బెంగళూరులో చెలరేగుతున్న చైన్‌స్నాచర్లు | Sakshi
Sakshi News home page

బెంగళూరులో చెలరేగుతున్న చైన్‌స్నాచర్లు

Published Fri, Dec 26 2014 2:14 AM

బెంగళూరులో చెలరేగుతున్న చైన్‌స్నాచర్లు

మళ్లీ ఏడు ప్రాంతాలలో బంగారు గొలుసులు చోరీ
 ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసిన పోలీసు అధికారులు

 
 బెంగళూరు :   బెంగళూరు నగరంలో మళ్లీ ఏడుగురి మహిళలలో మెడలో బంగారు గొలుసులను దుండగులు లాక్కొని పరారైనారు. బుధవారం రాత్రి ఏడు గంటల నుంచి గురువారం ఉదయం వరకు  ఏడు గంటల లోపు ఈ చైన్‌స్నాచింగ్‌లు జరిగాయి. ఒక్క జ్ఞానభారతీ పోలీస్ స్టేషన్‌లోనే నాలుగు కేసులు నమోదు అయ్యాయి. వివరాలు..

నాగరబావిలో నివాసముంటున్న విద్యా నవరత్న అనే మహిళ బుధవారం రాత్రి ఒంటరిగా నడిచి వెలుతున్న సమయంలో వెనుక నుండి బైక్‌లో వెళ్లిన ఇద్దరు నిందితులు ఆమె మెడలో ఉన్న 35 గ్రాముల మంగళసూత్రం లాక్కొని పరారైనారు. 15 నిమిషాల తరువాత నాగరబావి 12వ బ్లాక్‌లోని నమ్మూరు అంగడి సమీపంలో నడిచి వెలుతున్న మంజుల అనే మహిళ మెడలో 30 గ్రాముల బంగారు గొలుసు లాక్కొని పారిపోయారు. మరో 20 నిమిషాల వ్యవధిలో నాగరబావి సమీపంలోని కోకోనెట్ గార్డెన్ 12వ క్రాస్‌లో నడిచి వెలుతున్న స్వర్ణలత అనే మహిళ మెడలో ఉన్న 50 గ్రాముల బంగారు గొలుసు లాక్కొని పరారైనారు. తరువాత రావృకష్ణ లేఔట్‌లో నడిచి వెలుతున్న సునంద అనే మహిళ మెడలో ఉన్న 40 గ్రాముల బంగారు గొలుసు లాక్కొని పరారైనారు. ఈ నలుగురు మహిళలు జ్ఞానభారతీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేవలం ఒక గంట వ్యవధిలో ఒకే పోలీస్ స్టేషన్ పరిధిలో బైక్‌లో వెళ్లిన నిందితులు చైన్‌స్నాచింగ్‌లు చేసి పరారైనారు. బుధవారం రాత్రి చంద్రాలేఔట్‌లోని పీఇఎస్ కాలేజ్ సమీపంలో నడిచి వెలుతున్న లలితాబాయి అనే మహిళ మెడలో ఉన్న 35 గ్రాముల బంగారు గొలుసు లాక్కొని పరారైనారు. గురువారం ఉదయం చెన్నమ్మనే అచ్చుకట్ట పోలీస్ స్టేషన్ పరిధిలోని పీఇఎస్ కాలేజ్ స్టూడెంట్స్ హాస్టల్ సమీపంలో నడిచి వెలుతున్న యశోధమ్మ అనే మహిళ మెడలో ఉన్న 30 గ్రాముల బంగారు గొలుసు లాక్కొని పరారైనారు.

ఇది జరిగిన 20 నిమిషాల తరువాత గిరినగర పోలీస్ స్టేషన్ పరిధిలోని పీఇఎస్ కాలేజ్ సమీపంలో నడిచి వెలుతున్న గాయిత్రి అనే మహిళ మెడలో ఉన్న 80 గ్రాముల బంగారు గొలుసు లాక్కొని పరారైనారు. బాధితుల ఫిర్యాదు మేరకు 20 నుంచి 25 సంవత్సరాల వయస్సు ఉన్న యువకులు బంగారు గొలుసులు లాక్కొని పారిపోయారని పోలీసులు అంటున్నారు. గతంలో ఇదే విధంగా చైన్‌స్నాచింగ్‌లు చేసి మహారాష్ట్ర పారిపోయి చివరికి బెంగళూరు పోలీసులకు పట్టుబడిన ఇరాని గ్యాంగ్ (చైన్‌స్నాచర్స్) ఫొటోలను బాధితులకు చూపించి వివరాలు సేకరిస్తున్నామని పోలీసులు తెలిపారు. చైన్‌స్నాచింగ్‌లు చేస్తున్న వారిని పట్టుకొవడానికి బెంగళూరు పోలీసు అధికారులు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి గాలిస్తున్నారు.  
 
 

Advertisement
 
Advertisement
 
Advertisement