కోర్టు ఆవరణలో విషం తాగిన మహిళా న్యాయవాది | Chhattisgarh lawyer attempted to commit suicide in the Supreme Court premises | Sakshi
Sakshi News home page

కోర్టు ఆవరణలో విషం తాగిన మహిళా న్యాయవాది

Published Mon, Sep 22 2014 2:12 PM | Last Updated on Tue, Sep 18 2018 7:34 PM

Chhattisgarh lawyer attempted to commit suicide in the Supreme Court premises

న్యూఢిల్లీ : సుప్రీంకోర్టు ఆవరణలో ఓ మహిళా న్యాయవాది ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించిన ఘటన సోమవారం కలకలం సృష్టించింది. చత్తీస్గఢ్కు చెందిన  న్యాయవాది...తనపై జరిగిన గ్యాంగ్ రేసు కేసులో న్యాయం జరగలేదంటూ విషం తాగి ఈ ఘటనకు పాల్పడింది. ఈ విషయాన్ని గమనించిన స్థానికులు  బాధితురాలిని రామ్ మనోహర్ లోహియా ఆస్పత్రికి తరలించారు.

 

గత ఏడాది తనపై బంధువులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారని ఫిర్యాదు చేసినా.. వారిపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవటంతో మనస్తాపం చెందిన ఆమె ఆత్మహత్యాయత్నం చేసింది.  మరోవైపు సుప్రీంకోర్టు ఈ వ్యవహారాన్ని సుమోటోగా స్వీకరించింది. ఈ కేసు మంగళవారం విచారణకు వచ్చే అవకాశం ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement