ప్రభాస్‌ రియాక్షన్‌ కోరుకుంటున్న 'పెదకాపు' హీరో | Actor Virat Karna Speech Highlights At Peddha Kapu Movie Press Meet Goes Viral On Social Media - Sakshi
Sakshi News home page

Peddha Kapu Movie: ప్రభాస్‌ రియాక్షన్‌ కోరుకుంటున్న 'పెదకాపు' హీరో

Published Thu, Sep 28 2023 12:53 AM | Last Updated on Thu, Sep 28 2023 9:28 AM

Virat Karna Speech At Peddha Kapu Movie Press Meet - Sakshi

విరాట్‌ కర్ణ హీరోగా శ్రీకాంత్‌ అడ్డాల దర్శకత్వంలో మిర్యాల రవీందర్‌ రెడ్డి నిర్మించిన చిత్రం ‘పెదకాపు’. ఈ చిత్రం తొలి భాగం ‘పెదకాపు 1’ ఈ నెల 29న విడుదల కానుంది. ఈ సందర్భంగా బుధవారం విలేకర్ల సమావేశంలో విరాట్‌ కర్ణ చెప్పిన విశేషాలు.

► చిన్నతనంలో క్రికెటర్‌ కావాలనుకున్నాను. కానీ కాలేజ్‌ పూర్తయ్యాక ‘జయ జానకి నాయక’ సినిమా ప్రొడక్షన్‌లోకి వచ్చాను. నాలో నటించే ప్రతిభ కూడా ఉందని నిరూపించేందుకు ఓ యాక్షన్‌ షార్ట్‌ ఫిల్మ్‌ను తీసుకువచ్చి మా బావ (మిర్యాల రవీందర్‌ రెడ్డి)గారికి చూపించాను. అది దర్శకులు శ్రీకాంత్‌గారికి కూడా నచ్చడం, ‘పెదకాపు’ సినిమాకు ఓ కొత్త కుర్రాడిగా నేను నప్పుతానని ఆయన అనడంతో ఈ సినిమా మొదలైంది.

► ఈ సినిమాలో పెదకాపుగా నటించాను. 1980 బ్యాక్‌డ్రాప్‌లో ఈ సినిమా కథ జరుగుతుంది. అనేక సవాళ్లను ఎదుర్కొంటూ బలవంతుడితో పోరాడి ఓ సామాన్యుడు ఎలా ఎదిగాడు? అన్నదే ‘పెదకాపు’ కథ.

► ఈ సినిమాకు నిర్మాత రవీందర్‌రెడ్డిగారు కాకపోయినట్లయితే ఇంత కాన్వాస్‌ దొరికేది కాదేమో. ఈ సినిమాలోని ఓ యాక్షన్‌ ఎమోషనల్‌ సీన్‌ని నేను బాగా చేశానని, నన్ను గ్రేడ్‌ ఏ యాక్టర్‌గా సర్టిఫై చేస్తున్నట్లుగా పీటర్‌ హెయిన్స్‌గారు అన్నారు. అక్కడే ఉన్న రెడ్డిగారి కళ్లలో నీళ్లు తిరిగాయి.

► నేను ప్రభాస్‌గారికి ఫ్యాన్‌ని. ఈ సినిమా రిలీజ్‌ తర్వాత ఈ చిత్రంపై ప్రభాస్‌గారు స్పందిస్తే నా ఫీల్‌ వేరే లెవల్‌లో ఉంటుంది. త్వరలో ‘పెదకాపు 2’ స్టార్ట్‌ షూటింగ్‌ ఆరంభమవుతుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement