స్పిన్ మాంత్రికుడి బయోపిక్.. ఆసక్తిగా ఫస్ట్‌ లుక్! | Madhur Mittal to play Muttiah Muralitharan in 800 | Sakshi
Sakshi News home page

స్పిన్ మాంత్రికుడి బయోపిక్.. ఫస్ట్ లుక్ అదిరిపోయింది!

Apr 18 2023 12:39 AM | Updated on Apr 18 2023 7:57 AM

Madhur Mittal to play Muttiah Muralitharan in 800 - Sakshi

మధుర్‌ మిట్టల్‌

క్రికెట్‌ ప్రపంచంలో ఎన్నో రికార్డులు సాధించిన ప్రముఖ స్పిన్నర్‌ ముత్తయ్య మురళీధరన్‌ జీవితం ఆధారంగా రూపొందుతున్న చిత్రం ‘800’. సోమవారం (ఏప్రిల్‌ 17) ముత్తయ్య పుట్టినరోజుని పురస్కరించుకుని ఈ చిత్రం ఫస్ట్‌ లుక్‌ని విడుదల చేశారు. ఎంఎస్‌ శ్రీపతి రచన, దర్శకత్వం వహిస్తున్నారు. ‘స్లమ్‌డాగ్‌ మిలియనీర్‌’లో చేసిన సలీమ్‌ మాలిక్‌ పాత్ర ద్వారా గుర్తింపు తెచ్చుకున్న మధుర్‌ మిట్టల్‌ ఈ బయోపిక్‌లో ముత్తయ్య పాత్రను పోషిస్తున్నారు. ముత్తయ్య భార్య మదిమలర్‌ పాత్రను మహిమా నంబియార్‌ చేస్తున్నారు.

శ్రీపతి మాట్లాడుతూ – ‘‘కెరీర్‌లో 800 టెస్ట్‌ వికెట్స్‌ తీసిన ఏకైక ఆఫ్‌ స్పిన్నర్‌ బౌలర్‌గా మురళీధరన్‌ అరుదైన రికార్డు సాధించారు. అందుకే ఈ చిత్రానికి ‘800’నే టైటిల్‌గా పెట్టాం. మురళికి తమిళనాడులో మూలాలు ఉన్నాయి. అతని తాతలు భారతీయులు. బ్రిటిష్‌ వారు అక్కడి టీ తోటలలో పని చేయడానికి వారిని శ్రీలంకకు తీసుకెళ్లారు. ఇలా ముత్తయ్య మురళీధరన్‌లోని పలు కోణాలను చూపించే చిత్రం ఇది. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నాం’’ అన్నారు. వివేక్‌ రంగాచారి నిర్మిస్తున్న ఈ చిత్రం ఈ ఏడాదే విడుదల కానుంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement