PGIMR
-
CJI DY Chandrachud: న్యాయం, వైద్యం... అత్యంత ఖరీదు!
చండీగఢ్: ‘‘వైద్య, న్యాయ వృత్తుల రెండింటి లక్ష్యమూ ఒక్కటే. అంకితభావంతో కూడిన సేవ ద్వారా వ్యక్తులకు, సమాజానికి హితం చేకూర్చడం. సంక్షేమమే వాటి మూలసూత్రం. కానీ, సమాజ హితానికి పాటుపడేందుకే పుట్టుకొచి్చన అతి కీలకమైన ఆ రెండు రంగాలూ నేడు అదే సమాజానికి అందుబాటులో లేకుండా పోవడం ఆశ్చర్యకరం’’ అంటూ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డి.వై.చంద్రచూడ్ ఆవేదన వెలిబుచ్చారు. ముఖ్యంగా ప్రైవేట్ రంగం రాకతో 1980ల నుంచి భారత్‌లో వైద్యం బాగా వ్యాపారమయంగా మారిపోయిందన్నారు. ‘‘పలు ఔషధాల ఖరీదు భరించలేనంతగా పెరిగిపోయింది. గ్రామీణుల ఆదాయంలో ఏకంగా 77 శాతం, పట్టణ ప్రాంతాల్లో 70 శాతం వైద్య ఖర్చులకే పోతోంది’’ అని అభిప్రాయపడ్డారు. ఈ నేపథ్యంలో గ్రామీణ ప్రాంతాలకు వైద్య సేవలు అందుబాటులో ఉండేలా వైద్య కళాశాలు చూడాల్సిన అవసరముంది. ఇది వాటి సామాజిక బాధ్యత కూడా’’ అని హితవు పలికారు. శనివారం చండీగఢ్‌లో పీజీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ 37వ స్నాతకోత్సవంలో సీజేఐ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. యువ వైద్యులను ఉద్దేశించి ప్రసంగించారు. రోగుల పట్ల దయ, సహానుభూతి ఉండాలని వారికి ఉద్బోధించారు. ‘‘భారత్ ఇన్నొవేషన్ల కేంద్రంగా మారడం అభినందనీయం. కానీ వాటి ఫలాలు అతి కొద్దిమందికే పరిమితం అవుతుండటం బాధాకరం. కనుక వైద్య రంగంలో కీలక పరిశోధనలకు యువ డాక్టర్లు శ్రీకారం చుట్టాలి’’ అని ఆకాంక్షించారు. టెక్నాలజీ వాడకం పెరగాలి టెక్నాలజీ ద్వారా కోర్టుల పనితీరులో జవాబుదారీతనం పెరగడమే గాక న్యాయప్రక్రియ ప్రజలకు మరింత చేరువవుతుందని సీజేఐ అభిప్రాయపడ్డారు. ‘‘పారదర్శకత, ప్రజాస్వామ్యం, అందరికీ సమన్యాయం వంటి విలువల పరిరక్షణకు టెక్నాలజీ ఎంతో ఉపయోగపడుతోంది. కక్షిదారులు కూడా ఉన్నచోటి నుంచే వారి కేసుల విచారణను ప్రత్యక్షంగా వీక్షించే వీలు కలి్పస్తోంది’’ అని చెప్పారు. గత నాలుగేళ్లలో సుప్రీంకోర్టు ఏకంగా 8 లక్షలకు పైగా కేసులను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారించిందని గుర్తు చేశారు. పెండింగ్ భారాన్ని తగ్గించేందుకు కోర్టుల్లో మౌలిక సదుపాయాలను బలోపేతం చేయాల్సిన అవసరముందన్నారు. -
'మన్ కీ బాత్' వినకపోతే నన్ను కూడా శిక్షిస్తారా?.. మహువా మొయిత్రా ఫైర్
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ రేడియో కార్యక్రమం 'మన్ కీ బాత్' 100వ ఎపిసోడ్‌కు హాజరుకాలేదని 36 మంది విద్యార్థులకు శిక్ష విధించింది చండీగఢ్ పీజీఐఎంఈఆర్ కళాశాల. వీరిని వారం రోజుల పాటు హాస్టల్ నుంచి కాలు బయటపెట్టొద్దని ఆదేశించింది. దీంతో ఆ విద్యార్థులు వసతిగృహానికే పరిమితమయ్యారు. పీజీ వైద్య కళాశాల తీసుకున్న ఈ నిర్ణయంపై టీఎంపీ ఎంపీ మహువా మొయిత్రా ఫైర్ అయ్యారు. అసలు మోదీ రేడియా కార్యక్రమానికి హాజరుకాకపోతే శిక్షించడం ఏంటి? అని మండిపడ్డారు. ఇప్పటివరకు తాను మన్ కీ బాత్ ఒక్క ఎపిసోడ్ కూడా వినలేదని, అందుకు తనను కూడా ఇంట్లో నుంచి వారం రోజులు బయటకు రాకుండా శిక్షిస్తారా? అని ప్రశ్నించారు. కాలేజీ యాజమాన్యం తీరును తప్పుబట్టారు. ఇది తీవ్రంగా ఆందోళన చెందాల్సిన విషయం అన్నారు. అలాగే మోదీ మన్ కీ బాత్‌ను మంకీ బాత్ అంటూ వ్యంగ్యాస్త్రాలుసంధించారు మహువా. ఈమేరకు ట్వీట్ చేశారు. విద్యార్థులకు శిక్షపడిన విషయంపై ఓ జాతీయ పత్రికలో వచ్చిన కథానాన్ని కూడా ట్వీట్‌కు జతచేశారు. I haven’t listened to monkey baat either. Not once. Not ever. Am I going to be punished as well? Will l be forbidden from leaving my house for a week? Seriously worried now. pic.twitter.com/HaqEQwsWOj — Mahua Moitra (@MahuaMoitra) May 12, 2023 మోదీ మన్ కీ బాత్ 100వ ఎపిసోడ్ ఏప్రిల్ 30న జరిగింది. ఆరోజు విద్యార్థులంతా తప్పకుండా కార్యక్రమానికి హాజరుకావాలని పీజీఐఎంఆర్ కాలేజీ విద్యార్థులకు సర్కులర్ జారీ చేసింది. అయితే నర్సింగ్ మూడో సంవత్సరం చదువుతున్న 28 విద్యార్థులు, ఫస్ట్ ఇయర్‌కు చెందిన 8 మంది విద్యార్థులు ఈ కార్యక్రమాని డుమ్మా కొట్టారు. ఎలాంటి కారణం కూడా చెప్పలేదు. దీంతో కాలేజీ యాజమాన్యం వీరిపై చర్యలు తీసుకుంది. వారం రోజుల పాటు హాస్టల్ నుంచి బయటకు రావొద్దని ఆదేశించింది. ఈ విషయంపై ప్రశ్నించగా కాలేజీ యాజమాన్యం తమ చర్యను సమర్థించుకుంది. ఈ ఎపిసోడ్‌కు విద్యార్థులు కచ్చితంగా హాజరుకావాలని ముందుగానే చెప్పామని, ఆరోజు గెస్ట్ లెక్చర్స్, ఇతర కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. కానీ సరైన కారణం లేకుండా 36 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారని, అందుకే వాళ్లపై చర్యలు తీసుకున్నామని పేర్కొన్నారు. చదవండి: ఉద్ధవ్‌ను సీఎంగా నియమించలేం.. శివసేన సంక్షోభంపై సుప్రీం కీలక తీర్పు -
ఎఫ్ఐఐల అమ్మకాలు కొనసాగుతాయి..
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఇతర వర్ధమాన మార్కెట్లతో పోలిస్తే భారత మార్కెట్లు మెరుగైన పనితీరే కనబరుస్తున్నా యని పీజీఐఎం ఇండియా మ్యూచువల్ ఫండ్ హెడ్ (ఈక్విటీస్) అనిరుద్ధ నాహా తెలిపారు. ఇలాంటి పరిస్థితుల్లో విదేశీ ఇన్వెస్టర్లు (ఎఫ్ఐఐ) విక్రయాలను కొనసాగిస్తారని, నిధులను ఇతర మార్కెట్లలోకి తిప్పుతుంటారని ఆయన పేర్కొన్నారు. గత తొమ్మిది నెలలుగా ఎఫ్ఐఐలు విక్రయించడం, దేశీ సంస్థలు కొనుగోళ్లు జరుపుతుండటం కొనసాగుతోందని నాహా చెప్పారు. భారీ అమ్మకాలు వెల్లువెత్తుతున్నా, మార్కెట్లు తీవ్ర ఒడిదుడుకులకు లోనవుతు న్నప్పటికీ దేశీ ఇన్వెస్టర్లు పరిణితితో వ్యవహరిస్తున్నారని ఆయన పేర్కొన్నారు. దేశీ మదుపుదారుల పెట్టుబడులు కొనసాగుతుండటంతో ఎఫ్ఐఐల అమ్మకాల ఒత్తిడిని తట్టుకుని మార్కెట్లు నిలబడు తున్నాయన్నారు. మార్కెట్లు మరికొంత కరెక్షన్‌కి లోనుకావచ్చని, అయితే ఈక్విటీలకు కేటాయింపులు జరిపేందుకు.. దీర్ఘకాలంలో సంపద సృష్టించుకునేందుకు ఇది సరైన సమయమని నాహా చెప్పారు. భారతీయులు సాధారణంగా ఈక్విటీలు, ఈక్విటీ ఫండ్లకు ఎక్కువగా కేటాయించరని, ప్రస్తుతం ఆ ధోరణి మారుతోందని తెలిపారు. మరోవైపు, రిస్కులను సమర్ధంగా ఎదుర్కొంటూ మెరుగైన రాబడులు పొందేందుకు, ట్యాక్సేషన్‌పరంగా ప్రయోజనకరంగా ఉండేందుకు బ్యాలెన్స్డ్ అడ్వాంటేజ్ ఫండ్స్ (బీఏఎఫ్) ఆకర్షణీయంగా ఉంటున్నాయని నాహా పేర్కొన్నారు. దీనికి అనుగుణంగానే పీజీఐఎం ఇండియా బీఏఎఫ్‌ను నిర్వహిస్తున్నామని వివరించారు. మార్కెట్ వేల్యుయేషన్స్ అధిక స్థాయిలో ఉన్నప్పుడు కొంత ఈక్విటీ భాగాన్ని హెడ్జ్ చేసి, డెట్ సాధనాల్లో ఇన్వెస్ట్ చేస్తామని.. తద్వారా మార్కెట్ పతనమైన పెద్దగా ప్రభావం పడకుండా ఉంటుందని నాహా చెప్పారు. అలాగే తక్కువ స్థాయిలో కొనుగోలు చేసి అధిక స్థాయిలో విక్రయించే సూత్రాన్ని పాటిస్తాం కాబట్టి మెరుగైన రాబడులు అందించేందుకు వీలవుతుందని పేర్కొన్నారు. -
పీజీఐఎం నుంచి ఓవర్‌నైట్ ఫండ్
ఓవర్‌నైట్ సెక్యూరిటీల్లో ఇన్వెస్ట్ చేసే లక్ష్యంతో పీజీఐఎం ఇండియా మ్యూచువల్ ఫండ్ (లోగడ డీహెచ్ఎఫ్ఎల్ ప్రమెరికా) నుంచి ఓవర్‌నైట్ ఫండ్ అందుబాటులోకి వచ్చింది. ఇది ఓపెన్ ఎండెడ్ మ్యూచువల్ ఫండ్ పథకం. ఈ నెల 12న ఆఫర్ ప్రారంభం కాగా, ఈ నెల 26 వరకు పెట్టుబడులకు అందుబాటులో ఉంటుంది. ఒక్క రోజు వ్యవధిలో గడువు తీరే ఓవర్‌నైట్ సెక్యూరిటీల్లో (డెట్ సెక్యూరిటీలు, మనీ మార్కెట్ ఇనుస్ట్రుమెంట్లు) ఈ పథకం ఇన్వెస్ట్ చేస్తుంది. స్వల్ప కాలం కోసం నిధులను పార్క్ చేసుకోవాలనుకునే వారికి ఇది అనుకూలం. రిస్క్ తక్కువగా ఉంటుంది. అధిక లిక్విడిటీ (కోరుకున్నప్పుడు వేగంగా వెనక్కి తీసుకోగలగడం) ఇందులోని మరో సానుకూలత. అయితే, రాబడులకు హామీ ఉండదు. ప్రవేశం, వైదొలిగే సమయంలో ఎటువంటి చార్జీలు ఉండవు. ఒక రోజు నుంచి నెల రోజుల వరకు తమ నిధులపై రాబడులు కోరుకునే వారు ఈ తరహా పథకాల్లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. -
ఆర్ఎంఎల్లో పారిశుధ్యంపై కేంద్ర మంత్రి సమీక్ష
సాక్షి, న్యూఢిల్లీ: కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రారంభించిన పారిశుధ్య కార్యక్రమంలో భాగంగా ఆ విభాగం మంత్రి హర్షవర్ధన్ బుధవారం ఇక్కడి రామ్ మనోహర్ లోహియా ఆస్పత్రిని సందర్శించారు. దాదాపు గంట సమయం ఆస్పత్రిలో గడిపిన మంత్రి పారిశుధ్య పరిస్థితిపై సమీక్షించారు. ఎమర్జెన్సీ, కార్డియాలజీ విభాగాలతో పాటు ప్లాస్టిక్ సర్జరీ, కాలిన గాయాలకు చికిత్స చేసే విభాగాలను కూడా సందర్శించారు. ఆస్పత్రి ఆవరణలోని సెంట్రల్ పార్కును, ఎదురుగా ఉన్న పచ్చదనాన్ని పరిశీలించిన వర్ధన్ మొక్కలు, చెట్ల పరిరక్షణకు ఆస్పత్రి యాజమాన్యం చూపుతున్న శ్రద్ధను ప్రశంసించారు. ఆ తరువాత పీజీఐఎంఆర్‌కు చెందిన వివిధ విభాగాధిపతులను ఉద్దేశించి వర్ధన్ ప్రసంగిస్తూ ఆర్ఎంఎల్ ఆస్పత్రిని ఓ విశిష్టమైన వైద్య కేంద్రంగా మార్చాలని కోరుకుంటున్నట్లు తెలి పారు. ఖాళీగా ఉన్న డాక్టర్లు, నర్సులు, పారా మెడికల్ సిబ్బంది పోస్టుల సమస్యపై చర్చించిన వర్ధన్ ఆస్పత్రిలో సౌరశక్తి వినియోగానికి ప్రాధాన్యం ఇవ్వాలని చెప్పారు. ఆస్పత్రిలో 280 డాక్టర్ పోస్టులకు గాను 80 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. 800 నర్సుల ఉద్యోగాలకు గాను 200 ఖాళీగా ఉన్నాయి. ఇక పారా మెడికల్ సిబ్బంది పోస్టులు మూడింట ఒకవంతు చాలా కాలంగా ఖాళీగా ఉన్నాయని ఆర్ఎంఎల్ ఆస్పత్రి మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ హెచ్‌కే కర్ చెప్పారు. వ్యర్ధ జలాల శుద్ధీకరణ ప్లాంటు ఏర్పాటుకు ప్రభుత్వం ఇటీవల రూ.3.6 కోట్లు మంజూరు చేసిందని తెలిపారు. ప్రైవేటు ఆస్పత్రి మూసివేతకు ఆదేశం న్యూఢిల్లీ: అర్హతలేని వైద్యుడి చికిత్స కారణంగా రోగి మృతి ఘటన నేపథ్యంలో పశ్చిమ ఢిల్లీలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిని మూసివేయాల్సిందిగా ప్రభుత్వం ఆదేశించింది. రోహిణీ ప్రాంతంలోని సెక్టార్-16లోగల సత్యం ఆస్పత్రి మూసివేతకు ఆదేశాలు జారీఅయ్యాయి. ఈ మేరకు ఆరోగ్య శాఖ ఉత్తర్వులు జారీచేసింది. ఢిల్లీ మెడికల్ కౌన్సిల్ (డీఎంసీ) నివేదికను పరిశీలించిన అనంతరం లెసైన్సును తక్షణమే రద్దు చేస్తున్నట్టు ఆరోగ్య శాఖ సంచాలకుడు డాక్టర్ ఎన్.వి.కామత్ ఆస్పత్రికి సమాచారం అందించారు. కాగా అర్హతలేని వ్యక్తి వైద్యసేవలు అందించిన కారణంగానే సదరు ఆస్పత్రిలో చేరిన కామిని సోలంకి అనే రోగి మృతి చెందిందని నివేదిక పేర్కొంది.