
వారికి కావాల్సింది శిక్ష కాదు..కౌన్సెలింగ్
కతువా: జీవితాన్ని ముగించుకోవాలంటూ తీవ్రచర్యలకు పాల్పడే వ్యక్తులను శిక్షించరాదని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ఐపీసీ నుంచి ఆత్మహత్యా నేరం తొలగింపుపై ఆయన శనివారమిక్కడ పైవిధంగా స్పందించారు. జమ్మూకశ్మీర్‌లోని కతువా జిల్లాలో మోదీ ఎన్నికల ర్యాలీలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆత్మహత్యాయత్నం చేసుకున్న వారికి కావాల్సింది శిక్ష కాదని, సరైన కౌన్సెలింగ్ అవసరమన్నారు. కేంద్ర ప్రభుత్వం ఇటీవలే ఆత్మహత్యాయత్నం నేరం కాదని ...ఆత్మహత్యను నేరంగా పరిగణించే ఐపీసీ సెక్షన్ 309ను తొలగించాలని నిర్ణయించిన విషయం విదితమే.