bangalore city
-
జలదిగ్బంధంలో బెంగళూరు..
-
Lok sabha elections 2024: బెంగళూరు సిటీ... రిజర్వుడ్!
నాలెడ్జ్ కేపిటల్. ఐటీ హబ్. దిగ్గజ శాస్త్ర సాంకేతిక సంస్థల నిలయం. కాస్మోపాలిటన్ సంస్కృతి. చెప్పుకుంటూ పోతే బెంగళూరు నగర ప్రత్యేకతలు అన్నీ ఇన్నీ కావు. కానీ ఎన్నికల విషయానికి వచ్చేసరికి మాత్రం ఈ లెక్కలన్నింటినీ పక్కన పెట్టేస్తున్నారు నగర ఓటర్లు. అన్నిచోట్లా ఉన్నట్టే కులం, మతం, పార్టీ విధేయతలకే ఓటేస్తున్నారు!బెంగళూరు నగర పరిధిలో 4 లోక్‌సభ సీట్లకూ శుక్రవారం రెండో విడతలో పోలింగ్ జరగనుంది. 2008లో లోక్‌సభ నియోజకవర్గాల పునరి్వభజన జరిగినప్పటి నుంచీ ఆ స్థానాల్లో ఓటర్లు ఎప్పుడూ ఒకే పారీ్టకో, అభ్యరి్ధకో పట్టం కడుతుండటం విశేషం... బెంగళూరు పరిధిలోని లోక్‌సభ, అసెంబ్లీ స్థానాల్లో గెలిచిన అభ్యర్థే గెలవడం, ఒకే పార్టీకి ఓటర్లు జై కొట్టడానికి నియోజకవర్గాల పునరి్వభజన జరిగిన తీరే కారణమనేది రాజకీయ పరిశీలకుల అభిప్రాయం. నేతలు తమకు అనుకూలమైన కులాలు, మతాల ఓటర్లు ఒకే నియోజకవర్గంలోకి వచ్చేలా జాగ్రత్త పడటం వల్లే ఈ ట్రెండ్ కొనసాగుతోందనే వాదనలు బలంగా ఉన్నాయి. లోక్‌సభతో పాటు అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఇదే ధోరణి ప్రతిఫలిస్తోంది. 2008 నుంచి బెంగళూరులోని మొత్తం 28 అసెంబ్లీ స్థానాల్లో 57 శాతం సీట్లను సిట్టింగ్ ఎమ్మెల్యేలే గెలుస్తూ వస్తున్నారు. మరో 18 శాతం సీట్లను ఒకే ఎమ్మెల్యే లేదా పార్టీ కనీసం రెండుసార్లు గెలవడం విశేషం. ఆ లెక్కన చూస్తే నగరంలోని 75 శాతం స్థానాలు ఒకే అభ్యరి్థకో, ఒకే పారీ్టకో ‘రిజర్వ్’ అయిపోయాయన్నమాట! రాజకీయాల్లో తరచూ వినిపించే ఓటర్ల వ్యతిరేకత, సిట్టింగ్ ప్రజాప్రతినిధిపై అసంతృప్తి వంటివి బెంగళూరుకు వర్తించవు!నగర పరిధిలోని తొమ్మిది అసెంబ్లీ సీట్లలో బీజేపీ నుంచి, ఏడు స్థానాల్లో కాంగ్రెస్ నుంచి గెలిచిన అభ్యర్థులే మళ్లీ గెలిచారు. శివాజీనగర్‌లో 2008 నుంచి వరుసగా మూడుసార్లు కాంగ్రెస్ టికెట్‌పై ఎమ్మెల్యే అయిన రోషన్ బేగ్ 2019లో బీజేపీలోకి దూకారు. అనంతరం జరిగిన ఉప ఎన్నికలో మాత్రం కాంగ్రెస్ అభ్యర్థి రిజ్వాన్ అర్షద్ చేతిలో ఆయన చిత్తుగా ఓడటం విశేషం! అర్షద్‌కు ఎమ్మెల్యేగా అది రెండో విజయం. చామరాజ్‌పేట్ నుంచి మూడుసార్లు గెలిచిన కాంగ్రెస్ ఎమ్మెల్యే జమీర్ అహ్మద్ మాత్రం రెండుసార్లు జేడీ(ఎస్) టికెట్‌పైనా గెలిచారు.వొక్కళిగలే కీలకం...బెంగళూరులో ఇలా ఒకే పార్టీ, ఒకే అభ్యర్థి వరుసగా గెలుస్తున్న ట్రెండ్ వెనక పలు ఇతర కారణాలూ ఉన్నా కులమే కీలక ఫ్యాక్టర్‌గా నిలుస్తోంది. పార్టీ ఓటు బ్యాంకుతో పాటు పారీ్టలు, నేతల మధ్య లోపాయకారీ అవగాహన, తటస్థ ఓటర్ల మొగ్గు కూడా ప్రభావం చూపుతున్నాయి.► బెంగళూరులోని 28 అసెంబ్లీ స్థానాల్లో 4 ఎస్సీ రిజర్వుడు సీట్లు. వాటిని బీజేపీ, కాంగ్రెస్ చెరో రెండు చొప్పున తమ ఖాతాలో వేసుకుంటూ వస్తున్నాయి.► బెంగళూరు పరిధిలోని 28 మంది ఎమ్మెల్యేల్లో 13 మంది వొక్కళిగ కులానికి చెందినవారే. మిగతా సీట్లలో కూడా వారి ప్రభావం గట్టిగా కనబడుతుండటం నగరంలో కులాలవారీ ఓటింగ్ కీలకంగా నిలుస్తోందనేందుకు తిరుగులేని నిదర్శనం.► పునరి్వభజన తర్వాత పరిసర గ్రామీణ ప్రాంతాల నుంచి బెంగళూరు నగర పరిధిలోని నియోజకవర్గాలకు ఓటర్ల వలస కూడా ఈ ధోరణికి మరింత దోహదపడుతోంది.► వొక్కళిగ, ఎస్సీ రిజర్వుడ్‌తో పాటు ముగ్గురు ముస్లిం, ఒక క్రిస్టియన్ అభ్యర్థులు శివాజీనగర్ శాంతిగనర్, చామరాజ్‌పేట్, సర్వజ్ఞనగర్‌లో అసెంబ్లీ స్థానాల్లో ఆధిపత్యం ప్రదర్శిస్తున్నారు.► రాజాజీనగర్, గాం«దీగనర్, బసవనగుడి, చిక్పేట్ నియోజవర్గాల్లో ఎప్పుడూ బ్రాహ్మణ సామాజిక వర్గమే గెలుస్తోంది.► ప్రస్తుత లోక్‌సభ ఎన్నికల్లో నగరంలో టికెట్ల కేటాయింపులోనూ వొక్కళిగల ఆధిపత్యం కొట్టొచి్చనట్టు కనిపిస్తోంది. నాలుగు సీట్లలో మూడింటిని కాంగ్రెస్ ఆ సామాజికవర్గానికే కట్టబెట్టింది. బెంగళూరు నార్త్ నుంచి రాజీవ్ గౌడ, సౌత్ నుంచి సౌమ్యా రెడ్డి, రూరల్‌లో డీకే సురేశ్ బరిలో ఉన్నారు. బీజేపీ నుంచి బెంగళూరు నార్త్ అభ్యర్థి శోభ కరంద్లాజె, రూరల్ నుంచి సీఎన్ మంజునాథ కూడా వొక్కళిగలే. ► బెంగళూరు సెంట్రల్ లోక్‌సభ పరిధిలోని అసెంబ్లీ స్థానాల్లో చాలావరకు మైనారిటీల ఆధిపత్యమే కావడంతో మన్సూర్ అలీకి కాంగ్రెస్ టికెటిచి్చంది.లోక్‌సభ ఎన్నికల్లోనూ ఇదే ధోరణి► నియోజకవర్గాల పునర్విభజన జరిగిన తర్వాత మూడు లోక్‌సభ ఎన్నికల్లోనూ బెంగళూరు పరిధిలోని స్థానాల్లో దాదాపు ఒకే పార్టీ, లేదా అభ్యర్థే గెలిచారు.► బెంగళూరు రూరల్ 2013 ఉపఎన్నిక నుంచీ కాంగ్రెస్ కంచుకోటగా మారింది. పీసీసీ చీఫ్ డీకే శివకుమార్ సోదరుడు డీకే సురేశ్ ఇక్కడ హ్యాట్రిక్ కొట్టారు. నాలుగో విజయం కోసం మళ్లీ బరిలో దిగారు. ఆయనదీ వొక్కళిగ కులమే. ఇక్కడ బీజేపీ కూడా అదేసామాజిక వర్గానికి చెందిన దేవెగౌడ అల్లుడు సి.ఎన్.మంజునాథను బరిలో దింపింది.► బెంగళూరు సెంట్రల్ బీజేపీ సిట్టింగ్ ఎంపీ పీసీ మోహన్ కూడా హ్యాట్రిక్ వీరుడే. ఈసారి కూడా ఆయనే బరిలో ఉన్నారు. కాంగ్రెస్ మాత్రం అభ్యరి్థని మార్చి మన్సూర్ అలీతో అదృష్టాన్ని పరీక్షించుకుంటోంది.► బెంగళూరు సౌత్ నుంచి బీజేపీ సిట్టింగ్ ఎంపీ తేజస్వీ సూర్య మళ్లీ పోటీలో ఉన్నారు. ఇక్కడ 1991 నుంచీ కాషాయ జెండానే ఎగురుతుండటం విశేషం! దాంతో ఈసారి రాష్ట్ర మంత్రి రామలింగారెడ్డి కుమార్తె సౌమ్యా రెడ్డిని కాంగ్రెస్ బరిలోకి దింపింది.► బెంగళూరు నార్త్‌లో మాత్రం 2014 నుంచీ గెలుస్తున్న సదానంద గౌడను బీజేపీ ఈసారి పక్కనబెట్టింది. ఉడుపి–చిక్మగళూరుఎంపీ, కేంద్ర మంత్రి శోభ కరంద్లాజెను బరిలో దింపింది. ఆమె కోస్తా వొక్కళిగ కాగా కాంగ్రెస్ అభ్యర్థి రాజీవ్ గౌడ స్థానిక వొక్కలిగ కావడం విశేషం.బెంగళూరు నగర పరిధిలోని లోక్‌సభ స్థానాలుబెంగళూరు నార్త్, బెంగళూరు రూరల్, బెంగళూరు సెంట్రల్, బెంగళూరు సౌత్ నోట్: ‘గతం’ శీర్షికన అందిస్తున్న లోక్‌సభ ఎన్నికల సిరీస్‌కు రెండో విడత పోలింగ్ కవరేజీ కారణంగా ఈ రోజు విరామం. ఆ సిరీస్ రేపటినుంచి యథావిధిగా కొనసాగుతుంది. – సాక్షి, నేషనల్ డెస్క్ -
ఏరో ఇండియా 2023కి రెడీ అవుతున్న బెంగళూరు
-
ఐటీ సిటీలో ఇక నీళ్లకు రేషన్ తప్పదు!
దేశంలోనే ఐటీకి అతిపెద్ద కేంద్రంగా పేరొందిన బెంగళూరు నగరం ప్రస్తుతం నీటి కొరతతో కటకటలాడుతోంది. ఇప్పటికే అక్కడి రిజర్వాయర్లలో నీటిమట్టాలు గణనీయంగా తగ్గిపోయాయి. దాంతో బెంగళూరు సహా చుట్టుపక్కల పట్టణాల్లో త్వరలోనే నీళ్లకు రేషన్ విధానాన్ని అమలుచేసే అవకాశం కనిపిస్తోంది. ఎట్టి పరిస్థితుల్లోనూ నగరానికి నిరంతరాయంగా నీటి సరఫరా చేస్తామని ప్రభుత్వం ప్రకటించిన 15 రోజులకే ఈ పరిస్థితి ఏర్పడటం గమనార్హం. బెంగళూరు నగరంతో పాటు ఇతర పట్టణాలు కూడా కావేరీ జలాల మీదే ఆధారపడుతున్నాయి. ఇప్పటికే ఆ నదిలో నీటిమట్టం తగ్గిపోవడంతో నీటి ప్రెషర్ తగ్గిపోతోందని, కాలుష్యం కూడా పెరుగుతోందని అంటున్నారు. మామూలు రోజుల్లో అయితే తెల్లవారుజామున 5.30 నుంచి మూడు గంటల పాటు నీళ్లు సరఫరా చేస్తారు. కానీ ఇప్పుడు ప్రెషర్ తక్కువ ఉండటంతో రెండు గంటలే ఇస్తున్నారు. దాంతో డిస్ట్రిబ్యూషన్ లైన్లకు చివర్లో ఉన్న వినియోగదారులకు తగినంతగా నీళ్లు అందడం లేదు. సరఫరా చేస్తున్న నీళ్లు కూడా చాలా మురిగ్గా ఉంటున్నాయని హెబ్బల్ రెసిడెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు కేవీ జగదీష్ అన్నారు. బెంగళూరు వాటర్ బోర్డు అనధికారికంగా నీళ్ల రేషనింగ్ మొదలుపెట్టిందని అంటున్నారు. నగరంలో ఉష్ణోగ్రతలు పెరగడంతో నీళ్లకు డిమాండ్ పెరిగిందని, దానికితోడు బోర్‌వెల్స్ కూడా ఫెయిల్ కావడంతో కావేరీ జలాల మీదే ఎక్కువగా ఆధారపడుతున్నారని.. కానీ ఆ నదిలో నీళ్లు తగ్గడంతో ప్రెషర్ కూడా తక్కువైందని వాటర్ బోర్డు చైర్మన్ తుషార్ గిరినాథ్ చెప్పారు. ఫిబ్రవరి, మార్చి నెలల్లో తాము రోజుకు 1300, 1350 మిలియన్ లీటర్ల నీటిని సరఫరా చేస్తున్నామని, ప్రస్తుతానికి నగర అవసరాలకు తగినంతగా నీళ్లున్నాయని ఆయన అన్నారు. ఎక్కువగా బోర్ వెల్స్ మీద ఆధారపడిన ప్రాంతాలకు తాము నీళ్లు ఎక్కువ పంపుతున్నామని, అవసరమైన దాని కంటే ఎక్కువ నీళ్లు వెళ్తున్న ప్రాంతాలకు తగ్గించామని వివరించారు. అయితే.. రాబోయే రోజుల్లో మాత్రం నీటి సరఫరా బాగా తగ్గుతుందని వాటర్ బోర్డు సీనియర్ అధికారి ఒకరు చెప్పారు. -
బెంగళూరు డెడ్ సిటీ!
♦ ఐదేళ్లలో కాంక్రీటు అరణ్యంగా మారనున్న ఉద్యాన నగరి ♦ పెరుగుతున్న భవనాలు, తరుగుతున్న నీటివనరులు బెంగళూరు: పచ్చని చెట్లు, కనువిందైన పార్కులు, చెరువులతో కళకళలాడే ఉద్యాననగరి, సిలికాన్ సిటీ బెంగళూరు వచ్చే ఐదేళ్లలో మొత్తం కాంక్రీటు కీకారణ్యంగా మారి, మృతనగరమైపోనుందా? నగరంలోని చెట్టూచేమా, ప్రాణాధారమైన నీటివనరులు మాయమైపోయి నివాసానికి ఏమాత్రం పనికిరాకుండా పోనుందా? ఈ ప్రశ్నలకు శాస్త్రవేత్తలు, పర్యావరణవేత్తలు అవుననే అంటున్నారు! ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సెన్సైస్(ఐఐఎస్సీ) అధ్యయంలో ఇలాంటి మరెన్నో చేదు నిజాలు వెలుగు చూశాయి. మతిలేని అభివృద్ధి..: ఐఐఎస్సీ అధ్యయనం ప్రకారం.. నగరంలో భవనాలతో కూడిన ప్రాంతం గత 40 ఏళ్లలో 525 శాతం పెరిగింది. చెట్టుచేమల ప్రాంతం 78 శాతం తగ్గిపోయింది. జలవనరులు 79 శాతం తగ్గాయి. ‘ఇదంతా మతిలేని, ముందుచూపులేని అభివృద్ధి. ప్రణాళికలేని పట్టణీకరణ వల్ల బెంగళూరు వచ్చే ఐదేళ్లలో నివాసయోగ్యం కాకపోవడంతోపాటు మృతనగరం(డెడ్ సిటీ)గా మారనుంది. ప్రైవేటు డెవలపర్లు ప్రభుత్వ నిర్ణయాలను ప్రభావితం చేస్తున్నారు. నగరంలో 15 నుంచి 20 శాతం ఖాళీస్థలం ఉండాలన్న నిబంధనను ఉల్లంఘిస్తున్నారు’ అని ఐఐఎస్సీలోని సెంటర్ ఫర్ ఎకలాజికల్ సెన్సైస్‌కు చెందిన ప్రొఫెసర్ రామచంద్ర తెలిపారు. ప్రభుత్వం ఇప్పుడైనా మేల్కోవాలని, భవన నిర్మాణాలను తగ్గించేందుకు.. కొత్త పరిశ్రమలకు అనుమతి ఇవ్వకూడదని సూచించారు. రాజకీయ నాయకులకు బీడీఏ వత్తాసు బెంగళూరు అభివృద్ధి సంస్థ(బీడీఏ) రాజకీయ నాయకుల ప్రయోజనాల కోసం భూములను పందేరం చేస్తోందని, దీంతో భవన నిర్మాణాలు విపరీతంగా పెరిగి, పర్యావరణానికి ముప్పు తెస్తున్నాయని పర్యావరణవేత్తలు ఆరోపిస్తున్నారు. ‘ప్రస్తుత అభివృద్ధి పర్యవసానాలు ఎలా ఉంటాయో ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. భూమి, నీటిపై సరైన విధానం లేదు. భూమిని రాజకీయనేతలు వాళ్ల ఇష్టానుసారం వాడుకుంటున్నారు’ అని పర్యావరణవేత్త ఎల్లప్పరెడ్డి చెప్పారు. 40 వేల ఎకరాల ఖాళీ స్థలంలో పార్కులు,నీటి వనరులను ఏర్పాటు చేయాలన్నారు. -
బెంగళూరులో బతకడం ఇక కష్టమే!
భారతీయ సిలికాన్ వ్యాలీగా పేరు పొందిన బెంగళూరు నగరంలో ఐదేళ్ల తర్వాత బతకడం ఇక కష్టమేనని చెబుతున్నారు. అలా చెప్పింది కూడా ఏదో ఆషామాషీ సంస్థ కాదు.. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ (ఐఐఎస్సీ). గడిచిన 40 ఏళ్లలో బెంగళూరులో భవన నిర్మాణాలు అత్యంత ప్రమాదకర స్థాయిలో పెరిగిపోయాయని ఐఐఎస్సీ తేల్చిచెప్పింది. ఇది ఏకంగా 525 శాతం ఉందట. ఒకప్పుడు హరిత నగరంగా, ఉద్యాన నగరిగా పేరొందిన బెంగళూరులో పచ్చదనం 78 శాతం పడిపోయిందట. అలాగే మొన్నటివరకు 'లేక్ సిటీ' అని కూడా పేరున్న బెంగళూరులో జలవనరులు 79% కరిగిపోయి, వాటి స్థానంలో భవనాలు వెలిశాయి. మన చుట్టూ ఉండే మొక్కలు, నీళ్ల వల్లే మన జీవన నాణ్యత మెరుగుపడుతుందని, అవన్నీ క్రమంగా మాయం అవుతున్నాయంటే జీవనం దుర్భరం అవుతుందని ఐఐఎస్సీ పరిశీలనలో చెప్పారు. నగరంలో ఏమాత్రం అవగాహన లేకుండా విచ్చలవిడి అభివృద్ధి సాగుతోందని, ఇది సమీప భవిష్యత్తులోనే అత్యంత విధ్వంసకరంగా తయారవుతుందని ఐఐఎస్సీలోని సెంటర్ ఫర్ ఇకొలాజికల్ సైన్సెస్‌కు చెందిన ప్రొఫెసర్ టి.వి. రామచంద్ర హెచ్చరించారు. కొన్నేళ్ల క్రితం వరకు ఉంటే బెంగళూరులోనే ఉండాలని అంతా అనేవారని, కానీ ఇప్పుడు రాబోయే ఐదేళ్లలో అది ఏమాత్రం బతకలేని, మృతనగరంగా మారుతుందని హెచ్చరించారు. సముద్రమట్టానికి 3వేల అడుగుల ఎత్తులో ఉండే బెంగళూరులో అసలు నదులు లేవు. అయితే చిన్నా పెద్దా కలిపి 600 వరకు చెరువులు ఉండటంతో నగరం చల్లగా, పచ్చగా ఉండేది. కానీ గత రెండు దశాబ్దాలుగా వచ్చిన ఆర్థికాభివృద్ధి ఈ వనరులను ధ్వంసం చేసింది. నగరానికి కావల్సిన నీళ్లన్నీ 100 కిలోమీటర్ల దూరంలో, వెయ్యి అడుగుల ఎత్తున ఉన్న కావేరీ నది నుంచి వస్తాయి. ఆ నది ఎండిపోతే.. బెంగళూరు ఎడారిగా మారుతుంది. 1990లలో మొదలైన ఆర్థిక సంస్కరణలు నగరాన్ని పూర్తిగా మార్చేశాయి. గత పాతికేళ్లలో నగర జనాభా కూడా 150 శాతం వరకు పెరిగింది. ఒకప్పుడు 40 లక్షలు మాత్రమే ఉండే జనాభా 2016లో కోటి దాటింది. ఇక్కడ భూమి దొరకడం గగనంగా మారిందని, చక్కగా ఉండే ఆర్థికవ్యవస్థ పాడైపోయి, రాజకీయాలు కుళ్లిపోయాయని ఎప్పటి నుంచో బెంగళూరులో ఉంటున్నవాళ్లు వ్యాఖ్యానిస్తున్నారు. -
'డ్రాప్' అంటూనే దోచేస్తున్నారు
బెంగళూరు : ఉద్యాన నగరి నేర నగరికి మారిపోయింది. దారి దోపిడీలు, చైన్ స్నాచింగ్‌లు, బెదిరింపులు తదితర కేసులు అధికంగా నమోదవుతున్నాయి. మరీ రాత్రి వేళల్లో ప్రయాణం ప్రాణాంతకంగా మారుతోంది. దుర్మార్గులు ఏకంగా దోచుకోవడంతోపాటు హత్యలకు కూడా తెగబడుతున్నారు. హైదరాబాద్‌కు చెందిన ధృవ్ బెంగళూరులోని ఓ ఐటీ సంస్థలో సాఫ్ట్వేర్ ఇంజనీర్. అయితే ఈనెల 17న కాడుబేసినహళ్లిలో ఉన్న ఇంటికి బయల్దేరాడు. బస్సులు లేకపోవడంతో వేచి ఉన్న అతన్ని ఆటో డ్రైవర్ ఆరా తీశాడు. రాత్రి 12.00 గంటల సమయంలో ఆటో ఎక్కించుకున్నాడు. అప్పటికే అందులో మరో వ్యక్తి ఉన్నాడు. ఆటో బయల్దేరిన కొద్దిసేపటికి డ్రైవర్ దారి మళ్లించాడు. ఇదేంటని అడిగితే 'షార్ట్‌కట్ సార్ అందుకనే' అనే సమాధానం ఇచ్చాడు. ఆటో నిర్మానుష్య ప్రాంతానికి వెళుతోందన్న విషయాన్ని గమనించి ఆటోను ఆపమని కోరినా డ్రైవర్ వినిపించుకోలేదు. ఉన్నఫళంగా సీట్లో ఉన్న మరో వ్యక్తి వెనకసీట్లోకి వచ్చి... ధృవ్‌ను కత్తితో బెదిరించాడు. ఫోన్‌తోపాటు విలువైన వస్తువులు, నగదు లాక్కున్నారు. అప్పటికీ ఆటో ఆపకపోవడంతో ధృవ్ కిందకు దూకేశాడు. ఇదే తరహాలో మరో టెక్కీ వరుణ్ని అడ్డగించిన కొంతమంది దుండగులు తాము పోలీసులమని చెప్పి అతని వద్ద నుంచి బలవంతంగా రూ. 60 వేలను దోచుకున్నారు. ఇలాంటి ఘటనలు నగరంలో ఇటీవల పెరిగిపోతున్నాయి. వారాంతాల్లోనే అధికం.... ఈ తరహా దారి దోపిడీలు ఎక్కువగా వారాంతాల్లోనే నమోదవుతున్నాయి. వారాంతాల్లో పార్టీలకు హాజరై ఆలస్యంగా ఇంటికి చేరుకునే యువతను టార్గెట్ చేసుకొని ఈ ముఠాలు దారిదోపిడీలకు పాల్పడుతున్నాయి. పోలీసులమని చెప్పి బెదిరించి నగదు లాక్కోవడం, లిఫ్ట్ ఇస్తామంటూ బైక్‌లోనో, ట్యాక్సీలోనో తీసుకెళ్లి దోపిడీకి పాల్పడడంతో పాటు అర్థరాత్రి దాటాక ఆటో ఎక్కే ప్రయాణికులను సైతం కొంత మంది డ్రైవర్లు టార్గెట్‌గా చేసుకుంటున్నారు. ఇక ఈ విషయంపై సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్‌లోని ఓ ఉన్నత స్థాయి అధికారి మాట్లాడుతూ... ఇటీవల నగరంలో ఇలాంటి ఘటనలు అధికమవుతున్నాయని చెప్పారు. ఇలాంటి దోపిడీలకు పాల్పడే ముఠాలను అరెస్ట్ చేస్తున్నప్పటికీ వారు ఒకటి లేదా రెండు నెలల్లోనే బెయిల్‌పై బయటకు వచ్చేస్తున్నారు. మళ్లీ ఇదే రకమైన నేరాలకు పాల్పడుతున్నారు. ముఖ్యంగా వారాంతాల్లో ఇలాంటి ఘటనలు ఎక్కువగా చోటు చేసుకుంటున్నాయి అని చెప్పారు. -
ఎర్రచందనం స్మగ్లర్ అరెస్ట్
బెంగుళూరు : నగరంలోని ఎర్రచందనం స్మగ్లర్ అల్తాఫ్ ఫాంహౌస్‌పై సోమవారం టాస్క్‌ఫోర్స్ పోలీసులు దాడి చేశారు. అల్తాఫ్‌ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం అతడి నివాసంలో పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా అతడి నివాసంలో రూ. 2 కోట్ల విలువైన ఎర్రచందనం దుంగలను టాస్క్‌ఫోర్స్ పోలీసులు స్వాధీనం చేసుకుని... సీజ్ చేశారు. ఆ తర్వాత అల్తాఫ్‌ను పోలీస్ స్టేషన్‌కి తరలించారు. ఏడాదిగా అల్తాఫ్ పోలీసుల కళ్లుగప్పి తప్పించుకుని తిరుగుతున్నారు. ఈ నేపథ్యంలో అతడిని పట్టుకునేందుకు టాస్క్‌ఫోర్స్ పోలీసులు వేట ప్రారంభించారు. ఆ క్రమంలో సోమవారం అల్తాఫ్ పోలీసులకు చిక్కాడు. చిత్తూరు టాస్క్‌ఫోర్స్ సీఐ నేతృత్వంలో ఈ దాడులు జరిగాయి. -
నిఘా పెంచండి
నగరంలో సీసీ కెమెరాలు మరిన్ని ఏర్పాటు చేయూలి కేంద్ర మంత్రి అనంతకుమార్ ఆదేశం బెంగళూరు : బెంగళూరు నగరంలో ఉగ్రవాదులపై నిఘా పెట్టేందుకు, జనసంచారం అధికంగా ఉండే ప్రాంతాల్లో ప్రజా రక్షణకు సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని కేంద్ర ఎరువులు, రసాయనాల శాఖ మంత్రి అనంతకుమార్ తెలిపారు. బొమ్మనహళ్లి పరిధిలోని హెచ్ఎస్ఆర్ లేఔట్ వార్డులో స్వచ్ఛభారత్, బీజేపీ సభ్యత్వం నమోదు కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. అనంతరం స్థానిక ఎమ్మెల్యే సతీష్‌రెడ్డితో కలిసి విలేకరులతో మాట్లాడారు. సీసీ కెమెరాల ఏర్పాటుపై కేంద్ర హోం మంత్రితో చర్చించామన్నారు. ఇందులో భాగంగా తన శాఖ నిధుల నుంచి రూ.25 లక్షలు కేటాయించనున్నట్లు ఆయన తెలిపారు. ప్రభుత్వ కార్యాలయాలు, ఆస్పత్రులు, బస్టాండులు, రైల్వే స్టేషన్లు, తదితర ప్రాంతాల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి సూచించారు. ప్రతిఒక్కరూ స్వచ్ఛభారత్‌లో పాల్గొని పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు. బొమ్మనహళ్లి బీజేపీ అధ్యక్షుడు మాలా శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన బీజేపీ స్వభ్యత్వం నమోదు కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. స్థానికులతో సభ్యత్వం నమోదు చేయించారు. అనంతరం స్థానిక ఎమ్మెల్యే, బీజేపీ బొమ్మనహళ్ళి అధ్యక్షుడు శ్రీనివాస్ రెడ్డి బొమ్మనహళ్ళి నియోజకవర్గం పరిధిలోని వివిధ వార్డుల్లో బీజేపీ సభ్యత్వం నమోదు కార్యక్రమాన్ని పరిశీలించారు. కార్యక్రమంలో నగరసభ మాజీ సభ్యుడు సయ్యద్ అన్వర్, బీజేపీ నాయకుడు సయ్యద్ సలాం, బీజేపీ యువమొర్చా అధ్యక్షుడు రమేష్, కార్మిక విభాగం అధ్యక్షుడు నాగేంద్ర, కార్యకర్తలు హాజరయ్యారు. అనంతకుముందు స్థానికులు చేపట్టిన స్వచ్చభారత్ కాార్యక్రమంలో అనంతకుమార్ పాల్గొని వీధుల్లో గోడలకు రంగులు వేశారు. -
ఉద్యాననగరి...ఉగ్రవాదులకు నెలవు
అనుమానిత ఉగ్రవాదుల అరెస్ట్‌తో ఉలిక్కిపడ్డ కర్ణాటక బెంగళూరు: ఐటీ, బీటీ సిటీ, ఉద్యాననగరిగా పిలవబడే బెంగళూరు నగరం ప్రస్తుతం ఉగ్రవాదులకు నెలవుగా మారుతోందా అంటే అవున నే సమాధానమే వినిపిస్తోంది. గత ఏడాది డిసెంబర్ 28న జరిగిన బాంబు పేలుడు ప్రజల మనసుల్లో నుంచి తొలగిపోక ముందే భారీ ఎత్తున పేలుడు పదార్థాలతో ముగ్గురు అనుమానిత ఉగ్రవాదులను పోలీసులు అరెస్టు చేయడం చూస్తే ఇదే విషయం అర్థమవుతుంది. గత కొంతకాలంగా కర్ణాటకతో పాటు బెంగళూరులో సైతం ఉగ్ర కదలికలు కనిపిస్తూనే ఉన్నాయి. గత ఏడాది నవ ంబర్‌లో నిషేధిత ఉగ్రవాద సంస్థ ‘సిమి’తో సంబంధాలున్నట్లుగా భావిస్తున్న ముగ్గురు అనుమానిత ఉగ్రవాదులను గుల్బర్గాలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం ఐఎస్ఐఎస్ ఉగ్రవాద సంస్థకు తన ట్వీట్ల ద్వారా మద్దతిస్తున్న ఆరోపణలపై ‘మెహ్దీ’ అనే వ్యక్తిని సైతం బెంగళూరు పోలీసులు అరెస్టు చేశారు. ఆ తర్వాత గత ఏడాది డిసెంబర్ 28న నగరంలోని చర్చ్‌స్ట్రీట్‌లో బాంబు పేలుడు ఘటన చోటుచేసుకుంది. ఇప్పుడు తాజాగా బెంగళూరులోని పులకేశినగర్తో పాటు భట్కళ్ ప్రాంతంలో సోదాలు జరిపిన పోలీసులు, ఇంటెలిజెన్స్ అధికారులు గురువారం సాయంత్రం ముగ్గురు అనుమానిత ఉగ్రవాదులను అరెస్టు చేయడంతో పాటు వారి నుంచి భారీ ప్రమాణంలో పేలుడు పదార్థాలను, బాంబులు తయారు చేయడానికి వినియోగించే సర్క్యూట్లను కూడా స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనతో కర్ణాటకతో పాటు బెంగళూరు నగరం ఉగ్రవాదులకు అనువైన ప్రాంతంగా మారుతోందా అన్న అనుమానాలు అందరిలోనూ తలెత్తుతున్నాయి. కర్ణాటకలోని ఇతర ప్రాంతాల్లో సైతం కదలికలు.... హుబ్లీ-ధార్వాడ, గుల్బర్గా, ఉత్తర కన్నడ, దక్షిణ కన్నడ తదితర ప్రాంతాల్లో ఉగ్రవాదుల కదలికలు ఉన్నట్లు ఇంటలిజెన్స్ వర్గాలు హెచ్చరిస్తూనే ఉన్నాయి. ఇండియన్ ముజాహిద్దీన్, లష్కర్-ఇ-తొయ్బా, సిమి, అల్-ఉమా తదితర ఉగ్రవా ద సంస్థలు తమ జాడలను రాష్ట్రంలో విస్తరింపజేస్తున్నాయనేది ఇంటెలిజెన్స్ వర్గాల సమాచారం. ఈ సమాచారంతో ముగ్గురు అనుమానిత ఉగ్రవాదులను పోలీసులు అరెస్టు చేశారు. దేశంలోని అనేక ప్రాంతాల్లో ఉగ్ర జాడలు.... ఇక గురువారం సాయంత్రం రాష్ట్ర పోలీసులు ముగ్గురు అనుమానిత ఉగ్రవాదులను అరెస్టు చేయడంపై ముఖ్యమంత్రి సిద్ధరామయ్య స్పందించారు. శుక్రవారమిక్కడి విధానసౌధ ప్రాంగణంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ఉగ్రవాదుల కార్యకలాపాలు కేవలం బెంగళూరు, భట్కళ్ ప్రాంతాలకు మాత్రమే పరిమితం కాలేదన్నారు. దేశంలోని అనేక ప్రాంతాల్లో ఉగ్రవాదుల కదలికలు కనిపిస్తున్నాయని చెప్పారు. రాష్ట్ర పోలీసులు దాడులు జరిపి ముగ్గురు అనుమానిత ఉగ్రవాదులను అరెస్టు చేయడం అభినందనీయమని పేర్కొన్నారు. -
బెంగళూరులో చెలరేగుతున్న చైన్‌స్నాచర్లు
మళ్లీ ఏడు ప్రాంతాలలో బంగారు గొలుసులు చోరీ ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసిన పోలీసు అధికారులు బెంగళూరు : బెంగళూరు నగరంలో మళ్లీ ఏడుగురి మహిళలలో మెడలో బంగారు గొలుసులను దుండగులు లాక్కొని పరారైనారు. బుధవారం రాత్రి ఏడు గంటల నుంచి గురువారం ఉదయం వరకు ఏడు గంటల లోపు ఈ చైన్‌స్నాచింగ్‌లు జరిగాయి. ఒక్క జ్ఞానభారతీ పోలీస్ స్టేషన్లోనే నాలుగు కేసులు నమోదు అయ్యాయి. వివరాలు.. నాగరబావిలో నివాసముంటున్న విద్యా నవరత్న అనే మహిళ బుధవారం రాత్రి ఒంటరిగా నడిచి వెలుతున్న సమయంలో వెనుక నుండి బైక్‌లో వెళ్లిన ఇద్దరు నిందితులు ఆమె మెడలో ఉన్న 35 గ్రాముల మంగళసూత్రం లాక్కొని పరారైనారు. 15 నిమిషాల తరువాత నాగరబావి 12వ బ్లాక్‌లోని నమ్మూరు అంగడి సమీపంలో నడిచి వెలుతున్న మంజుల అనే మహిళ మెడలో 30 గ్రాముల బంగారు గొలుసు లాక్కొని పారిపోయారు. మరో 20 నిమిషాల వ్యవధిలో నాగరబావి సమీపంలోని కోకోనెట్ గార్డెన్ 12వ క్రాస్‌లో నడిచి వెలుతున్న స్వర్ణలత అనే మహిళ మెడలో ఉన్న 50 గ్రాముల బంగారు గొలుసు లాక్కొని పరారైనారు. తరువాత రావృకష్ణ లేఔట్లో నడిచి వెలుతున్న సునంద అనే మహిళ మెడలో ఉన్న 40 గ్రాముల బంగారు గొలుసు లాక్కొని పరారైనారు. ఈ నలుగురు మహిళలు జ్ఞానభారతీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేవలం ఒక గంట వ్యవధిలో ఒకే పోలీస్ స్టేషన్ పరిధిలో బైక్‌లో వెళ్లిన నిందితులు చైన్‌స్నాచింగ్‌లు చేసి పరారైనారు. బుధవారం రాత్రి చంద్రాలేఔట్‌లోని పీఇఎస్ కాలేజ్ సమీపంలో నడిచి వెలుతున్న లలితాబాయి అనే మహిళ మెడలో ఉన్న 35 గ్రాముల బంగారు గొలుసు లాక్కొని పరారైనారు. గురువారం ఉదయం చెన్నమ్మనే అచ్చుకట్ట పోలీస్ స్టేషన్ పరిధిలోని పీఇఎస్ కాలేజ్ స్టూడెంట్స్ హాస్టల్ సమీపంలో నడిచి వెలుతున్న యశోధమ్మ అనే మహిళ మెడలో ఉన్న 30 గ్రాముల బంగారు గొలుసు లాక్కొని పరారైనారు. ఇది జరిగిన 20 నిమిషాల తరువాత గిరినగర పోలీస్ స్టేషన్ పరిధిలోని పీఇఎస్ కాలేజ్ సమీపంలో నడిచి వెలుతున్న గాయిత్రి అనే మహిళ మెడలో ఉన్న 80 గ్రాముల బంగారు గొలుసు లాక్కొని పరారైనారు. బాధితుల ఫిర్యాదు మేరకు 20 నుంచి 25 సంవత్సరాల వయస్సు ఉన్న యువకులు బంగారు గొలుసులు లాక్కొని పారిపోయారని పోలీసులు అంటున్నారు. గతంలో ఇదే విధంగా చైన్‌స్నాచింగ్‌లు చేసి మహారాష్ట్ర పారిపోయి చివరికి బెంగళూరు పోలీసులకు పట్టుబడిన ఇరాని గ్యాంగ్ (చైన్‌స్నాచర్స్) ఫొటోలను బాధితులకు చూపించి వివరాలు సేకరిస్తున్నామని పోలీసులు తెలిపారు. చైన్‌స్నాచింగ్‌లు చేస్తున్న వారిని పట్టుకొవడానికి బెంగళూరు పోలీసు అధికారులు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి గాలిస్తున్నారు. -
పేరు మార్చుకున్న ఉద్యాననగరి
సాక్షి, బెంగళూరు: దాదాపు ఎనిమిదేళ్ల తర్వాత ఉద్యాననగరి ‘బ్యాంగళూరు’ నుంచి అధికారికంగా ‘బెంగళూరు’గా పేరు మార్చుకుంది. చాలా కాలంగా నగరాన్ని బెంగళూరుగానే పిలుస్తున్నప్పటికీ అధికారికంగా మాత్రం ‘బ్యాంగళూరు’గానే పరిగణించబడుతూ వచ్చింది. ఈ నేపథ్యంలో బెంగళూరుతో పాటు రాష్ట్రంలోని మరో 11నగరాల పేర్లలో మార్పులకు ఇటీవలే కేంద్రం ఆమోద ముద్ర వేయడంతో శనివారం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా కొత్త ఉచ్ఛారణలతో కొత్తపేర్లను అధికారికంగా ప్రకటిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది. అయితే ఈ పేరు మార్పు కొన్ని సంస్థలు, వ్యవస్థలకు మాత్రమే పరిమితం కానుందనేది విభిన్న రంగాల్లోని నిపుణుల వాదన. మరి పేరు మార్చుకోనున్న సంస్థలేవి, పేరు మార్చుకోలేని సంస్థలేవి, ఇందుకు గల కారణాలు పరిశీలిస్తే.... పేరు మార్చుకోనున్న సంస్థలివే.... బెంగళూరు సిటీ, కంటోన్మెంట్ రైల్వే స్టేషన్లలో ఇప్పటికే పేర్ల మార్పు పూర్తైది. బ్యాంగళూరు మెట్రోపాలిటన్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ (బీఎంటీసీ), బ్యాంగళూరు మెట్రో రైల్ కార్పొరేషన్ లిమిటెడ్(బీఎంఆర్సీఎల్)లు తమ పేర్లను ‘బెంగళూరు’గా మార్చుకోనున్నాయి. ఈ విషయంపై బీఎంఆర్సీఎల్ అధికారులు స్పందిస్తూ....‘మా సంస్థకు సంబంధించిన అన్ని కార్యకలాపాలు ఇక నుంచి ‘బెంగళూరు మెట్రో రైల్ కార్పొరేషన్ లిమిటెడ్’ పేరిట జరగనున్నాయి. సంస్థకు సంబంధించిన అన్ని పత్రాలు, అధికారిక వెబ్సైట్, టెండర్లు సైతం ఇదే పేరుతో దాఖలు కానున్నాయి. అయితే ఈ పూర్తి కార్యక్రమాన్ని విడతల వారీగా పూర్తి చేయనున్నాం’ అని పేర్కొన్నాయి. ఇక బీఎంటీసీ కూడా పేరు మార్పులో ఇదే విధానాన్ని అనుసరించనుంది. ఇక బ్యాంగళూరు మెడికల్ కా లేజ్ అండ్ రీసర్చ్ ఇన్స్టిట్యూట్ (బీఎంసీఆర్‌ఐ) పేరు ఇ ప్పటికే ‘బ్యాంగళూరు’గా అనేక అంతర్జాతీయ, జాతీయ విశ్వవిద్యాలయాల్లో నమోదైన కారణంగా ఈ అంశాన్ని భారతీయ వైద్య విద్యాశాఖ దృష్టికి తీసుకెళ్లి అనంతరం పేరు మార్పుపై తుది నిర్ణయాన్ని తీసుకోనుంది. పేరు మారదు.... ఇక పేరును మార్చబోని సంస్థల్లో బ్యాంగళూరు విశ్వవిద్యాలయం, బ్యాంగళూరు హాస్పిటల్, బ్యాంగళూరు లిటిల్ థియేటర్లున్నాయి. పేరు మార్పుపై బ్యాంగళూరు విశ్వవిద్యాలయం వైస్ ఛాన్స్లర్ తిమ్మేగౌడ స్పందిస్తూ...‘యూనివర్సిటీ పేరు యధాతథంగా కొనసాగనుంది. మద్రాస్, కలకత్తా, బాంబేల పేర్లు మారిన సందర్భంలో సైతం అక్కడి విశ్వవిద్యాలయాల పేర్లను మార్చలేదు’ అని చెప్పారు. ఇక బ్యాంగళూరు హాస్పిటల్‌ను కంపెనీస్ యాక్ట్ ప్రకారం రిజిస్టర్ చేసినందువల్ల ఆ సంస్థ పేరును కూడా మార్చేందుకు అవకాశం లేదని సంస్థ ప్రతినిధులు పేర్కొంటున్నారు. ఏయే నగరాలు, ఎప్పుడెప్పుడు..... బెంగళూరుతో పాటు దేశవ్యాప్తంగా ఉన్న అనేక ప్రముఖ నగరాలు తమ పేర్లను మార్చుకున్నాయి. వాటిలో 1991లో త్రివేండ్రం, తిరువనంతపురంగా, 1995లో బాంబే, ముంబైగా, 1996లో మద్రాస్, చెన్నైగా, 2001లో కలకత్తా, కోల్కటాగా, 2006లో పాండిచ్చేరి, పుదుచ్చేరిగా, 2008లో పూణా, పుణెగా, 2011లో ఒరిస్సా, ఒడిషాగా పేర్లు మార్చుకున్నాయి. -
సాఫ్ట్వేర్ ఇంజినీర్ ఆత్మహత్య
బెంగళూరు : జీవితంపై విరక్తి చెందిన సాఫ్ట్వేర్ ఇంజినీరు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్న సంఘటన ఇక్కడి విజయనగర పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. ఆలస్యంగా వెలుగు చూసిన ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. తమిళనాడుకు చెందిన సాఫ్ట్వేర్ సురేష్‌బాబు (29)కు ఆరు నెలల క్రితమే వివాహమైంది. అతని భార్య కూడా సాఫ్ట్వేర్ ఇంజినీరే. దంపతులు ఇద్దరు బెంగళూరు విజయనగర్‌లోని మూడపాళ్యలో నివాసముంటున్నారు. ఇద్దరు బెంగళూరులోనే వేరువేరు కంపెనీల్లో పని చేస్తున్నారు. గురువారం రాత్రి సురేష్ బాబు ఇంటిలో ఉరి వేసుకున్నాడు. భార్య అతన్ని వెంటనే ఆస్పత్రికి తరలించింది. చికిత్స విఫలమై అతను మరణించాడు. వేధింపుల వల్లే సురేష్‌బాబు ఆత్మహత్య చేసుకున్నాడని మృతుడి కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే కార్యాలయంలో వేధింపులా.. ఇంటిలో వేధింపులా అని పోలీసులు ఆరా తీస్తున్నారు. కేసు దర్యాప్తులో ఉందని విజయనగర పోలీసులు తెలిపారు. -
మద్యం మత్తులో ఏఎస్ఐ హల్ చల్
మద్యం మత్తులో బాధ్యత మరచి అతిగా ప్రవర్తించిన ఓ ఏఎస్ఐకి స్థానికులు దేహశుద్ధి చేసిన సంఘటన ఇక్కడి మల్లేశ్వరం పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. వివరాలు... చామరాజపేట ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లో ఈశ్వరప్ప ఏఎస్ఐ. ఆదివారం రాత్రి 8.30 గంటల సమయంలో తన బైక్ తీసుకుని బయలుదేరాడు. మల్లేశ్వరం దారిలో కాంతిలాల్ జైన్ అనే వ్యక్తి వెళ్తున్న కారును వెనుక నుంచి ఢీకొట్టాడు. అంతటితో ఆగకుండా ఎడమవైపు ఉన్న కారు అద్దాన్ని పగలగొట్టి కారులో ఉన్న కాంతిలాల్న బయటకు లాగి దాడి చేశాడు. స్థానికులు అక్కడికి చేరుకుని అడ్డుకున్నారు. దీంతో ఈశ్వరప్ప ఊగిపోయాడు. తననే అడ్డుకుంటారా అంటూ స్థానికులపై విరుచుకుపడ్డాడు. దీంతో స్థానికులు ఈశ్వరప్పను పట్టుకుని చితకబాదారు. సమాచారం అందుకున్న మల్లేశ్వరం పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని చావుదెబ్బలు తిన్న ఏఎస్ఐని కేసీ జనరల్ ఆస్పత్రికి తరలించారు. బాధితుడు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. ఈ విషయం తెలుసుకున్న బెంగళూరు నగర పశ్చిమ విభాగం (ట్రాఫిక్) డీసీపీ గిరీష్ ఈశ్వరప్పను సస్పెండ్ చేస్తూ ఆదేశాలు జారీ చేశారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
జాలీ రైడ్‌కని పిలుచుకు వెళ్లి ...
పీయూసీ విద్యార్థినిపై ఇద్దరు సామూహిక అత్యాచారం చేసిన సంఘటన బెంగళూరులో వెలుగుచూసింది. బ్యాటరాయణపుర పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. నగరంలో ప్రముఖ ప్రైవేటు కాలే జీలో పీయూసీ చదువుతున్న ఓ యువతికి (18) అభిషేక్ అనే వ్యక్తి 10 నెలల క్రితం ఫేస్బుక్ ద్వారా పరిచయమయ్యాడు. రెండుసార్లు వ్యక్తిగతంగా కూడా కలుసుకున్నారు. ఆదివారం సాయంత్రం జాలీ రైడ్ పేరుతో అభిషేక్, అతని స్నేహితుడు రాజు బలవంతంగా ఆ యువతిని కారులో తీసుకెళ్లారు. నగర శివార్లలోని తలఘట్టపుర సమీపంలోని నిర్జన ప్రదేశంలోకి తీసుకెళ్లి వారిద్దరూ అత్యాచారం చేశారు. విషయం బయటకు చెబితే చంపేస్తామని బెదిరించి.. బ్యాటరాయణపుర సమీపంలోని నిర్జన ప్రదేశంలో సోమవారం ఉదయం ఆ యువతిని వదలిపెట్టి పరారయ్యారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న బ్యాటరాయణపుర పోలీసులు నిందితుల కోసం గాలిస్తున్నారు. -
సాఫ్ట్వేర్ ఇంజనీర్‌పై అత్యాచార యత్నం
జార్ఖండ్‌కు చెందిన యువతిపై దుండగులు అత్యాచారానికి యత్నించిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఎలక్ట్రానిక్‌సిటీ పోలీసుల కథనం మేరకు..దొడ్డతోగూరులో పీజీ సెంటర్ నిర్వహిస్తున్నారు. జార్ఖండ్‌కు చెందిన యువతి (25) ఈ హాస్టల్లో ఉంటూ నగరంలోని ప్రైవేటుసాఫ్ట్వేర్ కంపెనీలో ఇంజనీరుగా ఉద్యోగం చేస్తోంది. శుక్రవారం రోజు దుండగులు హాస్టల్లో చోరీచేసేందుకు వెళ్లగా గదిలో ఒంటరిగా ఉన్న ఆ యువతిపై అత్యాచారానికి యత్నించి గాయపరిచారు. హాస్టల్ నిర్వాహకులు గుర్తించి బాధితురాలిని సెయింట్ జాన్స్ ఆసుపత్రికి తరలించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దర్యాప్తు చేపట్టిన పోలీసులు పలువురిని అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారని తెలిసింది. -
సాంకేతికం: బెంగళూరా? సింగపూరా?
మన తెలుగువారు ప్రపంచంలోని దాదాపు అన్ని దేశాలకు ఉద్యోగ, ఉపాధి అవకాశాల రీత్యా వెళ్లి వస్తున్నా... అన్నిట్లోకీ సింగపూరే ప్రత్యేకమైనదనే భావన అందరిలోనూ కనిపిస్తుంది. చిన్నదేశమైనా, స్వతంత్రంగా ఎదిగి వెలుగుతున్న దేశమది. అందులోనూ ఆ దేశ రాజధాని సింగపూర్ సిటీ మరీను. అటువంటి సిటీని ఎన్నో విషయాల్లో మన దేశంలోని బెంగళూరు సిటీ దాటేసింది! ప్రపంచాన్ని ఆకర్షించే సింగపూర్ కంటే ‘గ్రేడ్ ఎ’ ఆఫీసులు అత్యధికంగా ఉన్నది బెంగళూరులోనే! ఆధునికుడు ఉద్యోగ జీవి. అతనికేం కావాలి? మంచి ఉద్యోగం కావాలి. బెంగళూరులో దొరుకుతోంది. ఆధునికుడు జల్సా జీవి. అతనికేం కావాలి? మంచి వినోదం కావాలి. బెంగళూరులో దొరుకుతోంది. ఆధునికుడు మంచి వ్యాపారి. అతనికేం కావాలి? అద్భుతమైన మౌలిక సదుపాయాలు, మానవ వనరులు కావాలి. అవన్నీ బెంగళూరులో దొరుకుతున్నాయి. ఇటీవల ప్రపంచానికి బెంగళూరు కళ్లు తెరిపించిన విషయం ఏంటంటే... అంతర్జాతీయ సంస్థల విస్తరణ, కొత్త సంస్థల స్థాపనకు అనువుగా ఉండే ‘గ్రేడ్ ఎ’ ఆఫీసుల లభ్యతలో బెంగళూరు ప్రపంచంలోనే రెండో స్థానంలో ఉండడం! మొదటి స్థానంలో చైనాలోని షాంఘై ఉండగా మూడో స్థానంలో సింగపూర్ ఉంది. గ్రేడ్ ఎ ఆఫీసు అంటే అంతర్జాతీయ ప్రమాణాలున్న, సెంట్రల్ ఎయిర్కండిషనింగ్తో కూడిన అత్యాధునిక భవనాలు, వాటి ఆవరణలు, ప్రామాణిక శాశ్వత నిర్వహణ తీరు వంటివి ఉన్న ఆఫీసులు. గ్లోబల్ ఇనీషియేటివ్ ఫర్ రీస్ట్రక్చరింగ్ ఎన్విరాన్మెంట్ అండ్ మేనేజ్మెంట్ (గిరెన్) తాజా అధ్యయనం ప్రకారం ఇండియా ‘అత్యంత ఆకర్షణీయ వాణిజ్య కేంద్రం’ కాగా దేశంలోని మొత్తం ఎ గ్రేడ్ స్పేస్‌లో 24 శాతం ఒక్క బెంగళూరే కలిగి ఉంది. సైన్స్ సిటీ, ఉద్యాన నగరంగా వెలుగొందిన బెంగళూరు వాటికంటే ఎన్నో రెట్లు ఎక్కువ ఖ్యాతిని ఐటీ సర్వీసుల ద్వారా సంపాదించింది. ప్రపంచ ప్రఖ్యాత భారతీయ ఐటీ సంస్థలు ఇక్కడి నుంచి ఎదగడంతో ఐటీ, ఐటీఈఎస్ సంస్థలకు భారతదేశంలో ఇది రాజధానిగా మారింది. ఉన్నత శ్రేణి జనాభా (విద్యావంతులైన అప్పర్ మిడిల్ క్లాస్) ఎక్కువగా ఉన్న నగరం బెంగళూరు. అంటే పది లక్షలు అంతకంటే ఎక్కువ వార్షిక ఆదాయం ఉన్న వారు ఇక్కడ మిగతా అన్ని నగరాల కంటే ఎక్కువ. దేశంలో కొన్ని మాల్స్ కొన్ని నగరాల్లో ఉండవు. కానీ, బెంగళూరులో అన్ని అంతర్జాతీయ మాల్స్ తమ శాఖలను స్థాపించాయి. అందుకే అక్కడ వేతనాలు, ఉపాధి లభ్యత ఎక్కువ. ఆహారం, నివాసం, దుస్తులు, రవాణా, పర్సనల్ కేర్, వినోదం వంటివన్నీ సింగపూర్ నాణ్యతతో అంతకంటే తక్కువ ధరకు ఇక్కడ దొరుకుతున్నాయి. దీనికి అదనంగా నాణ్యమైన మానవ వనరుల లభ్యత మిగతా చాలా ప్రపంచ నగరాల కంటే బెంగళూరుకు ఎక్కువగా ఉంది. బెంగళూరు సింగపూర్ కంటే సంతోషంగా బతుకుతోంది అని చెప్పడానికి మరో ఉదాహరణ ఏంటంటే... పలు రకాల ధరల్లో బెంగళూరు నగరం కంటే 200 నుంచి 900 శాతం ఎక్కువగా ఉండే సింగపూర్‌లో లోకల్ పర్చేజింగ్ పవర్... బెంగళూరు కంటే పన్నెండు శాతం తక్కువ కావడం! సింగపూర్ విదేశీయులకు స్వర్గంగా, స్వదేశీయులకు కష్టంగా ఉంటే... బెంగళూరు ఇద్దరికీ అందుబాటులో ఉంటోంది. బెంగళూరులో కన్నడిగుల శాతం సగానికంటే తక్కువ. స్వదేశీయులు, విదేశీయులు ఇక్కడ పెద్దసంఖ్యలో స్థిరపడటంతో అసలైన కాస్మోపాలిటన్ లక్షణాలున్నాయి. ఇక యూరోపియన్ మూలాలున్న జనాభా 8 శాతం ఉంది. జపాన్‌లోని ఒసాకా తర్వాత అత్యధికంగా సాఫ్ట్వేర్ నిపుణులున్న నగరం బెంగళూరే. ఆసియాలోనే అత్యధిక పబ్‌లు ఇక్కడ ఉన్నాయి. శుభ్రతలోనూ ఇండియాలో ఇది టాప్.