కొందరు హీరోలు మాత్రమే ఫ్లాప్‌లతో సంబంధం లేకుండా వరుసగా సినిమాలు చేస్తూ పాపులారిటీ పొందుతుంటారు. ఇక అలాంటి హీరోయిన్లు కొందరు ఉన్నారు. ఇందులో బాలీవుడ్ సంచలన నటి కంగనా రనౌత్ ఒకరు. ఫైర్ బ్రాండ్‌గా పేరు తెచ్చుకున్న ఆమె తరచూ వివాదాలకు కేరాఫ్‌గా నిలుస్తుంటుంది. హిందీ, తెలుగు, తమిళం ఇలా బహుభాషా నటిగా రాణిస్తున్న కంగనా రనౌత్‌లో ఒక నిర్మాత, దర్శకురాలు ఉన్నారు.
ఇక అసలు విషయానికి వస్తే ఈమె మంచి విజయాన్ని అందుకుని చాలా కాలమే అయ్యింది. ఇటీవల అన్ని అపజయాలను ఎదుర్కొన్నారు. హిందీలో తాజాగా నటించిన తేజాస్ చిత్రం ఘోర పరాజయాన్ని మూటకట్టుకుంది. ఆ మధ్య తమిళం, హిందీ భాషల్లో నటించిన భారీ చిత్రం తలైవి పూర్తిగా నిరాశపరిచింది. ఇటీవల కంగనా రనౌత్ టైటిల్ పాత్రను పోషించిన చంద్రముఖి–2 చిత్రం ప్లాప్ అయ్యింది. అయినా ఈమెకు అవకాశాలు వస్తునే ఉన్నాయి.
తాజాగా మరో తమిళ చిత్రంలో నటించే అవకాశం కంగనా రనౌత్‌ను వరించింది. ఇందులో నటుడు మాధవన్ కథానాయకుడిగా నటిస్తున్నారు. హిందీ చిత్రం తను వెడ్స్ మను తరువాత ఈ జంట నటిస్తున్న చిత్రం ఇది. కాగా ఇంతకు ముందు కంగనా రనౌత్ ప్రధాన పాత్రలో నటించిన తలైవి చిత్ర దర్శకుడు ఏఎల్ విజయ్ తెరకెక్కిస్తున్న చిత్రం ఇది. హిందీలో కంగనా రనౌత్ స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తూ నటిస్తున్న ఎమర్జెన్సీ చిత్రం నిర్మాణ దశలో ఉంది. ఈ రెండు చిత్రాల రిజల్ట్ కోసం ఆమె అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ముఖ్యంగా ఎమర్జెన్సీ చిత్రం విజయం కంగనా రనౌత్‌కు చాలా ముఖ్యం.
Comments
Please login to add a commentAdd a comment