మహబూబ్‌నగర్: ఆరేళ్ల బాలికపై నలుగురు విద్యార్థులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఘటన శనివారం రాత్రి మహబూబ్‌నగర్‌లో జరిగింది. హనుమాన్‌పూరకు చెందిన నలుగురు విద్యార్థులు (14 ఏళ్లలోపు) గోల్‌మజిద్‌లోని ఓ టీచర్ వద్ద ట్యూషన్‌కు వెళ్తున్నారు. అక్కడికే ఓ ఆరేళ్ల బాలిక కూడా వస్తోంది. ఆ విద్యార్థులు గత 20 రోజులుగా ఆమెతో స్నేహంగా మెలుగుతున్నారు.
ఈ క్రమంలో శనివారం రాత్రి ట్యూషన్ వదిలిన తర్వాత బాలికను ఓ ఇంట్లోకి తీసుకెళ్లి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ విషయం ఎవరికైనా చెబితే చంపేస్తామని భయపెట్టారు. దీంతో బాధితురాలు ఏడ్చుకుంటూ వెళ్లి తన తల్లికి జరిగిన విషయం తెలిపింది. ఆమె వన్‌టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేయగా బాధ్యులైన నలుగురు బాలురను పోలీసులు అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ బాలాజీ తెలిపారు.
ఆరేళ్ల బాలికపై సామూహిక అత్యాచారం
Published Sun, Dec 15 2013 8:46 AM | Last Updated on Mon, Oct 8 2018 5:04 PM
Advertisement
Advertisement