Chandramukhi 2
-
స్కూల్లోనే ప్రేమలో పడ్డా.. కానీ అలా జరగలేదు: చంద్రముఖి నటి
కుంకీ చిత్రంతో కోలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చిన మాలీవుడ్ నటి లక్ష్మీ మీనన్. ఆ తరువాత వరుసగా అవకాశాలు వరించడంతో బిజీగా మారిపోయింది. అలా పలు హిట్ చిత్రాలలో నటించిన ఈ అమ్మడు ప్లస్–2 పరీక్షలకు ప్రిపేర్ అవ్వాలంటే నటనకు విరామం తీసుకుంది. అదే లక్ష్మీమీనన్ చేసిన పెద్ద పొరపాటు. ఆమె తనకు తానుగా తీసుకున్న విరామం పర్మినెంట్‌గా మారింది. ఆ తరువాత కొన్ని చిత్రాలలో నటించినా అవి పెద్దగా ఆడలేదు. అలాంటిది గతేడాది చంద్రముఖి–2 చిత్రంలో మెరిసింది. ఆ చిత్రం కూడా తీవ్రంగా నిరాశపరిచింది. కాగా సమీప కాలంలో తమిళ నిర్మాతల మండలి ఇతర సినీ సంఘాలతో కలిసి నిర్వహించిన కలైంజర్- 100 కార్యక్రమంలో నటి లక్ష్మీమీనన్ ఓ పాటకు డాన్స్ చేసింది. అయితే తాజాగా ఇటీవల ఓ ఇంటర్వ్యూకు హాజరైన లక్ష్మి మీనన్ ఆసక్తికరమైన విషయాలను పంచుకుంది. మీరు ఎవరినైనా ప్రేమించారా? లేక మిమ్మల్ని ఎవరైనా ప్రేమించారా? అన్న ప్రశ్నకు తన తొలి ప్రేమ అనుభవాన్ని వెల్లడించింది. తనను ఎవరూ ప్రేమించలేదని.. కానీ పాఠశాలలో చదువుతున్న సహ విద్యార్థితో తానే ప్రేమలో పడ్డానని చెప్పింది. అతను నచ్చడంతో నేరుగా అతని వద్దకు వెళ్లి తన ప్రేమ గురించి చెప్పానంది. కొన్ని రోజుల తరువాత అతను అంగీకరించాడని తెలిపింది. అయితే తామిద్దరం తరచూ కలుసుకోవడం, మాట్లాడుకోవడం, ఔటింగ్‌కు వెళ్లడం వంటివి జరగలేదని చెప్పింది. మేమిద్దరం కేవలం చదువుపైనే దృష్టి సారించి స్నేహితుల్లాగే ఉన్నామని తెలిపింది. ఎప్పుడో ఒకసారి కలిసి మాట్లాడుకునే వారమని చెప్పింది. అయితే పాఠశాల నుంచి ఇంటికి వెళ్లే సమయంలో తరచూ కలుసుకునేవారిమని.. ఫోన్లో మాట్లాడుకునే వాళ్లమని చెప్పుకొచ్చింది. అలా ఇంట్లో ఎవరికీ తెలియకుండా ఫోన్లో మాట్లాడుకుంటూ ఉండేవాళ్లమని వెల్లడించింది. అయితే పాఠశాల చదువు పూర్తయ్యాక మా మధ్య ప్రేమ కూడా కనిపించకుండా పోయిందని చెప్పింది. ఆ తరువాత ఇద్దరం తమ వృత్తిలో బిజీ అయిపోయామని చెప్పింది. కాగా.. అతను ఇటీవలే పెళ్లి చేసుకున్నట్లు తెలిసిందని చెప్పింది. దీంతో మీరెప్పుడు పెళ్లి చేసుకుంటారు? అన్న ప్రశ్నకు ఇంట్లో వాళ్లు చూసిన వ్యక్తినే చేసుకుంటానని స్పష్టం చేసింది. View this post on Instagram A post shared by 𝐋𝐚𝐤𝐬𝐡𝐦𝐢 𝐌𝐞𝐧𝐨𝐧 (@lakshmimenon967) -
వరుస ఫ్లాపులు.. ‘తగ్గేదేలే’ అంటున్న హీరోయిన్!
కొందరు హీరోలు మాత్రమే ఫ్లాప్‌లతో సంబంధం లేకుండా వరుసగా సినిమాలు చేస్తూ పాపులారిటీ పొందుతుంటారు. ఇక అలాంటి హీరోయిన్లు కొందరు ఉన్నారు. ఇందులో బాలీవుడ్ సంచలన నటి కంగనా రనౌత్ ఒకరు. ఫైర్ బ్రాండ్‌గా పేరు తెచ్చుకున్న ఆమె తరచూ వివాదాలకు కేరాఫ్‌గా నిలుస్తుంటుంది. హిందీ, తెలుగు, తమిళం ఇలా బహుభాషా నటిగా రాణిస్తున్న కంగనా రనౌత్‌లో ఒక నిర్మాత, దర్శకురాలు ఉన్నారు. ఇక అసలు విషయానికి వస్తే ఈమె మంచి విజయాన్ని అందుకుని చాలా కాలమే అయ్యింది. ఇటీవల అన్ని అపజయాలను ఎదుర్కొన్నారు. హిందీలో తాజాగా నటించిన తేజాస్ చిత్రం ఘోర పరాజయాన్ని మూటకట్టుకుంది. ఆ మధ్య తమిళం, హిందీ భాషల్లో నటించిన భారీ చిత్రం తలైవి పూర్తిగా నిరాశపరిచింది. ఇటీవల కంగనా రనౌత్ టైటిల్ పాత్రను పోషించిన చంద్రముఖి–2 చిత్రం ప్లాప్ అయ్యింది. అయినా ఈమెకు అవకాశాలు వస్తునే ఉన్నాయి. తాజాగా మరో తమిళ చిత్రంలో నటించే అవకాశం కంగనా రనౌత్‌ను వరించింది. ఇందులో నటుడు మాధవన్ కథానాయకుడిగా నటిస్తున్నారు. హిందీ చిత్రం తను వెడ్స్ మను తరువాత ఈ జంట నటిస్తున్న చిత్రం ఇది. కాగా ఇంతకు ముందు కంగనా రనౌత్ ప్రధాన పాత్రలో నటించిన తలైవి చిత్ర దర్శకుడు ఏఎల్ విజయ్ తెరకెక్కిస్తున్న చిత్రం ఇది. హిందీలో కంగనా రనౌత్ స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తూ నటిస్తున్న ఎమర్జెన్సీ చిత్రం నిర్మాణ దశలో ఉంది. ఈ రెండు చిత్రాల రిజల్ట్ కోసం ఆమె అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ముఖ్యంగా ఎమర్జెన్సీ చిత్రం విజయం కంగనా రనౌత్‌కు చాలా ముఖ్యం. -
జీవితంలో నాకున్న అతి పెద్ద కోరిక ఇదే: మహిమా నంబియార్
మహిమా నంబియార్.. నటించింది తక్కువ చిత్రాలే అయినా మంచి నటి అనే పేరు తెచ్చుకుంది. ప్రస్తుతం తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో స్టార్స్‌తో సినిమాలు చేస్తూ బిజీగా మారింది. ఆమె పరిచయం క్లుప్తంగా.. కేరళలో పుట్టి పెరిగిన మహిమా హైదరాబాద్‌లోని సెయింట్ ఫ్రాన్సిస్ విమెన్స్ కాలేజీలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసింది. డాన్స్ అంటే ఎంతో ఇష్టం. డాన్స్ ద్వారానే మోడలింగ్.. ఆ తర్వాత యాక్టింగ్‌లోకి అడుగుపెట్టింది. పదిహేనేళ్ల వయసులో తొలిసారిగా మలయాళ చిత్రం ‘కార్యస్థాన్’లో కనిపించింది. తొలి చిత్రమే మంచి హిట్ కావడంతో.. కుట్రం 23, కొడి వీరన్, మహాముని తదితర చిత్రాల్లో నటించే అవకాశాలను అందుకుంది. దాదాపుగా ఇవన్నీ కూడా సక్సెస్ కావడంతో ఇక వెనుతిరిగి చూడలేదు. క్రికెటర్ ముత్తయ్య మురళీధరన్ జీవిత కథగా తెరకెక్కిన ‘800’లోనూ మహిమా ప్రధాన పాత్ర పోషించింది. మహిమా మంచి డాన్సరే కాదు పాటలూ పాడుతుంది. తీరిక దొరికితే చాలు సోషల్ మీడియాలో మ్యూజిక్ ఆల్బమ్స్, వీడియోలతో ప్రేక్షకులను అలరిస్తూనే ఉంది. ‘చంద్రముఖి 2’తో ఈ బ్యూటీ టాలీవుడ్‌లోనూ కనిపించింది. నా జీవితంలో నాకున్న అతి పెద్ద కోరిక.. సూపర్‌స్టార్ రజనీకాంత్‌తో కలసి నటించాలని! ఆయన చిత్రంలో ఎలాంటి పాత్ర చేయడానికైనా రెడీ! – మహిమా నంబియార్ -
సౌత్ పాపులర్ హీరోకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన కంగనా
బాలీవుడ్ సంచలన నటి కంగనా రనౌత్. వివాదాస్పద నటిగా ముద్రవేసుకున్న ఈ భామ నటిగా మాత్రం బిజీబిజీగా ఉన్నారు. దర్శకురాలిగా, నిర్మాతగాను రాణిస్తున్న కంగనారనౌత్ స్వీయ దర్శకత్వంలో నటిస్తూ నిర్మిస్తున్న ఎమర్జెన్సీ చిత్రం నిర్మాణ దశలో ఉంది. ఇందులో ఆమె దివంగత ప్రధాని ఇందిరా గాంధీగా నటిస్తున్నారు. కాగా కంగనారనౌత్ తాజాగా నటించిన తేజాస్ చిత్రం ఇటీవలే తెరపైకి వచ్చింది. ఇక తమిళంలోనూ మంచి క్రేజ్ ఉన్న ఈమె ఇటీవల తమిళంలో నటించిన చంద్రముఖి–2 చిత్రం విడుదల కావడం, ఓటీటీలో స్ట్రీమింగ్ కావడం జరిగిపోయింది. చంద్రముఖి–2 చిత్రం ప్రచారం అంతా ఈమైపెనే జరిగినా, చిత్రంలో కనిపించింది మాత్రం ఇంటర్వెల్ తరువాతనే. ఇదే ప్రేక్షకులను నిరాశ పరిచిన విషయం. కాగా తరచూ వార్తల్లో ఉండే కంగనారనౌత్ ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పేర్కొంటూ ప్రస్తుతం తాను నటిస్తున్న చిత్రాలు కాకుండా మరో మూడు చిత్రాలు అంగీకరించినట్లు చెప్పారు. అందులో అను వెడ్స్ మను చిత్రానికి సీక్వెల్‌తో పాటు విజయ్‌సేతుపతి సరసన నటించే చిత్రం కూడా ఉందన్నారు. అయితే విజయ్‌సేతుపతితో నటించేది హిందీలోనా, తమిళంలోనా అనేది క్లారిటీ ఇవ్వలేదు. ఎందుకంటే విజయ్‌సేతుపతి ఇప్పుడు హిందీలోనూ బాగా పాపులర్ అయిన విషయం తెలిసిందే. -
ఓటీటీలోకి వచ్చేసిన హారర్, సైకో థ్రిల్లర్ మూవీస్.. స్ట్రీమింగ్ అక్కడే!
చాలామందికి హారర్ సినిమాలంటే ఇష్టం. ఓపక్క భయపడుతూనే మరోపక్క కన్నార్పకుండా సినిమా చూస్తారు. అలాంటివారికోసమే తాజాగా ఓ హారర్ చిత్రం ఓటీటీలోకి వచ్చేసింది. రజనీకాంత్ నటించిన సూపర్ హిట్ మూవీ చంద్రముఖికి సీక్వెల్‌గా వచ్చిందీ చిత్రం. చంద్రముఖి 2లో రాఘవ లారెన్స్ ప్రధాన పాత్రలో నటించగా కంగనా రనౌత్ హీరోయిన్గా నటించింది. చంద్రముఖి సినిమాతో ట్రెండ్ సెట్ చేసిన పి.వాసు ఈ సీక్వెల్‌కు దర్శకత్వం వహించాడు. అయితే ఈ సినిమా జనాలను పెద్దగా ఆకట్టుకోలేదు. కథ రొటీన్‌గా ఉండటంతో ప్రేక్షకులు ముఖం చాటేశారు. తాజాగా ఈ చిత్రం ఓటీటీలోకి వచ్చేసింది. నెట్‌ఫ్లిక్స్‌లో తెలుగు, తమిళ, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో నేటి నుంచి స్ట్రీమింగ్ అవుతోంది. చంద్రముఖి విషయానికి వస్తే.. 2005లో విడుదలైన ఈ మూవీ ఇప్పటికీ ప్రేక్షకుల మనసులో చెరగని ముద్ర వేసుకుంది. తమిళనాట ఈ చిత్రం 175 రోజులపాటు నిరంతరాయంగా ఆడి రికార్డులు బ్రేక్ చేసింది. ఇందులోని లకలకలకలక.. అనే డైలాగ్ ఇప్పటికీ చాలామంది నోళ్లలో నానుతూనే ఉంటుంది. కానీ ఈ సినిమా అందుకున్న విజయంలో పావు వంతైనా సక్సెస్ అందుకోలేకపోయింది చంద్రముఖి 2. అటు సైకో థ్రిల్లర్ ఇరైవన్ మూవీ సైతం నెట్‌ఫ్లిక్స్‌లోకి నేటి నుంచి అందుబాటులోకి వచ్చేసింది. తెలుగు, తమిళ, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో స్ట్రీమింగ్ అవుతోంది. నయనతార, జయం రవి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ మూవీ తెలుగులో గాడ్ పేరిట విడుదలైంది. Vettaiyan Raaja v̶a̶r̶a̶a̶r̶ vanthuvittaar!👑 Chandramukhi 2 is now streaming on Netflix in Tamil, Telugu, Malayalam, Kannada and Hindi! #Chandramukhi2OnNetflix pic.twitter.com/wwQHp60i7v — Netflix India South (@Netflix_INSouth) October 26, 2023 చదవండి: రజనీకాంత్ ఇంట గ్రాండ్‌గా దసరా సెలబ్రేషన్స్.. గవర్నర్ సహా సెలబ్రిటీలు హాజరు -
ఈ శుక్రవారం ఓటీటీల్లో 22 సినిమాలు రిలీజ్
శుక్రవారం వచ్చిందంటే చాలు సాఫ్ట్వేర్ బిడ్డలు రిలాక్స్ అయిపోతారు. కాలేజీ పోరలు చిల్ అవుతారు. మూవీ లవర్స్ మాత్రం కొత్తగా ఏ సినిమా వచ్చిందా? దాన్ని ఎప్పుడు చూద్దామా అని అనుకుంటూ ఉంటారు. అలా చూసుకుంటే ఈ వారం థియేటర్లలోకి వచ్చేవాటిలో సంపూ 'మార్టిన్ లూథర్‌కింగ్' సినిమా తప్ప పెద్దగా ఇంట్రెస్టింగ్ మూవీస్ లేవు. (ఇదీ చదవండి: విజయ్ 'లియో' ఓటీటీ రిలీజ్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?) ఇకపోతే ఈ శుక్రవారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు-వెబ్ సిరీసులు స్ట్రీమింగ్ కాబోతున్నాయి. వీటిలో చంద్రముఖి 2, పెబ్బల్స్, చాంగురే బంగారు రాజా అనే తెలుగు సినిమాలు ప్రేక్షకులకు ఆసక్తి కలిగిస్తున్నాయి. వీటితో పాటు మరికొన్ని ఇంగ్లీష్, హిందీ వెబ్ సిరీసులు కూడా రాబోతున్నాయి. ఇంతకీ అవి ఏయే ఓటీటీల్లో రిలీజ్ కానున్నాయనేది కింద లిస్ట్ ఉంది చూసేయండి. ఈ శుక్రవారం ఓటీటీల్లో రిలీజయ్యే మూవీస్ (అక్టోబరు 27) నెట్‌ఫ్లిక్స్ పెయిన్ హజ్లర్స్ - ఇంగ్లీష్ సినిమా సిస్టర్ డెత్ - స్పానిష్ చిత్రం టోర్ - స్వీడిష్ సిరీస్ ఎల్లో డోర్: 90స్ Lo-Fi ఫిల్మ్ క్లబ్ - కొరియన్ సినిమా కాస్ట్ ఎవే దివా - కొరియన్ సిరీస్ చంద్రముఖి 2- తెలుగు డబ్బింగ్ సినిమా (స్ట్రీమింగ్) క్రాషింగ్ ఈద్ - అరబిక్ సిరీస్ (ఆల్రెడీ స్ట్రీమింగ్) ఇరైవన్ - తెలుగు డబ్బింగ్ సినిమా (స్ట్రీమింగ్) లాంగ్ లివ్ లవ్ - థాయ్ చిత్రం (స్ట్రీమింగ్) వన్ ఫోర్: ఎగైనెస్ట్ ఆల్ ఆడ్స్ - ఇంగ్లీష్ మూవీ (స్ట్రీమింగ్) ప్లూటో - జపనీస్ సిరీస్ (స్ట్రీమింగ్) అమెజాన్ ప్రైమ్ కన్సక్రేషన్ - ఇంగ్లీష్ మూవీ సెబాస్టియన్ ఫిట్జెక్స్ థెరపీ - జర్మన్ సిరీస్ (స్ట్రీమింగ్) ట్రాన్స్ఫార్మర్స్: రైజ్ ఆఫ్ ది బీస్ట్స్ - ఇంగ్లీష్ సినిమా (స్ట్రీమింగ్) ఆహా యారో - తమిళ సినిమా డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ కాఫీ విత్ కరణ్ సీజన్ 8 - హిందీ టాక్ షో (స్ట్రీమింగ్) సోనీ లివ్ పెబ్బల్స్ - తమిళ మూవీ జీ5 నికోంజ్ - ద సెర్చ్ బిగిన్స్ - బెంగాలీ చిత్రం ఈ విన్ చాంగురే బంగారు రాజా - తెలుగు సినిమా లయన్స్ గేట్ ప్లే కాబ్ వెబ్ - ఇంగ్లీష్ సినిమా ఆపిల్ ప్లస్ టీవీ కర్సస్! - ఇంగ్లీష్ సిరీస్ ద ఎన్ఫీల్డ్ పోల్టర్‌గిస్ట్ - ఇంగ్లీష్ సిరీస్ (ఇదీ చదవండి: నోరు జారిన యాంకర్ సుమ.. మళ్లీ దానిపై సెటైర్లు కూడా!) -
ఈ వారం ఓటీటీల్లోకి రాబోతున్న 28 సినిమాలు
మరోవారం వచ్చేసింది. దసరా సందర్భంగా గతవారం థియేటర్లలోకి వచ్చిన లియో, భగవంత్ కేసరి, టైగర్ నాగేశ్వరరావు చిత్రాలు ప్రేక్షకుల్ని అలరిస్తున్నాయి. ఈ వారం థియేటర్లలో పెద్దగా చెప్పుకోదగ్గ చిత్రాలేం లేవు. దీంతో అందరూ దృష్టి ఆటోమేటిక్‌గా ఓటీటీలపై పడుతుంది. వీటిలో కొత్త మూవీస్ ఏమొచ్చాయి? వాటిలో ఏం చూద్దామనే తాపత్రయంతో ఉంటారు. అలా ఈవారం 28 వరకు సినిమాలు-వెబ్ సిరీసులు స్ట్రీమింగ్ కాబోతున్నాయి. (ఇదీ చదవండి: Bigg Boss 7: గేమ్ పేరు చెప్పి మోసం? నవ్వుతున్నారనే సోయి లేకుండా!) దాదాపు 28 వరకు ఓటీటీల్లోకి వస్తున్నాయి. అయితే వీటిలో చంద్రముఖి 2, స్కంద, చాంగురే బంగారు రాజా సినిమాలతో పాటు మాస్టర్ పీస్ అనే వెబ్ సిరీస్ ఆసక్తిగా అనిపిస్తుంది. వీటితోపాటు పలు హిందీ, ఇంగ్లీష్ మూవీస్, వెబ్ సిరీసులు కూడా పలు ఓటీటీల్లో స్ట్రీమింగ్ కానున్నాయి. మరి ఓవరాల్ లిస్ట్ ఏంటనేది ఇప్పుడు చూసేద్దాం. ఈ వారం ఓటీటీల్లోకి వచ్చే మూవీస్-వెబ్ సిరీస్ జాబితా (అక్టోబరు 23-29) అమెజాన్ ప్రైమ్ పరంపోరుల్ (తమిళ సినిమా) - అక్టోబరు 24 ఏస్ప్రింట్స్ సీజన్ 2 (హిందీ సిరీస్) - అక్టోబరు 25 ట్రాన్స్ఫార్మర్స్: రైజ్ ఆఫ్ ద బీస్ట్ (ఇంగ్లీష్ మూవీ) - అక్టోబరు 26 కన్సక్రేషన్ (ఇంగ్లీష్ చిత్రం) - అక్టోబరు 27 నెట్‌ఫ్లిక్స్ బర్నింగ్ బిట్రేయల్ (పోర్చుగీస్ సినిమా) - అక్టోబరు 25 లైఫ్ ఆన్ అవర్ ప్లానెట్ (ఇంగ్లీష్ సిరీస్) - అక్టోబరు 25 చంద్రముఖి 2 (తెలుగు డబ్బింగ్ మూవీ) - అక్టోబరు 26 లాంగ్ లివ్ లవ్ (థాయ్ సినిమా) - అక్టోబరు 26 ప్లూటో (జపనీస్ సిరీస్) - అక్టోబరు 26 పెయిన్ హజ్లర్స్ (ఇంగ్లీష్ చిత్రం) - అక్టోబరు 27 సిస్టర్ డెత్ (స్పానిష్ సినిమా) - అక్టోబరు 27 టోర్ (స్వీడిష్ సిరీస్) - అక్టోబరు 27 ఎల్లో డోర్: 90స్ Lo-Fi ఫిల్మ్ క్లబ్ (కొరియన్ సినిమా) - అక్టోబరు 27 కాస్ట్ ఎవే దివా (కొరియన్ సిరీస్) - అక్టోబరు 28 సోనీ లివ్ పెబ్బల్స్ (తమిళ సినిమా) - అక్టోబరు 27 ఆహా పరంపోరుల్ (తమిళ సినిమా) - అక్టోబరు 24 ఈ-విన్ చాంగురే బంగారు రాజా (తెలుగు మూవీ) - అక్టోబరు 27 జియో సినిమా ఫోన్ కాల్ (హిందీ సినిమా) - అక్టోబరు 23 జీ5 దురంగ సీజన్ 2 (హిందీ సిరీస్) - అక్టోబరు 24 నికోంజ్ - ద సెర్చ్ బిగిన్స్ (బెంగాలీ సినిమా) - అక్టోబరు 27 డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ మాస్టర్ పీస్ (తెలుగు డబ్బింగ్ సిరీస్) - అక్టోబరు 25 కాఫీ విత్ కరణ్ సీజన్ 8 (హిందీ టాక్ షో) - అక్టోబరు 26 స్కంద (తెలుగు సినిమా) - అక్టోబరు 27 హెచ్ఆర్ ఓటీటీ నడికలిల్ సుందరి యమున (మలయాళ సినిమా) - అక్టోబరు 23 బుక్ మై షో నైట్స్ ఆఫ్ జొడాయిక్ (ఇంగ్లీష్ సినిమా) - అక్టోబరు 24 లయన్స్ గేట్ ప్లే కాబ్ వెబ్ (ఇంగ్లీష్ చిత్రం) - అక్టోబరు 27 ఆపిల్ ప్లస్ టీవీ కర్సెస్ (ఇంగ్లీష్ సిరీస్) - అక్టోబరు 27 ద ఎన్ఫీల్డ్ పొల్టర్గిస్ట్ (ఇంగ్లీష్ సిరీస్) - అక్టోబరు 27 (ఇదీ చదవండి: చిన్నప్పటి ఫ్రెండ్ కోసం కదిలొచ్చిన చిరంజీవి.. స్వయంగా ఆస్పత్రికి వెళ్లి!) -
ఓటీటీలో చంద్రముఖి 2 సినిమా.. ఒకరోజు ముందుగానే!
హారర్ సినిమాలకు పెట్టింది పేరు రాఘవ లారెన్స్. ముని, కాంచన(ముని సీక్వెల్), కాంచన 2, కాంచన 3 సినిమాలను డైరెక్ట్ చేశాడు. దర్శకత్వం వహించడమే కాదు, ఈ సినిమాలన్నింటిలో లారెన్సే హీరోగా నటించాడు. ఇవి కాకుండా శివలింగ, రుద్ర అని మరికొన్ని హారర్ చిత్రాల్లో నటించాడు. ఇటీవలే బ్లాక్‌బస్టర్ మూవీ చంద్రముఖికి సీక్వెల్లో నటించాడు. చంద్రముఖిని తెరకెక్కించిన డైరెక్టర్ పి.వాసుయే ఈ సీక్వెల్‌కు డైరెక్షన్ చేశాడు. ఈ చిత్రంలో కంగనా రనౌత్ హీరోయిన్గా నటించింది. లైకా ప్రొడక్షన్స్ సంస్థ నిర్మించిన ఈ మూవీకి ఆస్కార్ విజేత ఎంఎం. కీరవాణి సంగీతం అందించారు. సెప్టెంబర్ 28న ప్రేక్షకుల ముందుకు వచ్చిన చంద్రముఖి 2 చిత్రానికి ప్రేక్షకుల నుంచి స్పందన కరువైంది. బాక్సాఫీస్ దగ్గర మిక్స్డ్ టాక్ అందుకుంది. ఇక ఈ మూవీ ఓటీటీలోకి ఎప్పుడెప్పుడు వస్తుందా? అని అభిమానులు ఆతృతగా ఎదురుచూస్తున్నారు. మొన్నటివరకు ఈ చిత్రం అక్టోబర్ 27 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానున్నట్లు ప్రచారం జరిగింది. కానీ అనుకున్న తేదీ కంటే ఒకరోజు ముందుగానే ఓటీటీలోకి వచ్చేస్తోందీ చిత్రం. అక్టోబర్ 26న ఓటీటీలో రిలీజ్ చేస్తున్నట్లు నెట్‌ఫ్లిక్స్ అధికారికంగా ప్రకటించింది. తెలుగు, తమిళ, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో అందుబాటులోకి రానున్నట్లు తెలిపింది. Screaming : Cause Chandramukhi is going to have us on our edge of our seats soon!😱 Chandramukhi 2, streams from 26th Oct on Netflix in Tamil, Telugu, Malayalam, Kannada and Hindi!#Chandramukhi2OnNetflix pic.twitter.com/AcGDT7zeoo — Netflix India South (@Netflix_INSouth) October 21, 2023 ‘‘క్లిక్ చేసి సాక్షి వాట్సాప్ ఛానెల్ ఫాలో అవ్వండి’’ చదవండి: మూడుసార్లు ప్రెగ్నెన్సీ ఫెయిల్, డిప్రెషన్.. అందుకే సీరియల్స్‌కు గుడ్‌బై.. -
ప్రముఖ ఓటీటీలోకి వచ్చేస్తున్న బెస్ట్ హర్రర్ తెలుగు సినిమా
రాఘవ లారెన్స్, కంగనా రనౌత్ ప్రధాన పాత్రల్లో పి.వాసు తెరకెక్కించిన పాన్ ఇండియా చిత్రం ‘చంద్రముఖి 2’. రజనీకాంత్ హిట్ సినిమా ‘చంద్రముఖి’కి ఇది సీక్వెల్‌గా రూపొందింది. లైకా ప్రొడక్షన్స్ సంస్థ నిర్మించిన ఈ సినిమా సెప్టెంబర్ 28న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాకు రాఘవ లారెన్స్ భారీగానే ప్రమోషన్స్ నిర్వహించారు. దీంతో భారీ అంచనాల మధ్య విడుదలైన చంద్రముఖి 2 మొదటి ఆట నుంచే డివైడ్ టాక్ తెచ్చుకుంది. (ఇదీ చదవండి: తెలుగులో ఆ స్టార్ హీరోతో సినిమా ఛాన్స్ వస్తే చేస్తా: ఆర్కే రోజా) దీంతో సినిమా చూద్దాం అనుకున్న వారందరూ కూడా ఓటీటీలో వచ్చినప్పుడు చూడొచ్చులే అని సరిపెట్టుకున్నారు. ఈ సినిమా వల్ల సుమారు రూ. 20 కోట్ల మేరకు నిర్మాతలు నష్టపోయారని టాక్. తెలుగు వెర్షన్ అయితే భారీ డిజాస్టర్‌గా నిలిచింది. థియేటర్లో నిరాశపరిచిన ఈ సినిమా ఓటీటీలోకి రాబోతోంది. అక్టోబర్ 27 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో ఈ మూవీ స్ట్రీమింగ్ కానున్నట్లు సమాచారం. కానీ చంద్రముఖి 2 సినిమా విడుదలైన కొద్దిరోజులకే ఆన్లైన్లో ప్రత్యక్షమైంది. తమిళ వెర్షన్‌కు సంబంధించి హెచ్డీ ప్రింట్‌ను పైరసీ సైట్‌తో పాటు కొన్ని సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌లో వైరల్ అయింది. థియేటర్లో చంద్రముఖి 2 చిత్రాన్ని చూడలేకపోయిన వారు అక్టోబర్ 27న నెట్‌ఫ్లిక్స్‌లో చూడొచ్చు. కానీ ఈ విషయంపై అధికారికంగా ప్రకటన రావాల్సి ఉంది. చంద్రముఖి 2 సినిమాలో మహిమా నంబియార్, లక్ష్మీ మీనన్, సుభీక్ష ప్రధాన పాత్రలు పోషించారు. అలాగే ఆస్కార్ విన్నర్ కీరవాణి మ్యూజిక్ అందించారు. -
నిద్రలోనూ అవే కలలు వస్తున్నాయి.. అయినా తప్పకుండా చేస్తా: రాఘవ లారెన్స్
ఇటీవలే చంద్రముఖి-2 సినిమాతో ప్రేక్షకులను అలరించిన కోలీవుడ్ స్టార్ రాఘవ లారెన్స్. ప్రస్తుతం ఎస్జే సూర్యతో కలిసి జగిర్తాండ డబుల్ ఎక్స్ చిత్రంలో నటిస్తున్నారు. కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో ఈ చిత్రాన్ని తెరక్కించారు. అయితే ఇప్పటికే షూటింగ్ పూర్తయిన ఈ చిత్రం దీపావళి కానుకగా రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో నిర్వహించిన ప్రెస్ మీట్లో రాఘవ లారెన్స్ మాట్లాడారు. చంద్రముఖి- 2 ఫ్లాప్ గురించి ఆయన స్పందించారు. (ఇది చదవండి: మరో సక్సెస్ఫుల్ హీరో వచ్చాడు – హీరో నాని ) రాఘవ మాట్లాడుతూ..'చంద్రముఖి -2 సినిమాకు నా డబ్బులు నాకు వచ్చేశాయి. జీవితంలో అన్నీ మనమే గెలవాలని లేదు కదా. గ్రూప్ డ్యాన్సర్ నుంచి డ్యాన్సర్ మాస్టర్ అయితే చాలని భావించా. అక్కడి నుంచే దర్శకుడిని, హీరోను అయ్యాను. నా గ్లామర్‌కు హీరో అవకాశాలు ఇవ్వడమే దేవుడిచ్చిన పెద్ద వరం. మళ్లీ అందులో ఫ్లాప్, హిట్ గురించి అస్సలు ఆలోచించకూడదు. 'జిగిర్తాండ డబుల్ ఎక్స్' డబ్బింగ్ పూర్తయ్యాక చూశా. ఇందులో మంచి స్టోరీ ఉంది. సినిమా హిట్ అవుతుందన్న నమ్మకం ఉంది. ఎంత పెద్ద హీరో సినిమా చేసినా, డ్యాన్స్ చేసినా కథ లేకపోతే సినిమా ఆడదు. కంటెంట్ బలంగా ఉండాలంటే దర్శకుడు కూడా అంతే బలంగా ఉండాలి. కార్తీక్ సుబ్బరాజు విషయంలో నాకు ఎలాంటి డౌట్స్ లేవు.' అని అన్నారు. (ఇది చదవండి: అమర్‌దీప్‌కి ఎలిమినేషన్ భయం.. ఇలా అయిపోయాడేంటి?) అయితే కాంచన-4 ఎప్పుడు ప్లాన్ చేస్తున్నారు సార్.. అని మీడియా ప్రతినిధులు ప్రశ్నించారు. దీనికి ఆయన సమాధానమిస్తూ.. అన్ని దెయ్యాల సినిమాలు తీసి మనశ్శాంతిగా ఉండటం లేదు. రాత్రి కూడా కలలో అవే గుర్తుకొస్తున్నాయి. దీంతో నా మైండ్ కాస్తా పిచ్చి పిచ్చిగా అయిపోయింది. కానీ ఏదో ఒక రోజు ఆ సినిమాను తప్పకుండా చేస్తా' అని అన్నారు. Any Muni Fans here ?🙋🏻🔥 #RaghavaLawrence pic.twitter.com/LEqbZCq2r1 — Anchor_Karthik (@Karthikk_7) October 10, 2023 -
భారీ ధరకు చంద్రముఖి 2 ఓటీటీ రైట్స్.. స్ట్రీమింగ్ అప్పుడేనా?
రాఘవ లారెన్స్, కంగనా రనౌత్ జంటగా నటించిన తాజా చిత్రం చంద్రముఖి 2. 2005లో సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన హార్రర్ మూవీ ‘చంద్రముఖి’కి సీక్వెల్ ఇది. పీ.వాసు దర్శకత్వం వహించిన ఈ చిత్రం భారీ అంచనాలతో సెప్టెంబర్ 28న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కానీ చంద్రముఖి స్థాయిలో మాత్రం ఆకట్టుకోలేకపోయింది. తొలి రోజు నుంచే మిశ్రమ స్పందన రావడంతో.. కలెక్షన్స్ కూడా పెద్దగా రాలేదు. అయితే సినిమాకు వచ్చిన బజ్ చూసి ప్రముఖ ఓటీటీ సంస్థ భారీ ధరకు డిజిటల్ రైట్స్ కొన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. స్ట్రీమింగ్ అప్పుడేనా.. చంద్రముఖి 2 స్ట్రీమింగ్ రైట్స్‌ని ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ఫిక్ల్ దక్కించుకుంది. దాదాపు రూ. 8 కోట్లు పెట్టి ఓటీటీ రైట్స్ కొనుగోలు చేసిందట. సినిమా విడుదలైన నెలన్నర తర్వాత ఓటీటీ స్ట్రీమింగ్ చేయాలని తొలుత ఒప్పుందం కుదుర్చుకున్నారట. అయితె థియేటర్స్ ఆడియన్స్ నుంచి ఈ చిత్రానికి ఆశించిన స్థాయిలో స్పందన లభించకపోవడంతో ముందుగానే ఈ చిత్రాన్ని స్ట్రీమింగ్ చేయాలని నెట్‌ఫ్లిక్స్ భావిస్తోందట. నవంబర్ మూడో వారంలో ఈ చిత్రం నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవ్వనుందని సమాచారం. అయితే దీనిపై మాత్రం ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. ‘ఎమెర్జెన్సీ’ బిజీలో కంగనా చంద్రముఖి 2లో టైటిల్ రోల్‌లొ నటించిన కంగనా.. ఇప్పుడా పాత్ర నుంచి బయటకు వచ్చింది. సినిమా ఫలితాన్ని మర్చిపోయి.. రాబోతున్న సినిమాలపై దృష్టి పెట్టింది. ఆమె ప్రధాన పాత్రలో నటించిన ఎమర్జెనీ చిత్రం విడుదలకు సిద్ధంగా ఉంది. ఇందిరా గాంధి బయోపిక్ ఇది. దీంతో పాటు ‘తేజస్’ చిత్రంలో కూడా కంగనా నటించింది. . 2016లో భారత వైమానిక దళంలోకి మొట్టమొదటి సారిగా మహిళలకు ప్రవేశాన్ని కల్పించిన సంఘటన ఆధారంగా ఈ సినిమా రూపొందుతోంది. సర్వేష్ మేవారా దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం అక్టోబర్ 20న విడుదల కాబోతుంది. -
‘చంద్రముఖి- 2’ కోసం లారెన్స్ భారీ రెమ్యునరేషన్.. ఎన్ని కోట్లంటే..
దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కబెట్టుకోవాలి అనే స్ట్రాటజీని పక్కాగా ఫాలో అవుతున్నాడు రాఘవ లారెన్స్. పలువురు దర్శక నిర్మాతలు అతన్ని హీరోగా పెట్టి సినిమాలు చేసేందుకు ఉత్సాహం చూపిస్తుండడంతో తన సొంత సినిమాలను పక్కన పెట్టేశాడు. ముందుగా బయట సినిమాలు తీసి.. అవకాశాలు రానప్పుడు సొంత కథలను తెరకెక్కించాలని ప్లాన్ చేసుకుంటున్నాడు. అందుకే ఫలితాలలో సంబంధం లేకుండా వరుస సినిమాలతో దూసుకెళ్తున్నాడు. (చదవండి: ఒక్కో సినిమాకు రూ.10 కోట్లు.. నయనతార ఆస్తుల విలువెంతో తెలుసా?) తాజాగా ఈ టాలెంటెడ్ హీరో నటించిన చంద్రముఖి 2 ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అప్పట్లో సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన 'చంద్రముఖి'కి ఇది సీక్వెల్ గా తెరకెక్కింది. పి. వాసు దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో ప్రముఖ తమిళ నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ నిర్మించింది. సెప్టెంబర్ 28న థియేటర్స్ లో విడుదలైన ఈ చిత్రానికి ప్రేక్షకుల నుంచి మిశ్రమ స్పందన లభించింది. దీంతో ఆశించిన స్థాయిలో వసూళ్లను రాబట్టకలేకపోయింది. అయితే విడుదలకు ముందే మంచి బిజినెస్ చేయడంతో నిర్మాతలకు పెద్దగా నష్టమేమి జరగలేదు. ఇవన్నీ పక్కకు పెడితే.. హీరో లారెన్స్‌కు మాత్రం చంద్రముఖి 2 చాలా స్పెషల్ అనే చెప్పాలి. గత సినిమాలతో పోలిస్తే చంద్రముఖి 2కి చాలా ఎక్కువ రెమ్యునరేషన్ ఇచ్చారట. ఈ చిత్రం కోసం లారెన్స్‌కి లైకా నిర్మాణ సంస్థ దాదాపు రూ. 25 కోట్లను పారితోషికంగా ఇచ్చినట్లు తెలుస్తోంది. ఓ సినిమాకు ఇంత పెద్ద మొత్తంలో రెమ్యునరేషన్ తీసుకోవడం లారెన్స్‌కి ఇదే తొలిశారట. ప్రస్తుతం ఈ న్యూస్ కోలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. సినిమా హిట్ కాకపోయినా.. లారెన్స్‌కి మాత్రం మంచి లాభమే తెచ్చిపెటిందని పలువురు కామెంట్స్ చేస్తున్నారు. (చదవండి: పేద వృద్ధురాలు పట్ల సితార తీరు.. నెటిజన్స్ ఫిదా!) -
ఈ వారం నాలుగు సినిమాలు.. రివ్యూలివే
టాలీవుడ్లో ఈ వారం పెద్ద సినిమాల హవా కొనసాగింది. రామ్ పోతినినే స్కందతో పాటు లారెన్స్ ‘చంద్రముఖి -2’, శ్రీకాంత్ అడ్డాల ‘పెదకాపు’చిత్రాలు ఈ వారం బాక్సాఫీస్ బరిలోకి దిగాయి. వీటితో పాటు వివేక్ అగ్నిహోత్రి తెరకెక్కించిన పాన్ ఇండియా మూవీ ‘ది వాక్సిన్ వార్’ కూడా ఈ నెల 28నే విడుదలయ్యాయి. మరి ఆ చిత్రాలు ఎలా ఉన్నాయో ‘సాక్షి’ రివ్యూల్లో చదవండి. స్కంద: నో లాజిక్.. ఓన్లీ యాక్షన్ రామ్ పోతినేని, బోయపాటి కాంబోలో తెరకెక్కిన తొలి చిత్రం ‘స్కంద’. బోయపాటి సినిమాలు అంటేనే హై వోల్టేజ్ యాక్షన్ కథ అని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. స్కంద కూడా అదే కాన్సెప్ట్‌తో తెరకెక్కింది. మరి ఈ సినిమా ఎలా ఉంది? కథేంటి? ప్లస్ పాయింట్స్ ఏంటి? మైనస్ పాయింట్స్? ( పూర్తి రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) చంద్రముఖి-2: భయపెట్టని హార్రర్ రజనీకాంత్, పీ.వాసు కాంబోలో వచ్చిన చంద్రముఖి(2005) అప్పట్లో ఎంతటి ఘన విజయం సాధించిందో అందరికి తెలిసిందే. తమిళ్లోనే కాదు తెలుగులో ఆ చిత్రం భారీ వసూళ్లని రాబట్టింది. అలాంటి చిత్రానికి సీక్వెల్ అంటే సాధారణంగానే అంచనాలు పెరిగిపోతాయి. పైగా చంద్రముఖిగా బాలీవుడ్ ఫైర్‌బ్రాండ్ కంగనా రనౌత్ నటించడంతో ‘చంద్రముఖి-2’పై ఫస్ట్ నుంచి భారీ అంచనాలు ఏర్పడాయి. మరి ఆ అంచనాలు ఈ చిత్రం ఏ మేరకు అందుకుంది? చంద్రముఖిగా కంగనా భయపెట్టిందా లేదా? (పూర్తి రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) పెదకాపు-1..తడబడిన సామ్యానుడి సంతకం ఫ్యామిలీ సినిమాకు కేరాఫ్ శ్రీకాంత్ అడ్డాల. ఒక నారప్ప మినహా ఆయన తెరకెక్కించిన చిత్రాలన్నీ కుటుంబ, ప్రేమ కథలే. అలాంటి దర్శకుడు రాజకీయ నేపథ్యంతో ‘పెదకాపు’ అనే సినిమాను తెరకెకించాడు. అది కూడా కొత్త హీరోహీరోయిన్లతో. రెండు భాగాలుగా తెరకెక్కిన ఈ చిత్రం మొదటి భాగం ‘పెద కాపు -1’ ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ చిత్రం ఎలా ఉంది? సామాన్యుడి సంతకం అంటూ వచ్చిన ఈ మూవీ ప్రేక్షకులను ఏ మేరకు మెప్పించింది (పూర్తి రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) ‘ది వ్యాక్సిన్ వార్’ ది కాశ్మీర్ ఫైల్స్ సినిమాతో వివేక్ అగ్నిహోత్రి నేషనల్ వైడ్‌గా కాంట్రవర్సీ అయ్యాడు. అంతకు ముందు పలు చిత్రాలను తెరక్కించినా.. ది కాశ్మీర్ ఫైల్స్’తోనే అతనికి గుర్తింపు వచ్చింది. తాజాగా వివేక్ అగ్నిహోత్రి తెరక్కించిన చిత్రం ‘ది వ్యాక్సిన్ వార్’. కరోనా లాక్డౌన్ సమయంలో ప్రజల దుస్థితి ఎలా ఉంది? వ్యాక్సిన్ కనుగోనేందుకు భారత శాస్త్రవేత్తలు చేసిన ప్రయత్నాలు ఏంటి? ఈ క్రమంలో మన శాస్త్రవేత్తలు ఎదుర్కొన్న సమస్యలేంటి? అనే నేపథ్యంలో ది వ్యాక్సిన్ వార్ సాగుతుంది ( పూర్తి రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
‘చంద్రముఖి 2’ మూవీ రివ్యూ
టైటిల్: చంద్రముఖి 2 నటీనటులు: రాఘవ లారెన్స్, కంగనా రనౌత్, వడివేలు, రాధికా శరత్ కుమార్, మహిమా నంబియార్, లక్ష్మి మీనన్ తదితరులు నిర్మాణ సంస్థ: లైకా ప్రొడక్షన్స్ నిర్మాత:సుబాస్కరన్ దర్శకుడు: పి.వాసు సంగీతం: కీరవాణి సినిమాటోగ్రఫీ:ఆర్డీ రాజశేఖర్ విడుదల తేది: సెప్టెంబర్ 28, 2023 సూపర్‌స్టార్ రజనీకాంత్ చంద్రముఖి(2005) అప్పట్లో ఎంతటి బ్లాక్ బస్టర్ అయిందో తెలిసిందే. చంద్రముఖిగా జ్యోతిక నటన చూసి చాలామంది భయపడ్డారు కూడా. ఇప్పటికీ చాలా మందికి బెస్ట్ హారర్ ఫిల్మ్ అంటే చంద్రముఖినే. అలాంటి హిట్ సినిమాకు సీక్వెల్ అంటే సాధారణంగానే అంచనాలు పెరిగిపోతాయి. సినిమా ప్రకటన వచ్చిన దగ్గర నుంచి చంద్రముఖి 2పై హైప్ క్రియేట్ అయింది. దానికి తోడు రజనీకాంత్ శిష్యుడు రాఘవ లారెన్స్ గురువుగారి పాత్ర పోషించడం.. బాలీవుడ్ క్వీన్ కంగన చంద్రముఖిగా అనేసరికి ‘చంద్రముఖి 2’పై అంచనాలు పెరిగాయి. భారీ అంచనాల మధ్య గురవారం(సెప్టెంబర్ 28) ఈ చిత్రం ప్రేక్షకులు ముందుకు వచ్చింది. మరి ఇది ఎలా ఉంది? చంద్రముఖిగా కంగన ఏమేరకు భయపెట్టిందో రివ్యూలో చూద్దాం. కథేంటంటే.. రంగనాయకి(రాధిక శరత్‌కుమార్) ఫ్యామిలీకి అనుకోని ఆపదలు వచ్చిపడతాయి. దీంతో ఆమె స్వామీజీ(రావు రమేశ్)ని కలుస్తుంది. కులదైవం గుడిలో కుటుంబ సభ్యులంతా కలిసి పూజలు చేస్తే దోషాలన్నీ తొలిగిపోతాయని ఆయన చెబుతాడు. దీంతో తన అన్నదమ్ములు, వారి పిల్లలతో కలిసి వేటయపురం వెళ్తుంది. ప్రేమ వివాహం చేసుకున్న కూతురి పిల్లలను కూడా పూజ కోసం తీసుకురావాల్సి వస్తుంది. ఆ పిల్లలకు సంరక్షకుడిగా ఉన్న మదన్(రాఘవ లారెన్స్) ఆ ఊరికి వెళ్తాడు. వారంతా చంద్రముఖి ఫ్యాలెస్‌లో దిగుతారు. ఆ ఇంటి ఓనర్ బసవయ్య(వడివేలు) బిల్డింగ్ అంతా తిరిగి చూపించి, దక్షిణం వైపు మాత్రం వెళ్లొద్దని హెచ్చరిస్తాడు. కానీ రంగనాయకి మేనకోడలు గాయత్రితో పాటు కొందరు దక్షిణం వైపు వెళ్తారు. ఆ తర్వాత ఏం జరిగింది? అసలు చంద్రముఖి(కంగనా రనౌత్) నేపథ్యం ఏంటి? సెంగోటయ్య(లారెన్స్) వేటయ్యరాజుగా ఎలా మారాడు? వేటయ్యరాజుకి, చంద్రముఖికి మధ్య పగ ఏంటి? రంగనాయకి కుటుంబ సభ్యుల్లో చంద్రముఖి ఎవరిని ఆవహించింది? ఆమె నుంచి చంద్రముఖిని తొలగించడానికి స్వామిజీతో పాటు మదన్ చేసిన త్యాగమేంటి? చివరకు చంద్రముఖి ఆత్మ ఈ లోకాన్ని విడిచి ఎలా వెళ్లిపోయింది? అనేదే మిగతా కథ. ఎలా ఉందంటే.. కథ వినగానే మీ కళ్ల ముందు చంద్రముఖి సినిమా తిరిగింది కదా! అది నిజమే. సినిమా చూస్తున్నంత సేపు చంద్రముఖి చిత్రమే కనిపిస్తుంది. కేవలం పాత్రలు మారుతాయి అంతే. హీరో ఇంట్రడక్షన్ నుంచి క్లైమాక్స్ వరకు ప్రతిదీ చంద్రముఖి లాగే ఉంటుంది. ఒక ఫైట్ సీన్‌తో హీరో ఎంట్రీ ఇవ్వడం.. ఆ తర్వాత ఫ్యాలెస్‌కు రావడం..అక్కడ అవమానాలు ఎదుర్కోవడం.. ప్యాలెస్ పక్కన ఉండే పేదింటి అమ్మాయిని హీరో ఇష్టపడడం.. సేమ్ టు సేమ్ చంద్రముఖి లాగే ఫస్టాఫ్ సాగుతుంది. అయితే కొత్తదనం ఏదైనా ఉందంటే..అది వేటయ్య ఆత్మను తీసుకురావడమే. రంగనాయకి కుటుంబానికి ఉన్న దోషం గురించి చెబుతూ సినిమాను ప్రారంభించాడు దర్శకుడు. ఆ తర్వాత ఓ ఫైట్ సీన్‌తో హీరోని పరిచయం చేశాడు. రంగనాయకి ఫ్యామిలీ అంతా చంద్రముఖి ఫ్యాలెస్ చేరేవరకు కథ ఆసక్తిగా సాగుతుంది. ప్యాలెస్‌లోకి వెళ్లిన తర్వాత ప్రతి సీన్ ‘చంద్రముఖి’లాగే అనిపిస్తుంది. పైగా నెమ్మదిగా సాగుతూ బోర్ కొట్టిస్తుంది. వడివేలు కామెడీ వర్కౌట్ కాలేదు. చాలాచోట్ల ఆయన సీన్లు సాగదీతగా అనిపిస్తాయి. మొదటి భాగంలోలాగే ఇందులో కూడా దొంగ బాబాగా మనోబాల ఎంట్రీ ఇస్తాడు. అయితే పార్ట్-1లో ఆ సీన్ బాగా నవ్విస్తుంది. కానీ ఇక్కడ చూస్తే.. నవ్వు రాకపోవడమే కాకుండా బోర్ కొడుతుంది. చంద్రముఖి ఎవరిని ఆవహించిందో చూపించే సీన్ ఒక్కటి కాస్త భయపెడుతుంది. ఇలా ఫస్టాఫ్ రొటీన్‌గా సాగుతుంది. ఇంటర్వెల్ తర్వాత కథంతా ఫ్లాష్ బ్యాక్‌లోకి వెళ్తుంది. వేటయ్య రాజు పాత్ర ఎంట్రీ తర్వాత కథలో వేగం పెరుగుతుంది. సెంగోటయ్య ఇచ్చే ట్విస్ట్ బాగుంటుంది. చంద్రముఖి ప్రియుడు గుణశేఖర్ ప్యాలెస్‌లోకి రావడం.. అది వేటయ్య రాజు చూడడం.. ఇందతా పార్ట్ 1లో లాగే సాగుతుంది. క్లైమాక్స్‌లో లారెన్స్, కంగనల మధ్య సాగే పోరాట ఘట్టం ఆకట్టుకుంటుంది. క్లైమాక్స్ కూడా అచ్చం ‘చంద్రముఖి’లాగే ఉండడం విచిత్రం. ఇక చివర్లో పార్ట్ 3 ఉంటుందన్నట్లు చిన్న లీడ్ ఇచ్చి ముగింపు పలికారు. ఎవరెలా చేశారంటే.. చంద్రముఖి అనగానే మనకు రజనీకాంత్, జ్యోతిక పాత్రలు కళ్లముందు తిరుగుతాయి. అంతలా తమ పాత్రల్లో జీవించారు. లారెన్స్, కంగన ఆ స్థాయిలో మెప్పించకపోయినా.. ఉన్నంతలో న్యాయం చేసేందుకు ప్రయత్నించారు. మదన్ లాంటి పాత్ర లారెన్స్ కు కొత్తేమి కాదు కానీ వేటయ్యరాజు తరహా పాత్రలో నటించడం మాత్రం తొలిసారి. అయినాసరే తనదైన నటనతో ఆకట్టుకున్నాడు. ఇక చంద్రముఖిగా కంగన ఒదిగిపోయింది. అయితే జ్యోతిక భయపెట్టినట్లుగా కంగన భయపెట్టలేకపోయింది. ఇది దర్శకుడి తప్పిదమనే చెప్పాలి. కైమాక్స్లో వచ్చే యాక్షన్ సీన్లో మాత్రం లారెన్స్‌తో పోటీపడి నటించింది. రంగనాయకిగా రాధికా శరత్‌కుమార్ పర్వాలేదనిపించింది. చంద్రముఖి ప్యాలెస్ ఓనర్ బసవయ్యగా వడివేలు నవ్వించే ప్రయత్నం చేశాడు. కానీ అది వర్కౌట్ కాలేదు. స్వామీజీగా రావు రమేశ్, చంద్రముఖి ఆవహించిన యువతి పాత్రలో నటించిన నటితో పాటు మిగిలిన వారంతా తమ పాత్రల పరిధిమేర నటించారు. ఇక సాంకేతిక విషయాలకొస్తే.. ఆస్కార్ అవార్డు గ్రహీత కీరవాణి ఈ సినిమాకు సంగీతం అందించారంటే నమ్మశక్యం కాదు. పాటలతో పాటు బీజీఎం కూడా చాలా పూర్. ఒక్క సాంగ్ కూడా గుర్తుండేలా లేదు. సినిమాటోగ్రఫీ, విజువల్ ఎఫెక్ట్ ఓకే. ఎడిటర్ తన కత్తెరకు ఇంకాస్త పని చెప్పాల్సింది. ముఖ్యంగా ఫస్టాప్‌లో చాలా చోట్ల సాగదీతగా అనిపిస్తుంది. వాటిని మరింత క్రిస్పీగా కట్ చేయాల్సిందే. లైకా సంస్థ నిర్మాణ విలువు సినిమా స్థాయికి తగ్గట్లుగా ఉన్నాయి. -అంజి శెట్టె, సాక్షి వెబ్‌డెస్క్ -
హీరోయిన్ కంగనకు పెళ్లి? టైమ్ కూడా ఫిక్స్!
సాధారణంగా హీరోయిన్లు గొడవలు, కాంట్రవర్సీలకు దూరంగా ఉంటారు. సినిమా చేశామా, డబ్బులు తీసుకున్నామా అన్నట్లు సైలెంట్‌గా ఉంటారు. కొందరు మాత్రం వివాదాలతో సావాసం చేస్తుంటారు. తెలుగులో ఈ తరహా ప్రవర్తన పెద్దగా ఉండదు కానీ బాలీవుడ్లో ఇలా ఎవరు చేస్తారనగానే కంగనా రనౌత్ పేరు గుర్తొస్తుంది. గత కొన్నాళ్లుగా ఎప్పటికప్పుడు కాంట్రవర్సీలకు కేరాఫ్ అవుతున్న ఈ బ్యూటీ ఇప్పుడు పెళ్లికి రెడీ అయిందట. 2006లో బాలీవుడ్లో కెరీర్ మొదలుపెట్టిన కంగనా రనౌత్.. తెలుగులోనూ ప్రభాస్ 'ఏక్ నిరంజన్' మూవీలో హీరోయిన్గా చేసింది. అది ఆడకపోవడంతో మరో తెలుగు సినిమా చేయలేదు. నటిగా హిందీలో అద్భుతమైన సినిమాలతో గుర్తింపు తెచ్చుకున్న కంగన.. అదే టైంలో పలు గొడవల్లోనూ తనదైన శైలిలో రెచ్చిపోయింది. హృతిక్‌తో రిలేషన్, ఖాన్ త్రయంపై కామెంట్స్ కావొచ్చు ఇలా పలు సందర్భాల్లో టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారింది. (ఇదీ చదవండి: నిత్యామేనన్‌ని వేధించిన ఆ హీరో.. క్లారిటీ ఇచ్చిన బ్యూటీ) గత కొన్నాళ్లుగా కంగన సినిమా కెరీర్ ఏం బాగోలేదు. ఒక్కటంటే ఒక్క సినిమా కూడా బాక్సాఫీస్ దగ్గర సక్సెస్ కావడం లేదు. ప్రస్తుతం ఈమె 'చంద్రముఖి 2' అనే తమిళ సినిమాలో లీడ్ రోల్ చేసింది. ఇది ఈ గురువారమే(సెప్టెంబరు 28) రిలీజ్ కానుంది. మరోవైపు హిందీలో 'తేజస్', 'ఎమర్జెన్సీ' అనే చిత్రాల్లో నటించింది. ఇవి త్వరలో విడుదల కానున్నాయి. అయితే కెరీర్ పరంగా కాస్త డౌన్ అయినట్లు అనిపిస్తున్న కంగన.. పెళ్లి చేసుకోవాలని అనుకుంటోందట. ప్రముఖ హిందీ క్రిటిక్.. ఈ విషయాన్ని చెబుతూ రీసెంట్గా ఓ ట్వీట్ చేశాడు. ప్రముఖ బిజినెస్‌మ్యాన్‌ని కంగన పెళ్లి చేసుకోబోతుందని, ఈ ఏడాది డిసెంబరులో నిశ్చితార్థం, వచ్చే ఏప్రిల్‌లో పెళ్లి అని రాసుకొచ్చాడు. మరి ఇది నిజమా కాదా అనేది తెలియాల్సి ఉంది. (ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 37 సినిమాలు) Breaking News:- Actress Kangana Ranaut is going to get engaged with a businessman in December 2023. They will get married in April 2024! Congratulations to her in advance! — KRK (@kamaalrkhan) September 24, 2023 -
చంద్రముఖి 2లో ఇదే హైలైట్
-
'చంద్రముఖి 2' అందరికీ నచ్చుతుంది : కీరవాణి
-
చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేసిన మూవీ లో..!
-
నా కెరీర్లో 'చంద్రముఖి 2' : కంగనా రనౌత్
-
ప్రజలు నిజంగానే దేవుళ్ళు..!
-
Raghava Lawrence, Kangana Ranaut Chandramukhi 2 Pre-Release Event: రాఘవ లారెన్స్ 'చంద్రముఖి 2'ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)
-
నా జీవితంలో ఆ ముగ్గుర్నీ ఎప్పుడూ మర్చిపోను: రాఘవ లారెన్స్
రాఘవ లారెన్స్ హీరోగా బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కంగనా రనౌత్ టైటిల్ పాత్రలో నటించిన భారీ బడ్జెట్ మూవీ 'చంద్రముఖి 2'. లైకా ప్రొడక్షన్స్ భారీ ఎత్తున నిర్మించిన ఈ చిత్రానికి పి. వాసు దర్శకత్వం వహించారు. రజనీకాంత్ హిట్ చిత్రం 'చంద్రముఖి'కి సీక్వెల్‌గా సెప్టెంబర్ 28న విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లోని జె.ఆర్.సి. కన్వెన్షన్స్‌లో ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను మేకర్స్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పలు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశాడు. ప్రభాస్ 'రెబల్' తర్వాత తెలుగులో మరో సినిమాను డైరెక్ట్ చేయడం కుదర్లేదని. 'చంద్రముఖి 2' ద్వారా తెలుగు ప్రేక్షకులు, అభిమానులను కలుసుకుంటుంన్నందుకు సంతోషంగా ఉందని లారెన్స్ చెప్పాడు. (ఇదీ చదవండి: ఆ సంఘటనతో బాడీగార్డ్ కావాలని అనుకున్నా: శృతిహాసన్) ఎంతో కష్టపడి సంపాదించిన డబ్బుతో టికెట్ కొనుక్కుని సినిమా చూస్తున్నారు. అంతేకాకుండా తమ నుంచి ఏం ఆశించకుండానే అభిమానం చూపిస్తారని ఫ్యాన్స్ గురించి లారెన్స్ తెలిపాడు. అభిమానుల ప్రేమలోనే తాను దేవుణ్ని చూస్తున్నానని ఆయన పేర్కొన్నాడు. తాను చాలామంది హీరోలకు కొరియోగ్రఫీలో డ్యాన్స్ చేశాను.. ఆ హీరోలందరి ఫ్యాన్స్ కూడా తనను కూడా అభిమానించడం చాలా ఆనందాన్ని ఇస్తుందని ఆయన తెలిపాడు. తనకు అలాంటి అవకాశం ఇచ్చిన హీరోలందరికీ ధన్యవాదాలు అని లారెన్స్ చెప్పాడు. 'వాసుగారు 'చంద్రముఖి2' మూవీ చేస్తున్నామని అనౌన్స్ చేయగానే రజినీకాంత్‌గారితో చేస్తున్నారేమోనని అనుకున్నా. తర్వాత డైరెక్టర్ నాకు కథ చెప్పగానే రజనీకాంత్‌కు ఫోన్ చేశాను. 'అన్నయ్యా.. చంద్రముఖి- 2 సినిమా చేస్తున్నా' అని చెప్పగానే ఆయన ఎంతో సంతోషంతో ఆల్ ది బెస్ట్ చెప్పారు. అంతే కాకుండా రాఘవేంద్ర స్వామీ ఆశీస్సులు ఎప్పుడూ ఉంటాయని చెప్పారు. దీంతో ఆయనకు ధన్యవాదాలు చెబుతున్నా. ఆయన లేకపోతే నేనీ వేదికపై ఉండేవాడినే కాదు. తెలుగు చిత్ర పరిశ్రమలో ఇంతమంది అభిమానులను సొంతం చేసుకున్నానంటే దానికి ప్రధాన కారణం చిరంజీవి అన్నయ్య. ఆయన నుంచే నేను డ్యాన్స్ నేర్చుకున్నా.. నన్ను డైరెక్టర్ని చేసిన నాగార్జునను ఎప్పటికీ మరిచిపోను. ఇక కంగనా రనౌత్ వంటి పెద్ద స్టార్‌తో నటించటం నేను ఎంతో లక్కీ. ఆమె సెట్స్‌లోకి అడుగు పెట్టగానే ఆమెకున్న సెక్యూరిటీని చూసి భయపడ్డాను. ఆ విషయం ఆమెకు చెప్పగానే ఆమె సెక్యూరిటీని బయటకు పంపేశారు. తర్వాత చక్కగా ఇద్దరం కలిసిపోయి నటించాం. చంద్రముఖి పాత్రలో ఆమె ఎంతగానో భయపెట్టారు. వాసుగారితో ఇది వరకు శివలింగ అనే సినిమా చేశాను. ఆ సినిమాకు పూర్తి భిన్నంగా 'చంద్రముఖి2' చేశాం.' అని లారెన్స్ చెప్పారు. కంగనా రనౌత్ కీలక వ్యాఖ్యలు బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కంగనా రనౌత్ మాట్లాడుతూ 'నేను గతంలో దక్షిణాదిన సినిమాలు చేశాను. తెలుగులో ఏక్ నిరంజన్, తలైవి వంటి సినిమాల్లో నటించాను. ఇప్పుడు మరోసారి తెలుగు ప్రేక్షకులను 'చంద్రముఖి2'తో మీ ముందుకు వస్తున్నా. ఈ మూవీలో చంద్రముఖి పాత్ర తెలుగులో మాట్లాడుతుంది. వాసుగారు ఓ వారియర్ సినిమా చేయాలని నా దగ్గరకు వచ్చినప్పుడు నేను చంద్రముఖి 2లో చంద్రముఖిగా ఎవరు నటిస్తున్నారని అడిగాను. ఇంకా ఎవరినీ తీసుకోలేదని చెప్పడంతో. నేను నటిస్తానని అడగ్గానే ఆయన వెంటనే ఒప్పుకున్నారు. అలా ఈ ప్రాజెక్ట్‌లోకి అడుగు పెట్టాను.' అని ఆమె చెప్పింది -
Chandramukhi 2: ‘చంద్రముఖి-2’ మూవీ ప్రెస్‌మీట్ (ఫొటోలు)
-
భయపడుతూ చంద్రముఖి-2 చేశాను: లారెన్స్
చంద్రముఖి 2లో కంగనా రనౌత్ హీరోయిన్ అనగానే ఆశ్చర్య పోయాను. సెట్లో అడుగు పెట్టగానే ఆమెకున్న సెక్యూరిటీని చూసి భయపడ్డాను. కొద్ది రోజుల తర్వాత ఆమెకు ఆ విషయం చెప్పగానే.. సెక్యూరిటీని బయటకు పంపించింది. ఆ తర్వాత చక్కగా కలిసిపోయి నటించారు. చంద్రముఖి పాత్రలో ఆమె భయపెట్టారు’అని హీరో రాఘవా లారెన్స్ అన్నారు. రాఘవా లారెన్స్, కంగనా రనౌత్ జంటగా నటించిన తాజా చిత్రం చంద్రముఖి-2. 17 ఏళ్ల క్రితం పీ వాసు తెరకెక్కించిన ‘చంద్రముఖి’ చిత్రానికి సీక్వెల్ ఇది. అగ్ర నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ బ్యానర్‌పై సుభాస్కరన్ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 28న విడుదల కాబోతుంది. ఈ నేపథ్యంలో తాజాగా చిత్ర యూనిట్ మీడియాతో ముచ్చటించారు. ఈ సందర్భంగా లారెన్స్ మాట్లాడుతూ.. రజనీకాంత్ చేసిన రోల్లో నేను నటించడం ఆ రాఘవేంద్రస్వామి నాకు ఇచ్చిన వరం. సూపర్‌స్టార్‌గారు చేసిన ఆ పాత్రను నేనెంత గొప్పగా చేయగలనా? అని ఆలోచించలేదు. నా పాత్రకు నేను న్యాయం చేస్తే చాలని అనుకుని చాలా భయపడుతూ నటించాను. కచ్చితంగా సినిమా మీ అందరినీ మెప్పిస్తుందని అనుకుంటున్నాను’ అని అన్నారు. కంగనా మాట్లాడుతూ.. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కంగనా రనౌత్ మాట్లాడుతూ ‘‘నేను ఇంతకు ముందు దక్షిణాదిలో సినిమాలు చేశాను. తెలుగులో ఏక్ నిరంజన్ సినిమాలో నటించాను. ఇప్పుడు మరోసారి తెలుగు ప్రేక్షకులను ‘చంద్రముఖి2’తో పలకరిస్తాను. వాసుగారు ఓ సారి నా దగ్గరకు వచ్చినప్పుడు నేను చంద్రముఖి 2లో చంద్రముఖిగా ఎవరు నటిస్తున్నారని అడిగాను. ఎవరినీ తీసుకోలేదని అన్నారు. నేను నటిస్తానని అడగ్గానే ఆయన వెంటనే ఒప్పుకున్నారు. అలా ఈ ప్రాజెక్ట్‌లోకి అడుగు పెట్టాను. ‘చంద్రముఖి’లో కామెడీ, హారర్ ఎలిమెంట్స్ ఎలాగైతే మిక్స్ అయ్యుంటాయో ‘చంద్రముఖి2’లోనూ అన్నీ ఎలిమెంట్స్ ఉంటాయి’ అన్నారు. ‘చంద్రముఖి సినిమాతో ‘చంద్రముఖి2’ను లింక్ చేసి ఈ కథను సిద్ధం చేశాను. కచ్చితంగా ఆడియెన్స్‌కు సినిమాను మెప్పిస్తుంది. తెలుగులో నాగవల్లి సినిమా ఉంది. అందులో డిఫరెంట్ పాయింట్ ఉంటుంది. కానీ ఇందులో 17 ఏళ్ల ముందు కోట నుంచి వెళ్లి పోయిన చంద్రముఖి మళ్లీ ఎందుకు వచ్చిందనే పాయింట్‌తో చేశాను. తప్పకుండా అందరికి నచ్చుతుందనే నమ్మకం ఉంది’ అని దర్శకుడు పీ.వాసు అన్నారు. -
చంద్రముఖి గా నన్ను చూసి అందరూ భయపడతారు
-
కంగనా రనౌత్ పై రాఘవ లారెన్స్ ఫన్నీ కామెంట్స్
-
'చంద్రముఖి 2' దర్శకుడి బర్త్ డే.. గిఫ్ట్‌గా ల్యాప్‌ట్యాప్స్
ప్రముఖ సినీ దర్శకుడు పి.వాసు శుక్రవారం తన పుట్టినరోజు వేడుకలను చైన్నెలోని లైకా సంస్థ కార్యాలయంలో జరుపుకున్నారు. ఈయన గత 40 ఏళ్లుకు పైగా దర్శకుడిగా రాణిస్తున్నారు. వివిధ భాషల్లో 60కిపైగా చిత్రాలకు దర్శకత్వం వహించారు. తాజాగా ఈయన దర్శకత్వం వహించిన చిత్రం చంద్రముఖి –2. (ఇదీ చదవండి: ఐదు రోజులుగా ఆ సమస్యతో బాధపడుతున్న అనసూయ!) రాఘవ లారెన్స్, బాలీవుడ్ బ్యూటీ కంగనా రనౌత్ ప్రధాన పాత్రల్లో నటించిన 'చంద్రముఖి 2'.. పాన్ ఇండియా వైడ్ రిలీజ్ కానుంది. ఇందులో వడివేలు, రావు రమేశ్ తదితరులు కీలకపాత్రలు పోషించారు. లైకా ప్రొడక్షన్స్ భారీ బడ్జెట్‌తో నిర్మించింది. ఆర్డీ రాజశేఖర్ సినిమాటోగ్రఫీ, ఎంఎం కీరవాణి సంగీతాన్ని అందించారు. అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకుని ఈ నెల 28న పాన్ ఇండియా స్థాయిలో ఐదు భాషల్లో విడుదల కానుంది. కాగా ఈ చిత్ర దర్శకుడు జన్మదిన వేడుకలను లైకా సంస్థ నిర్వాహకులు ఘనంగా నిర్వహించారు. ఇందులో నటుడు రాఘవ లారెన్స్, లైకా సంస్థ ప్రధాన నిర్వాహకుడు జీకే ఎం తమిళ్ కుమరన్ పాల్గొని పి.వాసుకు జన్మదిన శుభాకాంక్షలు చెప్పారు. ఈ సందర్భంగా పి.వాసు తన అసిస్టెంట్ డైరెక్టర్స్‌కి ల్యాప్ట్యాప్లని కానుకగా అందించారు. (ఇదీ చదవండి: రైతుబిడ్డకి వార్నింగ్.. రతిక బిహేవియర్‌పై నాగ్ సీరియస్!) -
లారెన్స్ తన కూతురిని దాస్తున్నాడా? ఆయనకు అంత పెద్ద కూతురు ఉందా?
కొరియోగ్రాఫర్‌గా కెరీర్ మొదలుపెట్టి, ప్రస్తుతం హీరోగా బిజీ అయిపోయాడు రాఘవ లారెన్స్. ఇతడు చేసిన కొత్త సినిమా 'చంద్రముఖి 2'. గతంలో రజనీకాంత్ చిత్రానికి ఇది సీక్వెల్. సెప్టెంబరు 28న థియేటర్లలోకి రానుంది. 1993లో డ్యాన్స్ కొరియోగ్రాఫర్‌గా అరంగేట్రం చేసిన ఆయన 1998లో తెలుగు సినిమాలో నటుడిగా కెరీర్‌ను ప్రారంభించారు. కాంచన సిరీస్‌లో విడుదలైన చిత్రాల ద్వారా సౌత్ ఇండియా ప్రేక్షకుల దృష్టిని లారెన్స్ ఆకర్షించాడు. సామాజిక సేవా విషయాల్లో ఎప్పుడూ ముందుండే వ్యక్తి లారెన్స్. నిరుపేద పిల్లలకు సహాయం చేసేందుకు ఆయన ఒక ట్రస్ట్‌ను ఏర్పాటు చేసి పలు సేవలను అందిస్తున్నాడు. (ఇదీ చదవండి: విశాల్ 'మార్క్ ఆంటోనీ' సినిమాపై బ్యాన్ విధించిన కోర్టు) లారెన్స్ లాగే అతని తమ్ముడు ఎల్విన్ కూడా హీరోగా కోలీవుడ్ అరంగేట్రం చేయబోతున్నాడు. ఆయన సినిమా షూటింగ్ పనులు కూడా వేగంగా జరుగుతున్నాయి. లారెన్స్ సినిమాలతో పాటు సోషల్ వర్క్ కూడా పెద్ద ఎత్తున చేస్తున్నాడు. అనాథ పిల్లలకు, వృద్ధులకు సహాయం చేయడంలో లారెన్స్ ముందుంటాడు. లారెన్స్ గురించి అందరికీ తెలుసుగానీ, అతని కుటుంబం గురించి ఎవరికీ పెద్దగా తెలిసే అవకాశం లేదు. లారెన్స్ భార్య పేరు లత. సామాజిక సేవ చేయడంలో భర్తకు అండగా నిలిచేది లత. లతను పెళ్లి చేసుకున్న తర్వాతే తాను డ్యాన్స్ మాస్టర్‌గా ఎదిగానని, సినిమాల్లో ఇంత ఎత్తుకు ఎదిగానని, ఆమె వల్లే తనకు అదృష్టాన్ని తెచ్చిపెట్టిందని లారెన్స్ ఇంటర్వ్యూలలో చెప్పాడు. లారెన్స్, లత దంపతులకు రాఘవి అనే కుమార్తె ఉంది. లారెన్స్‌కి ఓ కూతురు ఉందన్న విషయం చాలా మందికి తెలియదు. ఇప్పుడు రాఘవి సినిమాల్లో ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు లారెన్స్ అభిమానుల్లో చర్చ జరుగుతోంది. లారెన్స్‌కి ఇంత పెద్దకూతురు ఉందంటే నమ్మలేకపోతున్నామని చాలామంది వ్యాఖ్యానిస్తున్నారు. (ఇదీ చదవండి: బాక్సాఫీస్ దగ్గర జవాన్ కలెక్షన్ల తుపాన్.. రెండో రోజు ఎన్ని కోట్లంటే?) త్వరలో ఒక మంచి సినిమాతో ఆమె ఎంట్రీ ఇస్తుందని ప్రచారం జరుగుతుంది. అందుకు కథను కూడా లారెన్స్ సెలక్ట్ చేశాడని కూతురి తొలి సినిమాకు ఆయన డైరెక్షన్ చేస్తున్నట్లు సమాచారం. వచ్చే ఏడాదితో ఆమె గ్రాడ్యేషన్ పూర్తి అవుతుందని తెలుస్తోంది. రాఘవి మోడ్రన్ డ్రెస్సుల్లో స్టైలిష్‌గా పోజులిచ్చిన ఫోటోలు కూడా తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఇంతకాలం లారెన్స్ తన కూతురిని ఎక్కడ దాచిపెట్టాడు అంటూ కొందరు సరదాగా కామెంట్లు చేస్తున్నారు. -
గణేషా.. ఒక్క సినిమా లేదు..ఎందుకిలా?
పండగొచ్చిందంటే చాలు కొత్త సినిమాల సందడితో థియేటర్స్ కళకళలాడుతాయి. చిన్న పండుగల రోజు ఏమోగానీ సంక్రాంతి..వినాయక చవితి..దసరా..దీపావళి లాంటి పెద్ద పండగ రోజు అయితే రెండు, మూడు పెద్ద సినిమాలతో పాటు ఒకటి రెండు చిన్న చిత్రాలు కూడా రీలీజ్ అవుతుంటాయి. ప్రతి ఒక్కరు ఈ పండుగ రోజుల్లో తమ సినిమాను విడుదల చేయాలనుకుంటారు. కొన్నిసార్లు పోటీ భారీగా ఉన్నప్పటికీ బాక్సాఫీస్ బరిలోకి దిగుతారు. ఎందుకలా అంటే.. సినిమా యావరేజ్‌గా ఉన్నసరే పండుగ కాబట్టి ఫ్యామిలీ ఆడియెన్స్ థియేటర్లకు వచ్చే చాన్స్ ఉంటుంది. ఇది చాలా సందర్భాల్లో వర్కౌట్ అయింది కూడా. అందుకే పండుగలపై చాలా సినిమాలు ముందే ఖర్చీఫ్ వేసుకుంటాయి. కానీ ఇప్పుడు టాలీవుడ్లో విచిత్రమైన సంఘటన చోటు చేసుకుంది. వినాయక చవితి లాంటి పెద్ద పండగ రోజు ఒక్క తెలుగు సినిమా కూడా విడుదల కావడంలేదు. బంగారం లాంటి గణేష్ పండుగ డేట్‌ని వదిలేసి వేరే డేట్‌కి తమ చిత్రాలను రిలీజ్ చేస్తున్నారు. ముందే ఖర్చీఫ్.. చివరల్లో అలా వాస్తవానికి ఈ వినాయక చవితికి చాలా సినిమాలు విడుదల కావాల్సింది. కొన్ని పెద్ద సినిమాలు ముందే డేట్ ఎనౌన్స్ చేయడంతో చిన్న సినిమాలు వెనక్కి తగ్గాయి. కానీ చివరి నిమిషంలో బడా చిత్రాలు సైతం చవితికి రాలేమని ప్రకటించాయి. బోయపాటి-రామ్ కాంబోలో తెరకెక్కిన పాన్ ఇండియా మూవీ ‘స్కంద’ సెప్టెంబర్ 15న విడుదల కావాల్సింది. కానీ కారణం ఏంటో తెలియదు.. సెప్టెంబర్ 28కి వాయిదా వేశారు. ఇక రాఘవ లారెన్స్, కంగనా రనౌత్ కలిసి నటించిన చంద్రముఖి-2 చిత్రం కూడా సెప్టెంబర్ 15న రిలీజ్ కావాల్సింది. అది కూడా వాయిదా పడింది. వీఎఫ్ఎక్స్ సన్నివేశాలు ఆలస్యం కావడం వల్లే సినిమా వాయిదా పడిందని చిత్రయూనిట్ పేర్కొంది. స్కంద రిలీజ్ రోజే చంద్రముఖి-2 రానుంది. అంటే సెప్టెంబర్ 28న ఈ రెండు చిత్రాలు బాక్సాపీస్ వద్ద పోటీ పడతాయి. టిల్లన్న ఇలాగైతే ఎలాగన్నా? పోటీ ఈ వినాయక చవితికి టిల్లుగాని డీజేకి చిందులేద్దామనుకుంటే.. అది కూడా జరగడం లేదు. సిద్ధు జొన్నలగడ్డ, నేహా శెట్టి జంటగా నటించిన ‘టిల్లు స్క్వేర్’ సెప్టెంబర్ 15న విడుదల చేయనున్నట్లు గతంలో మేకర్స్ ప్రకటించారు. కానీ అది కూడా మళ్లీ వాయిదా పడింది. ‘టిల్లు స్క్వేర్’ పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. క్వాలిటీ ఔట్పుట్ కోసం విడుదల వాయిదా వేయక తప్పడం లేదు. త్వరలోనే కొత్త రిలీజ్ డేట్ ప్రకటిస్తాం’’ అంటూ మేకర్స్ ప్రకటించారు. డబ్బింగ్ సినిమానే దిక్కు వినాయక చవితికి ఒక్క తెలుగు సినిమా కూడా టాలీవుడ్లో విడుదల కావడంలేదు. డబ్బింగ్ సినిమాలనే తెలుగు ప్రేక్షకులను అలరించేందుకు సిద్దమయ్యాయి. అందులో చంద్రముఖి-2 వాయిదా పడింది. ఇప్పుడిక ఒకే ఒక్క డబ్బింగ్ మూవీ విడుదల కాబోతుంది. అదే మార్క్ ఆంటోని. విశాల్ నటిస్తున్న తమిళ సినిమా ఇది. ఇప్పటికే ఈ సినిమా ట్రైలర్‌కు పిచ్చ క్రేజ్ వచ్చింది. తెలుగులో కూడా విశాల్‌కు మంచి ఫాలోయింగ్. అందుకే ఈ చిత్రాన్నితెలుగులో డబ్ చేసి రిలీజ్ చేస్తున్నారు. ఒకవేళ కొంచెం పాజిటివ్ టాక్ వచ్చిన చాలు..మార్క్ ఆంటోని పంట పండినట్లే అని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మంచి వీకేండ్ మిస్ ఈ సారి వినాయక చవితి సోమవారం వచ్చింది. ఇది సినిమా వాళ్లకు బాగా కలిసొచ్చే రోజు. ఎందుంటే.. పండగతో కలిసి మొత్తం మూడు హాలిడేస్ వస్తున్నాయి. శుక్రవారం(సెప్టెంబర్ 15)సినిమాను విడుదల చేస్తే.. శని,ఆది వారాలతో పాటు సోమవారం కూడా సెలవు దినమే. దీంతో ఫ్యామిలీ ఆడియన్స్ ఎక్కువగా థియేటర్స్‌కి వచ్చే అవకాశం ఉంది. సినిమాకు కాస్త పాజిటివ్ టాక్ వచ్చిన చాలు.. ఈ మూడు రోజుల్లో బ్రేక్ ఈవెన్ దాటొచు. ఇంత మంచి వీకెండ్‌ని టాలీవుడ్ వదులుకుంది. -
చంద్రముఖి 2 వాయిదా, కారణం ఇదే!
కోలీవుడ్ సూపర్ స్టార్ రజనీకాంత్ కథానాయకుడిగా ప్రభు, జ్యోతిక, నయనతార, వడివేలు ముఖ్య పాత్రలు పోషించిన చిత్రం చంద్రముఖి. పి.వాసు దర్శకత్వం వహించిన ఈ చిత్రం 2005లో విడుదలై ఘనవిజయాన్ని సాధించింది. తాజాగా దానికి సీక్వెల్‌గా రూపొందిన చిత్రం చంద్రముఖి–2. రాఘవ లారెన్స్, కంగనా రనౌత్, వడివేలు, మహిమ నంబియార్, లక్ష్మీ మీనన్ ప్రధాన పాత్రలు పోషించిన ఈ చిత్రానికి ఎంఎం కీరవాణి సంగీతాన్ని, ఆర్డీ రాజశేఖర్ ఛాయాగ్రహణం అందించారు. ఆ చిత్ర ఆడియో, ట్రైలర్ ఇటీవలే విడుదలయ్యాయి. కాగా చంద్రముఖి 2 చిత్రాన్ని ఈ నెల 15న విడుదల చేయనున్నట్లు యూనిట్ వర్గాలు అధికారికంగా ప్రకటించాయి. చంద్రముఖి చిత్రం సంచలన విజయం సాధించడంతో దానికి సీక్వెల్‌గా రూపొందిన చంద్రముఖి–2 చిత్రంపై ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. అయితే తాజాగా ఈ చిత్రం విడుదల వాయిదా పడిందంటూ కొన్ని వార్తలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. చిత్రానికి వీఎఫ్ఎక్స్ సన్నివేశాలు ఆలస్యం కావడం వల్లే సినిమా వాయిదా పడిందని, కావున ఈ చిత్రాన్ని ఈనెల 28న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారంటూ టాక్ వైరల్ అవుతోంది. తాజాగా ఇదే నిజమని ధ్రువీకరించింది చిత్రయూనిట్. చంద్రముఖి 2 ఈ నెల 28న రిలీజ్ కానుందని అధికారికంగా ప్రకటించింది. Chandramukhi-2 release date has been pushed to September 28 due to technical delays. 🌸 Vettaiyan & Chandramukhi will be back fiercer than ever. 🏇🗡️ See you at the theatres with an extra special treat. 🕴🏻🤗 🎬 #PVasu 🌟 @offl_Lawrence @KanganaTeam 🎶 @mmkeeravaani 🎥… pic.twitter.com/zrJAT7psri — Lyca Productions (@LycaProductions) September 8, 2023 చదవండి: అట్లీ, షారుఖ్‌పై నయనతార అసంతృప్తి.. నిజమెంత? -
రిలీజ్ పోస్ట్ పోన్.. కొత్త డేట్ చెప్పు గురూ..
సినిమా సెట్ అనుకున్నప్పుడే చూచాయగా రిలీజ్ డేట్ కూడా సెట్ చేస్తుంటారు మేకర్స్. అలా కాకపోయినా షూటింగ్ సగం పూర్తయ్యాక సెట్ చేస్తారు. వన్ ఫైన్ డే ఆ డేట్‌ని అధికారికంగా ప్రకటిస్తారు. కానీ.. సెట్ చేసిన డేట్‌కి కొన్ని సినిమాలు విడుదల కాకపోవచ్చు. సాంకేతిక కారణాలు, ఇతర కారణాల వల్ల వాయిదా పడుతుంటాయి. అలా ప్రస్తుతం అరడజను చిత్రాల దాకా వాయిదా పడ్డాయి. ఏ సినిమా కారణం ఆ సినిమాది. ఇక అనుకున్న డేట్‌కి రాకుండా కొత్త డేట్ సెట్ చేసుకుని సిల్వర్ స్క్రీన్ పైకి రానున్న సినిమాల గురించి తెలుసుకుందాం. ‘సలార్’లో ప్రభాస్ ∙ప్రభాస్ హీరోగా నటించిన పాన్ ఇండియా చిత్రం ‘సలార్’. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో విజయ్ కిరగందూర్ నిర్మించిన ఈ సినిమా రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు రానుంది. అందులో భాగంగా ‘సలార్: పార్ట్ 1–సీజ్ఫైర్’ని ఈ నెల 28న విడుదల చేయనున్నట్లు తొలుత మేకర్స్ ప్రకటించారు. అన్నీ అనుకున్నట్లు జరిగితే ఈ నెలాఖరులో ప్రభాస్ ఫ్యాన్స్‌కి, సినిమా లవర్స్‌కి పండగే. అయితే ఈ సినిమా రిలీజ్ వాయిదా వేస్తున్నారంటూ వార్తలు షికారు చేస్తున్నాయి. గ్రాఫిక్స్ పనులు ఇంకా పూర్తి కాకపోవడంతో విడుదల వాయిదా పడనుందని ఇండస్ట్రీ వర్గాల్లో టాక్. అయితే ‘సలార్’ రిలీజ్ వాయిదాపై చిత్రబృందం నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. దీంతో ఎప్పుడు రిలీజ్ చేస్తారు? అనేదానిపై పాన్ ఇండియా స్థాయిలో చర్చ జరుగుతోంది. తాజా అప్డేట్ ప్రకారం ఈ సినిమాని దీపావళి కానుకగా నవంబర్‌లో విడుదల చేయాలనే ఆలోచనలో ఉన్నారట మేకర్స్. ముందుగా అనుకున్నట్లు ఈ నెల 28న సినిమాని విడుదల చేస్తారా? లేదా అనేది తెలియాలంటే కొన్ని రోజులు వేచి చూడాలి. శ్రుతీహాసన్ హీరోయిన్గా నటించిన ఈ చిత్రంలో జగపతిబాబు, పృథ్వీరాజ్ సుకుమారన్, శ్రియా రెడ్డి కీలక పాత్రల్లో నటించారు. ‘స్కంద’లో రామ్, శ్రీలీల రామ్ పోతినేని హీరోగా నటించిన తొలి పాన్ ఇండియా చిత్రం ‘స్కంద’ కూడా ముందు అనుకున్న తేదీకి కాకుండా వేరే తేదీకి ప్రేక్షకుల ముందుకు వస్తోంది. బోయపాటి శ్రీను దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో శ్రీలీల హీరోయిన్. శ్రీనివాసా చిట్టూరి నిర్మించారు. ఈ చిత్రాన్ని తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో వినాయక చవితి సందర్భంగా ఈ నెల 15న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు గతంలో చిత్రబృందం ప్రకటించింది. అయితే తాజాగా మేకర్స్ సినిమా విడుదలను వాయిదా వేశారు. ఈ నెల 15న కాకుండా 28న రిలీజ్ చేయనున్నట్లు చిత్ర నిర్మాణ సంస్థ అధికారికంగా ప్రకటించింది. అయితే సినిమా విడుదల తేదీ ఎందుకు మార్చాల్సి వచ్చిందనే విషయాన్ని మాత్రం వెల్లడించలేదు. ‘చంద్ర ముఖి–2’లో కంగన రజనీకాంత్ హీరోగా జ్యోతిక టైటిల్ రోల్లో నటించిన చిత్రం ‘చంద్రముఖి’ (2005). పి. వాసు దర్శకత్వం వహించిన ఈ సినిమా బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. దాదాపు 18 ఏళ్ల తర్వాత ఈ చిత్రానికి సీక్వెల్‌గా రూపొందిన చిత్రం ‘చంద్రముఖి 2’. తొలి భాగానికి దర్శకత్వం వహించిన పి. వాసునే రెండో భాగాన్ని తీశారు. అయితే సీక్వెల్లో హీరో, హీరోయిన్ మారారు. రాఘవ లారెన్స్ హీరోగా, కంగనా రనౌత్ టైటిల్ రోల్లో నటించారు. సుభాస్కరన్ నిర్మించిన ఈ చిత్రాన్ని వినాయక చవితి సందర్భంగా ఈ నెల 15న తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. అయితే తాజాగా ఈ సినిమా విడుదల వాయిదా పడింది. ఈ నెల 15న కాకుండా 28న విడుదల చేయనున్నట్లు నిర్మాణ సంస్థ ప్రకటించింది. కొన్ని సాంకేతిక కారణాల వల్లే విడుదలను వాయిదా వేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. కాగా ‘చంద్రముఖి 2’ని తెలుగులో రాధాకృష్ణ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై వెంకట్ ఉప్పుటూరి, వెంకట రత్నం శాఖమూరి రిలీజ్ చేస్తున్నారు. ‘ఆదికేశవ’లో వైష్ణవ్ తేజ్ వైష్ణవ్ తేజ్, శ్రీలీల జంటగా శ్రీకాంత్ ఎన్. రెడ్డి దర్శకత్వం వహిస్తున్న చిత్రం ‘ఆదికేశవ’. సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించిన ఈ సినిమా విడుదల కూడా వాయిదా పడింది. తొలుత ఈ చిత్రాన్ని జూలైలో రిలీజ్ చేయాలనుకున్నారు.. చేయలేదు. ఆ తర్వాత ఆగస్టు 18న విడుదల చేయనున్నట్లు యూనిట్ ప్రకటించింది. ఆ తర్వాత అది కూడా వాయిదా పడి చివరికి నవంబర్ 10వ తేదీకి ఫిక్స్ అయింది. ఫారిన్లో కొంత షూటింగ్ బ్యాలెన్స్ ఉండటం వల్లే విడుదల వాయిదా వేస్తున్నట్లు ‘ఆదికేశవ’ చిత్రబృందం ప్రకటించింది. ‘టిల్లు స్క్వేర్’లో సిద్ధు సిద్ధు జొన్నలగడ్డ, నేహా శెట్టి జంటగా విమల్ కృష్ణ దర్శకత్వం వహించిన ‘డీజే టిల్లు’ (2022) సినిమా సూపర్ హిట్‌గా నిలిచిన విషయం తెలిసిందే. ఈ సినిమాకి సీక్వెల్‌గా ‘టిల్లు స్క్వేర్’ రూపొందింది. ఈ చిత్రానికి డైరెక్టర్, హీరోయిన్ మారారు. మల్లిక్ రామ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో అనుపమా పరమేశ్వరన్ హీరోయిన్గా నటించారు. ‘డీజే టిల్లు’ని నిర్మించిన సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించారు. ఈ మూవీని కూడా ఈ నెల 15న విడుదల చేయనున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. అయితే విడుదల వాయిదా పడింది. ‘‘టిల్లు స్క్వేర్’ పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. క్వాలిటీ ఔట్పుట్ కోసం విడుదల వాయిదా వేయక తప్పడం లేదు. త్వరలోనే కొత్త రిలీజ్ డేట్ ప్రకటిస్తాం’’ అంటూ మేకర్స్ ప్రకటించారు. ‘పెద కాపు’లో విరాట్ కర్ణ ∙‘నారప్ప’ వంటి హిట్ మూవీ తర్వాత శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం వహించిన చిత్రం ‘పెదకాపు–1’. విరాట్ కర్ణ, ప్రగతి శ్రీవాస్తవ జంటగా నటించారు. మిర్యాల సత్యనారాయణ రెడ్డి సమర్పణలో మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మించారు. ఈ సినిమాని తొలుత ఆగస్టులో విడుదల చేయనున్నట్లు యూనిట్ ప్రకటించినా, వాయిదా పడింది. కొత్త రిలీజ్ డేట్ ఎప్పుడు? అనేదానిపై తాజాగా చిత్ర యూనిట్ స్పష్టత ఇచ్చింది. ఈ నెల 29న ‘పెదకాపు –1’ చిత్రాన్ని విడుదల చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. -
'నేను మీకు వీరాభిమానిని'.. జ్యోతిక పోస్ట్ వైరల్!
2005లో ఐకానిక్ బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న మూవీ చంద్రముఖి. ఈ చిత్రంలో రజినీకాంత్, నయనతార, ప్రభు, సోనుసూద్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ చిత్రం బాక్సాఫీస్‌ను షేక్ చేసిన సంగతి తెలిసిందే. పి. వాసు దర్శకత్వంలో తెరకెక్కించారు. అయితే ఈ చిత్రం చంద్రముఖి పాత్రలో జ్యోతిక అభిమానులను మెప్పించింది. తన హవాభావాలతో ప్రేక్షకులను కట్టిపడేసింది. ప్రేక్షకుల గుండెల్లో చంద్రముఖిగా తన పేరును ముద్రించుకుంది జ్యోతిక. (ఇది చదవండి: నిన్ను చాలా మిస్ అవుతున్నా.. హీరోయిన్ పోస్ట్ వైరల్!) అయితే ప్రస్తుతం ఈ చిత్రానికి సీక్వెల్‌గా చంద్రముఖి-2 చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రంలో చంద్రముఖి పాత్రలో బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ కనిపించనుంది. పార్ట్-2 లో నటీనటులను పూర్తిగా మార్చేశారు. రజినీకాంత్ పోషించిన పాత్రలో రాఘవ లారెన్స్ నటిస్తున్నారు. ఇప్పటికే ఈ మూవీ ట్రైలర్‌ను కూడా రిలీజ్ చేశారు మేకర్స్. దీంతో నటి జ్యోతిక ఓ ఆసక్తికర పోస్ట్ చేసింది. చంద్రముఖి పాత్రలో కంగనా నటించడం పట్ల ప్రశంసలు కురిపించింది. తాను కూడా కంగనా రనౌత్ అభిమానిని అంటూ ఇన్‌స్టా స్టోరీస్‌లో చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. జ్యోతిక ఇన్‌స్టాలో రాస్తూ..' అత్యంత ప్రతిభావంతులైన నటీమణుల్లో కంగనా ఒకరు. మీరు చంద్రముఖి పాత్రను పోషించినందుకు చాలా గర్వపడుతున్నా. ఆ పాత్రలో అద్భుతంగా కనిపిస్తున్నారు. మీ నటనకు నేను కూడా పెద్ద అభిమానిని. ఈ చిత్రం కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నా. ఎందుకంటే ప్రత్యేకంగా మీ కోసమే ఈ సినిమా చూడాలని ఉంది. ముఖ్యంగా లారెన్స్, పి వాసుకు మరో హిట్ ఖాతాలో పడినట్టే. సూపర్ హిట్ అవ్వాలని చిత్రబృందానికి మనస్ఫూర్తిగా అభినందనలు. నా ఆల్ ది బెస్ట్." అంటూ పోస్ట్ చేసింది. కాగా.. చంద్రముఖి 2 సెప్టెంబర్ 15న హిందీ, తమిళం, తెలుగు, కన్నడ, మలయాళ భాషల్లో సినిమాల్లో విడుదల కానుంది. (ఇది చదవండి: అందుకే ఇప్పటికీ పెళ్లి చేసుకోలేదు: తెలుగు నటి) -
చంద్రముఖి 2 ట్రైలర్ పై దారుణమైన ట్రోల్స్
-
జ్యోతిక కాదు నేనే అసలైన చంద్రముఖి: కంగనా
తమిళ సినిమా: వివాదాస్పద నటి అని కంగనా రనౌత్ మరోసారి నిరూపించారు. సినీ రాజకీయ నాయకులపై తనదైన బాణీలో విమర్శిస్తూ ఎప్పుడూ వార్తల్లో ఉంటుంది ఈ బాలీవుడ్ జాణ. తాజాగా ఈమె తమిళంలో టైటిల్ పాత్రను పోషించిన చంద్రముఖి –2 చిత్రం నిర్మాణ కార్యక్రమాలను పూర్తి చేసుకొని ఈనెల 15వ తేదీన ప్రపంచవ్యాప్తంగా తెరపైకి రానుంది. రాఘవ లారెన్స్ కథానాయకుడిగా నటించిన ఈ చిత్రానికి పి.వాసు దసకత్వం వహించారు ఎం ఎం కీరవాణి సంగీతాన్ని అందించిన ఈ చిత్రాన్ని లైకా ప్రొడక్షన్స్ సంస్థ నిర్మించింది. ఈ సందర్భంగా మంగళవారం ఉదయం చైన్నె లోని ఒక స్టార్ హోటల్లో చిత్ర విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. ఇందులో పాల్గొన్న నటి కంగనా రనౌత్ మాట్లాడుతూ తాను తమిళంలో నటించిన మూడో చిత్రం చంద్రముఖి– 2 అని చెప్పారు. తాను ఇంతకుముందు వచ్చిన చంద్రముఖి చిత్రాన్ని చూశానని అందులో జ్యోతిక నటన చాలా నచ్చిందని చెప్పారు. ఆమె తనకు స్ఫూర్తిగా పేర్కొన్నారు. అయితే ఆమెతో తనను పోల్చుకోరాదని, తాను నటించిన పాత్రే అసలైన చంద్రముఖి అని పేర్కొన్నారు. హారర్ర్, కామెడీ ఫ్యామిలీ అంటూ అన్ని అంశాలు కలిగిన చంద్రముఖి వంటి కలర్ ఫుల్ చిత్రంలో నటించడం సంతోషంగా ఉందన్నారు. ఈ చిత్ర యూనిట్‌తో కలిసి నటించడం మంచి అనుభవంగా పేర్కొన్నారు. -
చంద్రముఖి 2: సేమ్ టు సేమ్ ఉంది అంటున్న నెటిజన్స్
-
Chandramukhi 2: ఆసక్తి పెంచుతోన్న చంద్రముఖి-2 ట్రైలర్
రాఘవ లారెన్స్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ‘చంద్రముఖి 2’. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కంగనా రనౌత్ టైటిల్ పాత్రను పోషించింది. రజనీకాంత్ నటించిన సూపర్‌హిట్ సినిమా ‘చంద్రముఖి’కి ఇది సీక్వెల్‌గా రూపొందిన సంగతి తెలిసిందే. వినాయక చవితి సందర్భంగా సెప్టెంబరు 15న ఈ చిత్రం విడుదల కాబోతుంది. ఈ సందర్భంగా చిత్ర బృందం తాజాగా ట్రైలర్‌ని విడుదల చేసింది. ‘రాజాధి రాజ.. రాజ గంభీర.. రాజ మార్తాండ.. రాజ కుల తిలక..వేటయ్య వేట్టయ రాజు వరాదూర్’అంటూ రాఘవ లారెన్స్ ఎంట్రీతో ట్రైలర్ ప్రారంభం అవుతంది. ట్రైలర్లో రాఘవ లారెన్స్ రెండు షేడ్స్‌లో మెప్పిస్తున్నారు. ఒకటి స్టైలిష్ లుక్ కాగా.. మరోటి వేట్టయా రాజా లుక్. ఇక చంద్రముఖి పాత్రలో కంగనా రనౌత్ ఒదిగిపోయింది. ఇక బసవయ్య పాత్రలో స్టార్ కమెడియన్ వడివేలు తనదైన కామెడీతో మెప్పించబోతున్నారు. సినిమాలోని హారర్, థ్రిల్లింగ్, కామెడీ అంశాలను చూపించారు. ప్రతీ ఫ్రేమ్‌ను ఎంతో రిచ్‌గా తెరకెక్కించారు. నటీనటుల పెర్ఫామెన్స్‌తో పాటు ఆస్కార్ విన్నర్ ఎం.ఎం.కీరవాణి సంగీతం, నేపథ్య సంగీతం, ఆర్.డి.రాజశేఖర్ సినిమాటోగ్రఫీ హైలైట్‌గా ఆడియెన్స్‌ను అలరించనున్నాయని ట్రైలర్ చూస్తుంటే స్పష్టమవుతోంది. ట్రైలర్ సినిమాపై ఉన్న ఎక్స్‌పెక్టేషన్స్‌ను పెంచుతోంది. ‘చంద్రముఖి 2’తో డైరెక్టర్ పి.వాసు సిల్వర్ స్క్రీన్‌పై మరోసారి ఎలాంటి మ్యాజిక్ క్రియేట్ చేయబోతున్నారోనని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. -
అందుకే నా ట్రస్ట్‌కి విరాళాలు వద్దని చెప్పా: లారెన్స్
సామాజిక సేవ కార్యక్రమాల్లో ఎప్పుడు ముందుంటాడు రాఘవా లారెన్స్. ‘రాఘవా లారెన్స్ ఛారిటబుల్ ట్రస్ట్’ ద్వారా ఇప్పటికే ఎంతోమంది చిన్నారులకు, దివ్యాంగులకు సేవలు అందిస్తున్నారు. డ్యాన్సర్‌గా ఉన్నప్పుడు దివ్యాంగులకు డ్యాన్స్ నేర్పించాడు. కొంతమంది చిన్నారులకు గుండె ఆపరేషన్స్ చేయించడ, కరోనా సమయంలో నిత్యావసర వస్తువులను పంపిణీ చేయటం.. ఇలా క్రమంగా ఆయన తన సేవా కార్యక్రమాలను పెంచుకుంటూ వెళుతున్నారు. అయితే లారెన్స్ చేసే మంచి పనులు చూసి కొంతమంది అతని ట్రస్ట్‌కు డబ్బులు పంపిస్తున్నారు. కానీ ఇది లారెన్స్‌కి నచ్చడం లేదు. తన ట్రస్ట్‌కు ఎవరూ డబ్బులు పంపొద్దని, తానే చూసుకుంటానని ట్వీట్ చేశాడు. లారెన్స్ నిర్ణయాన్ని పలువురు నెటిజన్స్ తప్పుబట్టారు. అతన్ని ట్రోల్ చేస్తూ ట్వీట్ చేశారు. ఈ నేపథ్యంలో లారెన్స్ తాజాగా ఓ వీడియోని విడుదల చేశాడు. తాను విరాళాలు స్వీకరించకపోవడానికి గల కారణాలు తెలియజేశాడు. (చదవండి: అల్లు అర్జున్‌కి గ్లోబల్ వైడ్ క్రేజ్.. ఎలా సాధ్యమైంది?) "నా ట్రస్ట్ కి ఎవరూ డబ్బులు పంపొద్దు..నా పిల్లల్ని నేనే చూసుకుంటాను.. అని కొన్ని రోజుల ముందు రిక్వెస్ట్ చేస్తూ నేను ఒక ట్వీట్ వేశాను. అందుకు కారణమేంటంటే నేను డాన్స్ మాస్టర్ గా ఉన్నప్పుడు ఓ ట్రస్ట్ ను స్టార్ట్ చేశాను. అందులో 60 మంది పిల్లల్ని పెంచటం, వికలాంగులకు డాన్స్ నేర్పించటం, ఓపెన్ హార్ట్ సర్జరీలు చేయించటం వంటి కార్యక్రమాలను నిర్వహించాను. ఈ పనులన్నింటినీ నేను ఒకడ్నినే చేయలేకపోయాను. అందుకనే ఇతరుల నుంచి సాయం కావాలని కోరాను. అప్పుడు రెండేళ్లకు ఓసినిమానే చేసేవాడిని. కానీ ఇప్పుడు సంవత్సరానికి మూడు సినిమాలు చేస్తున్నాను. బాగానే డబ్బులు వస్తున్నాయి కదా, నాకు నేనే చేయొచ్చు కదా, ఇతరులను ఎందుకు అడిగి చేయాలని నాకే అనిపించింది. నేను పొగరుతో ఇతరులు సేవ కోసం ఇచ్చే డబ్బులను వద్దనటం లేదు. నాకు ఇచ్చే డబ్బులను మీకు దగ్గరలో డబ్బుల్లేక కష్టపడే ట్రస్టులు చాలానే ఉన్నాయి. అలాంటి వారికి సాయం చేయండి. వారికెంతో ఉపయోగపడుతుంది. వారికి చాలా మంది సాయం చేయరు. నేను ఎంత చెప్పినా కొందరైతే నాతో కలిసే సాయం చేస్తామని అంటున్నారు. చాలా సంతోషం. ఆర్థిక ఇబ్బందులో బాధపడేవారెవరో నేనే చెబుతాను. మీచేత్తో మీరే సాయం చేయండి. అది మీకు ఎంతో సాయాన్ని కలిగిస్తుంది. థాంక్యూ సో మచ్ ’అన్నారు. This is for my Telugu Fans..! pic.twitter.com/csJPLn5nqH — Raghava Lawrence (@offl_Lawrence) August 30, 2023 -
చంద్రముఖి 2 విజయం ఆయనకే దక్కుతుంది
‘‘డైరెక్టర్ వాసుగారు నాలుగు దశాబ్దాల అనుభవంలో ఎన్నో గొప్ప సినిమాలు చేశారు. ‘చంద్రముఖి 2’ను కూడా గొప్పగా తెరకెక్కించారు.. ఈ సినిమా సాధించే విజయం ఆయనకే దక్కుతుంది’’ అని హీరో రాఘవ లారెన్స్ అన్నారు. పి.వాసు దర్శకత్వంలో రాఘవ లారెన్స్ హీరోగా, కంగనా రనౌత్ టైటిల్ పాత్రలో నటించిన చిత్రం ‘చంద్రముఖి 2’. లైకా ప్రొడక్షన్స్ బ్యానర్‌పై సుభాస్కరన్ నిర్మించిన ఈ సినిమా సెప్టెంబర్ 15న విడుదలవుతోంది. చెన్నైలో జరిగిన ప్రీ రిలీజ్ వేడుకలో రాఘవ లారెన్స్ మాట్లాడుతూ–‘‘ నేను నిర్వహిస్తున్న చారిటీ సంస్థకు సుభాస్కరన్‌గారు ఎంతో పెద్ద మనసుతో కోటి రూపాయలు విరాళం ఇచ్చారు. ఆ డబ్బుతో ఓ స్థలం కొని భవనం కడతాను. ఇకపై నా చారిటీకి డబ్బులు ఇవ్వకండి.. నా చారిటీకి నేను ఉన్నాను. సాయం చేయాలనుకుంటే చాలా చారిటీ సంస్థలుఉన్నాయి.. వాటికి ఇవ్వండి’’ అన్నారు. ‘‘నేను నటిగా కెరీర్ స్టార్ట్ చేసిన ఇన్నేళ్లలో ‘చంద్రముఖి 2’ వంటి గొప్ప చిత్రం చేయలేదు’’ అన్నారు కంగన. ‘‘చంద్రముఖి 2’ ని లారెన్స్‌తో చేస్తున్నామని రజనీకాంత్‌గారికి చెప్పగానే.. సినిమా హిట్ అవుతుందని చెప్పారు’’ అని పి.వాసు అన్నారు. -
సారీ చెప్పిన హీరో లారెన్స్.. ఆ గొడవపై కామెంట్స్!
కొరియోగ్రాఫర్‌గా కెరీర్ మొదలుపెట్టి, ప్రస్తుతం హీరోగా బిజీ అయిపోయాడు రాఘవ లారెన్స్. ఇతడు చేసిన కొత్త సినిమా 'చంద్రముఖి 2'. గతంలో రజనీకాంత్ చిత్రానికి ఇది సీక్వెల్. సెప్టెంబరు 15న థియేటర్లలోకి రానుంది. ఈ క్రమంలోనే తాజాగా ఆడియో లాంచ్ ఈవెంట్ నిర్వహించారు. అక్కడ ఓ గొడవ జరగ్గా, దానిపై ఇప్పుడు లారెన్స్ క్షమాపణలు చెప్పాడు. ఏం జరిగింది? సాధారణంగా ఇలాంటి ఆడియో లాంచ్, ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగినప్పుడు అభిమానులు కాస్త ఎక్కువగానే వస్తుంటారు. 'చంద్రముఖి 2' ఆడియో విడుదల కార్యక్రమంలోనూ అలాంటి ఓ సంఘటన జరిగింది. ఈవెంట్ చూడటానికి వచ్చిన ఓ స్టూడెంట్‌పై బౌన్సర్ దాడి చేశాడు. ఆ గొడవ ఆడిటోరియం బయట జరగ్గా, తాజాగా లారెన్స్ దృష్టికి రావడంతో సారీ చెప్పాడు. (ఇదీ చదవండి: బిగ్‌బాస్ 7 'ఉల్టా పల్టా' అసలు మీనింగ్ ఇదేనా!?) ట్వీట్లో ఏముంది? 'చంద్రముఖి 2 ఆడియో లాంచ్ ఈవెంట్లో ఓ స్టూడెంట్, బౌన్సర్ మధ్య జరిగిన గొడవ ఇప్పుడు నా దృష్టికి వచ్చింది. వేడుక జరుగుతున్నప్పుడు దాని బయట గొడవ జరగడంతో నాకు ఏం తెలియలేదు. ఇప్పుడే నా దృష్టికి వచ్చింది. విద్యార్థులంటే నాకు ఎంతిష్టమో, వాళ్ల వృద్ధి చెందాలని ఎంత కోరుకుంటానే మీకు తెలుసు. ఇలాంటి గొడవలు నాకు నచ్చవ్. కారణం ఏదైనా సరే స్టూడెంట్‌ని కొట్టడం తప్పు. ఇది జరగకుండా ఉండాల్సింది. క్షమాపణలు చెబుతున్నా. బౌన్సర్స్ ఇకపై ఇలాంటి దాడి చేయొద్దని రిక్వెస్ట్ చేస్తున్నా' అని లారెన్స్ ట్వీట్ చేశాడు. సినిమాపై బజ్ లేదు 'చంద్రముఖి' సినిమా అప్పట్లో భాషతో సంబంధం లేకుండా అందరినీ భయపెట్టింది. రజనీకాంత్, జ్యోతిక యాక్టింగ్ ఇప్పటికీ మన కళ్లముందే కదలాడుతూ ఉంది. ఇప్పుడు సీక్వెల్లో వెంకటపతిరాజుగా లారెన్స్, చంద్రముఖిగా బాలీవుడ్ బ్యూటీ కంగన రనౌత్ నటించారు. పోస్టర్, పాటలు రిలీజ్ చేసినప్పటికీ తెలుగులో అయితే పెద్దగా బజ్ లేదు. రిలీజ్‌కి ఇంకో 20 రోజులు ఉంది కాబట్టి అంచనాలు పెరుగుతాయేమో చూడాలి? (ఇదీ చదవండి: పెళ్లికి ముందే పూజలు తెగ చేస్తున్న ఆ హీరోయిన్) Hello everyone, I just came to know about the unfortunate incident which happened during our #Chandramukhi2 movie Audio Launch, where one of the Bouncers involved in a fist fight with a college student. First of all myself or the organisers were not aware of this incident as it… — Raghava Lawrence (@offl_Lawrence) August 27, 2023 -
సెప్టెంబరు నెలలో విడుదల అవుతున్న ఏడు టాప్ సినిమాలు ఇవే..!
సెప్టెంబరు నెలలో సినిమా అభిమానులకు పండుగే అని చెప్పవచ్చు.. ఇదే నెలలో 7కు పైగా పెద్ద సినిమాలు విడుదలకు రెడీగా ఉన్నాయి. అంతేకాకుండా మరికొన్ని చిన్న సినిమాలు కూడా ఉన్నాయి. సెప్టెంబరు 18న వినాయక చవితి పండుగ ఉండటంతో సెప్టెంబరు 15న ఏకంగా మూడు సినిమాలు విడుదల అవుతున్నాయి. సెప్టెంబరు 1 'ఖుషి' విజయ్ దేవరకొండ-సమంత కాంబినేషన్లో వస్తున్న సినిమా 'ఖుషి'. శివ నిర్వాణ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రమిది. 2019లో వచ్చిన మజిలీ సినిమా తర్వాత ఖుషి వస్తుండటంతో ఫ్యాన్స్ అంచనాలు భారీగానే ఉన్నాయి. ఈ మూవీని నవీన్ ఎర్నేని, వై.రవిశంకర్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో రూపొందిన ఈ చిత్రం సెప్టెంబరు 1న ప్రేక్షకుల ముందుకొస్తోంది. సెప్టెంబర్ 7 'జవాన్' కోలీవుడ్ డైరెక్టర్ అట్లీ, బాలీవుడ్ కింగ్ షారుక్ ఖాన్ కాంబినేషన్లో వస్తున్న సినిమా 'జవాన్'. పఠాన్ తర్వాత భారీ అంచనాలతో ఈ సినిమా విడుదల కానుంది. ఇందులో నయనతార,దీపికా పదుకోన్ వంటి స్టార్స్ ఉన్నారు. ఈ చిత్రం సెప్టెంబర్ 7న ప్రేక్షకుల ముందుకు రానుంది. సెప్టెంబర్ 7 'మిస్ శెట్టి.. మిస్టర్ పోలిశెట్టి' యంగ్ హీరో నవీన్ పోలిశెట్టి, అనుష్క జంటగా మహేష్ బాబు. పి దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా మిస్ శెట్టి.. మిస్టర్ పోలిశెట్టి. యూవీ క్రియేషన్స్ నిర్మిస్తున్న ఈ చిత్రం సెప్టెంబర్ 7న తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో గ్రాండ్‌గా విడుదల కానుందీ చిత్రం.. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్, టీజర్, సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇక తాజాగా ఈ సినిమా ట్రైలర్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఇప్పుడు యూట్యూబ్‌లో ట్రెండ్ అవుతుంది. సెప్టెంబర్ 15 'స్కంద' రామ్ పోతినేని- శ్రీ లీల జంటగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కిన మాస్, ఫ్యామిలీ ఎంటర్టైనర్ 'స్కంద'. శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్‌పై శ్రీనివాస చిట్టూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రామ్‌ను పక్కా మాస్ లుక్‌లో బోయపాటి చూపించాడు. ఇందులోని యాక్షన్ సీన్స్ ప్రేక్షకులతో ఈలలు వేయించేలా ఉన్నాయి. ఇందులో రామ్ రెండు కోణాలు ఉన్న పాత్రలో కనిపించనున్నారు. పాన్ ఇండియా సినిమాగా తెరకెక్కిన 'స్కంద' సెప్టెంబర్ 15న వినాయక చవితి సందర్భంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. సెప్టెంబర్ 15 'చంద్రముఖి 2' రజనీకాంత్ నటించిన చంద్రముఖి సినిమా అప్పట్లో ఒక సంచలన విజయం. ఈ సినిమాకు సీక్వెల్‌గా ఇప్పుడు 'చంద్రముఖి 2' విడుదలకు రెడీగా ఉంది. ఇందులో రాఘవ లారెన్స్-కంగనా రనౌత్ నటిస్తున్నారు. పి.వాసు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా సెప్టెంబర్ 15న విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సినిమాకు కీరవాణి సంగీతం అందిస్తున్నారు. సెప్టెంబర్ 15 'మార్క్ ఆంథోని' హీరో విశాల్.. ఇప్పుడు 'మార్క్ ఆంథోని'గా వచ్చేస్తున్నాడు. సైన్స్ ఫిక్షన్, హై వోల్టేజ్ యాక్షన్ థ్రిల్లర్‌గా తీసిన ఈ సినిమాలో విశాల్‌కి జోడీగా రీతూవర్మ నటించింది. ఎస్.జె.సూర్య, సునీల్, సెల్వ రాఘవన్ ముఖ్య పాత్రలు పోషించారు. అధిక్ రవిచంద్రన్ దర్శకత్వం వహించారు. ఎస్.వినోద్ కుమార్ నిర్మించారు. ఈ సినిమా కూడా సెప్టెంబర్ 15న వినాయక చవితి సందర్భంగా విడుదల కానుంది. సెప్టెంబర్ 28 'సలార్' ప్రభాస్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన 'సలార్' సెప్టెంబర్ 28న విడుదలకు రెడీగా ఉంది. ఇందుకు సంబంధించిన ట్రైలర్‌ను సెప్టెంబర్ 3న విడుదల చేసేందుకు హోంబలే ఫిలిమ్స్ ప్లాన్ చేస్తుంది. ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్ కార్యక్రమాలు కూడా అదే రోజు నుంచి ప్రారంభించనున్నట్లు తెలుస్తోంది. సెప్టెంబర్ నెలలో విడుదలయ్యే అతిపెద్ద సినిమా 'సలార్' అనే చెప్పవచ్చు. (ఇదీ చదవండి: చిరంజీవి 'చూడాలని ఉంది' సినిమాకు 25 ఏళ్లు.. ఈ విషయాలు తెలుసా?) -
నా జీవితంలో ఇదే మొదటిసారి: కంగనా
గతంలో రజనీకాంత్ కథానాయకుడు నటించిన 'చంద్రముఖి' చిత్రం ఘనవిజయాన్ని సాధించిన విషయం తెలిసిందే. 18 ఏళ్ల తర్వాత దానికి సీక్వెల్‌గా రూపొందుతున్న చిత్రం 'చంద్రముఖి–2'. ఆ చిత్ర దర్శకుడు పి.వాసు దీనికి దర్శకత్వం వహించారు. లారెన్స్ కథానాయకుడిగా నటించిన ఇందులో బాలీవుడ్ బ్యూటీ కంగనా రనౌత్ చంద్రముఖిగా నటించడం విశేషం. నటుడు వడివేలు ముఖ్యపాత్ర పోషించారు. ఆస్కార్ అవార్డు గ్రహీత ఎంఎం కీరవాణి సంగీతాన్ని అందించిన ఈ చిత్రానికి ఆర్డి రాజశేఖర్ అందించారు. లైకా ప్రొడక్షన్స్ పతాకంపై సుభాస్కరన్ నిర్మించిన ఈ భారీ చిత్రం నిర్మాణ కార్యక్రమాలు పూర్తిచేసుకుని వినాయక చతుర్థి సందర్భంగా సెప్టెంబర్ 15న తెరపైకి రావడానికి ముస్తాబవుతోంది. ఈ సందర్భంగా చైన్నెలోని ఒక విశ్వవిద్యాలయంలో చంద్రముఖి–2 చిత్ర కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఎంఎం కీరవాణి మాట్లాడుతూ తనను మళ్లీ తమిళ చిత్ర పరిశ్రమకు తీసుకువచ్చిన లైకా ప్రొడక్షన్న్స్కు, పి.వాసుకు కతజ్ఞతలు తెలుపుకుంటున్నానన్నారు. ఈ చిత్రంలో ఐదు పాటలు ఉంటాయని చెప్పారు. నిర్మాత సుభాస్కరన్ తమిళ సినిమాకు దక్కిన భాండాగారం అని దర్శకుడు పి.వాసు పేర్కొన్నారు. కంగనారనౌత్ మాట్లాడుతూ తన జీవితంలో ఇప్పటివరకు ఎవరి వద్ద ఎలాంటి అవకాశాన్ని కోరలేదు అన్నారు అలాంటిది దర్శకుడు పి. వాసు వద్ద చంద్రముఖిగా నటించడానికి తాను నప్పుతానా అని అడిగాను అన్నారు. అందుకు ఆయన కొంచెంసేపు ఆలోచించి ఓకే అని చెప్పారన్నారు. లారెన్స్ మాట్లాడుతూ తాను సహాయ నృత్య కళాకారుడుగా నటిస్తున్నప్పుడే పి వాసు దర్శకత్వం వహించిన చిత్రాలకు పనిచేశానన్నారు. (ఇదీ చదవండి: ప్రియురాలిని పరిచయం చేసిన ' జైలర్' ఫేమ్ జాఫర్ సాదిఖ్.. ఆమె ఎవరంటే) ఆ తర్వాత నృత్య దర్శకుడుగా, నటుడుగా, దర్శకుడుగా చిత్రాలు చేసిన తాను కథానాయకుడిగా నటించిన చిత్రానికి ఆయన దర్శకత్వం వహించారన్నారు. ఇలా 40 ఏళ్లకుపైగా పి వాసు సక్సెస్ఫుల్ దర్శకుడుగా కొనసాగుతున్నారని అన్నారు. తాను ఈ చిత్రంలో వేట్టైయాన్ పాత్రలో నటించానని, దీనికి లభించే ప్రశంసలన్నీ ఆయనకే చెందుతాయని లారెన్స్ పేర్కొన్నారు. -
కంగనా చాలా బోల్డ్.. గన్‌మెన్స్‌తో కలిసి సెట్లోకి.. భయపడ్డా: లారెన్స్
‘చంద్రముఖి-2’లో కంగనా రనౌత్ హీరోయిన్ అని తెలియగానే ఆశ్చర్యపోయాను. ఆమె చాలా బోల్డ్ పర్సన్. సెట్స్‌లోకి గన్‌మెన్స్‌తో వచ్చేది. అప్పుడు నాలో ఇంకా భయం పెరిగిపోయింది. తర్వాత నా రిక్వెస్ట్ మేరకు ఆమె గన్ మెన్స్‌ను సెట్ బయటే ఉంచారు. అప్పటి నుంచి ఆమెతో ఫ్రెండ్ షిప్ చేయటం ప్రారంభించాను. అద్భుతంగా పాత్రలో ఒదిగిపోయారు’అని స్టార్ కొరియోగ్రాఫర్, డెరెక్టర్, హీరో రాఘవ లారెన్స్ అన్నారు. ఆయన హీరోగా నటించిన తాజా చిత్రం ‘చంద్రముఖి 2’. సీనియర్ డైరెక్టర్ పి.వాసు ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. సెప్టెంబర్ 15న ఈ చిత్రం విడుదల కాబోతుంది. ఈ నేపథ్యంలో తాజాగా చెన్నైలో ప్రీరిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ సందర్భంగా రాఘవ లారెన్స్ మాట్లాడుతూ..‘పెద్ద పెద్ద స్టార్ హీరోలతో సినిమాలు చేసే సుభాస్కరన్‌గారు నాతో సినిమా చేస్తారా? అని అనుకున్నాను. కానీ చంద్రముఖి 2 వంటి ఓ గొప్ప సినిమాను లార్జర్ దేన్ లైఫ్ మూవీలా నిర్మించారు. ఆయన బ్యానర్లో సినిమా చేయటం ఎంతో గర్వంగా ఉంది. ఇక మా డైరెక్టర్ వాసుగారి గురించి చెప్పాలంటే ఆయనకు నాలుగు దశాబ్దాల అనుభవం ఉంది. నేను చిన్న సైడ్ డాన్సర్‌గా ఉన్నప్పటి నుంచి ఇప్పటి వరకు ఆయన డైరెక్టర్‌గా ఎన్నో గొప్ప సినిమాలు చేశారు. ‘చంద్రముఖి 2’ను కూడా ఎంతో గొప్పగా తెరకెక్కించారు. ఈ సినిమా సాధించే విజయం ఆయనకే దక్కుతుంది’ అన్నారు. హీరోయిన్ కంగనా రనౌత్ మాట్లాడుతూ..‘నేను నటిగా కెరీర్ స్టార్ట్ చేసిన ఇన్నేళ్లలో ‘చంద్రముఖి 2’ వంటి గొప్ప సినిమా చేయలేదు. అసలు విషయమేమంటే.. నాకు అవకాశం కావాలని ఎవరినీ అడగలేదు. తొలిసారి డైరెక్టర్ పి.వాసుగారినే అడిగాను. ఈ సినిమాలో వాసుగారు నా పాత్రతో పాటు ప్రతీ పాత్రకు ఇంపార్టెన్స్ ఇస్తూ ఎంతో అద్భుతంగా తెరకెక్కించారు. ఈ సినిమా క్రెడిట్ అంతా ఆయనకే దక్కుతుంది. లారెన్స్ మాస్టర్ చాలా మందికి పెద్ద ఇన్స్పిరేషన్. ఆయన చిన్న డాన్సర్‌గా కెరీర్ స్టార్ట్ చేసి ఇప్పుడు హీరో, దర్శకుడు రేంజ్‌కు ఎదిగారు. ఎంతో మంచి మనసున్న వ్యక్తి. ఎలాంటి పరిస్థితులనైనా చిరునవ్వుతో స్వీకరిస్తారు. అలాంటి గుణం చాలాతక్కువ మందికే ఉంటుంది.రు. కీరవాణిగారి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ప్రపంచమంతా ఆయన గురించి గొప్పగా మాట్లాడింది. ఆయనకు ఆస్కార్ అవార్డ్ వస్తే నాకే వచ్చినట్లు సంతోషపడ్డాను. ఆయన మ్యూజిక్ డైరెక్షన్లో సినిమా చేయటం ఓ మంచి ఎక్స్‌పీరియెన్స్’అని అన్నారు. ‘డైరెక్టర్‌గా ఇప్పటి దర్శకులతో పోటీ పడాలనే ఆలోచిస్తుంటాను. ఆ కోణంలో ఆలోచించే చంద్రముఖి 2ను రూపొందించాను. ఈ చిత్రాన్ని లారెన్స్‌తో చేస్తున్నామని రజనీకాంత్‌గారికి చెప్పగానే సినిమా గొప్ప విజయాన్ని సాధిస్తుందన్నారు. లారెన్స్ చాలా అద్భుతంగా నటించాడు’అని దర్శకుడు పి.వాసు అన్నారు. ఈ కార్యక్రమంలో ఆస్కార్ విన్నర్ ఎంఎం కీరవాణి, కమెడియన్ వడివేలుతో పాటు ఇతర చిత్రబృందం అంతా పాల్గొని, పెద్ద విజయాన్ని సాధించాలని కోరుకున్నారు. -
నా గురించి రాత్రింబవళ్లు ఆలోచించి డబ్బు వృథా చేసుకోకండి: కంగనా
బాలీవుడ్ సంచలన నటి కంగనా రనౌత్ మరోసారి వార్తల్లోకి ఎక్కారు. ఈమెను వివాదాలకు కేంద్ర బిందువు అంటారు. తాను విమర్శించ తలుచుకుంటే వారు ఎంతటి వారనే విషయాన్ని ఆమె పట్టించుకోరని అంటారు. ఈ విషయంలో సినిమా వారినే కాదు, రాజకీయవాదులను కూడా వదిలిపెట్టరు. అయితే నటిగా మాత్రం కంగనా రనౌత్‌ను వంకపెట్టలేం. ఈ బహుభాషా నటి నిర్మాత, దర్శకురాలు కూడా. ముఖ్యంగా తమిళంలో ధామ్ ధూమ్ చిత్రంతో ఎంట్రీ ఇచ్చిన ఈమె ఆ మధ్య దివంగత ముఖ్యమంత్రి జయలలిత బయోపిక్ తలైవి చిత్రంలో టైటిల్ పాత్రను పోషించి మెప్పించారు. తాజాగా పి.వాసు దర్శకత్వంలో లారెన్‌న్స్ కథానాయకుడిగా నటిస్తున్న చంద్రముఖి– 2 చిత్రంలో టైటిల్ పాత్రను పోషించారు. ఈ చిత్రం వచ్చే నెల తెరపైకి రావడానికి ముస్తాబు అవుతోంది. ఈమె పాత్రను బేస్ చేసుకునే చిత్రవర్గాలు ప్రచారం చేస్తుండటం విశేషం. కాగా నటి కంగనా రనౌథ్ తాజాగా తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారంటూ ట్విట్టర్ ద్వారా విరుచుకు పడ్డారు. అందులో తనకు వ్యతిరేకంగా డబ్బిచ్చి మరీ కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారు అని ఆరోపించారు. తన చిత్రాల వసూళ్ల గురించి ఇలాంటి అవాస్థవాలే ప్రచారం చేస్తున్నారన్నారు. అయితే అలా చేసేవారి ఆత్మకు సంతృప్తి కలగాలని అన్నారు. రూ.150 కోట్లకు పైగా వసూలు చేసి రికార్డు సృష్టించిన తన చిత్రాలను ప్లాప్ అంటూ దుష్ప్రచారం చేస్తున్నారన్నారు. దీని వెనుక ఒక పెద్ద మాఫియా ఉందని అన్నారు. ఇలాంచి సంకుచిత భావాలు వీరికి ఎలా వస్తాయో తెలియడం లేదన్నారు. ఇతరులను చెడ్డవారిగా చిత్రీకరించడానికి రాత్రింబవళ్లు ఆలోచించి డబ్బులు వృథా చేస్తున్నారని నటి కంగనా రనౌత్ పేర్కొన్నారు. (ఇదీ చదవండి: 'భోళా శంకర్'పై చిరంజీవి ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్) -
చంద్రముఖి నీకిదే స్వాగతాంజలి
‘లాస్య విలసిత.. నవ నాట్యదేవత.. నటనాంకిత అభినయ వ్రత చారుధీర చరిత స్వాగతాంజలి.. స్వాగతాంజలి’ అంటూ సాగే పాట ‘చంద్రముఖి 2’ చిత్రంలోనిది. రాఘవా లారెన్స్, లక్ష్మీ మీనన్, కంగనా రనౌత్, వడివేలు ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘చంద్రముఖి 2’. పి. వాసు దర్శకత్వంలో లైకా ప్రొడక్షన్స్ పతాకంపై సుభాస్కరన్ ఈ సినిమాను నిర్మించారు. ఈ చిత్రం సెప్టెంబరు 15న విడుదల కానుంది. ఈ చిత్రంలో చంద్రముఖి పాత్రధారి కంగనా రనౌత్‌పై చిత్రీకరించిన ‘ఓ చంద్రముఖి నీకిదే స్వాగతాంజలి’ పాట తెలుగు, తమిళ లిరికల్ వీడియోను శుక్రవారం విడుదల చేశారు. యం.యం. కీరవాణి స్వరకల్పనలో చైతన్య ప్రసాద్ లిరిక్స్ అందించిన ఈ పాటను శ్రీనిధి తిరుమల పాడారు. ఇక రజనీకాంత్ హీరోగా జ్యోతిక, ప్రభు, నయనతార లీడ్ రోల్స్‌లో పి. వాసు దర్శకత్వంలో రూపొందిన ‘చంద్రముఖి’ చిత్రం 2005లో విడుదలై ఘనవిజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి సీక్వెల్‌గా ‘చంద్రముఖి 2’ తెరకెక్కింది. -
చంద్రముఖి-2 క్రేజీ అప్డేట్.. ఫస్ట్ సింగిల్ వచ్చేసింది!
సూపర్‌స్టార్ రజనీకాంత్ కథానాయకుడిగా నటించిన సూపర్‌హిట్ చిత్రం చంద్రముఖి. పి.వాసు దర్శకత్వం ఆ చిత్రానికి ఇప్పుడు సీక్వెల్‌గా చంద్రముఖి–2 రూపొందిస్తున్న సంగతి తెలిసిందే. లారెన్స్ కథానాయకుడిగా నటిస్తున్న ఈ చిత్రంలో బాలీవుడ్ సంచలన నటి కంగనా రనౌత్, వడివేలు, మహిమా నంబియార్, లక్ష్మీమీనన్, సృష్టి తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. పి.వాసు దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి ఆస్కార్ అవార్డు గ్రహీత ఎంఎం కీరవాణి సంగీతాన్ని అందిస్తున్నారు. (ఇది చదవండి: 'మీరు చేయకపోతే చాలామంది ఉన్నారని చెప్పాడు'.. క్యాస్టింగ్ కౌచ్‌పై బుల్లితెర నటి!) లైకా ప్రొడక్షన్స్ పతాకంపై సుభాస్కరన్ భారీ ఎత్తున నిర్మిస్తున్న ఈ చిత్రం షూటింగ ఇటీవలే పూర్తి చేసుకుంది. ప్రస్తుతం నిర్మాణ కార్యక్రమాలను శరవేగంగా జరుపుకుంటోంది. తాజాగా ఈ చిత్రానికి సంబంధించి క్రేజీ అప్డేట్ ఇచ్చారు మేకర్స్. ఈ చిత్రంలోని ఫస్ట్ సింగిల్ లిరికల్ సాంగ్‌ను రిలీజ్ చేశారు. 'విలసిత.. నవనాట్య దేవతా.. నటనాంకిత.. అభినయవ్రత.. చారుధీర చరిత.. స్వాగతాంజలి.. స్వాగతాంజలి.. జననజనన రూపురాలి స్వాగతాంజలి.. ఓ చంద్రముఖి నీకే మా స్వాగతాంజలి ' అనే లిరికల్ సాంగ్ యూట్యూబ్‌లో అలరిస్తోంది. ఈ పాటలో కంగనా రనౌత్ లుక్ అదిరిపోయింది. కాగా.. ఇప్పటికే కంగనా రనౌత్ ఫస్ట్ లుక్ రిలీజ్ చేయగా అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. (ఇది చదవండి: ' చావును దగ్గరి నుంచి చూశా'.. విశాల్ కామెంట్స్ వైరల్!) -
చంద్రముఖి
ఆత్మవిశ్వాసం.. ఆత్మాభిమానం.. ఎదురులో ఉన్నది రాజు అయినా ఎదిరించి నిలబడే ధైర్యం.. ఈ లక్షణాలన్నీ ఉన్న చంద్రముఖిగా కనిపించనున్నారు కంగనా రనౌత్. రజనీకాంత్, నయనతార, ప్రభు, జ్యోతిక కాంబినేషన్లో పి. వాసు తెరకెక్కించిన ‘చంద్రముఖి’ సీక్వెల్ ‘చంద్రముఖి 2’లో కంగనా టైటిల్ రోల్ చేశారు. శనివారం ఆమె లుక్‌ని విడుదల చేశారు. కంగనా కాస్ట్యూమ్స్‌ని ప్రముఖ బాలీవుడ్ డిజైనర్ నీతు లుల్లా డిజైన్ చేశారు. రాఘవా లారెన్స్ లీడ్ రోల్లో పి. వాసు దర్శకత్వంలో ఈ చిత్రం రూ΄÷ందింది. సుభాస్కరన్ నిర్మించిన ఈ చిత్రానికి ఎం.ఎం. కీరవాణి సంగీతం అందించగా, ఆర్.డి. రాజశేఖర్ ఛాయాగ్రాహకుడిగా వ్యవహరించారు. ‘చంద్రముఖి 2’ వినాయక చవితి సందర్భంగా సెప్టెంబర్‌లో రిలీజ్ కానుంది. -
చేసింది కొన్ని సినిమాలే.. భారీ చిత్రంలో ఛాన్స్ కొట్టేసిన ముద్దుగుమ్మ!
మలయాళ బ్యూటీ మహిమా నంబియార్ ఇప్పుడు చాలా ఖుషీగా ఉంది. ఈ మలయాళ బ్యూటీ తన 13 ఏళ్ల కెరీర్లో నటించింది తక్కువ చిత్రాలే అయినా మంచి పేరుని తెచ్చుకుంది. దీనికి కారణం మంచి పాత్రలను ఎంపిక చేసుకోవడమే. మలయాళం, తమిళం భాషల్లో నటిస్తున్న మహిమా నంబియార్ఆమె 2010లో మలయాళం సినిమా కార్యస్థాన్ చిత్రం ద్వారా సినీ పరిశ్రమలో అడుగుపెట్టింది. ఆ తర్వాత 2012లో సట్టై సినిమాతో కోలీవుడ్‌కు పరిచయమైంది. (ఇది చదవండి: షారుఖ్‌పై ఆనంద్ మహీంద్రా ట్వీట్ - మిగిలిన వారికంటే..!) ఆమె నటించిన తొలి చిత్రమే మంచి సక్సెస్ కావడంతో ఆ తర్వాత కుట్రం 23, కొడి వీరన్, మహాముని తదితర చిత్రాల్లో నటించే అవకాశం వరించింది. వీటిలో ఎక్కువ శాతం సక్సెస్ కావడం ఈమె కెరీర్‌కు ప్లస్ అయ్యింది. కాగా ప్రస్తుతం చంద్రముఖి– 2 లాంటి వంటి భారీ చిత్రంతో తమిళ ప్రేక్షకుల ముందుకు రానుంది. రజనీకాంత్, ప్రభు, నయనతార, జ్యోతిక, వడివేలు ప్రధాన పాత్రలు పోషించిన చంద్రముఖి చిత్రానికి ఇది సీక్వెల్‌గా తెరకెక్కించారు. ఇందులో రజనీకాంత్ పోషించిన పాత్రలో నృత్య దర్శకుడు రాఘవ లారెన్స్ నటించడం విశేషం. అదే విధంగా బాలీవుడ్ నటి కంగనా రనౌత్ జ్యోతిక పాత్రలో నటించగా.. లక్ష్మి మీనన్, సృష్టి డాంగే, రాధిక శరత్ కుమార్, వడివేలు తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. వీరితో పాటు మహిమ నంబియార్ ఒక నాయకిగా నటిస్తోంది. పి. వాసు దర్శకత్వంలో లైకా ప్రొడక్షన్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ భారీ చిత్రం షూటింగ్ ఇప్పటికే పూర్తి చేసుకుంది. కాగా ఈ చిత్రంలోని ఓ పాటను చిత్రీకరిస్తున్నారు. దీని గురించి మహిమా నంబియార్ తన ట్విట్టర్లో చంద్రముఖి– 2 చిత్రంలోని పాట చిత్రీకరణ కోసం జార్జియా వెళుతున్నట్లు పేర్కొంది. ఒక నటిగా లారెన్‌న్స్ మాస్టర్‌తో కలిసి డాన్స్ చేయాలన్నది తన చిరకాల కలని అది ఇప్పుడు నెరవేరడం సంతోషంగా ఉందని పేర్కొంది. (ఇది చదవండి: పెళ్లికి సిద్ధమైన హీరోయిన్.. అఫీషియల్‌గా ప్రకటించిన భామ!) View this post on Instagram A post shared by Mahima Nambiar (@mahima_nambiar) -
వినాయక చవితికి ‘చంద్రముఖి-2’
రజనీకాంత్ హీరోగా పి. వాసు దర్శకత్వం వహించిన ‘చంద్రముఖి’ (2005)కి సీక్వెల్‌గా తెరకెక్కించిన సినిమా ‘చంద్రముఖి 2’. రాఘవ లారెన్స్ హీరోగా నటించిన ఈ చిత్రంలో కంగనా రనౌత్ ప్రధాన పాత్ర పోషించారు. పి.వాసు దర్శకుడు. సుభాస్కరన్ నిర్మించారు. ఈ సినిమాని వినాయక చవితికి (సెప్టెంబరు) విడుదల చేయనున్నట్లు ప్రకటించి, రాఘవ లారెన్స్ ఫస్ట్ లుక్ విడుదల చేశారు. ఫస్ట్ లుక్ ను గమనిస్తే... రాజు వేషంలో రాఘవ లారెన్స్ కనిపిస్తున్నారు. ఆ లుక్ లో పొగరు, రాజసంతో పాటు కూర్రత్వం కూడా కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది. లుక్‌లోనే ఈ రేంజ్ ఉంటే సినిమాలో లారెన్స్ ఎలా తనదైన నటనతో ఆకట్టుకుంటారనేది అందరిలోనూ ఆసక్తిని రేపుతోన్న అంశం. వడివేలు, లక్ష్మీ మీనన్, మహిమా నంబియార్, రాధికా శరత్‌కుమార్ నటించిన ఈ చిత్రానికి ఆస్కార్ విన్నర్ ఎం.ఎం.కీరవాణి సంగీత సారథ్యం వహిస్తున్నారు. -
'చంద్రముఖి 2' ఫస్ట్ లుక్.. తెలిసే ఈ తప్పు చేశారా?
తెలిసి చేస్తున్నారో తెలియక చేస్తున్నారో గానీ కొన్ని సినిమాలు తీస్తున్న దర్శకనిర్మాతలు అడ్డంగా బుక్కైపోతున్నారు. ఫ్యాన్స్ తో బూతులు తిట్టించుకుంటున్నారు. మొన్న ప్రభాస్ 'కల్కి' విషయంలో ఇలానే జరగ్గా.. ఇప్పుడు లారెన్స్ 'చంద్రముఖి 2' చిత్రంపైనా అలాంటి విమర్శలే వస్తున్నాయి. ప్రస్తుతం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్. అసలు ఇంతకీ ఏం జరుగుతోంది? (ఇదీ చదవండి: ఛాన్సుల కోసం కాంప్రమైజ్ అవమన్నారు.. ఈ నటి మాత్రం!) సూపర్‌స్టార్ రజినీకాంత్ 'చంద్రముఖి' గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. 90స్ జనరేషన్ కి ఈయన్ని బాగా పరిచయం చేసింది ఈ సినిమా అని చెప్పొచ్చు. ఈ చిత్రానికి దాదాపు 18 ఏళ్ల తర్వాత సీక్వెల్ తీస్తున్నారు. లారెన్స్ హీరోగా నటిస్తున్నాడు. చంద్రముఖిగా కంగనా రనౌత్ కనిపించనుంది. ఈ క్రమంలోనే సోమవారం ఫస్ట్ లుక్ రిలీజ్ చేయగా, ప్రశంసలు బదులు ట్రోల్స్ వస్తున్నాయి. ఈ ఫస్ట్ లుక్‌లో లారెన్స్ వెంకటపతి రాజు గెటప్‌లో కనిపించాడు. కాకపోతే తల పెద్దగా, శరీరం చిన్నగా, చేయి సన్నగా ఉండటం వింతగా అనిపించింది. దీన్ని చూసిన నెటిజన్స్.. తెలిసే ఈ తప్పు జరిగిందా? లేదంటే కావాలనే ఇలా చేస్తున్నారు అని మాట్లాడుకుంటున్నారు. మొన్నీ మధ్య ప్రభాస్ 'కల్కి' ఫస్ట్ లుక్ విషయంలో ఇలానే జరగ్గా, వెంటనే దాన్ని మార్చి మరో లుక్ విడుదల చేశారు. 'చంద్రముఖి 2' లుక్ ఏమైనా మార్చి రిలీజ్ చేస్తారా? అలానే వదిలేస్తారా అనేది చూడాలి. వినాయక చవితికి ఈ మూవీని థియేటర్లలో పాన్ ఇండియా లెవల్లో రిలీజ్ చేయనున్నారు. Thanks to Thalaivar Superstar @rajinikanth! Here’s presenting you the first look of #Vettaiyan 👑 I need all your blessings! Releasing this GANESH CHATURTHI in Tamil, Hindi, Telugu, Malayalam & Kannada! 🔥 #Chandramukhi2 🗝 pic.twitter.com/v4qYmkzeDh — Raghava Lawrence (@offl_Lawrence) July 31, 2023 (ఇదీ చదవండి: సమంత మరోసారి ప్రేమలో పడిందా? మరి ఆ ఫొటోలు!) -
చంద్రముఖి 2 ప్రాణభయం.. 2 నెలలు నిద్రలేని రాత్రులు: కీరవాణి
హారర్ సినిమాల్లో చంద్రముఖిది ప్రత్యేక స్థానం. కామెడీ, ఎమోషన్స్, హారర్.. ఇలా అన్నింటి మేళవింపుగా వచ్చిన చిత్రం అప్పట్లో బ్లాక్‌బస్టర్ విజయాన్ని నమోదు చేసింది. అదే సమయంలో భయమంటే తెలియనివారికి కూడా భయాన్ని పరిచయం చేసింది. అంతటి సెన్సేషన్ మూవీకి సీక్వెల్ తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే! ఇటీవలే చంద్రముఖి 2 సినిమా షూటింగ్ కూడా పూర్తయింది. ఇందులో రాఘవ లారెన్స్, కంగనా రనౌత్, వడివేలు, మహిమా నంబియార్, లక్ష్మీమీనన్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఇటీవలే లారెన్స్ తన పాత్రకు డబ్బింగ్ పూర్తి చేశాడు. పి.వాసు దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి ఆర్డీ రాజశేఖర్ ఛాయాగ్రహణం, ఆస్కార్ అవార్డు గ్రహీత ఎంఎం కీరవాణి సంగీతాన్ని అందిస్తున్నారు. లైకా ప్రొడక్షన్స్ బ్యానర్‌పై సుభాస్కరన్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ఇదిలా ఉంటే తాజాగా కీరవాణి చంద్రముఖి సినిమాపై సోషల్ మీడియా వేదికగా చేసిన ట్వీట్ వైరల్‌గా మారింది. 'చంద్రముఖి 2 సినిమా చూశాను. సినిమాలోని పాత్రలకు మరణభయంతో కంటిమీద కునుకు లేకుండా పోయింది. నా పరిస్థితి కూడా అంతే! అద్భుతమైన సన్నివేశాలకు సంగీతంతో ప్రాణం పోసేందుకు రెండు నెలలపాటు నిద్రలేని రాత్రులు గడిపాను. గురు కిరణ్, నా స్నేహితుడు విద్యాసాగర్.. నాకు విజయం అందాలని కోరుకోండి' అని ట్వీట్ చేశారు. కీరవాణి ఇచ్చిన హైప్‌తో సినిమాపై అంచనాలు ఒక్కసారిగా పెరిగిపోయాయి. Watched @LycaProductions Chandramukhi 2. The characters in the movie spend sleepless nights from fear of DEATH . for me 2 months of sleepless days and nights for adding LIFE to the mind blowing scenes with my efforts. GuruKiran & my friend Vidyasagar pls wish me the best 🙏🙏 — mmkeeravaani (@mmkeeravaani) July 23, 2023 చదవండి: బేబీ రనౌత్ రాక కోసం వెయిటింగ్.. సీమంతం ఫోటోలు షేర్ చేసిన కంగనా అమ్మ బాలేదని వీడియో... ఇంతలోనే కొత్త కారు కొన్న ముక్కు అవినాశ్ -
చంద్రముఖి–2 అభిమానులకు అప్డేట్ ఇచ్చిన మేకర్స్
సూపర్‌స్టార్ రజనీకాంత్ కథానాయకుడిగా నటించిన సూపర్‌హిట్ చిత్రం చంద్రముఖి. పి.వాసు దర్శకత్వం ఆ చిత్రానికి ఇప్పుడు సీక్వెల్‌గా చంద్రముఖి–2 రూపొందిస్తున్న విషయం తెలిసిందే. లారెన్స్ కథానాయకుడిగా నటిస్తున్న ఈ చిత్రంలో బాలీవుడ్ సంచలన నటి కంగనా రనౌత్, వడివేలు, మహిమా నంబియార్, లక్ష్మీమీనన్, సృష్టి తదితరులు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. పి.వాసు దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి ఆర్డీ రాజశేఖర్ ఛాయాగ్రహణం, ఆస్కార్ అవార్డు గ్రహీత ఎంఎం కీరవాణి సంగీతాన్ని అందిస్తున్నారు. లైకా ప్రొడక్షన్స్ పతాకంపై సుభాస్కరన్ భారీ ఎత్తున నిర్మిస్తున్న ఈ చిత్రం షూటింగ ఇటీవలే పూర్తి చేసుకుంది. ప్రస్తుతం నిర్మాణ కార్యక్రమాలను శరవేగంగా జరుపుకుంటోంది. కాగా ఇటీవలే నటుడు లారెన్స్ తన పాత్రకు డబ్బింగ్ చెప్పి పూర్తి చేశారు. కాగా శనివారం నుంచి ఎంఎం కీరవాణి ఈ చిత్రానికి నేపథ్య సంగీతాన్ని సమ కూర్చడం ప్రారంభించారని యూనిట్ వర్గాలు తెలిపారు. కాగా త్వరలోనే చంద్రముఖి –2 చిత్ర ఆడియో ఆవిష్కరణ కార్యక్రమాన్ని భారీగా నిర్వహించడానికి తెలిపారు. అంతకుముందే వచ్చే నెలలో చిత్రంలోని సింగిల్ సాంగ్‌ను విడుదల చేయనున్నట్లు పేర్కొన్నారు. సెప్టెంబర్ 19న పాన్ ఇండియా రేంజ్లో ఈ సినిమా విడుదల కానుంది. -
18 ఏళ్లకు సీక్వెల్.. చంద్రముఖి 2 రిలీజ్ డేట్ వచ్చేసింది..
రజనీకాంత్, ప్రభు, జ్యోతిక, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన చంద్రముఖి సినిమా అప్పట్లో సెన్సేషనల్ విజయాన్ని అందుకుంది. ఇప్పటికీ ఈ సినిమా వస్తుందంటే చాలు చాలామంది టీవీలకు అతుక్కుపోతారు. 2005లో విడుదలైన ఈ సినిమాను పి.వాసు డైరెక్ట్ చేశాడు. దీనికి సీక్వెల్ చేయాలని ఆయన ఎప్పటినుంచో ప్రయత్నిస్తున్నాడు. ఈ క్రమంలో రజనీకాంత్ ఒప్పుకోకపోవడంతో సీక్వెల్ కథతో తెలుగులో నాగవల్లి సినిమా చేశాడు. చివరకు 18 ఏళ్ల తర్వాత తమిళంలోనూ చంద్రముఖి 2 పూర్తి చేశాడు. ఇందులో రజనీకాంత్‌కు బదులుగా నృత్య దర్శకుడు, నటుడు లారెన్స్ నటించాడు. బాలీవుడ్ హీరోయిన్ కంగనా రనౌత్ ప్రధాన పాత్రలో యాక్ట్ చేసింది. వడివేలు, రాధిక ముఖ్య పాత్రలు పోషించారు. ఇటీవలే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా రిలీజ్‌కు రెడీ అయింది. చంద్రముఖి 2 తెలుగు, తమిళ, హిందీ, మలయాళ, కన్నడ భాషల్లో వినాయక చవితికి ప్రేక్షకుల ముందుకు రానుంది అంటూ అధికారికంగా వెల్లడించారు. దీంతో అభిమానులు సినిమా కోసం వెయిటింగ్ అంటూ కామెంట్లు చేస్తున్నారు. We are thrilled to announce that the doors to the much awaited sequel Chandramukhi 2 🗝️ will be open from Ganesh Chaturthi 🤗✨ Releasing in Tamil, Hindi, Telugu, Malayalam & Kannada! #Chandramukhi2 🗝️ pic.twitter.com/hoM7BXxWp2 — Raghava Lawrence (@offl_Lawrence) June 29, 2023 చదవండి: పాట పాడటమే కాదు, డ్యాన్స్ కూడా చేసిన ఏఆర్ రెహమాన్ -
చంద్రముఖి 2.. గుమ్మడికాయ కొట్టేశారు!
చంద్రముఖి–2 చిత్ర షూటింగ్ పూర్తి అయింది. రజనీకాంత్, జ్యోతిక, నయనతార, ప్రభు ప్రధాన పాత్ర పోషించిన చంద్రముఖి సినిమా 2005లో విడుదలైంది. అప్పట్లో సంచలన విజయాన్ని సాధించిన చంద్రముఖి చిత్రాన్ని పి.వాసు డైరెక్ట్ చేశాడు. దీనికి సీక్వెల్ చేయాలని వాసు ఎప్పటినుంచో ప్రయత్నిస్తూ ఉన్నారు. రజనీకాంత్ అంగీకరించకపోవడంతో అదే కథతో తెలుగులో వెంకటేష్ కథానాయకుడిగా నాగవల్లి సినిమా తెరకెక్కించారు. అయితే 18 ఏళ్ల తరువాత చంద్రముఖి –2ను తమిళంలో రూపొందిస్తున్నారు. ఇందులో రజనీకాంత్‌కు బదులుగా నృత్య దర్శకుడు, నటుడు లారెన్స్ నటించడం విశేషం. బాలీవుడ్ సంచలన నటి కంగనా రనౌత్ ప్రధాన పాత్రను పోషిస్తున్న ఇందులో వడివేలు, రాధిక ముఖ్యపాత్రల్లో నటిస్తున్నారు. తొలి భాగానికి దర్శకత్వం వహించిన పి.వాసు తెరకెక్కిస్తున్న ఈ చిత్రాన్ని లైకా ప్రొడక్షన్స్ సంస్థ నిర్మిస్తోంది. ప్రముఖ టాలీవుడ్ సంగీత దర్శకుడు ఎం ఎం కీరవాణి సంగీతాన్ని అందిస్తున్న ఈ చిత్ర షూటింగ్ బుధవారం పూర్తయింది. ఈ విషయాన్ని చిత్ర వర్గాలు పోస్టర్ ద్వారా వెల్లడించారు. ప్రస్తుతం నిర్మాణ కార్యక్రమాలు జరుపుకుంటున్న చంద్రముఖి–2 చిత్రంపై సినీ వర్గాల్లో ఉత్కంఠ నెలకొంది. కారణం రజనీకాంత్ పాత్రను లారెన్స్ పోషించడం జ్యోతిక పాత్రలో కంగనారనౌత్ నటించడంతో పాటు ఎంఎం కీరవాణి సంగీతాన్ని అందించడమే! And... Cut! Chandramukhi 2 shooting has officially packed up. 🎬 We can't contain our excitement for fans to experience it on the big screen. 🤩🕴🏻🔥 #Chandramukhi2 🗝️ #CM2 🗝️ 🎬 #PVasu 🌟 @offl_Lawrence @KanganaTeam 🎶 @mmkeeravaani 🎥 @RDRajasekar 🛠️ #ThottaTharani ✂️🎞️… pic.twitter.com/cqxHM8ZJ86 — Lyca Productions (@LycaProductions) June 20, 2023 చదవండి: టాప్ లేకుండా వెళ్తేనే నిర్మాతలకు నచ్చుతారు -
దెయ్యం సినిమాలు నా వల్ల కాదు
-
చంద్రముఖి సీక్వెల్ కు పెరిగిన డిమాండ్
-
రాధికా శరత్‌కుమార్‌కు గోల్డ్ రింగ్ గిఫ్టుగా ఇచ్చిన లారెన్స్
కంగనా రనౌత్ ప్రధానపాత్రలో తెరకెక్కుతున్న సినిమా చంద్రముఖి-2. 2005లో వచ్చిన ‘చంద్రముఖి’ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఎంతటి సంచలనం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. దాదాపు 17 ఏళ్ల తర్వాత దానికి సీక్వెల్‌గా చంద్రముఖి–2 సినిమాను రూపొందిస్తున్నారు. ఈ చిత్రానికి తొలిభాగం దర్శకత్వం వహించిన పి. వాసునే తెరకెక్కించారు. ఇందులో లారెన్స్ హీరోగా నటిస్తున్నారు. రాధికా శరత్‌కుమార్, లక్ష్మీ మీనన్, వడివేలు తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. హార్రర్ కామెడీ నేపథ్యంలో వస్తున్న ఈసినిమా షూటింగ్ పూర్తయినట్లు మేకర్స్ తెలిపారు. చదవండి: హీరోయిన్లందరినీ ట్రై చేశా.. జేడీ చక్రవర్తి బోల్డ్ కామెంట్స్ ఇక ఈ సినిమాను వినాయక చవితి సందర్భంగా సెప్టెంబర్ మాసంలో రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇక ఈ సినిమా షూటింగ్లో లారెన్స్ తనకు బంగారు ఉంగరంతో పాటు ఖరీదైన వాచీ గిఫ్టుగా ఇచ్చినట్లు నటి రాధికా శరత్‌కుమార్ తెలిపారు. ఈ మేరకు లెరన్స్తో దిగిన ఫోటోను షేర్ చేస్తూ ఖుషీ అయ్యారు. -
చివరి దశకు చేరుకున్న చంద్రముఖి 2 షూటింగ్
రజనీకాంత్, ప్రభు, జ్యోతిక, నయనతార ప్రధాన పాత్రలు పోషించిన చిత్రం చంద్రముఖి. పి.వాసు దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఎంతటి సంచలన విజయం సాధించిందో అందరికీ తెలిసిందే. సుమారు 17 ఏళ్ల తరువాత దానికి సీక్వెల్‌గా చంద్రముఖి–2 సినిమాను దర్శకుడు పి.వాసునే తెరకెక్కిస్తున్నారు. ఇందులో లారెన్స్ కథానాయకుడిగా నటిస్తుండగా బాలీవుడ్ సంచలన నటి కంగనా రనౌత్ టైటిల్ పాత్ర పోషిస్తున్నారు. వడివేలు తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రాన్ని లైకా ప్రొడక్షన్స్ పతాకంపై సుభాస్కరన్ నిర్మిస్తున్నారు. ఎంఎం కీరవాణి సంగీతాన్ని, ఆర్డీ రాజశేఖర్ ఛాయాగ్రహణం అందిస్తున్న ఈ చిత్ర షూటింగ్ అధిక భాగం పూర్తయినట్లు చిత్ర వర్గాలు ఇటీవల అధికారికంగా ప్రకటించారు. అదే విధంగా కంగనా రనౌత్‌కు సంబంధించిన సన్నివేశాల చిత్రీకరణ కూడా పూర్తయినట్లు ఆమె స్వయంగా ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. కాగా చంద్రముఖి–2 చిత్ర షూటింగ్ చివరి దశకు చేరుకుందని దర్శకుడు తెలిపారు. ఇంకా 10 రోజులు షూటింగ్ చేస్తే మొత్తం పూర్తవుతుందని ఆయన చెప్పారు. తదుపరి షూటింగ్‌ను మైసూరులో నిర్వహించనున్నట్లు చిత్ర వర్గాల సమాచారం. నిర్మాణాంతర కార్యక్రమాలు నిర్వహించి త్వరలోనే చిత్ర విడుదల తేదీని ప్రకటించే అవకాశం ఉంది. కాగా సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి చాలా గ్యాప్ తరువాత తమిళంలో చేస్తున్న చిత్రం ఇదే కావడం విశేషం. చదవండి: నిశ్చితార్థం రద్దు చేసుకున్న శర్వానంద్? ఇదిగో క్లారిటీ! -
నటి జ్యోతికపై కంగనా రనౌత్ ప్రశంసలు.. ట్వీట్ వైరల్
వైవిధ్యమైన నటనతో ఆకట్టుకుంటున్న కంగనా రనౌత్ నటిస్తున్న తాజాచిత్రం చంద్రముఖి-2. రాఘవ లారెన్స్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం షరవేగంగా జరుగుతుంది.2005లో రజినీకాంత్, నయనతార, జ్యోతిక నటించిన ఈ చిత్రం అప్పట్లో సూపర్ హిట్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం దానికి సీక్వెల్లో తెరెకక్కుతున్న సినిమాలో చంద్రముఖిగా కంగనా నటిస్తుంది. ఈ క్రమంలో జ్యోతికపై కంగనా ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. గతంలో ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన జ్యోతిక.. కంగనా తన ఫేవరెట్ బాలీవుడ్ హీరోయిన్ అని చెప్తుంది. ఈ వీడియోను ఓ నెటిజన్ పోస్ట్చేయగా కంనగా రనౌత్ స్పందిస్తూ.. చంద్రముఖిలో జ్యోతిక ఐకానిక్ నటనను నేను దాదాపు ప్రతిరోజూ చూస్తున్నాను. ఎందుకంటే మేము క్లైమాక్స్‌ను చిత్రీకరిస్తున్నాము. జ్యోతిక నటన అద్భుతం. ఆమెను మ్యాచ్చేయడం చాలా కష్టం అంటూ కంగనా ప్రశంసలు కురిపించింది. That’s encouraging, as a matter of fact I am watching Jyothika ji’s iconic performance in Chandramukhi almost every day because we are shooting the climax it’s nerve wracking, how astonishing she is in the first part!! it is practically impossible to match up to her brilliance 🙏 https://t.co/JENhDhbhFC — Kangana Ranaut (@KanganaTeam) February 12, 2023 -
Kangana Ranaut: భారంగా కంగనా బృందం
నటి కంగనారనౌత్ పేరే ఒక సంచలనం. అంతకు మించి వివాదాస్పదం. సమస్యలకు, విమర్శలకు కేరాఫ్. అయితే ఈమెలో ఒక దర్శకురాలు, నిర్మాత ఉన్నారు. అందుకే కాస్త పొగరు అని కూడా అంటారు. 2021లో జయలలిత జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన తలైవి చిత్రంలో కంగనా టైటిల్ రోల్ పోషించిన విషయం తెలిసిందే. తాజాగా చంద్రముఖి–2లో నటిస్తున్నారు. రజనీకాంత్ కథానాయకుడిగా వచ్చిన చంద్రముఖి చిత్రానికి సీక్వెల్‌గా రూపొందుతోంది. దర్శకుడు పి.వాసు దర్శకత్వంలో రజనీకాంత్ పాత్రలో లారెన్స్ నటిస్తున్నారు. కాదీన్ని లైకా ప్రొడక్షన్స్ సంస్థ నిర్మిస్తోంది. ఇక్కడి వరకూ బాగానే ఉంది. కంగనా రనౌత్‌తో ఉండే బృందంతోనే ఇప్పుడు చిక్కంతా. ఈమె వెంట పెద్ద పర్సనల్ మేకప్‌మెన్, బౌన్సర్లు, వ్యక్తిగత సిబ్బందితో పాటు నలుగురు సీఆర్పీఎఫ్ సెక్యూరిటీ ఉన్నారట. వాళ్ల ఖర్చులన్నీ నిర్మాతలే భరించాల్సి వస్తోందట. దీంతో నిత్యం ఏదో సమస్య వస్తూనే ఉంటోందట. ఎదో ఒక వివాదాస్పద వ్యాఖ్యలు చేసే కంగనారనౌత్ సీఆర్పీఎఫ్ బృందాన్ని రక్షణగా ఏర్పాటు చేసుకుందనే ప్రచారం ఒకటి ఉంది. కాగా వీరితోనే చిత్ర యూనిట్‌కు భారంగా మారుతోందని గగ్గోలు పెడుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇలాంటి వాటిని ఎదుర్కొంటూ దర్శకుడు పి.వాసు చంద్రముఖి 2 చిత్రాన్ని త్వరగా పూర్తి చేయగలరా? అనే ప్రశ్న తలెత్తుతోంది. -
నాపై కూడా యాసిడ్ దాడి జరుగుతుందేమో: కంగనా రనౌత్
యువతులపై యాసిడ్ దాడులు పెరిగిపోతున్నాయి. ఇటీవల ఢిల్లీలో ఇలాంటి సంఘటనే చోటు చేసుకుంది. దీంతో నటి కంగనా రనౌత్‌కు యాసిడ్ భయం పట్టుకుంది. బాలీవుడ్‌తో పాటు తమిళం, తెలుగు వంటి దక్షిణాది భాషల్లో నటిస్తూ సంచలన నటిగా ముద్ర వేసుకున్న కంగనా రనౌత్ తాజాగా తమిళంలో చంద్రముఖి 2 చిత్రంలో నటిస్తున్నారు. ఏ విషయంలోనైనా ధైర్యంగా తన అభిప్రాయాలను వ్యక్తం చేస్తుంటారు. అయితే ఎంత ధైర్యం కలిగిన వ్యక్తి అయినా తమ జీవితంలో జరిగిన భయంకర సంఘటనలు ఆందోళనకు గురి చేస్తూనే ఉంటాయి. నటి కంగనా రనౌత్ అందుకు అతీతం కాదు. ఈమె తన కుటుంబంలో జరిగిన యాసిడ్ దాడి గురించి తన ఇన్‌స్టా స్టోరీలో పేర్కొంటూ తన సోదరి మాదిరిగానే తనపైనా యాసిడ్ దాడి జరుగుతుందేమోనని భయపడుతున్నట్లు పేర్కొంది. తన సోదరి రంగోలి యాసిడ్ దాడికి గురైందని, ఆమెకు 52 శస్త్ర చికిత్సలు జరిగినట్లు గుర్తు చేసింది. ఆ సంఘటనలో తన సోదరి శారీరకంగా, మానసికంగా ఎంతో బాధింపునకు గురైందని చెప్పింది. ఆ సంఘటన తర్వాత తనపై కూడా యాసిడ్ దాడి జరుగుతుందేమేనని ప్రతిక్షణం భయపడుతున్నట్లు పేర్కొంది. దీంతో ఎవరైనా తన పక్కన వస్తుంటే ముఖం దాచుకుంటున్నానని తెలిపింది. -
చంద్రముఖిగా మారిన కంగనా రనౌత్.. షూటింగ్ ప్రారంభం
బాలీవుడ్ ఫైర్‌బ్రాండ్ కంగనా రనౌత్ నటిస్తున్న తాజాచిత్రం చంద్రముఖి-2. లైకా ప్రొడక్షన్స్ భారీగా నిర్మిస్తున్న ఈ సినిమాలో రాఘవా లారెన్స్ కీలక పాత్రలో కనిపించనున్నారు. 2005లో విడుదలైన చంద్రముఖి చిత్రంలో రజనీకాంత్, జ్యోతిక నటించారు. కేవలం రూజ 9కోట్లతో తెరకెక్కిన ఈ సినిమా అప్పట్లోనే రూ. 70 కోట్లుకు పైగా కలెక్షన్లను రాబట్టింది. తాజాగా ఇప్పుడీ చిత్రానికి సీక్వెల్ రాబోతుంది. జ్యోతిక పాత్రలో కంగనా, రజనీకాంత్ పాత్రలో లారెన్స్ నటిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. తాజాగా ఈ సినిమా తొలి షెడ్యూల్ ప్రారంభం అయినట్లు కంగనా తెలిపింది. ఇన్‌స్టా వేదికగా దీనికి సంబంధించిన ఫోటోను షేర్చేసుకుంది. -
చంద్రముఖిగా మారనున్న కంగనా రనౌత్!
వెండితెరపై లేటెస్ట్ చంద్రముఖిగా కనిపించనున్నారు కంగనా రనౌత్. రజనీకాంత్, జ్యోతిక, ప్రభు, నయనతార ప్రధాన పాత్రల్లో పి. వాసు దర్శకత్వంలో 2005లో వచి్చన ‘చంద్రముఖి’ ఎంతటి ఘనవిజయం సాధించిందో తెలిసిందే. ఈ సినిమాకు సీక్వెల్‌గా ‘చంద్రముఖి 2’ను తెరకెక్కిస్తున్నారు పి. వాసు. అయితే లీడ్ రోల్‌ను రాఘవా లారెన్స్ చేస్తున్నారు. కాగా అప్పటి ‘చంద్రముఖి’లో జ్యోతిక చేసిన చంద్రముఖి పాత్రకు సీక్వెల్లో కంగనాను తీసుకున్నారని తెలిసింది. ‘దర్శకులు పి. వాసుగారితో వర్క్ చేయనుండటం హ్యాపీగా ఉంది’ అని పేర్కొన్నారు కంగనా రనౌత్. డిసెంబరు తొలి వారంలో చెన్నైలో జరగనున్న ‘చంద్రముఖి 2’ చిత్రీకరణలో కంగనా పాల్గొంటారని టాక్.