మహిమా నంబియార్.. నటించింది తక్కువ చిత్రాలే అయినా మంచి నటి అనే పేరు తెచ్చుకుంది. ప్రస్తుతం తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో స్టార్స్‌తో సినిమాలు చేస్తూ బిజీగా మారింది. ఆమె పరిచయం క్లుప్తంగా..
కేరళలో పుట్టి పెరిగిన మహిమా హైదరాబాద్‌లోని సెయింట్ ఫ్రాన్సిస్ విమెన్స్ కాలేజీలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసింది.
డాన్స్ అంటే ఎంతో ఇష్టం. డాన్స్ ద్వారానే మోడలింగ్.. ఆ తర్వాత యాక్టింగ్‌లోకి అడుగుపెట్టింది.
పదిహేనేళ్ల వయసులో తొలిసారిగా మలయాళ చిత్రం ‘కార్యస్థాన్’లో కనిపించింది.
తొలి చిత్రమే మంచి హిట్ కావడంతో.. కుట్రం 23, కొడి వీరన్, మహాముని తదితర చిత్రాల్లో నటించే అవకాశాలను అందుకుంది. దాదాపుగా ఇవన్నీ కూడా సక్సెస్ కావడంతో ఇక వెనుతిరిగి చూడలేదు. క్రికెటర్ ముత్తయ్య మురళీధరన్ జీవిత కథగా తెరకెక్కిన ‘800’లోనూ మహిమా ప్రధాన పాత్ర పోషించింది.
మహిమా మంచి డాన్సరే కాదు పాటలూ పాడుతుంది. తీరిక దొరికితే చాలు సోషల్ మీడియాలో మ్యూజిక్ ఆల్బమ్స్, వీడియోలతో ప్రేక్షకులను అలరిస్తూనే ఉంది.
‘చంద్రముఖి 2’తో ఈ బ్యూటీ టాలీవుడ్‌లోనూ కనిపించింది.
నా జీవితంలో నాకున్న అతి పెద్ద కోరిక.. సూపర్‌స్టార్ రజనీకాంత్‌తో కలసి నటించాలని! ఆయన చిత్రంలో ఎలాంటి పాత్ర చేయడానికైనా రెడీ! – మహిమా నంబియార్
Comments
Please login to add a commentAdd a comment