టెస్టు క్రికెట్ చరిత్రలో 800 వికెట్లు తీసిన ఏకైక బౌలర్, దిగ్గజ ఆఫ్ స్పిన్నర్ ముత్తయ్య మురళీధరన్ జీవితం ఆధారంగా తీసిన సినిమా '800'. మురళీధరన్ పాత్రలో 'స్లమ్‌డాగ్ మిలియనీర్' ఫేమ్ మధుర్ మిట్టల్ నటించారు. ఎంఎస్ శ్రీపతి దర్శకుడు. బుకర్ ప్రైజ్ పురస్కార గ్రహీత షెహన్ కరుణతిలకతో కలిసి ఆయన స్క్రిప్ట్ అందించారు. శివలెంక కృష్ణప్రసాద్ చిత్రాన్ని సమర్పిస్తున్నారు. తాజాగా ముంబైలో మంగళవారం సచిన్ టెండూల్కర్ ముఖ్య అతిథిగా '800' ట్రైలర్ లాంచ్ ఈవెంట్ జరిగింది. ఇందులో భాగంగా మురళీధరన్ ఆసక్తికర కామెంట్స్ చేశారు.
(ఇదీ చదవండి: పెళ్లి గురించి హింట్ ఇచ్చిన అనుష్క.. కానీ!)
'నా కోసం ఇక్కడికి వచ్చిన, మా సినిమాకు సపోర్ట్ చేస్తున్న సచిన్‌కి థాంక్స్. నేను కూడా సచిన్ ఫ్యాన్. క్రికెట్‌లో ఆయన సాధించినది ఎవరూ సాధించలేరు. మరో 100 ఏళ్ల తర్వాత కూడా సచిన్ లాంటి క్రికెటర్, వ్యక్తి రాలేరు. ఆయన ఎప్పటికీ బెస్ట్. మరో సచిన్ టెండూల్కర్ పుట్టరు. నా బౌలింగ్‌లో రన్స్ చేయడంలో లారా సక్సెస్ అయ్యాడు. కానీ నా బౌలింగ్ శైలిని పట్టుకోలేకపోయాడు. రాహుల్ ద్రావిడ్ కూడా! సచిన్ మాత్రం నా ఆటను పూర్తిగా చదివేశాడు'' అని మురళీధరన్ చెప్పాడు.
ఇక సచిన్ మాట్లాడుతూ ''మై వెరీ డియర్ ఫ్రెండ్ మురళీధరన్‌కి ఆల్ ది బెస్ట్. అతని జీవితంలో ఏం జరిగిందో ప్రజలు తెలుసుకోవాలి. ఎంతో సాధించినా చాలా సింపుల్‌గా ఉంటాడు. అతనికి నో చెప్పడం కష్టం. అతని కోసమే నేను ఇక్కడికి వచ్చా. ఆటలో అప్ అండ్ డౌన్స్ ఉంటాయి. కొన్నిసార్లు మన ఆట పట్ల డిజప్పాయింట్ అవుతాం. అక్కడ నుంచి మళ్ళీ నిలబడి పోటీ ఇవ్వడమే నిజమైన ఆటగాడి లక్షణం. మురళీధరన్ అదే చేశాడు' అని అన్నాడు.
(ఇదీ చదవండి: తొలిప్రేమ- బ్రేకప్ గురించి చెబుతూ బాధపడిన జాన్వీ)
Comments
Please login to add a commentAdd a comment