క్రైమ్‌ థ్రిల్లర్‌ | arun vijay crime 23 released on august 31 | Sakshi
Sakshi News home page

క్రైమ్‌ థ్రిల్లర్‌

Published Sun, Aug 26 2018 2:12 AM | Last Updated on Sun, Aug 26 2018 2:12 AM

arun vijay crime 23 released on august 31 - Sakshi

అరుణ్‌ విజయ్‌

అరుణ్‌ విజయ్‌ హీరోగా మహిమా నంబియార్, అభినయ హీరోయిన్లుగా దర్శకుడు అరివళగన్‌ తమిళంలో తెరకెక్కించిన చిత్రం ‘కుట్రమ్‌ 23’. ఈ సినిమాను ‘క్రైమ్‌ 23’గా ప్రసాద్‌ ధర్మిరెడ్డి, రంధి శంకరరావు, సూరాపాటి గాంధి, ఇంద్ర కుమార్‌ తెలుగులో ఈ నెల 31న రిలీజ్‌ చేస్తున్నారు. ఈ సందర్భంగా నిర్మాత ప్రసాద్‌ ధర్మిరెడ్డి మాట్లాడుతూ – ‘‘బ్రూస్‌లీ, ఎంతవాడుగానీ’ చిత్రాల్లో విలన్‌గా ఆకట్టుకున్న అరుణ్‌ విజయ్‌ నటించిన ఈ సినిమాను తెలుగులో రిలీజ్‌ చేయడం హ్యాపీగా ఉంది. దర్శకుడు అరివళగన్‌ సోషల్‌ మెసేజ్‌తో పాటు కమర్షియల్‌ అంశాలను చక్కగా జోడించి ఈ చిత్రాన్ని రూపొందించారు. అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునే మంచి క్రైమ్‌ థ్రిల్లర్‌. ప్రభాస్‌గారు రిలీజ్‌ చేసిన ట్రైలర్‌కు మంచి స్పందన వస్తోంది. ఈ నెల 31న ఈ సినిమాను గ్రాండ్‌గా రిలీజ్‌ చేస్తున్నాం’’ అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: విశాల్‌ చంద్రశేఖర్, కెమెరా: కేయమ్‌ భాస్కరన్‌.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement