
టెస్ట్ క్రికెట్ చరిత్రలో 800 వికెట్లు తీసిన ఏకైక బౌలర్, లెజెండరీ ఆఫ్ స్పిన్నర్ ముత్తయ్య మురళీధరన్ జీవితం ఆధారంగా రూపొందిన సినిమా '800'. ఈ చిత్రంలో మురళీధరన్ పాత్రలో మధుర్ మిట్లల్, మదిమలర్ పాత్రలో మహిమా నంబియార్ నటించారు. ఎంఎస్ శ్రీపతి దర్శకత్వం వహించారు.తాజాగా ఈ చిత్రం ట్రైలర్‌ని విడుదల చేశారు మేకర్స్. ఇందులో ముత్తయ్య మురళీధరన్ చిన్నప్పట్నుంచి క్రికెటర్‌గా ఎదిగిన జర్నీని, ముఖ్యంగా ఆయన జీవితంలోని ముఖ్య ఘట్టాలను చూపించారు.
తమిళనాడు నుంచి శ్రీలంకకు వలస రావడం..అక్కడ పౌరసత్వానికి సంబంధించిన సమస్యలు ఎదుర్కొవడం.. అవన్నీ దాటుకొని క్రికెటర్‌గా ఎదిగితే.. అక్కడ కూడా అవమానాలు.. జావి వివక్షతకు గురికావడం..చేయి స్టైయిట్‌గా ఊపడం లేదంటూ అంతర్జాతీయ క్రికెట్‌లో అడ్డంకులు ఎదురు కావడం..ఇవన్నీ ట్రైలర్‌లో చూపించారు. ఆద్యంతం ఎమోషనల్ జర్నీగా `800`ట్రైలర్‌ని చూడండి