సాఫ్ట్‌వేర్ ఇంజనీర్పై అత్యాచార యత్నం
జార్ఖండ్‌కు చెందిన యువతిపై దుండగులు అత్యాచారానికి యత్నించిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఎలక్ట్రానిక్‌సిటీ పోలీసుల కథనం మేరకు..దొడ్డతోగూరులో పీజీ సెంటర్ నిర్వహిస్తున్నారు. జార్ఖండ్‌కు చెందిన యువతి (25) ఈ హాస్టల్‌లో ఉంటూ నగరంలోని ప్రైవేటుసాఫ్ట్‌వేర్ కంపెనీలో ఇంజనీరుగా ఉద్యోగం చేస్తోంది.
శుక్రవారం రోజు దుండగులు హాస్టల్‌లో చోరీచేసేందుకు వెళ్లగా గదిలో ఒంటరిగా ఉన్న ఆ యువతిపై అత్యాచారానికి యత్నించి గాయపరిచారు. హాస్టల్ నిర్వాహకులు గుర్తించి బాధితురాలిని సెయింట్ జాన్స్ ఆసుపత్రికి తరలించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దర్యాప్తు చేపట్టిన పోలీసులు పలువురిని అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారని తెలిసింది.