ఈ వారం నాలుగు సినిమాలు.. రివ్యూలివే | Reviews Of Latest Tollywood Movies Released On September 2023 In Telugu, From Skanda To Chandramukhi 2 - Sakshi
Sakshi News home page

Latest Telugu Movie Reviews 2023: ఈ వారం నాలుగు పెద్ద సినిమాలు.. రివ్యూలివే

Published Sat, Sep 30 2023 12:14 PM

Reviews Of Tollywood Movies Released On September 2023 - Sakshi

టాలీవుడ్‌లో ఈ వారం పెద్ద సినిమాల హవా కొనసాగింది. రామ్‌ పోతినినే స్కందతో పాటు లారెన్స్‌ ‘చంద్రముఖి -2’, శ్రీకాంత్‌ అడ్డాల ‘పెదకాపు’చిత్రాలు  ఈ వారం బాక్సాఫీస్‌ బరిలోకి దిగాయి. వీటితో పాటు వివేక్‌ అగ్నిహోత్రి తెరకెక్కించిన పాన్‌ ఇండియా మూవీ ‘ది వాక్సిన్‌ వార్‌’ కూడా ఈ నెల 28నే విడుదలయ్యాయి. మరి ఆ చిత్రాలు ఎలా ఉన్నాయో ‘సాక్షి’ రివ్యూల్లో చదవండి.

స్కంద: నో లాజిక్‌.. ఓన్లీ యాక్షన్‌
రామ్‌ పోతినేని, బోయపాటి కాంబోలో తెరకెక్కిన తొలి చిత్రం ‘స్కంద’. బోయపాటి సినిమాలు అంటేనే హై వోల్టేజ్‌ యాక్షన్‌ కథ అని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. స్కంద కూడా అదే కాన్సెప్ట్‌తో తెరకెక్కింది. మరి ఈ సినిమా ఎలా ఉంది? కథేంటి?  ప్లస్‌ పాయింట్స్‌ ఏంటి? మైనస్‌ పాయింట్స్‌? ( పూర్తి రివ్యూ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి)

చంద్రముఖి-2: భయపెట్టని హార్రర్‌
రజనీకాంత్‌, పీ.వాసు కాంబోలో వచ్చిన చంద్రముఖి(2005) అప్పట్లో ఎంతటి ఘన విజయం సాధించిందో అందరికి తెలిసిందే. తమిళ్‌లోనే కాదు తెలుగులో  ఆ చిత్రం భారీ వసూళ్లని రాబట్టింది. అలాంటి చిత్రానికి సీక్వెల్‌ అంటే సాధారణంగానే అంచనాలు పెరిగిపోతాయి. పైగా చంద్రముఖిగా బాలీవుడ్‌ ఫైర్‌బ్రాండ్‌ కంగనా రనౌత్‌ నటించడంతో ‘చంద్రముఖి-2’పై ఫస్ట్‌ నుంచి భారీ అంచనాలు ఏర్పడాయి. మరి ఆ అంచనాలు ఈ చిత్రం ఏ మేరకు అందుకుంది? చంద్రముఖిగా కంగనా భయపెట్టిందా లేదా? (పూర్తి రివ్యూ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి)


పెదకాపు-1..తడబడిన సామ్యానుడి సంతకం
ఫ్యామిలీ సినిమాకు కేరాఫ్‌ శ్రీకాంత్‌ అడ్డాల. ఒక నారప్ప మినహా ఆయన తెరకెక్కించిన చిత్రాలన్నీ కుటుంబ, ప్రేమ కథలే. అలాంటి దర్శకుడు  రాజకీయ నేపథ్యంతో ‘పెదకాపు’ అనే సినిమాను తెరకెకి​ంచాడు. అది కూడా కొత్త హీరోహీరోయిన్లతో. రెండు భాగాలుగా తెరకెక్కిన ఈ చిత్రం మొదటి భాగం ‘పెద కాపు -1’ ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ చిత్రం ఎలా ఉంది? సామాన్యుడి సంతకం అంటూ వచ్చిన ఈ మూవీ ప్రేక్షకులను ఏ మేరకు మెప్పించింది (పూర్తి రివ్యూ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి)

 ‘ది వ్యాక్సిన్‌ వార్‌’

ది కాశ్మీర్ ఫైల్స్ సినిమాతో వివేక్ అగ్నిహోత్రి నేషనల్ వైడ్‌గా కాంట్రవర్సీ అయ్యాడు. అంతకు ముందు పలు చిత్రాలను తెరక్కించినా.. ది కాశ్మీర్‌ ఫైల్స్‌’తోనే అతనికి గుర్తింపు వచ్చింది. తాజాగా వివేక్‌ అగ్నిహోత్రి తెరక్కించిన చిత్రం ‘ది వ్యాక్సిన్‌ వార్‌’. కరోనా లాక్‌డౌన్‌ సమయంలో ప్రజల దుస్థితి ఎలా ఉంది? వ్యాక్సిన్‌ కనుగోనేందుకు భారత శాస్త్రవేత్తలు చేసిన ప్రయత్నాలు ఏంటి? ఈ క్రమంలో మన శాస్త్రవేత్తలు ఎదుర్కొన్న సమస్యలేంటి? అనే నేపథ్యంలో ది వ్యాక్సిన్‌ వార్‌ సాగుతుంది ( పూర్తి రివ్యూ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి)

Advertisement
 
Advertisement
 
Advertisement