
ఆత్మవిశ్వాసం.. ఆత్మాభిమానం.. ఎదురులో ఉన్నది రాజు అయినా ఎదిరించి నిలబడే ధైర్యం.. ఈ లక్షణాలన్నీ ఉన్న చంద్రముఖిగా కనిపించనున్నారు కంగనా రనౌత్. రజనీకాంత్, నయనతార, ప్రభు, జ్యోతిక కాంబినేషన్‌లో పి. వాసు తెరకెక్కించిన ‘చంద్రముఖి’ సీక్వెల్ ‘చంద్రముఖి 2’లో కంగనా టైటిల్ రోల్ చేశారు. శనివారం ఆమె లుక్‌ని విడుదల చేశారు.
కంగనా కాస్ట్యూమ్స్‌ని ప్రముఖ బాలీవుడ్ డిజైనర్ నీతు లుల్లా డిజైన్ చేశారు. రాఘవా లారెన్స్ లీడ్ రోల్‌లో పి. వాసు దర్శకత్వంలో ఈ చిత్రం రూ΄÷ందింది. సుభాస్కరన్ నిర్మించిన ఈ చిత్రానికి ఎం.ఎం. కీరవాణి సంగీతం అందించగా, ఆర్.డి. రాజశేఖర్ ఛాయాగ్రాహకుడిగా వ్యవహరించారు. ‘చంద్రముఖి 2’ వినాయక చవితి సందర్భంగా సెప్టెంబర్‌లో రిలీజ్ కానుంది.
Comments
Please login to add a commentAdd a comment