Chandramukhi 2: MM Keeravani Reveals Why He Spend Sleepless Nights From Fear Of Death - Sakshi
Sakshi News home page

MM Keeravani Review On Chandramukhi 2: చంద్రముఖి 2.. ప్రాణభయంతో 2 నెలలు నిద్రలేని రాత్రులు..

Published Mon, Jul 24 2023 1:56 PM | Last Updated on Mon, Jul 24 2023 2:33 PM

Chandramukhi 2: MM Keeravani Reveals Why He Spend Sleepless Nights From Fear Of Death - Sakshi

హారర్‌ సినిమాల్లో చంద్రముఖిది ప్రత్యేక స్థానం. కామెడీ, ఎమోషన్స్‌, హారర్‌.. ఇలా అన్నింటి మేళవింపుగా వచ్చిన చిత్రం అప్పట్లో బ్లాక్‌బస్టర్‌ విజయాన్ని నమోదు చేసింది. అదే సమయంలో భయమంటే తెలియనివారికి కూడా భయాన్ని పరిచయం చేసింది. అంతటి సెన్సేషన్‌ మూవీకి సీక్వెల్‌ తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే! ఇటీవలే చంద్రముఖి 2 సినిమా షూటింగ్‌ కూడా పూర్తయింది.

ఇందులో రాఘవ లారెన్స్‌, కంగనా రనౌత్‌, వడివేలు, మహిమా నంబియార్‌, లక్ష్మీమీనన్‌ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఇటీవలే లారెన్స్‌ తన పాత్రకు డబ్బింగ్‌ పూర్తి చేశాడు. పి.వాసు దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి ఆర్డీ రాజశేఖర్‌ ఛాయాగ్రహణం, ఆస్కార్‌ అవార్డు గ్రహీత ఎంఎం కీరవాణి సంగీతాన్ని అందిస్తున్నారు. లైకా ప్రొడక్షన్స్‌ బ్యానర్‌పై సుభాస్కరన్‌ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు.

ఇదిలా ఉంటే తాజాగా కీరవాణి చంద్రముఖి సినిమాపై సోషల్‌ మీడియా వేదికగా చేసిన ట్వీట్‌ వైరల్‌గా మారింది. 'చంద్రముఖి 2 సినిమా చూశాను. సినిమాలోని పాత్రలకు మరణభయంతో కంటిమీద కునుకు లేకుండా పోయింది. నా పరిస్థితి కూడా అంతే! అద్భుతమైన సన్నివేశాలకు సంగీతంతో ప్రాణం పోసేందుకు రెండు నెలలపాటు నిద్రలేని రాత్రులు గడిపాను. గురు కిరణ్‌, నా స్నేహితుడు విద్యాసాగర్‌.. నాకు విజయం అందాలని కోరుకోండి' అని ట్వీట్‌ చేశారు. కీరవాణి ఇచ్చిన హైప్‌తో సినిమాపై అంచనాలు ఒక్కసారిగా పెరిగిపోయాయి.

చదవండి: బేబీ రనౌత్‌ రాక కోసం వెయిటింగ్‌.. సీమంతం ఫోటోలు షేర్‌ చేసిన కంగనా
అమ్మ బాలేదని వీడియో... ఇంతలోనే కొత్త కారు కొన్న ముక్కు అవినాశ్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement