girl gangraped
-
జాలీ రైడ్‌కని పిలుచుకు వెళ్లి ...
పీయూసీ విద్యార్థినిపై ఇద్దరు సామూహిక అత్యాచారం చేసిన సంఘటన బెంగళూరులో వెలుగుచూసింది. బ్యాటరాయణపుర పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. నగరంలో ప్రముఖ ప్రైవేటు కాలే జీలో పీయూసీ చదువుతున్న ఓ యువతికి (18) అభిషేక్ అనే వ్యక్తి 10 నెలల క్రితం ఫేస్బుక్ ద్వారా పరిచయమయ్యాడు. రెండుసార్లు వ్యక్తిగతంగా కూడా కలుసుకున్నారు. ఆదివారం సాయంత్రం జాలీ రైడ్ పేరుతో అభిషేక్, అతని స్నేహితుడు రాజు బలవంతంగా ఆ యువతిని కారులో తీసుకెళ్లారు. నగర శివార్లలోని తలఘట్టపుర సమీపంలోని నిర్జన ప్రదేశంలోకి తీసుకెళ్లి వారిద్దరూ అత్యాచారం చేశారు. విషయం బయటకు చెబితే చంపేస్తామని బెదిరించి.. బ్యాటరాయణపుర సమీపంలోని నిర్జన ప్రదేశంలో సోమవారం ఉదయం ఆ యువతిని వదలిపెట్టి పరారయ్యారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న బ్యాటరాయణపుర పోలీసులు నిందితుల కోసం గాలిస్తున్నారు. -
తండాలో బాలికపై సామూహిక అత్యాచారం
ఖమ్మం జిల్లా టేకులపల్లి మండలం మద్రాస్ తండాలో గత అర్థరాత్రి దారుణం జరిగింది. తండాకు చెందిన సునీత అనే16 ఏళ్ల బాలికపై ఆరుగురు యువకులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. అనంతరం ఆరుగురు యువకులు పరారైయ్యారు. దాంతో ఆ బాలిక ఇంటికి చేరుకుని జరిగిన విషయాన్ని తల్లీదండ్రులకు వెల్లడించింది. దీంతో బాధితురాలి తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు కేసు నమోదు చేసి... బాధితురాలిని వైద్య పరీక్షల నిమిత్తం ఖమ్మం జిల్లా ఆసుపత్రికి తరలించినట్లు పోలీసులు వెల్లడించారు. పరారైన నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు పోలీసులు వెల్లడించారు. -
యువతిపై ఆగంతకులు సామూహిక అత్యాచారం
ఇంట్లోకి ఆగంతకులు ప్రవేశించి ఒంటరిగా ఉన్న 22 ఏళ్ల యువతిపై దాడి చేశారు. అనంతరం ఆ యువతి కాళ్లు కట్టేసి మరీ ఆమెపై సామూహిక అత్యాచారం చేశారు. మహారాష్ట్ర థానే జిల్లా షాహర్ పూర్ తాలుకాలోని ఘాటోగర్ గ్రామంలో ఆ ఘటన చోటు చేసుకుందని పోలీసులు బుధవారం వెల్లడించారు. అనంతరం ఆగంతకులు అక్కడినుంచి పరారైయ్యారని పోలీసులు తెలిపారు. బాధితురాలు స్థానికుల సాయంతో తమకు ఫిర్యాదు చేసిందని చెప్పారు. పలు సెక్షన్లు కింద నిందితులపై కేసులు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు వెల్లడించారు. అయితే ఆగంతకులు దాడిలో మహిళ తీవ్రంగా గాయపడిందని తెలిపారు. వైద్య పరీక్షల నిమిత్తం బాధితురాలిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు చెప్పారు. సామూహిక అత్యాచార ఘటన సోమవారం మధ్యాహ్నం చోటు చేసుకుందని పోలీసులు వివరించారు. -
ఆరేళ్ల బాలికపై సామూహిక అత్యాచారం
మహబూబ్‌నగర్: ఆరేళ్ల బాలికపై నలుగురు విద్యార్థులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఘటన శనివారం రాత్రి మహబూబ్‌నగర్‌లో జరిగింది. హనుమాన్పూరకు చెందిన నలుగురు విద్యార్థులు (14 ఏళ్లలోపు) గోల్మజిద్లోని ఓ టీచర్ వద్ద ట్యూషన్‌కు వెళ్తున్నారు. అక్కడికే ఓ ఆరేళ్ల బాలిక కూడా వస్తోంది. ఆ విద్యార్థులు గత 20 రోజులుగా ఆమెతో స్నేహంగా మెలుగుతున్నారు. ఈ క్రమంలో శనివారం రాత్రి ట్యూషన్ వదిలిన తర్వాత బాలికను ఓ ఇంట్లోకి తీసుకెళ్లి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ విషయం ఎవరికైనా చెబితే చంపేస్తామని భయపెట్టారు. దీంతో బాధితురాలు ఏడ్చుకుంటూ వెళ్లి తన తల్లికి జరిగిన విషయం తెలిపింది. ఆమె వన్‌టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేయగా బాధ్యులైన నలుగురు బాలురను పోలీసులు అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ బాలాజీ తెలిపారు.