జాలీ రైడ్‌కని పిలుచుకు వెళ్లి ... | Teenage girl gangraped in Bangalore | Sakshi
Sakshi News home page

జాలీ రైడ్‌కని పిలుచుకు వెళ్లి ...

Jun 18 2014 10:01 AM | Updated on Apr 8 2019 6:21 PM

జాలీ రైడ్‌కని పిలుచుకు వెళ్లి ... - Sakshi

జాలీ రైడ్‌కని పిలుచుకు వెళ్లి ...

పీయూసీ విద్యార్థినిపై ఇద్దరు సామూహిక అత్యాచారం చేసిన సంఘటన బెంగళూరులో వెలుగుచూసింది.

పీయూసీ విద్యార్థినిపై ఇద్దరు సామూహిక అత్యాచారం చేసిన సంఘటన బెంగళూరులో వెలుగుచూసింది. బ్యాటరాయణపుర పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. నగరంలో ప్రముఖ ప్రైవేటు కాలే జీలో పీయూసీ చదువుతున్న ఓ యువతికి (18) అభిషేక్ అనే వ్యక్తి 10 నెలల క్రితం ఫేస్‌బుక్ ద్వారా పరిచయమయ్యాడు. రెండుసార్లు వ్యక్తిగతంగా కూడా కలుసుకున్నారు. ఆదివారం సాయంత్రం జాలీ రైడ్ పేరుతో అభిషేక్, అతని స్నేహితుడు రాజు బలవంతంగా ఆ యువతిని కారులో తీసుకెళ్లారు.

 

నగర శివార్లలోని తలఘట్టపుర సమీపంలోని నిర్జన ప్రదేశంలోకి తీసుకెళ్లి వారిద్దరూ అత్యాచారం చేశారు. విషయం బయటకు చెబితే చంపేస్తామని బెదిరించి.. బ్యాటరాయణపుర సమీపంలోని నిర్జన ప్రదేశంలో సోమవారం ఉదయం ఆ యువతిని వదలిపెట్టి పరారయ్యారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న బ్యాటరాయణపుర పోలీసులు నిందితుల కోసం గాలిస్తున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement