వాస్తవ సంఘటనలతో... | Kuttram 23 now in Telugu | Sakshi
Sakshi News home page

వాస్తవ సంఘటనలతో...

Published Thu, Aug 9 2018 1:10 AM | Last Updated on Sat, Aug 11 2018 8:48 PM

Kuttram 23 now in Telugu - Sakshi

అరుణ్‌ విజయ్‌,మహిమ నంబియార్

‘బ్రూస్‌ లీ’, ‘ఎంతవాడుగాని’ చిత్రాల్లో విలన్‌గా నటించి, తెలుగు ప్రేక్షకులను అలరించిన అరుణ్‌ విజయ్‌ హీరోగా తెరకెక్కిన తమిళ చిత్రం ‘కుట్రమ్‌ 23’. ‘వైశాలి’ చిత్రం ఫేమ్‌ అరివళగన్‌ దర్శకుడు. మహిమ నంబియార్, అభినయ హీరోయిన్స్‌. ఈ చిత్రాన్ని అరుణ ప్రసాద్‌ ధర్మిరెడ్డి సమర్పణలో శ్రీ విజయ నరసింహా ఫిలింస్‌ పతాకంపై ‘క్రైమ్‌ 23’ పేరుతో తెలుగులో విడుదల చేస్తున్నారు. ప్రసాద్‌ ధర్మిరెడ్డి, రంధి శంకరరావు, సూరాపాటి గాంధి, ఇందర్‌కుమార్‌ నిర్మాతలు.

ఈ నెల 24న రిలీజ్‌ అవుతోన్న ఈ చిత్రం గురించి ప్రసాద్‌ ధర్మిరెడ్డి మాట్లాడుతూ– ‘‘తమిళనాడులో జరిగిన వాస్తవ సంఘటనల ఆధారంగా రూపొందిన మెడికల్‌ క్రైమ్‌ థ్రిల్లర్‌ చిత్రమిది. యాక్షన్, రొమాన్స్, ఫ్యామిలీ సెంటిమెంట్‌.. ఇలా అన్ని ఎమోషన్స్‌తో అరివళగన్‌ బాగా తెరకెక్కించారు. అరుణ్‌ విజయ్‌ పోలీస్‌ ఆఫీసర్‌గా మంచి నటన కనబరిచాడు. ఇటీవల ప్రభాస్‌గారి చేతుల మీదుగా విడుదలైన ట్రైలర్‌కు అద్భుతమైన స్పందన వచ్చింది’’ అన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement