చంద్రముఖి 2.. గుమ్మడికాయ కొట్టేశారు! | Raghava Lawrence Chandramukhi 2 Movie Shooting Completed | Sakshi
Sakshi News home page

Chandramukhi 2 Movie: చంద్రముఖి 2.. గుమ్మడికాయ కొట్టేశారు!

Published Thu, Jun 22 2023 6:07 PM | Last Updated on Thu, Jun 22 2023 6:09 PM

Raghava Lawrence Chandramukhi 2 Movie Shooting Completed - Sakshi

చంద్రముఖి–2 చిత్ర షూటింగ్‌ పూర్తి అయింది. రజనీకాంత్‌, జ్యోతిక, నయనతార, ప్రభు ప్రధాన పాత్ర పోషించిన చంద్రముఖి సినిమా 2005లో విడుదలైంది. అప్పట్లో సంచలన విజయాన్ని సాధించిన చంద్రముఖి చిత్రాన్ని పి.వాసు డైరెక్ట్‌ చేశాడు. దీనికి సీక్వెల్‌ చేయాలని వాసు ఎప్పటినుంచో ప్రయత్నిస్తూ ఉన్నారు. రజనీకాంత్‌ అంగీకరించకపోవడంతో అదే కథతో తెలుగులో వెంకటేష్‌ కథానాయకుడిగా నాగవల్లి సినిమా తెరకెక్కించారు.

అయితే 18 ఏళ్ల తరువాత చంద్రముఖి –2ను తమిళంలో రూపొందిస్తున్నారు. ఇందులో రజనీకాంత్‌కు బదులుగా నృత్య దర్శకుడు, నటుడు లారెన్స్‌ నటించడం విశేషం. బాలీవుడ్‌ సంచలన నటి కంగనా రనౌత్‌ ప్రధాన పాత్రను పోషిస్తున్న ఇందులో వడివేలు, రాధిక ముఖ్యపాత్రల్లో నటిస్తున్నారు. తొలి భాగానికి దర్శకత్వం వహించిన పి.వాసు తెరకెక్కిస్తున్న ఈ చిత్రాన్ని లైకా ప్రొడక్షన్స్‌ సంస్థ నిర్మిస్తోంది.

ప్రముఖ టాలీవుడ్‌ సంగీత దర్శకుడు ఎం ఎం కీరవాణి సంగీతాన్ని అందిస్తున్న ఈ చిత్ర షూటింగ్‌ బుధవారం పూర్తయింది. ఈ విషయాన్ని చిత్ర వర్గాలు పోస్టర్‌ ద్వారా వెల్లడించారు. ప్రస్తుతం నిర్మాణ కార్యక్రమాలు జరుపుకుంటున్న చంద్రముఖి–2 చిత్రంపై సినీ వర్గాల్లో ఉత్కంఠ నెలకొంది. కారణం రజనీకాంత్‌ పాత్రను లారెన్స్‌ పోషించడం జ్యోతిక పాత్రలో కంగనారనౌత్‌ నటించడంతో పాటు ఎంఎం కీరవాణి సంగీతాన్ని అందించడమే!

చదవండి: టాప్‌ లేకుండా వెళ్తేనే నిర్మాతలకు నచ్చుతారు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement