కుట్రం 23తో వస్తానంటున్న అరుణ్‌విజయ్ | Arun Vijay's next titled Kuttram 23 | Sakshi
Sakshi News home page

కుట్రం 23తో వస్తానంటున్న అరుణ్‌విజయ్

Published Fri, May 13 2016 2:31 AM | Last Updated on Sun, Sep 3 2017 11:57 PM

కుట్రం 23తో వస్తానంటున్న అరుణ్‌విజయ్

కుట్రం 23తో వస్తానంటున్న అరుణ్‌విజయ్

కుట్రం పేరుతో కూడిన కట్రం కడిదల్ హిట్. సంఖ్య పేరుగా తెరకెక్కిన 24 చిత్రం సూపర్‌హిట్.  ఇప్పుడు కుట్రం 23 అంటూ తెరపైకి రావడానికి నటుడు అరుణ్‌విజయ్ సిద్ధం అవుతున్నారు. ఎస్ హీరోగా నటిస్తూ అనూహ్యంగా ఎన్నైఅరిందాళ్ చిత్రంతో అజిత్‌కు విలన్‌గా మారిన అరుణ్‌విజయ్ ఆ పాత్రతో విశేష ప్రేక్షకాదరణ పొందారు. మళ్లీ హీరోగా మారిపోయారు.
 
  ఇన్ సినిమా ఎంటర్‌టెయిన్‌మెంట్ పేరుతో సొంత నిర్మాణ సంస్థను ప్రారంభించి నిర్మాతగా,కథానాయకుడిగా చేస్తున్న చిత్రం కుట్రం 23. చిన్న గ్యాప్ తరవాత కథానాయకుడిగా నటించనుండడంతో అరుణ్‌విజయ్ అందుకు చాలా కథలనే విన్నారట. అలా విన్న కథలో ది బెస్ట్ అనిపించిన కథను దర్శకుడు అరివళగన్ అందించారట.
 
  ఇంతకు ముందు ఈరం, వల్లినం,ఆరదు సినమ్ వంటి విజయవంతమైన చిత్రాల సృష్టికర్త అరివళగన్. మెడికల్ క్రైమ్ థ్రిల్లర్ కథా చిత్రంగా తెరకెక్కుతున్న ఈ చిత్రం ఇప్పటికే 60 శాతం షూటింగ్‌ను పూర్తి చేసుకుందట. మిగిలిన షూటింగ్‌ను జూన్ నెలాఖరుకంతా పూర్తి చేస్తామంటున్నారు చిత్ర యూనిట్. చిత్ర ఫస్ట్‌లుక్ పోస్టర్లను ఈ నెల చివరి వారంలో విడుదల చేయనున్నట్లు తెలిపారు. కమర్షియల్ అంశాలతో ఆసక్తికరంగా సాగే ఈ కుట్రం 23 ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని కలిగిస్తుందంటున్నారు  దర్శకుడు అరివళగన్.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement