
కృష్ణప్రసాద్, లక్ష్మణ్, మురళీధరన్, మధుర్ మిట్టల్
‘‘మురళీధరన్ గొప్ప క్రికెటర్ అని అందరికీ తెలుసు. కానీ, అంతకంటే గొప్ప మనసున్న వ్యక్తి, నిగర్వి. ఈ తరం యువతకు రోల్ మోడల్, స్ఫూర్తి. అతనిలాంటి స్నేహితుడు ఉండటం అదృష్టం. తనకు క్రికెట్టే జీవితం’’ అని క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్ అన్నారు. క్రికెటర్ ముత్తయ్య మురళీధరన్ జీవితం ఆధారంగా రూ΄÷ందిన చిత్రం ‘800’. ముత్తయ్యగా మధుర్ మిట్టల్, ఆయన భార్య మది మలర్‌గా మహిమా నంబి యార్ నటించారు.
ఎంఎస్ శ్రీపతి దర్శకత్వంలో మూవీ ట్రైన్ మోషన్ పిక్చర్స్ సంస్థ నిర్మించింది. నిర్మాత శివలెంక కృష్ణప్రసాద్ సమర్పణలో అక్టోబర్ 6న తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ఈ సినిమా విడుదల కానుంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో నిర్వహించిన ‘800’ ప్రీ రిలీజ్ వేడుకకి వీవీఎస్ లక్ష్మణ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ వేడుకలో ముత్తయ్య మురళీధరన్ మాట్లాడుతూ– ‘‘క్రికెట్ అంటే రికార్డులు కాదు... స్నేహితుల్ని చేసుకోవడం.
లక్ష్మణ్ నాకు క్లోజ్ ఫ్రెండ్. ఇండియన్ సెలబ్రిటీలతో క్రికెట్ టీమ్ ఏర్పాటు చేయాల్సి వస్తే హీరో వెంకటేశ్‌ని కెప్టెన్ చేయాలి.. ఆయనకు క్రికెట్ అంటే చాలా ఇష్టం’’ అన్నారు. ‘‘కన్నీళ్లు పెట్టుకునే సన్నివేశాలు ఎన్నో ఈ సినిమాలో ఉన్నాయి’’ అన్నారు శివలెంక కృష్ణప్రసాద్. ‘‘ఈ సినిమాలో మురళీధరన్ క్రికెట్ గురించి మాత్రమే కాదు. ప్రజలకు తెలియని ఆయన జీవితం ఎంతో ఉంది’’ అన్నారు మధుర్ మిట్టల్.
Comments
Please login to add a commentAdd a comment