మనవరాలి పెళ్లితో నటుడు మురళీ మోహన్ (Murali Mohan).. సంగీత దర్శకుడు కీరవాణికి చుట్టమయ్యాడు. మురళీ మోహన్ మనవరాలు రాగ.. కీరవాణి కుమారుడు, హీరో శ్రీ సింహ (Sri Simha) ఈ మధ్యే పెళ్లిపీటలెక్కారు. ఈ వివాహ వేడుకలో ఇరు కుటుంబాలు ఆటపాటలతో, డ్యాన్సులతో ఉత్సాహంగా గడిపారు. తాజాగా ఈ వెడ్డింగ్ గురించి మురళీ మోహన్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు.
అలా మొదలైంది
'రాజమౌళి కోడలు పూజ, నా మనవరాలు రాగ క్లోజ్ ఫ్రెండ్స్. ఇద్దరూ ఒకరింటికి ఒకరు వెళ్లేవారు. ఆ సమయంలో రాజమౌళి (SS Rajamouli), కీరవాణి కుటుంబాలు ఎంత బాగా కలిసున్నాయో కళ్లారా చూసింది. ఫ్రెండ్స్‌లాగా ఒకరిపై మరొకరు జోకులు వేసుకుంటూ చాలా క్లోజ్‌గా, ఆప్యాయతగా ఉంటారు. వీకెండ్ వచ్చిందంటే ఫామ్ హౌస్‌కు వెళ్లి గేమ్స్ ఆడేవారు.
తనే ప్రపోజ్ చేసింది
ఇదంతా రాగకు బాగా నచ్చింది. తనకు చిన్నప్పటి నుంచి ఉమ్మడి కుటుంబమంటే చాలా ఇష్టం. అందుకని ఆ రెండు కుటుంబాలు అలా కలిసిమెలిసి ఉండటం చూసి ముచ్చటపడిపోయింది. తనే ఒకరోజు శ్రీసింహకు ప్రపోజ్ చేసింది. ఈ విషయం మొదట మాకు చెప్పలేదు. పెళ్లి ప్రస్తావన వచ్చినప్పుడు నీకు నచ్చినవాళ్లెవరూ లేరా? అని అడిగాను. అప్పుడు తన మనసులో మాట బయటపెట్టింది.
(చదవండి: అల్లు అర్జున్‌ను అరెస్ట్ చేయడం కరెక్టే: పవన్ కల్యాణ్)
ఎంత సంతోషమేసిందో!
కీరవాణి కుమారుడు శ్రీసింహను ఇష్టపడ్డాను.. మీరందరూ అనుమతిస్తే పెళ్లి చేసుకుంటాను అని చెప్పింది. తన సెలక్షన్ బాగుండటంతో అందరం ఓకే అన్నాం. పెళ్లిలో కూడా వాళ్లు ఎంత బాగా ఇన్వాల్వ్ అయ్యారో.. పెళ్లికూతుర్ని వధువు తరపువారు పల్లకి మోస్తూ మండపానికి తీసుకెళ్లాలి. కానీ అప్పుడు కీరవాణి పెద్దబ్బాయి కాలభైరవ సహా మరికొందరు పల్లకి మోసి తనను తీసుకెళ్లారు. ఎంతో సంతోషమేసింది' అని చెప్పుకొచ్చాడు.
రాగ ఎవరంటే?
మురళీ మోహన్‌కు కుమారుడు, కూతురు ఉన్నారు. కుమారుడు రామ్‌మోహన్- రూపల కుమార్తెనే రాగ. కీరవాణి చిన్న కుమారుడు శ్రీసింహ విషయానికి వస్తే యమదొంగలో చైల్డ్ ఆర్టిస్ట్‌గా నటించాడు. మత్తు వదలరా మూవీలో హీరోగా గుర్తింపు తెచ్చుకున్నాడు.
Comments
Please login to add a commentAdd a comment