కుంకీ చిత్రంతో కోలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చిన మాలీవుడ్ నటి లక్ష్మీ మీనన్. ఆ తరువాత వరుసగా అవకాశాలు వరించడంతో బిజీగా మారిపోయింది. అలా పలు హిట్ చిత్రాలలో నటించిన ఈ అమ్మడు ప్లస్–2 పరీక్షలకు ప్రిపేర్ అవ్వాలంటే నటనకు విరామం తీసుకుంది. అదే లక్ష్మీమీనన్ చేసిన పెద్ద పొరపాటు. ఆమె తనకు తానుగా తీసుకున్న విరామం పర్మినెంట్‌గా మారింది. ఆ తరువాత కొన్ని చిత్రాలలో నటించినా అవి పెద్దగా ఆడలేదు. అలాంటిది గతేడాది చంద్రముఖి–2 చిత్రంలో మెరిసింది. ఆ చిత్రం కూడా తీవ్రంగా నిరాశపరిచింది. కాగా సమీప కాలంలో తమిళ నిర్మాతల మండలి ఇతర సినీ సంఘాలతో కలిసి నిర్వహించిన కలైంజర్- 100 కార్యక్రమంలో నటి లక్ష్మీమీనన్ ఓ పాటకు డాన్స్ చేసింది.
అయితే తాజాగా ఇటీవల ఓ ఇంటర్వ్యూకు హాజరైన లక్ష్మి మీనన్ ఆసక్తికరమైన విషయాలను పంచుకుంది. మీరు ఎవరినైనా ప్రేమించారా? లేక మిమ్మల్ని ఎవరైనా ప్రేమించారా? అన్న ప్రశ్నకు తన తొలి ప్రేమ అనుభవాన్ని వెల్లడించింది. తనను ఎవరూ ప్రేమించలేదని.. కానీ పాఠశాలలో చదువుతున్న సహ విద్యార్థితో తానే ప్రేమలో పడ్డానని చెప్పింది. అతను నచ్చడంతో నేరుగా అతని వద్దకు వెళ్లి తన ప్రేమ గురించి చెప్పానంది. కొన్ని రోజుల తరువాత అతను అంగీకరించాడని తెలిపింది.
అయితే తామిద్దరం తరచూ కలుసుకోవడం, మాట్లాడుకోవడం, ఔటింగ్‌కు వెళ్లడం వంటివి జరగలేదని చెప్పింది. మేమిద్దరం కేవలం చదువుపైనే దృష్టి సారించి స్నేహితుల్లాగే ఉన్నామని తెలిపింది. ఎప్పుడో ఒకసారి కలిసి మాట్లాడుకునే వారమని చెప్పింది. అయితే పాఠశాల నుంచి ఇంటికి వెళ్లే సమయంలో తరచూ కలుసుకునేవారిమని.. ఫోన్‌లో మాట్లాడుకునే వాళ్లమని చెప్పుకొచ్చింది. అలా ఇంట్లో ఎవరికీ తెలియకుండా ఫోన్లో మాట్లాడుకుంటూ ఉండేవాళ్లమని వెల్లడించింది. అయితే పాఠశాల చదువు పూర్తయ్యాక మా మధ్య ప్రేమ కూడా కనిపించకుండా పోయిందని చెప్పింది. ఆ తరువాత ఇద్దరం తమ వృత్తిలో బిజీ అయిపోయామని చెప్పింది. కాగా.. అతను ఇటీవలే పెళ్లి చేసుకున్నట్లు తెలిసిందని చెప్పింది. దీంతో మీరెప్పుడు పెళ్లి చేసుకుంటారు? అన్న ప్రశ్నకు ఇంట్లో వాళ్లు చూసిన వ్యక్తినే చేసుకుంటానని స్పష్టం చేసింది.
Comments
Please login to add a commentAdd a comment