ప్రేమకు వ్యతిరేకం కాదు.. అలాంటి ‍వ్యక్తికే నా లైఫ్‌లో చోటు: నిత్యా మీనన్ | Tollywood Actress Nithya Menen Comments About Her Marriage And Love | Sakshi

Nithya Menen: అలాంటి వ్యక్తి మాత్రమే నా జీవితంలోకి వస్తాడు: నిత్యా మీనన్

Oct 25 2024 4:21 PM | Updated on Oct 25 2024 4:32 PM

Tollywood Actress Nithya Menen Comments About Her Marriage And Love

టాలీవుడ్ హీరోయిన్ నిత్యామీనన్ ప్రస్తుతం ఇడ్లీ కడై అనే కోలీవుడ్ చిత్రంలో నటిస్తోంది. ఈ సినిమాలో ధనుశ్ హీరోగా నటిస్తున్నారు. గతంలో వీరిద్దరు జంటగా రుచిత్రంబ‌లం (తెలుగులో ‘తిరు’) మూవీలో నటించారు. ఈ సినిమాలో నటనకు గానూ నిత్యాకు జాతీయ ఉ‍త్తమ నటి అవార్డ్‌ను దక్కించుకుంది. ఇటీవల తనకు అవార్డ్ రావడం పట్ల నిత్యామీనన్ స్పందించింది. జాతీయ అవార్డ్ వస్తుందని తానెప్పుడూ ఊహించలేదని తెలిపింది.

తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన నిత్యామీనన్ వ్యక్తిగత జీవితం గురించి పలు ఆసక్తికర విషయాలు పంచుకుంది. తన జీవితంలో ప్రేమ, పెళ్లి గురించి మాట్లాడింది. ప్రేమ పట్ల నాకు ఎలాంటి వ్యతిరేక అభిప్రాయాలు లేవని తెలిపింది. అయితే తనకిప్పుడు ప్రేమ, పెళ్లి ఇంపార్టెంట్‌ కాదని.. ప్రస్తుతం తన కెరీర్‌తో సంతోషంగా ఉన్నానని చెబుతోంది. వాటికి కూడా టైమ్ వస్తుందని.. అది ఎప్పుడైనా కావొచ్చు అంటోంది నిత్యామీనన్.

నిత్యా మీనన్ మాట్లాడుతూ..'నా జీవితంలో ప్రేమకు అవకాశం లేదని కాదు. అలాగని ప్రేమకు వ్యతిరేకం కాదు. నా జీవితంలోనూ ఎవరైనా రావాల్సిందే. కానీ అది ఇప్పుడే పెళ్లి చేసుకో అనే మాటలు నేను నమ్మను. ప్రేమ, పెళ్లి విషయంలో చాలా ఫ్లెక్సిబుల్‌గా ఉన్నా. ఆ సందర్భం ఎప్పుడైనా రావొచ్చు. అది 50 ఏళ్ల వయసులో వచ్చినా సరే నేను సంతోషిస్తా. లైఫ్‌లో ఒక వ్యక్తిగా చాలా ఎదుగుతున్నప్పటికీ మరింత నేర్చుకుంటూనే ఉంటా. అర్హత ఉన్న వ్యక్తి మాత్రమే నా జీవితంలోకి వస్తాడు. ప్రస్తుతం నేను దాని కోసం వెతకడం లేదు. జీవితం అనేది చాలా విషయాలతో ముడిపడి ఉంది. ' అని తమ మనసులో మాట చెప్పుకొచ్చింది. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all

Video

View all
Advertisement