Chandramukhi 2 First Lyrical Song Released Now - Sakshi
Sakshi News home page

Chandramukhi 2: 'చంద్రముఖి నీకిదే మా స్వాగతాంజలి'.. ఆకట్టుకుంటోన్న లిరికల్ సాంగ్!

Published Fri, Aug 11 2023 7:59 PM | Last Updated on Fri, Aug 11 2023 8:42 PM

Chandramukhi 2 First Lyrical Songle Released Now - Sakshi

సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ కథానాయకుడిగా నటించిన సూపర్‌హిట్‌ చిత్రం చంద్రముఖి. పి.వాసు దర్శకత్వం ఆ చిత్రానికి ఇప్పుడు సీక్వెల్‌గా చంద్రముఖి–2 రూపొందిస్తున్న సంగతి తెలిసిందే. లారెన్స్‌ కథానాయకుడిగా నటిస్తున్న ఈ చిత్రంలో బాలీవుడ్‌ సంచలన నటి కంగనా రనౌత్‌, వడివేలు, మహిమా నంబియార్‌, లక్ష్మీమీనన్‌, సృష్టి తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. పి.వాసు దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి ఆస్కార్‌ అవార్డు గ్రహీత ఎంఎం కీరవాణి సంగీతాన్ని అందిస్తున్నారు.

(ఇది చదవండి: 'మీరు చేయకపోతే చాలామంది ఉన్నారని చెప్పాడు'.. క్యాస్టింగ్‌ కౌచ్‌పై బుల్లితెర నటి!)

లైకా ప్రొడక్షన్స్‌ పతాకంపై సుభాస్కరన్‌ భారీ ఎత్తున నిర్మిస్తున్న ఈ చిత్రం షూటింగ ఇటీవలే పూర్తి చేసుకుంది. ప్రస్తుతం నిర్మాణ కార్యక్రమాలను శరవేగంగా జరుపుకుంటోంది. తాజాగా ఈ చిత్రానికి  సంబంధించి క్రేజీ అప్‌డేట్ ఇచ్చారు మేకర్స్. ఈ చిత్రంలోని ఫస్ట్ సింగిల్ లిరికల్ సాంగ్‌ను రిలీజ్ చేశారు. 'విలసిత.. నవనాట్య దేవతా.. నటనాంకిత.. అభినయవ్రత.. చారుధీర చరిత.. స్వాగతాంజలి.. స్వాగతాంజలి.. జననజనన రూపురాలి స్వాగతాంజలి.. ఓ చంద్రముఖి నీకే మా స్వాగతాంజలి ' అనే లిరికల్ సాంగ్‌ యూట్యూబ్‌లో అలరిస్తోంది. ఈ పాటలో కంగనా రనౌత్ లుక్ అదిరిపోయింది. కాగా.. ఇప్పటికే కంగనా రనౌత్ ఫస్ట్ లుక్ రిలీజ్‌ చేయగా అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. 

(ఇది చదవండి: ' చావును దగ్గరి నుంచి చూశా'.. విశాల్ కామెంట్స్ వైరల్!)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement