రాఘవ లారెన్స్, కంగనా రనౌత్ జంటగా నటించిన తాజా చిత్రం చంద్రముఖి 2. 2005లో సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన హార్రర్ మూవీ ‘చంద్రముఖి’కి సీక్వెల్ ఇది. పీ.వాసు దర్శకత్వం వహించిన ఈ చిత్రం భారీ అంచనాలతో సెప్టెంబర్ 28న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కానీ చంద్రముఖి స్థాయిలో మాత్రం ఆకట్టుకోలేకపోయింది. తొలి రోజు నుంచే మిశ్రమ స్పందన రావడంతో.. కలెక్షన్స్ కూడా పెద్దగా రాలేదు. అయితే సినిమాకు వచ్చిన బజ్ చూసి ప్రముఖ ఓటీటీ సంస్థ భారీ ధరకు డిజిటల్ రైట్స్ కొన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
స్ట్రీమింగ్ అప్పుడేనా..
చంద్రముఖి 2 స్ట్రీమింగ్ రైట్స్‌ని ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫిక్ల్ దక్కించుకుంది. దాదాపు రూ. 8 కోట్లు పెట్టి ఓటీటీ రైట్స్ కొనుగోలు చేసిందట. సినిమా విడుదలైన నెలన్నర తర్వాత ఓటీటీ స్ట్రీమింగ్ చేయాలని తొలుత ఒప్పుందం కుదుర్చుకున్నారట. అయితె థియేటర్స్ ఆడియన్స్ నుంచి ఈ చిత్రానికి ఆశించిన స్థాయిలో స్పందన లభించకపోవడంతో ముందుగానే ఈ చిత్రాన్ని స్ట్రీమింగ్ చేయాలని నెట్‌ఫ్లిక్స్ భావిస్తోందట. నవంబర్ మూడో వారంలో ఈ చిత్రం నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవ్వనుందని సమాచారం. అయితే దీనిపై మాత్రం ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు.
‘ఎమెర్జెన్సీ’ బిజీలో కంగనా
చంద్రముఖి 2లో టైటిల్ రోల్‌లొ నటించిన కంగనా.. ఇప్పుడా పాత్ర నుంచి బయటకు వచ్చింది. సినిమా ఫలితాన్ని మర్చిపోయి.. రాబోతున్న సినిమాలపై దృష్టి పెట్టింది. ఆమె ప్రధాన పాత్రలో నటించిన ఎమర్జెనీ చిత్రం విడుదలకు సిద్ధంగా ఉంది. ఇందిరా గాంధి బయోపిక్ ఇది. దీంతో పాటు ‘తేజస్’ చిత్రంలో కూడా కంగనా నటించింది. . 2016లో భారత వైమానిక దళంలోకి మొట్టమొదటి సారిగా మహిళలకు ప్రవేశాన్ని కల్పించిన సంఘటన ఆధారంగా ఈ సినిమా రూపొందుతోంది. సర్వేష్ మేవారా దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం అక్టోబర్ 20న విడుదల కాబోతుంది.
Comments
Please login to add a commentAdd a comment