
‘లాస్య విలసిత.. నవ నాట్యదేవత.. నటనాంకిత అభినయ వ్రత చారుధీర చరిత స్వాగతాంజలి.. స్వాగతాంజలి’ అంటూ సాగే పాట ‘చంద్రముఖి 2’ చిత్రంలోనిది. రాఘవా లారెన్స్, లక్ష్మీ మీనన్, కంగనా రనౌత్, వడివేలు ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘చంద్రముఖి 2’. పి. వాసు దర్శకత్వంలో లైకా ప్రొడక్షన్స్ పతాకంపై సుభాస్కరన్ ఈ సినిమాను నిర్మించారు.
ఈ చిత్రం సెప్టెంబరు 15న విడుదల కానుంది. ఈ చిత్రంలో చంద్రముఖి పాత్రధారి కంగనా రనౌత్‌పై చిత్రీకరించిన ‘ఓ చంద్రముఖి నీకిదే స్వాగతాంజలి’ పాట తెలుగు, తమిళ లిరికల్ వీడియోను శుక్రవారం విడుదల చేశారు.
యం.యం. కీరవాణి స్వరకల్పనలో చైతన్య ప్రసాద్ లిరిక్స్ అందించిన ఈ పాటను శ్రీనిధి తిరుమల పాడారు. ఇక రజనీకాంత్ హీరోగా జ్యోతిక, ప్రభు, నయనతార లీడ్ రోల్స్‌లో పి. వాసు దర్శకత్వంలో రూపొందిన ‘చంద్రముఖి’ చిత్రం 2005లో విడుదలై ఘనవిజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి సీక్వెల్‌గా ‘చంద్రముఖి 2’ తెరకెక్కింది.
Comments
Please login to add a commentAdd a comment