'నేను మీకు వీరాభిమానిని'.. జ్యోతిక పోస్ట్ వైరల్! | Actress Jyothika Praises Kangana Ranaut For Her Appearance In Chandramukhi 2 - Sakshi
Sakshi News home page

Jyotika: 'మీ కోసమే సినిమా చూడాలనుకుంటున్నా'.. జ్యోతిక పోస్ట్ వైరల్!

Published Thu, Sep 7 2023 5:00 PM | Last Updated on Thu, Sep 7 2023 6:14 PM

Jyotika Proud To Be Kangana Ranaut playing her role in Chandramukhi 2 - Sakshi

2005లో ఐకానిక్  బ్లాక్‌ బస్టర్ హిట్ అందుకున్న మూవీ చంద్రముఖి. ఈ చిత్రంలో రజినీకాంత్, నయనతార, ప్రభు, సోనుసూద్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ చిత్రం బాక్సాఫీస్‌ను షేక్ చేసిన సంగతి తెలిసిందే. పి. వాసు దర్శకత్వంలో తెరకెక్కించారు. అయితే ఈ చిత్రం చంద్రముఖి పాత్రలో జ్యోతిక అభిమానులను మెప్పించింది. తన హవాభావాలతో ప్రేక్షకులను కట్టిపడేసింది. ప్రేక్షకుల గుండెల్లో చంద్రముఖిగా తన పేరును ముద్రించుకుంది జ్యోతిక. 

(ఇది చదవండి: నిన్ను చాలా మిస్‌ అవుతున్నా.. హీరోయిన్‌ పోస్ట్ వైరల్!)

అయితే ప్రస్తుతం ఈ చిత్రానికి సీక్వెల్‌గా చంద్రముఖి-2  చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రంలో చంద్రముఖి పాత్రలో బాలీవుడ్ క్వీన్‌ కంగనా రనౌత్ కనిపించనుంది. పార్ట్‌-2 లో నటీనటులను పూర్తిగా మార్చేశారు. రజినీకాంత్‌ పోషించిన పాత్రలో రాఘవ లారెన్స్‌  నటిస్తున్నారు. ఇప్పటికే ఈ మూవీ ట్రైలర్‌ను కూడా రిలీజ్ చేశారు మేకర్స్. దీంతో నటి జ్యోతిక ఓ ఆసక్తికర పోస్ట్ చేసింది. చంద్రముఖి పాత్రలో కంగనా నటించడం పట్ల ప్రశంసలు కురిపించింది. తాను కూడా కంగనా రనౌత్‌ అభిమానిని అంటూ ఇన్‌స్టా స్టోరీస్‌లో చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. 

జ్యోతిక ఇన్‌స్టాలో రాస్తూ..' అత్యంత ప్రతిభావంతులైన నటీమణుల్లో కంగనా ఒకరు. మీరు చంద్రముఖి పాత్రను పోషించినందుకు చాలా గర్వపడుతున్నా. ఆ పాత్రలో అద్భుతంగా కనిపిస్తున్నారు. మీ నటనకు నేను కూడా పెద్ద అభిమానిని. ఈ చిత్రం కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నా. ఎందుకంటే ప్రత్యేకంగా మీ కోసమే ఈ సినిమా చూడాలని ఉంది. ముఖ్యంగా లారెన్స్, పి వాసుకు మరో హిట్‌ ఖాతాలో పడినట్టే. సూపర్‌ హిట్‌ అవ్వాలని చిత్రబృందానికి మనస్ఫూర్తిగా అభినందనలు. నా ఆల్ ది బెస్ట్." అంటూ పోస్ట్ చేసింది. కాగా..  చంద్రముఖి 2 సెప్టెంబర్ 15న హిందీ, తమిళం, తెలుగు, కన్నడ, మలయాళ భాషల్లో సినిమాల్లో విడుదల కానుంది.

(ఇది చదవండి: అందుకే ఇప్పటికీ పెళ్లి చేసుకోలేదు: తెలుగు నటి)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement