Peddha Kapu 1 Movie
-
సైలెంట్‌గా ఓటీటీలోకి వచ్చేసిన కొత్త మూవీ, స్ట్రీమింగ్ అక్కడే!
తొలి చిత్రం కొత్త బంగారు లోకంతోనే సూపర్ హిట్ అందుకున్నాడు శ్రీకాంత్ అడ్డాల. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, ముకుంద, బ్రహ్మోత్సవం, నారప్ప(అసురన్ రీమేక్) వంటి సినిమాలు తీసిన ఈయన ఈ మధ్యే పెదకాపు సినిమా తీశాడు. ఇందులో విరాట్ కర్ణ, ప్రగతి శ్రీవాస్తవ ప్రధా హీరోహీరోయిన్లుగా నటించారు. వీరిద్దరూ కొత్తవాళ్లే కావడం విశేషం. డైరెక్టర్ కూడా ఈ సినిమాలో ఓ పాత్రలో నటించాడు. అనసూయ, రావు రమేశ్, తనికెళ్ల భరణి ముఖ్య పాత్రలు పోషించారు. ఈ చిత్రం సెప్టెంబర్ 29న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే ఈ సినిమాకు మిశ్రమ స్పందన రావడంతో పెద్దగా వసూళ్లు కూడా అంతంతమాత్రంగానే వచ్చాయి. తాజాగా ఈ మూవీ ఎటువంటి ముందస్తు ప్రకటన లేకుండా ఓటీటీలోకి వచ్చేసింది. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. గురువారం (అక్టోబర్ 26) అర్ధరాత్రి నుంచే ఓటీటీలో అందుబాటులోకి వచ్చింది. సినిమా కథ విషయానికి వస్తే.. 1962లో గోదావరి జిల్లా అల్లర్లు చెలరేగడంతో పరిసర ప్రాంతాల ప్రజలు భయంతో ఉన్న ఊరిని వదిలి వెళ్లిపోతుంటారు. ఆ సమయంలో ఓ పొలం వద్ద అప్పుడే పుట్టిన బిడ్డ కనిపించడంతో ఓ అనామకురాలు లంక గ్రామంలోని మాస్టర్(తనికెళ్ల భరణి)కు అమ్మేస్తుంది. కట్ చేస్తే.. 1982లో లంక గ్రామంపై పెత్తనం కోసం ఓ వర్గానికి చెందిన సత్యరంగయ్య(రావు రమేశ్), బయ్యన్న(నరేన్) పోటీపడుతుంటారు. అదే గ్రామానికి చెందిన పెదకాపు(విరాట్ కర్ణ)(పది మందికి సాయం చేస్తూ, ఆపదొస్తే అండగా ఉండేవాణ్ని అప్పట్లో పెదకాపుగా పిలిచేవారు) తన అన్నయ్యతో కలిసి సత్యరంగయ్య వద్ద పని చేస్తుంటాడు. ఓసారి సత్యరంగయ్య చేసిన హత్య కేసులో ఆయన తరపున పెదకాపు అన్నయ్య జైలుకు వెళ్తాడు. తర్వాత కనిపించకుండా పోతాడు. పెదకాపు అన్నయ్య ఏమయ్యాడు? ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్న సత్యరంగయ్యను పెదకాపు ఎదిరించాడా? లేదా? పొలం దగ్గర బిడ్డను వదిలేసింది ఎవరు? ఈ కథలో కన్నబాబు(శ్రీకాంత్ అడ్డాల), అక్కమ్మ(అనసూయ)ల పాత్ర ఏంటి? అనేది తెలియాలంటే పెదకాపు సినిమాను ఓటీటీలో చూడాల్సిందే! #PeddhaKapu1 Now Streaming on #AmazonPrimeVideo #PeddhaKapu1OnPrimeVideos @ViratKarrna @SrikanthAddala_ @officialpragati @Editormarthand @NaiduChota @mravinderreddyy @dwarakacreation pic.twitter.com/OhbS9VfNBP — TSRU UPDATES (@TsruUpdates) October 27, 2023 చదవండి: నదీతీరంలో తడిచిన అందాలతో కవ్విస్తోన్న హీరోయిన్! -
ఈ వారం నాలుగు సినిమాలు.. రివ్యూలివే
టాలీవుడ్లో ఈ వారం పెద్ద సినిమాల హవా కొనసాగింది. రామ్ పోతినినే స్కందతో పాటు లారెన్స్ ‘చంద్రముఖి -2’, శ్రీకాంత్ అడ్డాల ‘పెదకాపు’చిత్రాలు ఈ వారం బాక్సాఫీస్ బరిలోకి దిగాయి. వీటితో పాటు వివేక్ అగ్నిహోత్రి తెరకెక్కించిన పాన్ ఇండియా మూవీ ‘ది వాక్సిన్ వార్’ కూడా ఈ నెల 28నే విడుదలయ్యాయి. మరి ఆ చిత్రాలు ఎలా ఉన్నాయో ‘సాక్షి’ రివ్యూల్లో చదవండి. స్కంద: నో లాజిక్.. ఓన్లీ యాక్షన్ రామ్ పోతినేని, బోయపాటి కాంబోలో తెరకెక్కిన తొలి చిత్రం ‘స్కంద’. బోయపాటి సినిమాలు అంటేనే హై వోల్టేజ్ యాక్షన్ కథ అని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. స్కంద కూడా అదే కాన్సెప్ట్‌తో తెరకెక్కింది. మరి ఈ సినిమా ఎలా ఉంది? కథేంటి? ప్లస్ పాయింట్స్ ఏంటి? మైనస్ పాయింట్స్? ( పూర్తి రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) చంద్రముఖి-2: భయపెట్టని హార్రర్ రజనీకాంత్, పీ.వాసు కాంబోలో వచ్చిన చంద్రముఖి(2005) అప్పట్లో ఎంతటి ఘన విజయం సాధించిందో అందరికి తెలిసిందే. తమిళ్లోనే కాదు తెలుగులో ఆ చిత్రం భారీ వసూళ్లని రాబట్టింది. అలాంటి చిత్రానికి సీక్వెల్ అంటే సాధారణంగానే అంచనాలు పెరిగిపోతాయి. పైగా చంద్రముఖిగా బాలీవుడ్ ఫైర్‌బ్రాండ్ కంగనా రనౌత్ నటించడంతో ‘చంద్రముఖి-2’పై ఫస్ట్ నుంచి భారీ అంచనాలు ఏర్పడాయి. మరి ఆ అంచనాలు ఈ చిత్రం ఏ మేరకు అందుకుంది? చంద్రముఖిగా కంగనా భయపెట్టిందా లేదా? (పూర్తి రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) పెదకాపు-1..తడబడిన సామ్యానుడి సంతకం ఫ్యామిలీ సినిమాకు కేరాఫ్ శ్రీకాంత్ అడ్డాల. ఒక నారప్ప మినహా ఆయన తెరకెక్కించిన చిత్రాలన్నీ కుటుంబ, ప్రేమ కథలే. అలాంటి దర్శకుడు రాజకీయ నేపథ్యంతో ‘పెదకాపు’ అనే సినిమాను తెరకెకించాడు. అది కూడా కొత్త హీరోహీరోయిన్లతో. రెండు భాగాలుగా తెరకెక్కిన ఈ చిత్రం మొదటి భాగం ‘పెద కాపు -1’ ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ చిత్రం ఎలా ఉంది? సామాన్యుడి సంతకం అంటూ వచ్చిన ఈ మూవీ ప్రేక్షకులను ఏ మేరకు మెప్పించింది (పూర్తి రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) ‘ది వ్యాక్సిన్ వార్’ ది కాశ్మీర్ ఫైల్స్ సినిమాతో వివేక్ అగ్నిహోత్రి నేషనల్ వైడ్‌గా కాంట్రవర్సీ అయ్యాడు. అంతకు ముందు పలు చిత్రాలను తెరక్కించినా.. ది కాశ్మీర్ ఫైల్స్’తోనే అతనికి గుర్తింపు వచ్చింది. తాజాగా వివేక్ అగ్నిహోత్రి తెరక్కించిన చిత్రం ‘ది వ్యాక్సిన్ వార్’. కరోనా లాక్డౌన్ సమయంలో ప్రజల దుస్థితి ఎలా ఉంది? వ్యాక్సిన్ కనుగోనేందుకు భారత శాస్త్రవేత్తలు చేసిన ప్రయత్నాలు ఏంటి? ఈ క్రమంలో మన శాస్త్రవేత్తలు ఎదుర్కొన్న సమస్యలేంటి? అనే నేపథ్యంలో ది వ్యాక్సిన్ వార్ సాగుతుంది ( పూర్తి రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
‘పెదకాపు 1’ మూవీ రివ్యూ
టైటిల్: ‘పెదకాపు 1’ నటీనటులు: విరాట్ కర్ణ, ప్రగతి శ్రీవాస్తవ, అనసూయ, శ్రీకాంత్ అడ్డాల తదితరులు నిర్మాణ సంస్థ: ద్వారక క్రియేషన్స్ నిర్మాత: మిర్యాల రవీందర్ రెడ్డి దర్శకత్వం: శ్రీకాంత్ అడ్డాల సంగీతం: మిక్కీ జే మేయర్ సినిమాటోగ్రఫీ: చోటా కె. నాయుడు విడుదల తేది: సెప్టెంబర్ 29, 2023 ఫ్యామిలీ సినిమాలకు పెట్టింది పేరు శ్రీకాంత్ అడ్డాల. అయితే నారప్ప నుంచి తన స్టైల్ మార్చాడు. అది అనుసర్ మూవీకి తెలుగు రీమేకే అయినా.. మేకింగ్ పరంగా తనలో కొత్త యాంగిల్ చూపించాడు. ఇక ఇప్పుడు అదే జానర్లో ‘పెదకాపు-1’ అనే సినిమా చేశాడు. హీరోహీరోయిన్లు ఇద్దరిని కొత్తవాళ్లను పెట్టి, రాజకీయ నేపథ్యంతో ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ సినిమాపై ఆసక్తిని పెంచింది. దానికి తోడు మూవీ ప్రమోషన్స్ కూడా గ్రాండ్‌గా నిర్వహించడంతో ‘పెదకాపు’పై హైప్ క్రియేట్ అయింది. భారీ అంచనాల మధ్య నేడు(సెప్టెంబర్ 29) ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ఎలా ఉందో రివ్యూలో చూద్దాం. ‘పెదకాపు 1’ కథేంటంటే.. 1962లో గోదావరి జిల్లాలో అల్లరు చెలరేగడంతో చుట్టు పక్కల గ్రామాల ప్రజలంతా భయంతో ఉన్న ఊరిని వదిలి వెళ్లిపోతుంటారు. అలా వెళ్తున్న క్రమంలో ఓ పొలం వద్ద అప్పుడే పుట్టిన బిడ్డ కనిపిస్తుంది. ఎవరో పడేసి వెళ్లిన ఆ ఆడబిడ్డను ఓ అనామకురాలు చూసి.. ఆ బిడ్డని ఎవరికైనా అమ్మేసి రమ్మని కూతురు గౌరీకి చెబుతుంది. ఆమె ఆ పాపను ఓ చాటలో తీసుకొని.. లంక గ్రామంలోని మాస్టర్(తనికెళ్ల భరణి)కి అమ్మెస్తుంది. కట్ చేస్తే.. అది 1982 మార్చి 29. రాష్ట్రంలో అప్పుడే ఓ కొత్త పార్టీ ఆవిర్భవించింది. దీంతో లంకలోని యువత ఆ పార్టీ కోసం పనిచేసేందుకు రెడీ అవుతోంది. అయితే ఆ గ్రామంపై పెత్తనం కోసం ఓ వర్గానికి చెందిన సత్యరంగయ్య(రావు రమేశ్), బయ్యన్న(నరేన్) పోటీ పడుతుంటారు. హింసని ప్రేరేపిస్తూ.. తమ స్వార్థం కోసం జనాల ప్రాణాలతో చలగాటం ఆడుతుంటారు. అదే గ్రామానికి చెందిన పెదకాపు(విరాట్ కర్ణ) (పది మందికి సాయం చేస్తూ, ఆపదొస్తే అండగా ఉండేవాణ్ని అప్పట్లో పెదకాపుగా పిలిచేవారు) తన అన్నయ్యతో కలిసి సత్య రంగయ్య వద్ద పనిచేస్తుంటాడు. ఓ సారి సత్యరంగయ్య చేసిన హత్య కేసులో. ఆయన తరపున పెదకాపు అన్నయ్య జైలుకు వెళ్తాడు. పోలీసులు అదుపు ఉండాల్సిన ఆయన.. కనిపించకుండా పోతాడు. అసలు పెదకాపు అన్నయ్య ఏమయ్యాడు? పొలంలో పడేసిపోయిన ఆ ఆడబిడ్డ ఎవరు? ఆమెను పడేసి వెళ్లిందెవరు? స్వార్థ రాజకీయాల కోసం సామాన్యుల ప్రాణాలతో చలగాటం ఆడుతున్న బయ్యన్న, సత్యరంగయ్యను పెదకాపు ఎలా ఎదిరించాడు? ఈ క్రమంలో అతనికి ఎదురైన సమస్యలేంటి? కొత్తగా వచ్చి పార్టీ.. ఎమ్మెల్యే టికెట్ ఎవరికి ఇచ్చింది? ఈ కథలో కన్నబాబు(శ్రీకాంత్ అడ్డాల), అక్కమ్మ(అనసూయ)ల పాత్ర ఏంటి? అనేది తెలియాలంటే ‘పెదకాపు 1’ సినిమా చూడాల్సిందే. ఎలా ఉందంటే.. ‘సామాన్యుడిగా ఓ మనిషి ఎప్పుడు దుఃఖం నుంచి సుఖంలోకి.. చీకటి నుంచి వెలుగులోకి రావాలని అనుకుంటాడు. ఎదగాలని తపన పడతాడు. అప్పుడు అలా ఎదగాలి అనుకునేవాడికి, ఎదగనివ్వనోడికి, తన దారిన తాను పోయేవాడికి, ఆ దారి మూసేసి తోక్కేయ్యాలనుకునే వాడికి మధ్య యుద్ధం తప్పదు’ అంటూ సినిమా ప్రారంభంలోనే ఓ నోట్ కార్డు వేసి సినిమా ఎలా ఉండబోతుందో క్లారిటీ ఇచ్చాడు దర్శకుడు. అయితే అంతే క్లారిటీగా కథను నడిపించడంలో మాత్రం విఫలమయ్యాడు. కథను ఒక్కలా ప్రారంభించి..మధ్యలో మరోలా చూపించి.. చివరకు రాజకీయంతో ముగింపు పలికాడు. ఒకే కథలో రకారకాల ఎమోషన్స్ చూపించి.. ఆడియన్స్‌ని ఏ ఎమోషన్స్‌కి కనెక్ట్ కాకుండా గందరగోళంతో బయటకు వచ్చేలా చేశాడు. ఓ పసిపాపని పొలంలో పడేసి వెళ్లె సీన్‌తో కథ ఆసక్తికరంగా ప్రారంభం అవుతుంది. అసలు ఆడబిడ్డ ఎవరు? ఆమె నేపథ్యం ఏంటి? కథలో ఆమె కీలక పాత్ర కావొచ్చుననే కుతుహాలం ప్రేక్షకుల్లో కలిగే లోపు.. కథను రాజకీయాల్లోకి తీసుకెళ్లాడు. అక్కడ పెదకాపుని పరిచయం చేశాడు. ఆ తర్వాత బయ్యన్న, సత్యరంగయ్య పాత్రలను రంగంలోకి దించాడు. కొత్త పార్టీకి వారిని ముడిపెడుతూ.. కాసేపు రాజకీయం, ఆదిపత్య పోరుని చూపించాడు. పోని అదైనా పూర్తిగా చూపిస్తాడనుకుంటే అంటే.. వెంటనే కట్ చేసి బ్రదర్ సెంటిమెంట్‌ని తెరపైకి తెచ్చాడు. అక్కడితో ఆగకుండా అక్కమ్మ పాత్రని రంగంలోకి దించాడు. గౌరి పాత్రను చంపేసి ప్రేక్షకుల ఆలోచనను అక్కమ్మ పాత్రపైకి మలిచాడు. ఆ తర్వాత మళ్లీ ఆదిపత్య పోరు..రాజకీయాల వైపు వెళ్లాడు. ఇలా కథను ఆసక్తిగా ఎత్తుకోవడం వెంటనే దించేసి..మరో పాయింట్‌ని చూపించడంతో కథ ఎటువైపు వెళ్తుందో అర్థంకాక.. ఎవరి ఎమోషన్‌కి కనెక్ట్ కాలేక..ఆడియన్స్ గందరగోళానికి గురవుతారు. ఈ కథలో కీలకం అని చెప్పిన పెదకాపు పాత్రనే సరిగా తీర్చిదిద్దలేదనిపిస్తుంది. పెదకాపుగా ఎంట్రీ సీన్లోనే హీరో ఓ పెద్ద చెట్టుని నరికి కొత్త పార్టీ జెండా ఎత్తేందుకు ప్రయత్నిస్తాడు. అడ్డుగా వచ్చిన బయ్యన్న మనుషులను కత్తులతో నరికి మరీ ఊర్లో జెండా ఎగరేస్తాడు. ఆ సీన్ చూడగానే పెదకాపు సామాన్యుడు ఎలా అవుతాడనే ఫీలింగ్ కలుగుతుంది. అలాగే ఓ కీలక వ్యక్తిని నరికి చంపేంత ధైర్యం ఉన్నోడు..అతన్ని ఇబ్బంది పెడుతున్న వ్యక్తిని ఎలా వదిలేస్తాడు? ఒక చోట భయపడుతూ.. మరో చోట ధైర్యంగా ఉంటూ.. చాలా విచిత్రంగా ఆ పాత్ర ప్రవర్తిస్తుంది. అలాగే హీరోయిన్ పాత్ర ప్రవర్తన కూడా కాస్త తేడాగానే అనిపిస్తుంది. పసిపాపను ఎందుకు పొలంలో వదిలేసి వచ్చారనే రీజన్ కూడా కన్విన్సింగ్‌గా అనిపించదు. కొన్ని సన్నివేశాల్లో సహజత్వం కొరవడుతుంది. కొన్ని విషయాల్లో మాత్రం దర్శకుడు సఫలం అయ్యాడు. ప్రేక్షకులను 1980 నాటి కాలంలోకి తీసుకెళ్లాడు. అప్పటి గ్రామాల్లోని పరిస్థితి, రాజకీయ పరిణామాలను చక్కగా ఆవిష్కరించాడు. ఇంటర్వెల్ సీన్ అదిరిపోతుంది. కొన్ని పాత్రలను సగం సగంగానే పరిచయం చేసి పార్ట్ 2లో ఇంకా ఏదో ఉందనేలా చూపించే ప్రయత్నం చేశాడు. ఎవరెలా చేశారంటే.. హీరో విరాట్ కర్ణకి తొలి సినిమా ఇది. అయినా అది తెరపై కనిపించదు. చాలా సహజంగా నటించాడు. యాక్షన్స్ సీన్స్ ఇరగదీశాడు. హీరోయిన్ ప్రగతి పాత్రకు పెద్దగా ప్రాధాన్యత లేదు. అయినా ఉన్నంతలో చక్కగా నటించింది. సత్యరంగయ్య పాత్రలో రావు రమేశ్ ఒదిగిపోయాడు. ఓ రకమైన మేజరిజంతో విలనిజాన్ని బాగా పండించాడు. బయన్న పాత్రలో నరేన్ కూడా తన పరిధిమేర చక్కగా నటించాడు. కన్నబాబు పాత్రలో శ్రీకాంత్ అడ్డాల నిజంగానే సర్ప్రైజ్ చేశాడు. కూర్చున్న చోట నుంచే అన్ని నడిపించే విలన్ పాత్ర తనది. అక్కమ్మగా చేసిన అనసూయ చాలా కీలకమైన పాత్ర చేసింది. పార్ట్ 2లో ఆమె పాత్ర మరింత కీలకం కానున్నట్లు సినిమా చూస్తే అర్థమవుతుంది. పెదకాపు తల్లిదండ్రులుగా ఈశ్వరిరావు, రాజీవ్ కనకాల తెరపై మరోసారి తమ అనుభవాన్ని చూపించారు. తాగుడుకు బానిసైన మాస్టర్‌గా తనికెళ్ల భరణి తన పాత్ర పరిధిమేర చక్కగా నటించాడు. శ్రీనివాస్ వడ్లమాని, నాగబాబుతో మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర నటించారు. ఇక సాంకేతిక విషయాలకొస్తే.. మిక్కీ జే మేయర్ నేపథ్య సంగీతం బాగుంది. పాటలు పర్వాలేదు. ఛోటా కె. నాయుడు సినిమాటోగ్రఫీ అద్భుతంగా ఉంది. తెరపై అనాటి గోదావరి జిల్లాను చూపించాడు. విజువల్స్ పరంగా సినిమా చాలా బాగుంది. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్లు ఉన్నతంగా ఉన్నాయి. -అంజి శెట్టె, సాక్షి వెబ్‌డెస్క్ -
‘పెదకాపు’ ఓ కులానికీ సంబంధించిన చిత్రం కాదు: శ్రీకాంత్ అడ్డాల
‘‘కొత్త బంగారు లోకం’, ‘ముకుందా’ ఇలా కొత్తవాళ్లతో సినిమాలు చేసిన అనుభవం నాకుంది. కొత్తవారితో పని చేయడం ఫ్రెష్‌గా బాగుంటుంది. అలా ఇప్పుడు ‘పెదకాపు 1’ చేశాను. అయితే కొత్తవాళ్లతో రెండు భాగాలుగా ‘పెదకాపు’ వంటి భారీ బడ్జెట్ సినిమా తీయడం దర్శకుడిగా నాకో సవాల్. ఇంత ఖర్చు చేస్తున్నారు కాబట్టి సినిమాలో బాగా నటించడం అనేది విరాట్ ముందున్న సవాల్. సినిమా నిర్మాణం సజావుగా సాగేలా చేయడం రవీందర్ రెడ్డిగారి ముందున్న చాలెంజ్. ‘పెదకాపు 1’లో భాగస్వామ్యులైన ప్రతి ఒక్కరూ సవాల్‌గా తీసుకుని బాధ్యతతో పని చేశారు’’ అన్నారు దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల. విరాట్ కర్ణ హీరోగా పరిచయం అవుతున్న చిత్రం ‘పెదకాపు 1’. శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మించిన ఈ చిత్రం నేడు విడుదలవుతోంది. ఈ సందర్భంగా గురువారం విలేకర్ల సమావేశంలో శ్రీకాంత్ అడ్డాల చెప్పిన విశేషాలు. ► 1982, 83 సమయాల్లో చోటు చేసుకున్న కొన్ని రాజకీయ సమీకరణాలకు కొంత ఫిక్షన్‌ను జత చేసి ఈ సినిమాను తెరకెక్కించాం. ఆ సమయంలో మా ఊర్లోని రాజకీయాల్లో మా నాన్నగారు క్రియాశీలకంగా ఉండేవారు. ఓ రకంగా ఈ సినిమాకు మా నాన్నగారు కూడా ఓ స్ఫూర్తి. ఇది ప్రత్యేకంగా ఏ కులానికీ సంబంధించిన చిత్రం కాదు. ఓ సారి ఓ ఊరికి వెళ్లినప్పుడు బోర్డుపై ఓ వ్యక్తి పేరు పక్కన ‘పెదకాపు’ అని ఉంది. అలా ఎందుకు అని అక్కడివారిని అడిగితే... పది మందిని కాపాడుతూ, పది మందికి సాయం చేసేవారిని పెదకాపుగా పిలుస్తామని చెప్పారు. మనం చెబుతున్న కథ కూడా ఈ తరహాలోనే ఉంటుంది కాబట్టి ‘పెదకాపు’ టైటిల్ పెడదామని నిర్మాత రవీందర్గారితో చెప్పినప్పుడు బాగుంది.. సరే అన్నారు. ► ఓ సామాన్యుడి పోరాటమే ఈ సినిమా కథ. అందరికీ కనెక్ట్ అవుతుంది. సాధారణంగా కొత్తవారి కోసం కథలు రాసుకుంటుంటాం. ఇలా నేను రాసుకున్న కథల్లో ‘పెదకాపు’ ఒకటి. కథగా ఉన్నప్పుడే రెండు భాగాలుగా తీయాలనుకున్నాం. విరాట్ కర్ణకు ఇది తొలి సినిమా. మొదటి చిత్రానికి ప్రతి హీరోకు కొన్ని కష్టాలుంటాయి. అయితే విరాట్‌తో నటింపజేసే బాధ్యత ఓ దర్శకుడిగా నాది. తన నుంచి మంచి నటన రాబట్టుకున్నా. ఈ చిత్రానికి మిక్కీ సంగీతం ఓ ప్రధాన ఆకర్షణ. చోటాగారు మంచి విజువల్స్ ఇచ్చారు ► ‘పెదకాపు’లో నేను చేసిన పాత్రకు ముందు ఓ మలయాళ నటుడిని అనుకున్నాం. కొన్ని కారణాల వల్ల ఆయన సెట్స్‌కు రాలేదు. నాగబాబు, రావు రమేష్గార్లు ఇలా చాలామందితో కాంబినేషన్ సీన్స్ ఉన్నాయి. ప్రొడక్షన్ ఖర్చు కనిపిస్తోంది. దీంతో ఆ పాత్రను నేనే చేశాను. ఈ సినిమాకి నేను రాసిన డైలాగ్స్‌కు మంచి స్పందన వస్తుండటం హ్యాపీగా ఉంది. ‘నీకే అంత ఉంటే మాకు ఎంత ఉండాలి’ అనే డైలాగ్ అందరికీ చాలా కనెక్ట్ అయ్యింది. ఆల్రెడీ వేసిన కొన్ని ప్రీమియర్స్‌లో మంచి స్పందన వచ్చింది. ఆ డైలాగ్ కొన్నేళ్లు నిలిచిపోతుంది. ఇక ‘అన్నాయ్’ అనే మల్టీస్టారర్ కథ నా దగ్గర ఉంది. నా తర్వాతి ప్రాజెక్ట్ గీతా ఆర్ట్స్‌లో ఉంటుంది. -
ప్రభాస్ రియాక్షన్ కోరుకుంటున్న 'పెదకాపు' హీరో
విరాట్ కర్ణ హీరోగా శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మించిన చిత్రం ‘పెదకాపు’. ఈ చిత్రం తొలి భాగం ‘పెదకాపు 1’ ఈ నెల 29న విడుదల కానుంది. ఈ సందర్భంగా బుధవారం విలేకర్ల సమావేశంలో విరాట్ కర్ణ చెప్పిన విశేషాలు. ► చిన్నతనంలో క్రికెటర్ కావాలనుకున్నాను. కానీ కాలేజ్ పూర్తయ్యాక ‘జయ జానకి నాయక’ సినిమా ప్రొడక్షన్లోకి వచ్చాను. నాలో నటించే ప్రతిభ కూడా ఉందని నిరూపించేందుకు ఓ యాక్షన్ షార్ట్ ఫిల్మ్‌ను తీసుకువచ్చి మా బావ (మిర్యాల రవీందర్ రెడ్డి)గారికి చూపించాను. అది దర్శకులు శ్రీకాంత్‌గారికి కూడా నచ్చడం, ‘పెదకాపు’ సినిమాకు ఓ కొత్త కుర్రాడిగా నేను నప్పుతానని ఆయన అనడంతో ఈ సినిమా మొదలైంది. ► ఈ సినిమాలో పెదకాపుగా నటించాను. 1980 బ్యాక్‌డ్రాప్‌లో ఈ సినిమా కథ జరుగుతుంది. అనేక సవాళ్లను ఎదుర్కొంటూ బలవంతుడితో పోరాడి ఓ సామాన్యుడు ఎలా ఎదిగాడు? అన్నదే ‘పెదకాపు’ కథ. ► ఈ సినిమాకు నిర్మాత రవీందర్‌రెడ్డిగారు కాకపోయినట్లయితే ఇంత కాన్వాస్ దొరికేది కాదేమో. ఈ సినిమాలోని ఓ యాక్షన్ ఎమోషనల్ సీన్‌ని నేను బాగా చేశానని, నన్ను గ్రేడ్ ఏ యాక్టర్‌గా సర్టిఫై చేస్తున్నట్లుగా పీటర్ హెయిన్స్‌గారు అన్నారు. అక్కడే ఉన్న రెడ్డిగారి కళ్లలో నీళ్లు తిరిగాయి. ► నేను ప్రభాస్‌గారికి ఫ్యాన్‌ని. ఈ సినిమా రిలీజ్ తర్వాత ఈ చిత్రంపై ప్రభాస్‌గారు స్పందిస్తే నా ఫీల్ వేరే లెవల్లో ఉంటుంది. త్వరలో ‘పెదకాపు 2’ స్టార్ట్ షూటింగ్ ఆరంభమవుతుంది. -
అందుకే ‘పెదకాపు’ అని టైటిల్ పెట్టాం: నిర్మాత
‘అఖండ లాంటి విజయం తర్వాత ఏం చేయాలనే డైలమా నాలో కూడా వచ్చింది. పెద్ద స్టార్స్, దర్శకులకు అడ్వాన్సులు ఇవ్వాలని సన్నిహితుల నుంచి ఒత్తిడి వచ్చింది. అయితే ఎవరితో చేసినా మంచి కథ ఉంటే మంచి సినిమా అవుతుంది. దానికి స్టార్ యాడ్ ఐతే ఇంకా పెద్ద సినిమా అవుతుందని నా నమ్మకం. ఇలాంటి సమయంలో పెదకాపు కథ వచ్చింది. తెలుగు చిత్ర పరిశ్రమలో చెప్పుకోదగ్గ సినిమాలు అరుదుగా ఉంటాయి. అలాంటి అరుదైన చిత్రంగా పెదకాపు నిలుస్తుంది’ నిర్మాత రవీందర్ రెడ్డి అన్నారు. అఖండ లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత ద్వారకా క్రియేషన్స్‌పై రవీందర్ రెడ్డి నిర్మించి చిత్రం ‘పెదకాపు-1’. సెన్సిబుల్ డైరెక్టర్ శ్రీకాంత్ అడ్డాల తెరకెక్కించిన ఈ చిత్రంతో విరాట్ కర్ణ హీరోగా పరిచయం అవుతున్నాడు. సెప్టెంబర్ 29న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సందర్భంగా నిర్మాత రవీందర్ మీడియాతో ముచ్చటించారు. ఆ విశేషాలు... ► కొత్తవాళ్లతోనే వర్క్ అవుట్ అయ్యే కథ ఇది. ఈ కథకు ఒక సామాన్యుడు కావాలి. కొత్తవాడైతే దానికి సహజత్వం వస్తుంది. అందుకే విరాట్‌ని హీరోగా ఎంచుకున్నాం. కొత్త హీరోతో ఇంతపెద్ద కాన్వాస్ తో సినిమా చేయడం ఏ దర్శకుడికైనా కొంచెంరిస్క్ అనిపిస్తుంది. ఐతే ఈ కథని బలంగా నమ్మాం. ఎలాంటి బౌండరీలు లేకుండా సినిమాని పెద్దగానే తీయాలని ముందుగానే చెప్పాను. మంచి జౌట్పుట్ వచ్చింది. ► ప్రతి కథలో బలవంతుడు బలహీనుడు మధ్య పోరాటం ఉంటుంది. ఇందులోకి వచ్చేసరికి నేటివిటీ తోడైయింది. ఈ కథ తెరపై చూస్తున్నపుడు ఒక సినిమాలా కాకుండా నిజ జీవితాన్నే తెరపై చూస్తున్న అనుభూతి కలుగుతుంది. శ్రీకాంత్ గారు రాసిన మాటలు గుచ్చుకుంటాయి. సినిమా చూస్తున్నపుడు జీవితంలో నెగ్గాలంటే ఒక సామాన్యుడు ఇంతపోరాటం చేయాలా అనిపిస్తుంది. సినిమా చూసి బయటికి వెళ్తున్నప్పుడు నిజమే కదా.. మనం ఎందుకు పోరాటం చేయకూడదనిపిస్తుంది. ► ఈ సినిమా అంత చాలా సహజత్వంతో ఉంటుంది. ఎక్కడ కృత్రిమంగా సెట్స్ వేయలేదు. వందశాతం నిజాయితీగా తీశాం. ఒక చరిత్రని కళ్ళ ముందు ఎలా చూపించాలో అలానే చూపించాం. 1980 నాటి పరిస్థితులని ప్రతిబింబిచేలా అన్ని రియల్ లోకేషన్స్ లో షూట్ చేశాం. రాజమండ్రి నుంచి ప్రతి రోజు రెండుగంటల పాటు జర్నీ చేసిమరీ కొన్ని సహజమైన లోకేషన్స్ లో షూట్ చేశాం. తెలుగు సినిమా ఇండస్ట్రీకి మరో వెట్రిమారన్, శ్రీకాంత్ అడ్డాల రూపంలో వస్తారు. ► ఈ కథ అనుకున్నప్పుడే రెండు పార్టులుగా తీయాలనుకున్నాం. ఇదొక చరిత్ర, ఒక సామాన్యుడు, అసమాన్యుడు కావడం ఒక పూటలో జరగదు. ఈ పోరాటంలో చాలా సవాళ్ళు ఉంటాయి. ఇది రెండు పార్టులుగా చెపాల్సిన కథ. ► మొదట సినిమాకి కొన్ని టైటిల్స్ అనుకున్నాం. ఇది కర్ణ పాత్ర చేసే పోరాటం కదా.. కర్ణ టైటిల్ ఐతే ఎలా వుంటుందని చర్చించాం. ఇలాంటి సమయంలో శ్రీకాంత్ గారు లోకేషన్స్ చూడటానికి వెళ్ళినపుడు ‘పెదకాపు’ అనే పేరుని చూశారు. దాని గురించి అక్కడి వాళ్ళని అడిగితే ఆయన ఆ వూరికి మంచి చేసిన వ్యక్తని చెప్పారు. అప్పుడు శ్రీకాంత్ గారు మన కథ కూడా ఇదే కథ..పెదకాపు పేరు బావుంటుందని అన్నారు. అలా ఈ కథకు పెదకాపు అనే పేరుపెట్టాం. కుటుంబం, సమూహం, ప్రాంతం.. ఇలా ఏదైనా నా అనుకొనే వారికోసం కాపుకాచుకొని ఉండేవారికి ఆ పేరు ఉంటుంది. ఆ ఉద్దేశంతోనే ఈ పేరుపెట్టాం. ► శ్రీకాంత్ అడ్డాల ఇందులో ఒక పాత్ర నటించాడు. కూర్చున్న చోటే అన్నీ చేసే పాత్ర అది. దీన్ని చాలా సహజంగా నటించే నటుడు మాత్రమే చేయగలడు. దీని కోసం ఓ ఇద్దరు నటులని అనుకున్నాం. కానీ వారికి వీలుపడలేదు. దీంతో శ్రీకాంత్ గారు కాల్ తీసుకున్నారు. ఒక దర్శకుడికి అన్ని పాత్రలు తెలుసు. ఆ పాత్రని దర్శకుడిగా శ్రీకాంత్ గారే అంత చక్కడా చేయగలరు. సినిమా చూసినప్పుడు మీరు చాలా సర్ప్రైజ్ అవుతారు. ► పెదకాపులో రాజకీయ అంశాలు కూడా ఉంటాయి. 80నాటి పరిస్థితుల నేపధ్యంలో ఉండే కథ ఇది. ఒక కొత్త పార్టీ వస్తుందంటే యువతలో చైతన్యం ఉంటుంది. ఆ పార్టీతో తమ తలరాతలు మారుతాయనే ఆశ ఉంటుంది. రాష్ట్రంలోగాని, దేశంలో గాని ఒక కొత్తపార్టీ వస్తుందంటే ముందు ఎట్రాక్ట్ అయ్యేది యువతనే. అలా వచ్చిన పార్టీ వీరికి ఎలాంటి చేయూతనిచ్చిందనేది ఒక అంశంగా ఉంటుంది.