
రాఘవ లారెన్స్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ‘చంద్రముఖి 2’. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కంగనా రనౌత్ టైటిల్ పాత్రను పోషించింది. రజనీకాంత్ నటించిన సూపర్‌హిట్ సినిమా ‘చంద్రముఖి’కి ఇది సీక్వెల్‌గా రూపొందిన సంగతి తెలిసిందే. వినాయక చవితి సందర్భంగా సెప్టెంబరు 15న ఈ చిత్రం విడుదల కాబోతుంది. ఈ సందర్భంగా చిత్ర బృందం తాజాగా ట్రైలర్‌ని విడుదల చేసింది.
‘రాజాధి రాజ.. రాజ గంభీర.. రాజ మార్తాండ.. రాజ కుల తిలక..వేటయ్య వేట్టయ రాజు వరాదూర్’అంటూ రాఘవ లారెన్స్ ఎంట్రీతో ట్రైలర్ ప్రారంభం అవుతంది. ట్రైలర్‌లో రాఘవ లారెన్స్ రెండు షేడ్స్‌లో మెప్పిస్తున్నారు. ఒకటి స్టైలిష్ లుక్ కాగా.. మరోటి వేట్టయా రాజా లుక్. ఇక చంద్రముఖి పాత్రలో కంగనా రనౌత్ ఒదిగిపోయింది.
ఇక బసవయ్య పాత్రలో స్టార్ కమెడియన్ వడివేలు తనదైన కామెడీతో మెప్పించబోతున్నారు. సినిమాలోని హారర్, థ్రిల్లింగ్, కామెడీ అంశాలను చూపించారు. ప్రతీ ఫ్రేమ్‌ను ఎంతో రిచ్‌గా తెరకెక్కించారు. నటీనటుల పెర్ఫామెన్స్‌తో పాటు ఆస్కార్ విన్నర్ ఎం.ఎం.కీరవాణి సంగీతం, నేపథ్య సంగీతం, ఆర్.డి.రాజశేఖర్ సినిమాటోగ్రఫీ హైలైట్‌గా ఆడియెన్స్‌ను అలరించనున్నాయని ట్రైలర్ చూస్తుంటే స్పష్టమవుతోంది. ట్రైలర్ సినిమాపై ఉన్న ఎక్స్‌పెక్టేషన్స్‌ను పెంచుతోంది. ‘చంద్రముఖి 2’తో డైరెక్టర్ పి.వాసు సిల్వర్ స్క్రీన్‌పై మరోసారి ఎలాంటి మ్యాజిక్ క్రియేట్ చేయబోతున్నారోనని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment