Electronic City
-
బెంగళూరులో చిరుత పులి సంచారం కలకలం
కర్ణాటకలోని బెంగళూరులో చిరుత పులి సంచారం మరోసారి కలకలం రేపుతోంది. తుమకూరు రోడ్..హోసూర్ రోడ్ మధ్య ఫేజ్ 1 టోల్ ప్లాజ్ ఉంది. ఆ టోల్ ప్లాజా దగ్గరలో రోడ్డు దాటుతూ చిరుత కనిపించడం స్థానికులను భయాందోళనలకు గురి చేస్తోంది. దీనికి సంబంధించిన దృశ్యాలు అక్కడే ఉన్న సీసీటీవీల్లో రికార్డ్ అయ్యాయి.మంగళవారం ఉదయం తెల్లవారుజామున 3.00 గంటలకు చిరుతపులి టోల్‌ప్లాజా సమీపంలోని ఫ్లైఓవర్‌ను దాటుతున్నట్లు టోల్ ఫ్లాజా అధికారులు గుర్తించారు. పనక్ ఇండియా కంపెనీ ప్రాంతం నుండి నెట్టూర్ టెక్నికల్ ట్రైనింగ్ ఫౌండేషన్ (ఎన్ టీటీ ఎఫ్ ) వైపు చిరుత పులి వెళ్లినట్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఎన్టీటీఎఫ్ ప్రిన్సిపల్ సునీల్ జోషి మాట్లాడుతూ.. టోల్ గేట్ సమీపంలోని కెమెరాలో కాంపౌండ్ వాల్ దగ్గర నుండి చిరుతపులి వెళ్ళినట్లు మాకు సమాచారం వచ్చింది. వెంటనే మేం ఇనిస్టిట్యూట్ లలో అన్నీ గదులను, సీసీటీవీ ఫుటేజీలను తనిఖీ చేశాం.ఎక్కడా పులి ఆనవాళ్లు కనిపించలేదు. క్యాంపస్‌లో ముందస్తు తనిఖీలు నిర్వహించాం. అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇచ్చాం. అధికారులు క్యాంపస్ ను పరిశీలించారు. చిరుతపులి కాంపౌండ్ ప్రక్కన ఉన్న దగ్గర నడుస్తూ కనిపించింది. కాని ఆ తరువాత ఎక్కడికి వెళ్లిందో మాకు తెలియదు’ అని అన్నారు. ముందు జాగ్రత్త చర్యలు తీసుకున్న తర్వాత ఇన్స్టిట్యూట్ తరగతులను తిరిగి ప్రారంభిస్తామని వెల్లడించారు. ఇదీ చదవండి : రూటు మార్చిన ఇజ్రాయెల్ -
బంపరాఫర్.. ఆ షాపులో ఒక డ్రెస్ ఖరీదు రూ.1 మాత్రమే..!
బెంగళూరు: కరోనా మహమ్మారి సమయంలో పేదలు జీవనోపాధి కోల్పోయి నానా అవస్థలు పడ్డారు. చాలా మంది ఎన్జీవోస్, స్యచ్ఛంద సంస్థలు తమ వంతు సాయం అందిచడానికీ ముందుకు వచ్చాయి. ఈ క్రమంలోనే నిరుపేదలను ఆదుకునేలా బెంగళూరులోని నలుగురు స్నేహితులు సరికొత్త ఆలోచనతో ముందుకు రావడమే కాక కార్యాచరణలోకి తీసుకువచ్చి అందర్నీ ఆశ్చర్య పరిచారు. (చదవండి: ఎంత మంచి వాడో.. ప్రతి డెలివరీ బాయ్‌కు గిఫ్ట్ ఇస్తాడట) ఈ మేరకు మెలిషా నొరోన్హా అనే ఆమె తన భర్త వినోద్ లోబో, తల్లి గ్లాస్గో, మరో ఇద్దరు స్నేహితులు నితిన్ కుమార్, విఘ్నేశ్‌తో సహా కలసి 2013లో పేద ప్రజల కోసం ఒక ట్రస్ట్‌ని ఏర్పాటు చేశారు. అయితే ఈ కరోనా మహమ్మారి తర్వాత ప్రజల దీనస్థిత చూశక వారికి క్లాత్ బ్యాంక్ అనే ఆలోచన వచ్చింది. ఆ క్రమంలోనే తాము ఇమాజిన్ క్లాత్స్ బ్యాంక్ అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. సెప్టెంబర్ 2021లో బెరటేన అగ్రహారంలో లవకుశ లే అవుట్‌లోని ఒక చిన్న డబల్ బెడ్రూం అపార్ట్మెంట్లో షాపును ప్రారంభించారు. అయితే ఈ షాపుకి అక్కడ ఎలక్ట్రానిక్ సిటీ చుట్టుపక్కల ఉన్నవాళ్లు బట్టలను విరాళంగా ఇచ్చారు. ఈ క్లాత్ బ్యాంక్‌లో పేదవాళ్లు తమకు నచ్చిన దుస్తులను ఎన్నుకోవచ్చు. పైగా వాటి ధర రూ.1 మాత్రమే. పైగా ఈ క్లాత్ షాపులోని క్లాత్‌లు అమ్మగా వచ్చిన డబ్బులను కూడా వారు నిరుపేద కుటుంబాల పిల్లల చదువు, వైద్య ఖర్చుల అవసరాలకు నిధులుగా సమకూరుస్తున్నారు. అంతేకాదు ఒక పేద కుటుంబం సంవత్సరానికి దుస్తులు కోసం రూ. 2000 ఖర్చు చేస్తున్నారు. అదే ఈ బ్యాంక్ ద్వారా వారికి డబ్బు ఆదా కూడా అవుతుంది. ఈ మేరకు వినోద్, నితిన్ మాడుతూ.."2002లో మంగళూరులోని సెయింట్ అలోసియస్లో మా కాలేజ్ డేస్‌లోనే ఈ క్లాత్ బ్యాంక్ ఆలోచన ఉంది. మేము అప్పుడు కూడా మా స్నేహితు సాయంతో దుస్తులను సేకరించి పేదలకు పంపిణీ చేసేవాళ్లం." అని అన్నారు. (చదవండి: ప్రమాదం ఆ కుక్క జీవితాన్ని మార్చింది.. ఏకంగా మనిషిలా..) -
సాఫ్ట్వేర్ ఇంజనీర్‌పై అత్యాచార యత్నం
జార్ఖండ్‌కు చెందిన యువతిపై దుండగులు అత్యాచారానికి యత్నించిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఎలక్ట్రానిక్‌సిటీ పోలీసుల కథనం మేరకు..దొడ్డతోగూరులో పీజీ సెంటర్ నిర్వహిస్తున్నారు. జార్ఖండ్‌కు చెందిన యువతి (25) ఈ హాస్టల్లో ఉంటూ నగరంలోని ప్రైవేటుసాఫ్ట్వేర్ కంపెనీలో ఇంజనీరుగా ఉద్యోగం చేస్తోంది. శుక్రవారం రోజు దుండగులు హాస్టల్లో చోరీచేసేందుకు వెళ్లగా గదిలో ఒంటరిగా ఉన్న ఆ యువతిపై అత్యాచారానికి యత్నించి గాయపరిచారు. హాస్టల్ నిర్వాహకులు గుర్తించి బాధితురాలిని సెయింట్ జాన్స్ ఆసుపత్రికి తరలించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దర్యాప్తు చేపట్టిన పోలీసులు పలువురిని అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారని తెలిసింది. -
వస్తున్నాడోచ్
సాక్షి ప్రతినిధి, బెంగళూరు : ఆస్తుల కేసులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్. జగన్మోహన్రెడ్డికి బెయిల్ లభించడంతో కర్ణాటక వ్యాప్తంగా సంబరాలు అంబరాన్నంటాయి. ఉదయం 11 గంటల నుంచే రాష్ట్ర వ్యాప్తంగా, ముఖ్యంగా కర్ణాటక-ఆంధ్రప్రదేశ్ సరిహద్దు జిల్లాల్లో జగన్ అభిమానులు టీవీలకు అతుక్కుపోయారు. దాదాపు ఐదు గంటల పాటు ఉత్కంఠ భరితంగా గడిపారు. సాయంత్రం సుమారు ఐదు గంటలప్పుడు జగన్‌కు బెయిల్ మంజూరైందని టీవీలు బ్రేకింగ్ న్యూస్‌ను ఫ్లాష్ చేయడంతో అభిమానుల ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. పెద్ద ఎత్తున బాణా సంచా పేల్చడంతో పాటు స్వీట్లు పంచి పెట్టారు. బెంగళూరులోని యలహంక, బొమ్మనహళ్లి, మారతహళ్లి, ఎలక్ట్రానిక్ సిటీ కత్రిగుప్పెలతో పాటు బళ్లారి, హొసూరు తదితర ప్రాంతాల్లో అభిమానులు హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తూ స్వీట్లు పంచారు. యలహంకలోని జగన్ నివాసం వద్ద డాక్టర్ వైఎస్ఆర్ స్మారక ఫౌండేషన్-కర్ణాటక అధ్యక్షుడు వెంకట కృష్ణారెడ్డి, కార్యదర్శి రాకేశ్ రెడ్డి, మహిళా కార్యదర్శి బత్తుల అరుణాదాస్‌ల ఆధ్వర్యంలో కేక్ కట్ చేశారు. అనంతరం పెద్ద ఎత్తున బాణాసంచా పేల్చారు. బెంగళూరు నుంచి మలేసియాకు వెళ్లిన స్థానిక రోటరీ క్లబ్ సభ్యులు, జగన్‌కు బెయిల్ లభించిందని తెలియడంతో అక్కడే సంబరాలు చేసుకున్నారు. చింతామణిలో అభిమానులు పెద్ద ఎత్తున బాణాసంచా పేల్చారు.