న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ రేడియో కార్యక్రమం 'మన్ కీ బాత్' 100వ ఎపిసోడ్‌కు హాజరుకాలేదని 36 మంది విద్యార్థులకు శిక్ష విధించింది చండీగఢ్ పీజీఐఎంఈఆర్ కళాశాల. వీరిని వారం రోజుల పాటు హాస్టల్ నుంచి కాలు బయటపెట్టొద్దని ఆదేశించింది. దీంతో ఆ విద్యార్థులు వసతిగృహానికే పరిమితమయ్యారు.
పీజీ వైద్య కళాశాల తీసుకున్న ఈ నిర్ణయంపై టీఎంపీ ఎంపీ మహువా మొయిత్రా ఫైర్ అయ్యారు. అసలు మోదీ రేడియా కార్యక్రమానికి హాజరుకాకపోతే శిక్షించడం ఏంటి? అని మండిపడ్డారు. ఇప్పటివరకు తాను మన్ కీ బాత్ ఒక్క ఎపిసోడ్ కూడా వినలేదని, అందుకు తనను కూడా ఇంట్లో నుంచి వారం రోజులు బయటకు రాకుండా శిక్షిస్తారా? అని ప్రశ్నించారు. కాలేజీ యాజమాన్యం తీరును తప్పుబట్టారు. ఇది తీవ్రంగా ఆందోళన చెందాల్సిన విషయం అన్నారు. అలాగే మోదీ మన్ కీ బాత్‌ను మంకీ బాత్ అంటూ వ్యంగ్యాస్త్రాలుసంధించారు మహువా. ఈమేరకు ట్వీట్ చేశారు. విద్యార్థులకు శిక్షపడిన విషయంపై ఓ జాతీయ పత్రికలో వచ్చిన కథానాన్ని కూడా ట్వీట్‌కు జతచేశారు.
I haven’t listened to monkey baat either. Not once. Not ever. Am I going to be punished as well? Will l be forbidden from leaving my house for a week?
— Mahua Moitra (@MahuaMoitra) May 12, 2023
Seriously worried now. pic.twitter.com/HaqEQwsWOj
మోదీ మన్ కీ బాత్ 100వ ఎపిసోడ్ ఏప్రిల్ 30న జరిగింది. ఆరోజు విద్యార్థులంతా తప్పకుండా కార్యక్రమానికి హాజరుకావాలని పీజీఐఎంఆర్ కాలేజీ విద్యార్థులకు సర్కులర్ జారీ చేసింది. అయితే నర్సింగ్ మూడో సంవత్సరం చదువుతున్న 28 విద్యార్థులు, ఫస్ట్ ఇయర్‌కు చెందిన 8 మంది విద్యార్థులు ఈ కార్యక్రమాని డుమ్మా కొట్టారు. ఎలాంటి కారణం కూడా చెప్పలేదు. దీంతో కాలేజీ యాజమాన్యం వీరిపై చర్యలు తీసుకుంది. వారం రోజుల పాటు హాస్టల్ నుంచి బయటకు రావొద్దని ఆదేశించింది.
ఈ విషయంపై ప్రశ్నించగా కాలేజీ యాజమాన్యం తమ చర్యను సమర్థించుకుంది. ఈ ఎపిసోడ్‌కు విద్యార్థులు కచ్చితంగా హాజరుకావాలని ముందుగానే చెప్పామని, ఆరోజు గెస్ట్ లెక్చర్స్, ఇతర కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. కానీ సరైన కారణం లేకుండా 36 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారని, అందుకే వాళ్లపై చర్యలు తీసుకున్నామని పేర్కొన్నారు.
చదవండి: ఉద్ధవ్‌ను సీఎంగా నియమించలేం.. శివసేన సంక్షోభంపై సుప్రీం కీలక తీర్పు
Comments
Please login to add a commentAdd a comment