
ఎలాంటి పాత్రనైనా అవలీలగా చేయగలిగే హీరోయిన్ మహిమ నంబియార్. 12వ తరగతి చదువుతుండగానే కథానాయికగా రంగప్రవేశం చేసిందీ మాలీవుడ్ చిన్నది. సాట్టై చిత్రం ద్వారా కోలీవుడ్‌కు పరిచయం అయిన మహిమా నంబియార్ ఆ తరువాత ఇక్కడ పలు చిత్రాలలో నటించి గుర్తింపు పొందింది. ఇటీవల ఈమె నటించిన చంద్రముఖి–2, రత్తం చిత్రాలు ఒకే రోజు విడుదల అవడం విశేషం. రత్తం చిత్రంలో విలనిజాన్ని ప్రదర్శించిన ఈమె చంద్రముఖి–2లో రాఘవ లారెన్స్‌కు జంటగా నటించింది.
హీరోయిన్ల సమస్యలపై ఏమందంటే?
ప్రస్తుతం పలు చిత్రాలతో ముఖ్యంగా మలయాళంలో ప్రముఖ నటుల సరసన నటిస్తూ బిజీగా ఉంది. తాజాగా మహిమా నంబియార్.. హీరోయిన్లు ఎదుర్కొంటున్న సమస్యలపై స్పందిస్తూ.. చిత్ర పరిశ్రమలో కథానాయికలు చాలా కాలంగా ఇబ్బందిపడుతున్నారంది. చాలా మంది నటీమణులు తమకు ఎదురయ్యే అరాచకాలపై పోరాడుతున్నా ఫలితం ఉండటం లేదని పేర్కొంది. ఎక్కడి వరకో ఎందుకు? తాను కూడా ఇలాంటి సమస్యలను ఎదుర్కొన్నానని చెప్పింది.
ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నా..
ఇంతకు ముందు తెలుగులో ఒక ప్రముఖ హీరో సరసన నటించే అవకాశం వచ్చిందని, ఆ చిత్రంలో నాలుగు రోజులు నటించానని, ఆ తరువాత కొంచెం గ్యాప్ తీసుకుని షూటింగ్ చేద్దామని చిత్ర వర్గాలు చెప్పారంది. అలా కొన్ని రోజుల తరువాత ఆ చిత్ర మేనేజర్ తనకు ఫోన్ చేసి తమ చిత్రంలో ఒక పెద్ద హీరోయిన్ నటించడానికి సమ్మతించారని, అందువలన నన్ను తొలగించినట్లు చెప్పారని పేర్కొంది. ఇలాంటి అవమానాలను చాలా ఎదుర్కొన్నట్టు నటి మహిమ నంబియార్ చెప్పింది.
చదవండి: ఒకే వేదికపై మహేశ్-రాజమౌళి.. ఫుల్ జోష్‌లో ఫ్యాన్స్
Comments
Please login to add a commentAdd a comment