Raghava Lawrence Chandramukhi 2 Movie Release On Ganesh Chaturthi - Sakshi
Sakshi News home page

Chandramukhi 2: 18 ఏళ్లకు సీక్వెల్‌.. చంద్రముఖి 2 రిలీజ్‌ డేట్‌ వచ్చేసింది..

Published Thu, Jun 29 2023 8:18 PM | Last Updated on Thu, Jun 29 2023 8:26 PM

Chandramukhi 2 Movie Gets Release Date - Sakshi

రజనీకాంత్‌, ప్రభు, జ్యోతిక, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన చంద్రముఖి సినిమా అప్పట్లో సెన్సేషనల్‌ విజయాన్ని అందుకుంది. ఇప్పటికీ ఈ సినిమా వస్తుందంటే చాలు చాలామంది టీవీలకు అతుక్కుపోతారు. 2005లో విడుదలైన ఈ సినిమాను పి.వాసు డైరెక్ట్‌ చేశాడు. దీనికి సీక్వెల్‌ చేయాలని ఆయన ఎప్పటినుంచో ప్రయత్నిస్తున్నాడు. ఈ క్రమంలో రజనీకాంత్‌ ఒప్పుకోకపోవడంతో సీక్వెల్‌ కథతో తెలుగులో నాగవల్లి సినిమా చేశాడు.

చివరకు 18 ఏళ్ల తర్వాత తమిళంలోనూ చంద్రముఖి 2 పూర్తి చేశాడు. ఇందులో రజనీకాంత్‌కు బదులుగా నృత్య దర్శకుడు, నటుడు లారెన్స్‌ నటించాడు. బాలీవుడ్‌ హీరోయిన్‌ కంగనా రనౌత్‌ ప్రధాన పాత్రలో యాక్ట్‌ చేసింది. వడివేలు, రాధిక ముఖ్య పాత్రలు పోషించారు. ఇటీవలే షూటింగ్‌ పూర్తి చేసుకున్న ఈ సినిమా రిలీజ్‌కు రెడీ అయింది. చంద్రముఖి 2 తెలుగు, తమిళ, హిందీ, మలయాళ, కన్నడ భాషల్లో వినాయక చవితికి ప్రేక్షకుల ముందుకు రానుంది అంటూ అధికారికంగా వెల్లడించారు. దీంతో అభిమానులు సినిమా కోసం వెయిటింగ్‌ అంటూ కామెంట్లు చేస్తున్నారు.

చదవండి: పాట పాడటమే కాదు, డ్యాన్స్‌ కూడా చేసిన ఏఆర్‌ రెహమాన్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement