jolly ride
-
అర్ధరాత్రి..సెక్యూరిటీ లేకుండా.. బుల్లెట్ పై మంత్రి
హైదరాబాద్: ఓ వ్యక్తి ఎంత ఎత్తుకు ఎదిగినా.. చిన్న చిన్న కోర్కెలు వెంటాడుతూనే ఉంటాయి. అలాంటి కోర్కెలు తెలంగాణ ఎక్సైజ్ శాఖ మంత్రి పద్మారావు గౌడ్ ను వెంటాడాయో ఏమో.. అర్ధరాత్రి సెక్యూరిటీని వదిలేసి హైదరాబాద్ లోని పంజాగుట్ట-సికింద్రాబాద్ రోడ్డుపై రయ్ రయ్ మంటూ రాయల్ ఎన్ ఫీల్డ్ పై షికారు చేశారు. మంత్రి అయ్యాక మీటింగ్, సందర్శకులతో బిజీగా ఉండే పద్మారావు ఆటవిడుపు కోసం తన కార్యకర్తలతో కలిసి రోడ్లపై ఎంజాయ్ చేశారు. తన అభిమానులు, కార్యకర్తల కోరికను తొలుత సున్నితంగా తిరస్కరించినట్టు సమాచారం. అయితే చివరికి రాయల్ ఎన్ ఫీల్డ్ పై రైడ్ చేస్తూ.. తన కార్యకర్తను వెనుక కూచోపెట్టుకుని ఫ్లై ఓవర్లపై పద్మారావు ఎంజాయ్ రైడ్ ముగించారు. -
జాలీ రైడ్కని పిలుచుకు వెళ్లి ...
పీయూసీ విద్యార్థినిపై ఇద్దరు సామూహిక అత్యాచారం చేసిన సంఘటన బెంగళూరులో వెలుగుచూసింది. బ్యాటరాయణపుర పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. నగరంలో ప్రముఖ ప్రైవేటు కాలే జీలో పీయూసీ చదువుతున్న ఓ యువతికి (18) అభిషేక్ అనే వ్యక్తి 10 నెలల క్రితం ఫేస్బుక్ ద్వారా పరిచయమయ్యాడు. రెండుసార్లు వ్యక్తిగతంగా కూడా కలుసుకున్నారు. ఆదివారం సాయంత్రం జాలీ రైడ్ పేరుతో అభిషేక్, అతని స్నేహితుడు రాజు బలవంతంగా ఆ యువతిని కారులో తీసుకెళ్లారు. నగర శివార్లలోని తలఘట్టపుర సమీపంలోని నిర్జన ప్రదేశంలోకి తీసుకెళ్లి వారిద్దరూ అత్యాచారం చేశారు. విషయం బయటకు చెబితే చంపేస్తామని బెదిరించి.. బ్యాటరాయణపుర సమీపంలోని నిర్జన ప్రదేశంలో సోమవారం ఉదయం ఆ యువతిని వదలిపెట్టి పరారయ్యారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న బ్యాటరాయణపుర పోలీసులు నిందితుల కోసం గాలిస్తున్నారు.