Raghava Lawrence Chandramukhi 2 Movie Team Announced Its Release Date, Deets Inside - Sakshi
Sakshi News home page

Chandramukhi 2 Movie: చంద్రముఖి–2 అభిమానులకు అప్‌డేట్‌ ఇచ్చిన మేకర్స్‌

Published Mon, Jul 24 2023 6:38 AM | Last Updated on Mon, Jul 24 2023 9:33 AM

Raghava Lawrence Chandramukhi 2 Movie Update - Sakshi

సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ కథానాయకుడిగా నటించిన సూపర్‌హిట్‌ చిత్రం చంద్రముఖి. పి.వాసు దర్శకత్వం ఆ చిత్రానికి ఇప్పుడు సీక్వెల్‌గా చంద్రముఖి–2 రూపొందిస్తున్న విషయం తెలిసిందే. లారెన్స్‌ కథానాయకుడిగా నటిస్తున్న ఈ చిత్రంలో బాలీవుడ్‌ సంచలన నటి కంగనా రనౌత్‌, వడివేలు, మహిమా నంబియార్‌, లక్ష్మీమీనన్‌, సృష్టి తదితరులు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. పి.వాసు దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి ఆర్డీ రాజశేఖర్‌ ఛాయాగ్రహణం, ఆస్కార్‌ అవార్డు గ్రహీత ఎంఎం కీరవాణి సంగీతాన్ని అందిస్తున్నారు.

లైకా ప్రొడక్షన్స్‌ పతాకంపై సుభాస్కరన్‌ భారీ ఎత్తున నిర్మిస్తున్న ఈ చిత్రం షూటింగ ఇటీవలే పూర్తి చేసుకుంది. ప్రస్తుతం నిర్మాణ కార్యక్రమాలను శరవేగంగా జరుపుకుంటోంది. కాగా ఇటీవలే నటుడు లారెన్స్‌ తన పాత్రకు డబ్బింగ్‌ చెప్పి పూర్తి చేశారు. కాగా శనివారం నుంచి ఎంఎం కీరవాణి ఈ చిత్రానికి నేపథ్య సంగీతాన్ని సమ కూర్చడం ప్రారంభించారని యూనిట్‌ వర్గాలు తెలిపారు.

కాగా త్వరలోనే చంద్రముఖి –2 చిత్ర ఆడియో ఆవిష్కరణ కార్యక్రమాన్ని భారీగా నిర్వహించడానికి తెలిపారు. అంతకుముందే వచ్చే నెలలో చిత్రంలోని సింగిల్‌ సాంగ్‌ను విడుదల చేయనున్నట్లు పేర్కొన్నారు. సెప్టెంబర్‌ 19న పాన్‌ ఇండియా రేంజ్‌లో ఈ సినిమా విడుదల కానుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement