నటించారు. ఎంఎస్ శ్రీపతి దర్శకుడు. బుకర్ ప్రైజ్ పురస్కార గ్రహీత షెహన్ కరుణతిలకతో కలిసి ఆయన స్క్రిప్ట్ అందించారు. శివలెంక కృష్ణప్రసాద్ చిత్రాన్ని సమర్పిస్తున్నారు. తాజాగా ముంబైలో మంగళవారం సచిన్ టెండూల్కర్ ముఖ్య అతిథిగా '800' ట్రైలర్ లాంచ్ ఈవెంట్ జరిగింది. ఇందులో భాగంగా మురళీధరన్ ఆసక్తికర కామెంట్స్ చేశారు. (ఇదీ చదవండి: పెళ్లి గురించి హింట్ ఇచ్చిన అనుష్క.. కానీ!) 'నా కోసం ఇక్కడికి వచ్చిన, మా సినిమాకు సపోర్ట్ చేస్తున్న సచిన్‌కి థాంక్స్. నేను కూడా సచిన్ ఫ్యాన్. క్రికెట్లో ఆయన సాధించినది ఎవరూ సాధించలేరు. మరో 100 ఏళ్ల తర్వాత కూడా సచిన్ లాంటి క్రికెటర్, వ్యక్తి రాలేరు. ఆయన ఎప్పటికీ బెస్ట్. మరో సచిన్ టెండూల్కర్ పుట్టరు. నా బౌలింగ్‌లో రన్స్ చేయడంలో లారా సక్సెస్ అయ్యాడు. కానీ నా బౌలింగ్ శైలిని పట్టుకోలేకపోయాడు. రాహుల్ ద్రావిడ్ కూడా! సచిన్ మాత్రం నా ఆటను పూర్తిగా చదివేశాడు'' అని మురళీధరన్ చెప్పాడు. ఇక సచిన్ మాట్లాడుతూ ''మై వెరీ డియర్ ఫ్రెండ్ మురళీధరన్‌కి ఆల్ ది బెస్ట్. అతని జీవితంలో ఏం జరిగిందో ప్రజలు తెలుసుకోవాలి. ఎంతో సాధించినా చాలా సింపుల్‌గా ఉంటాడు. అతనికి నో చెప్పడం కష్టం. అతని కోసమే నేను ఇక్కడికి వచ్చా. ఆటలో అప్ అండ్ డౌన్స్ ఉంటాయి. కొన్నిసార్లు మన ఆట పట్ల డిజప్పాయింట్ అవుతాం. అక్కడ నుంచి మళ్ళీ నిలబడి పోటీ ఇవ్వడమే నిజమైన ఆటగాడి లక్షణం. మురళీధరన్ అదే చేశాడు' అని అన్నాడు. (ఇదీ చదవండి: తొలిప్రేమ- బ్రేకప్ గురించి చెబుతూ బాధపడిన జాన్వీ) -
గుండెల్ని పిండేస్తున్న ముత్తయ్య మురళీధరన్ బయోపిక్ ‘800’ ట్రైలర్
టెస్ట్ క్రికెట్ చరిత్రలో 800 వికెట్లు తీసిన ఏకైక బౌలర్, లెజెండరీ ఆఫ్ స్పిన్నర్ ముత్తయ్య మురళీధరన్ జీవితం ఆధారంగా రూపొందిన సినిమా '800'. ఈ చిత్రంలో మురళీధరన్ పాత్రలో మధుర్ మిట్లల్, మదిమలర్ పాత్రలో మహిమా నంబియార్ నటించారు. ఎంఎస్ శ్రీపతి దర్శకత్వం వహించారు.తాజాగా ఈ చిత్రం ట్రైలర్‌ని విడుదల చేశారు మేకర్స్. ఇందులో ముత్తయ్య మురళీధరన్ చిన్నప్పట్నుంచి క్రికెటర్‌గా ఎదిగిన జర్నీని, ముఖ్యంగా ఆయన జీవితంలోని ముఖ్య ఘట్టాలను చూపించారు. తమిళనాడు నుంచి శ్రీలంకకు వలస రావడం..అక్కడ పౌరసత్వానికి సంబంధించిన సమస్యలు ఎదుర్కొవడం.. అవన్నీ దాటుకొని క్రికెటర్‌గా ఎదిగితే.. అక్కడ కూడా అవమానాలు.. జావి వివక్షతకు గురికావడం..చేయి స్టైయిట్‌గా ఊపడం లేదంటూ అంతర్జాతీయ క్రికెట్లో అడ్డంకులు ఎదురు కావడం..ఇవన్నీ ట్రైలర్లో చూపించారు. ఆద్యంతం ఎమోషనల్ జర్నీగా `800`ట్రైలర్‌ని చూడండి