
బాలీవుడ్ ఫైర్‌బ్రాండ్ కంగనా రనౌత్ నటిస్తున్న తాజాచిత్రం చంద్రముఖి-2. లైకా ప్రొడక్షన్స్ భారీగా నిర్మిస్తున్న ఈ సినిమాలో రాఘవా లారెన్స్ కీలక పాత్రలో కనిపించనున్నారు. 2005లో విడుదలైన చంద్రముఖి చిత్రంలో రజనీకాంత్, జ్యోతిక నటించారు. కేవలం రూజ 9కోట్లతో తెరకెక్కిన ఈ సినిమా అప్పట్లోనే రూ. 70 కోట్లుకు పైగా కలెక్షన్లను రాబట్టింది.
తాజాగా ఇప్పుడీ చిత్రానికి సీక్వెల్ రాబోతుంది. జ్యోతిక పాత్రలో కంగనా, రజనీకాంత్ పాత్రలో లారెన్స్ నటిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. తాజాగా ఈ సినిమా తొలి షెడ్యూల్ ప్రారంభం అయినట్లు కంగనా తెలిపింది. ఇన్‌స్టా వేదికగా దీనికి సంబంధించిన ఫోటోను షేర్‌చేసుకుంది.
Comments
Please login to add a commentAdd a comment