సారీ చెప్పిన హీరో లారెన్స్.. ఆ గొడవపై కామెంట్స్! | Raghava Lawrence Sorry Tweet Chandramukhi 2 Incident | Sakshi
Sakshi News home page

Raghava Lawrence: బౌన్సర్ దాడి.. ట్వీట్‌తో లారెన్స్ క్షమాపణ

Published Sun, Aug 27 2023 4:58 PM | Last Updated on Sun, Aug 27 2023 5:10 PM

Raghava Lawrence Sorry Tweet Chandramukhi 2 Incident - Sakshi

కొరియోగ్రాఫర్‌గా కెరీర్ మొదలుపెట్టి, ప్రస్తుతం హీరోగా బిజీ అయిపోయాడు రాఘవ లారెన్స్. ఇతడు చేసిన కొత్త సినిమా 'చంద్రముఖి 2'. గతంలో రజనీకాంత్ చిత్రానికి ఇది సీక్వెల్. సెప్టెంబరు 15న థియేటర్లలోకి రానుంది. ఈ క్రమంలోనే తాజాగా ఆడియో లాంచ్ ఈవెంట్ నిర్వహించారు. అక్కడ ఓ గొడవ జరగ్గా, దానిపై ఇప్పుడు లారెన్స్ క్షమాపణలు చెప్పాడు. 

ఏం జరిగింది?
సాధారణంగా ఇలాంటి ఆడియో లాంచ్, ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగినప్పుడు అభిమానులు కాస్త ఎక్కువగానే వస్తుంటారు. 'చంద్రముఖి 2' ఆడియో విడుదల కార్యక్రమంలోనూ అలాంటి ఓ సంఘటన జరిగింది. ఈవెంట్ చూడటానికి వచ్చిన ఓ స్టూడెంట్‌పై బౌన్సర్ దాడి చేశాడు. ఆ గొడవ ఆడిటోరియం బయట జరగ్గా, తాజాగా లారెన్స్ దృ‍ష్టికి రావడంతో సారీ చెప్పాడు.

(ఇదీ చదవండి: బిగ్‌బాస్ 7 'ఉల్టా పల్టా' అసలు మీనింగ్ ఇదేనా!?)

ట్వీట్‌లో ఏముంది?
'చంద్రముఖి 2 ఆడియో లాంచ్ ఈవెంట్‌లో ఓ స్టూడెంట్, బౌన్సర్ మధ్య జరిగిన గొడవ ఇప్పుడు నా దృష్టికి వచ్చింది. వేడుక జరుగుతున్నప్పుడు దాని బయట గొడవ జరగడంతో నాకు ఏం తెలియలేదు. ఇప్పుడే నా దృష్టికి వచ్చింది. విద్యార్థులంటే నాకు ఎంతిష్టమో, వాళ్ల వృద్ధి చెందాలని ఎంత కోరుకుంటానే మీకు తెలుసు. ఇలాంటి గొడవలు నాకు నచ్చవ్. కారణం ఏదైనా సరే స్టూడెంట్‌ని కొట్టడం తప్పు. ఇది జరగకుండా ఉండాల్సింది. క్షమాపణలు చెబుతున్నా. బౌన్సర్స్ ఇకపై ఇలాంటి దాడి చేయొద్దని రిక్వెస్ట్ చేస్తున్నా' అని లారెన్స్ ట్వీట్ చేశాడు. 

సినిమాపై బజ్ లేదు
'చంద్రముఖి' సినిమా అప్పట్లో భాషతో సంబంధం లేకుండా అందరినీ భయపెట్టింది. రజనీకాంత్, జ్యోతిక యాక్టింగ్ ఇప్పటికీ మన కళ్లముందే కదలాడుతూ ఉంది. ఇప్పుడు సీక్వెల్‌లో వెంకటపతిరాజుగా లారెన్స్, చంద్రముఖిగా బాలీవుడ్ బ్యూటీ కంగన రనౌత్ నటించారు. పోస్టర్, పాటలు రిలీజ్ చేసినప్పటికీ తెలుగులో అయితే పెద్దగా బజ్ లేదు. రిలీజ్‌కి ఇంకో 20 రోజులు ఉంది కాబట్టి అంచనాలు పెరుగుతాయేమో చూడాలి?

(ఇదీ చదవండి: పెళ్లికి ముందే పూజలు తెగ చేస్తున్న ఆ హీరోయిన్)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement