బెంగళూరులో చిరుత పులి సంచారం కలకలం | leopard spotted crossing road in bengaluru | Sakshi
Sakshi News home page

బెంగళూరులో చిరుత పులి సంచారం కలకలం

Published Tue, Sep 17 2024 9:24 PM | Last Updated on Tue, Sep 17 2024 9:39 PM

leopard spotted crossing road in bengaluru

కర్ణాటకలోని బెంగళూరులో చిరుత పులి సంచారం మరోసారి కలకలం రేపుతోంది. తుమకూరు రోడ్..హోసూర్ రోడ్ మధ్య ఫేజ్ 1 టోల్ ప్లాజ్ ఉంది. ఆ టోల్ ప్లాజా దగ్గరలో రోడ్డు దాటుతూ చిరుత కనిపించడం స్థానికులను భయాందోళనలకు గురి చేస్తోంది. దీనికి సంబంధించిన దృశ్యాలు అక్కడే ఉన్న సీసీటీవీల్లో రికార్డ్​ అయ్యాయి.

మంగళవారం ఉదయం తెల్లవారుజామున 3.00 గంటలకు చిరుతపులి టోల్‌ప్లాజా సమీపంలోని ఫ్లైఓవర్‌ను దాటుతున్నట్లు టోల్ ఫ్లాజా అధికారులు గుర్తించారు. పనక్ ఇండియా కంపెనీ ప్రాంతం నుండి నెట్టూర్ టెక్నికల్ ట్రైనింగ్ ఫౌండేషన్ (ఎన్ టీటీ ఎఫ్ ) వైపు చిరుత పులి  వెళ్లినట్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. 

ఎన్టీటీఎఫ్ ప్రిన్సిపల్ సునీల్ జోషి మాట్లాడుతూ..  టోల్ గేట్ సమీపంలోని కెమెరాలో కాంపౌండ్ వాల్ దగ్గర నుండి చిరుతపులి వెళ్ళినట్లు మాకు సమాచారం వచ్చింది. వెంటనే మేం ఇనిస్టిట్యూట్ లలో అన్నీ గదులను, సీసీటీవీ ఫుటేజీలను తనిఖీ చేశాం.ఎక్కడా పులి ఆనవాళ్లు కనిపించలేదు. క్యాంపస్‌లో ముందస్తు తనిఖీలు నిర్వహించాం. అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇచ్చాం. అధికారులు క్యాంపస్ ను పరిశీలించారు.  

చిరుతపులి కాంపౌండ్ ప్రక్కన ఉన్న దగ్గర నడుస్తూ కనిపించింది. కాని ఆ తరువాత ఎక్కడికి వెళ్లిందో మాకు తెలియదు’ అని అన్నారు. ముందు జాగ్రత్త చర్యలు తీసుకున్న తర్వాత ఇన్‌స్టిట్యూట్ తరగతులను తిరిగి ప్రారంభిస్తామని వెల్లడించారు. 

ఇదీ చదవండి : రూటు మార్చిన ఇజ్రాయెల్

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement