
హీరో సూర్య(Suriya) సరసన భాగ్యశ్రీ బోర్సే(Bhagyashree Borse) హీరోయిన్గా నటించనున్నారా? అంటే అవుననే సమాధానమే వినిపిస్తోంది ఫిల్మ్‌నగర్ సర్కిల్స్‌లో. సూర్య హీరోగా వెంకీ అట్లూరి దర్శకత్వంలో ఓ మూవీకి ఏర్పాట్లు జరుగుతున్నాయి. సితార ఎంటర్‌టైన్మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ నిర్మించనున్నారని తెలిసింది.
ఈ సినిమాలో హీరోయిన్ పాత్ర కోసం భాగ్యశ్రీ బోర్సేని ఎంపిక చేశారని తెలిసింది. ప్రస్తుతం ప్రీప్రొడక్షన్ వర్క్స్ జరుగుతున్నాయని, మే నుంచి రెగ్యులర్ షూటింగ్‌ను ఆరంభించేలా మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారట. ఈ చిత్రంపై అధికారిక ప్రకటన అతి త్వరలోనే రానుందని సమాచారం. ఇదిలా ఉంటే.. ఈ సినిమా ఓ మల్టీస్టారర్ అని, సూర్యతో పాటు మరో హీరో కూడా నటిస్తారనే ప్రచారం కూడా సాగుతోంది.
Comments
Please login to add a commentAdd a comment