దేవుడే ఈ అవకాశం కల్పించాడు | kuttram 23 movie Trailer innovation program | Sakshi
Sakshi News home page

దేవుడే ఈ అవకాశం కల్పించాడు

Published Fri, Sep 2 2016 2:53 AM | Last Updated on Mon, Sep 4 2017 11:52 AM

దేవుడే ఈ అవకాశం కల్పించాడు

దేవుడే ఈ అవకాశం కల్పించాడు

కుట్రమ్ 23 చిత్రం నటుడు అరుణ్ విజయ్‌కు విజయ మకుటాన్ని అందిస్తుందనే నమ్మకాన్ని నటుడు జయంరవి వ్యక్తం చేశారు. పలు విజయవంతమైన చిత్రాల నటుడు అరుణ్‌విజయ్ కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం కుట్రమ్ 23. అరివళగన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో నటి మహిమానంబియార్ నాయకిగా నటించారు. ఇతర ముఖ్య పాత్రల్లో అభినయ, లక్ష్మీరామకృష్ణన్,అరవింద్ ఆకాశ్,అమిత్‌భార్గవ్, సుజావరూణి నటించారు. విశాల్ చంద్రశేఖర్ సంగీతాన్ని అందించిన ఈ చిత్రాన్ని రేదన్ నిర్మించారు.
 
  చిత్ర ఆడియో, ట్రైలర్ ఆవిష్కరణ కార్యక్రమం గురువారం ఉదయం స్థానిక రాయపేటలోని సత్యం సినీ మాల్‌లో జరిగింది. దర్శకుడు గౌతమ్‌మీనన్, నటుడు జయంరవి ముఖ్యఅతిథులుగా పాల్గొని చిత్ర ఆడియోను, ట్రైలర్‌ను ఆవిష్కరించారు. జయం రవి మాట్లాడుతూ తన చిత్ర దర్శకుడికి పలు అబద్దాలు చెప్పి అయినా ఈ కుట్రమ్ 23 చిత్ర ఆడియో ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొనాలని భావించానన్నారు.
 
 అయితే ఆ దేవుడే అలాంటి అవకాశాన్ని కల్పించారని చెప్పారు. ఈ చిత్రం అరుణ్‌విజయ్‌కి విజయ మకుటాన్ని తొడుగుతుందనే నమ్మకం తనకుందని జయంరవి పేర్కొన్నారు.అరుణ్ విజయ్ ఎలాంటి పాత్రనైనా ఎంత రిస్క్ తీసుకునైనా నటించడానికి సిద్ధపడే నటుడని అలాంటి ఆయన హీరోగా నటించిన ఈ కుట్రమ్ 23 చిత్రం మంచి విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని దర్శకుడు గౌతమ్‌మీనన్ అన్నారు. నటుడు విజయకుమార్, దర్శకుడు శశి, ఎస్‌పీ. జననాథన్, మహిళ్‌తిరువేణి, శరవణన్, భరత్, ఉదయ్, శ్రీకాంత్, మహేంద్రన్ పాల్గొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement