గతంలో రజనీకాంత్ కథానాయకుడు నటించిన 'చంద్రముఖి' చిత్రం ఘనవిజయాన్ని సాధించిన విషయం తెలిసిందే. 18 ఏళ్ల తర్వాత దానికి సీక్వెల్‌గా రూపొందుతున్న చిత్రం 'చంద్రముఖి–2'. ఆ చిత్ర దర్శకుడు పి.వాసు దీనికి దర్శకత్వం వహించారు. లారెన్స్ కథానాయకుడిగా నటించిన ఇందులో బాలీవుడ్ బ్యూటీ కంగనా రనౌత్ చంద్రముఖిగా నటించడం విశేషం. నటుడు వడివేలు ముఖ్యపాత్ర పోషించారు. ఆస్కార్ అవార్డు గ్రహీత ఎంఎం కీరవాణి సంగీతాన్ని అందించిన ఈ చిత్రానికి ఆర్డి రాజశేఖర్ అందించారు.
లైకా ప్రొడక్షన్స్ పతాకంపై సుభాస్కరన్ నిర్మించిన ఈ భారీ చిత్రం నిర్మాణ కార్యక్రమాలు పూర్తిచేసుకుని వినాయక చతుర్థి సందర్భంగా సెప్టెంబర్ 15న తెరపైకి రావడానికి ముస్తాబవుతోంది. ఈ సందర్భంగా చైన్నెలోని ఒక విశ్వవిద్యాలయంలో చంద్రముఖి–2 చిత్ర కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఎంఎం కీరవాణి మాట్లాడుతూ తనను మళ్లీ తమిళ చిత్ర పరిశ్రమకు తీసుకువచ్చిన లైకా ప్రొడక్షన్‌న్స్‌కు, పి.వాసుకు కతజ్ఞతలు తెలుపుకుంటున్నానన్నారు. ఈ చిత్రంలో ఐదు పాటలు ఉంటాయని చెప్పారు. నిర్మాత సుభాస్కరన్ తమిళ సినిమాకు దక్కిన భాండాగారం అని దర్శకుడు పి.వాసు పేర్కొన్నారు.
కంగనారనౌత్ మాట్లాడుతూ తన జీవితంలో ఇప్పటివరకు ఎవరి వద్ద ఎలాంటి అవకాశాన్ని కోరలేదు అన్నారు అలాంటిది దర్శకుడు పి. వాసు వద్ద చంద్రముఖిగా నటించడానికి తాను నప్పుతానా అని అడిగాను అన్నారు. అందుకు ఆయన కొంచెంసేపు ఆలోచించి ఓకే అని చెప్పారన్నారు. లారెన్స్ మాట్లాడుతూ తాను సహాయ నృత్య కళాకారుడుగా నటిస్తున్నప్పుడే పి వాసు దర్శకత్వం వహించిన చిత్రాలకు పనిచేశానన్నారు.
(ఇదీ చదవండి: ప్రియురాలిని పరిచయం చేసిన ' జైలర్' ఫేమ్ జాఫర్ సాదిఖ్.. ఆమె ఎవరంటే)
ఆ తర్వాత నృత్య దర్శకుడుగా, నటుడుగా, దర్శకుడుగా చిత్రాలు చేసిన తాను కథానాయకుడిగా నటించిన చిత్రానికి ఆయన దర్శకత్వం వహించారన్నారు. ఇలా 40 ఏళ్లకుపైగా పి వాసు సక్సెస్‌ఫుల్ దర్శకుడుగా కొనసాగుతున్నారని అన్నారు. తాను ఈ చిత్రంలో వేట్టైయాన్ పాత్రలో నటించానని, దీనికి లభించే ప్రశంసలన్నీ ఆయనకే చెందుతాయని లారెన్స్ పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment