Woman lawyer
-
ఢిల్లీ కోర్టులో కాల్పుల కలకలం
న్యూఢిల్లీ: కట్టుదిట్టమైన భద్రత ఉండే ఢిల్లీలోని సాకేత్ కోర్టు ఆవరణలో తుపాకీ కాల్పులు కలకలం రేపాయి. లాయర్ దుస్తుల్లో వచ్చిన కామేశ్వర్ సింగ్ అనే వ్యక్తి ఓ మహిళపై కాల్పులు జరిపి పరారయ్యాడు. దాంతో అంతా పరుగులు తీశారు. మహిళకు ప్రాణాపాయం లేదని పోలీసులు తెలిపారు. ఆర్థిక విభేదాలే ఘటనకు కారణమని భావిస్తున్నామన్నారు. మాజీ లాయర్ అయిన నిందితుడు హరియాణా పోలీసులకు పట్టుబడ్డాడు. గత ఏడాది అతడిని ఢిల్లీ బార్ అసోసియేషన్ బహిష్కరించింది. ఆయన ఎం.రాధ(సుమారు 40 ఏళ్లు) అనే మహిళకు రూ.25 లక్షలు అప్పుగా ఇచ్చాడు. తిరిగివ్వకపోవడంతో చీటింగ్ కేసు పెట్టాడు. విచారణకు శుక్రవారం ఇద్దరూ కోర్టుకు వచ్చారు. 10.30 సమయంలో తగవుపడ్డారు. కామేశ్వర్ తన వెంట తెచ్చుకున్న తుపాకీతో రాధపై నాలుగు రౌండ్ల కాల్పులు జరిపాడు. రాధకు రెండు బుల్లెట్లు, పక్కనే ఉన్న లాయర్‌కు ఒక బుల్లెట్ తగిలాయి. ఈ ఘటనపై ఆమ్ ఆద్మీ పార్టీ మండిపడింది. ఢిల్లీలో సామాన్యులకు భద్రతే లేకుండా పోతుంటే లెఫ్టినెంట్ గవర్నర్ ఏం చేస్తున్నారని ప్రశ్నించింది. -
హైదరాబాద్‌లో విషాదం.. భర్త, మేనమామతో గొడవ.. న్యాయవాది ఆత్మహత్య
సాక్షి, హైదరాబాద్: భర్త, మేనమామ వేధింపులు భరించలేక ఓ మహిళ భవనంపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన చందానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. సీఐ క్యాస్ట్రో తెలిపిన మేరకు.. శేరిలింగంపల్లిలోని లక్ష్మీ విహార్ ఫేజ్ –1 ఢిపెన్స్ ఎంప్లాయిస్ కాలనీలో మల్లికార్జున్‌రెడ్డి, శివాణి(24) దంపతులు నివాసముంటున్నారు. వీరికి మూడేళ్ల కుమారుడు ఉన్నాడు. శివాణి జూనియర్ అడ్వకేట్‌గా పనిచేస్తూ శేరిలింగంపల్లిలో స్టాంప్ వెండర్ ఆఫీస్ నిర్వహిస్తోంది. శనివారం రాత్రి మల్లికార్జున్‌రెడ్డి, శివాణి మేనమామ రఘు, శివాణిల మధ్య స్టాంప్ పేపర్ల విషయంలో గొడవ జరిగింది. రాత్రి 11.30 గంటల సమయంలో గొడవ జరుగుతుండగా మనస్తాపం చెందిన శివాణి పక్కనే భవనం మూడో అంతస్తు నుంచి కిందికి దూకింది. తలకు తీవ్ర గాయాలు కావడంతో స్థానికులు ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతిచెందిందని వైద్యులు తెలిపారు. శివాణీ తల్లి హేమ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు మేనమామ రఘు, భర్త పె కేసు నమోదు చేశారు. 20 రోజుల క్రితం మేనమామ స్టాంపు పేపర్లు తీసుకెళ్లడంతోపాటు శివాణిని చదివించిన డబ్బివ్వాలని అడుగుతున్నాడని, దీనికితోడు శివాణి తల్లి ఆస్తిలో భాగం కావాలని భర్త వేధిస్తున్నాడని ఫిర్యాదులోపేర్కొన్నారు. తెల్లవారితే కుమారుడి పుట్టినరోజు.. శివాణీ మూడేళ్ల కుమారుడు అనిరుధ్ పుట్టిన రోజు ఆదివారం కావడంతో వేడుకలకు ఏర్పాటు పూర్తి చేశారు. శనివారం రాత్రి జరిగిన గొడవతో శివాణి ఆత్మహత్య చేసుకోవడంతో బంధువులు, స్నేహితులు, సన్నిహితులు కన్నీటిపర్యంతమవుతున్నారు. మనిషికి ఉండేది ఒక్కటే జీవితం. ఆత్మహత్య అన్ని సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్ సెంటర్‌ను ఆశ్రయించి సాయం పొందండి. ఫోన్ నెంబర్లు: 040-66202000/040-66202001 మెయిల్: roshnihelp@gmail.com -
మహిళా న్యాయవాదికి నైజీరియన్ కిలేడి ఊహించని షాక్
సాక్షి, హైదరాబాద్: నగరానికి చెందిన మహిళా న్యాయవాదికి నైజీరియన్ కిలేడీ ఊహించని షాక్ ఇచ్చింది. ఇటీవల ఓ కేసును వాదించాలని నైజీరియన్ మహిళ న్యాయవాదిని సంప్రదించింది. అనంతరం న్యాయవాదిని ట్రాప్ చేసి రూ.9.26 లక్షలు కాజేసి పరారయ్యింది. దీంతో మోసపోయానని గుర్తించిన న్యాయవాది సీసీఎస్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. -
నగ్నచిత్రాలు పంపించాలని బ్లాక్మెయిల్
సాక్షి, నాగోలు: ఫేస్బుక్ ఖాతాలతో మహిళల మొబైల్ నంబర్లు సేకరించి నగ్నచిత్రాలు పంపించాలంటూ బ్లాక్ మెయిల్‌కు పాల్పడుతున్న వ్యక్తిని రాచకొండ సైబర్‌క్రైం పోలీసులు శనివారం అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. రాచకొండ సైబర్ క్రైం పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నగరంలో నివసించే మోటా దుర్గాప్రసాద్ (23) ప్రైవేట్ ఉద్యోగి. ఇంటర్నెట్లో నీలి చిత్రాలు చూస్తుంటాడు. సోషల్ మీడియా ప్లాట్‌ఫాం నుంచి అమ్మాయిల ఫోన్ నంబర్లను సేకరించి వాట్సాప్ ద్వారా అసభ్యకర దృశ్యాలను పంపించేవాడు. మహిళలకు వీడియో కాల్స్ చేసి వారి నగ్న చిత్రాలను పంపించాలంటూ బ్లాక్మెయిల్ చేసేవాడు. ఇందుకు నిరాకరించిన మహిళల మొబైల్ నంబర్లను పోర్న్ వెబ్సైట్లో, ఇంటర్నెట్లో పెడతానంటూ బెదిరించేవాడు. ఈ క్రమంలో నగరానికి చెందిన ఓ మహిళా న్యాయవాదిని వాట్సాప్ చాటింగ్‌తో వేధింపులతో గురి చేయడంతో ఆమె రాచకొండ సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశారు. (పోర్న్సైట్లలో విద్యార్థినులు, లెక్చరర్ల ఫోటోలు) ఈ మేరకు సైబర్ క్రైం పోలీసులు కేసు దర్యాప్తు మొదలుపెట్టారు. విశ్వసనీయం సమాచారం, సాంకేతిక ఆధారాలతో నిందితుడు దుర్గా ప్రసాద్‌ను శనివారం అరెస్టు చేశారు. ఇతనిపై నల్లగొండ, సైబరాబాద్ పరిధిలో పలు కేసులు ఉన్నాయని, గతంలో జైలుకు వెళ్లివచ్చినట్లు పోలీసుల విచారణలో తేలింది. అయినా తన ప్రవర్తన మార్చుకోకుండా మహిళలపై వేధింపులకు పాల్పడుతున్నట్లు వెల్లడైంది. ఈ సందర్భంగా రాచకొండ పోలీస్ కమిషనర్ మహేష్ భగవత్ మాట్లాడుతూ.. బాలికలు, మహిళలు సోషల్ మీడియా ప్లాట్‌ఫాంలో జాగ్రత్త వహించాలని, తెలియని స్నేహితుల అభర్యర్థనలను అంగీకరించవద్దని, వ్యక్తిగత వివరాలు కొత్తవారితో పంచుకోవద్దని సూచించారు. (ఇద్దరు మైనర్లపై 11 మంది గ్యాంగ్ రేప్..) -
ప్రభుత్వ మహిళా న్యాయవాది హత్య కలకలం
లక్నో : ఉత్తరప్రదేశ్‌లో మరో మహిళా న్యాయవాది న్యాయవాది హత్య కలకలం రేపింది. నూతన్ యాదవ్(35) అనే ప్రభుత్వ మహిళా న్యాయవాది హత్యకు గురయ్యారు. ఎటా జిల్లాలో పోలీస్ లైన్స్ ఎదురుగా ఉన్న క్వార్టర్లో ఆమె నివాసంలో సోమవారం రాత్రి గుర్తు తెలియని దుండగులు ఆమెను కాల్చి చంపారు. ఎటా పోలీస్ సూపరింటెండెంట్ సంజయ్ కుమార్ అందించిన సమాచారం ప్రకారం ఆగ్రా నివాసి అయిన నూతన్ అవివాహితురాలు, ఒంటరిగా నివసిస్తోంది. అయితే కుటుంబానికి అత్యంత సన్నిహతులైన వారే ఈ హత్యకు పాల్పడి వుంటారని భావిస్తున్నారు. ఆమె గ్రామానికి చెందిన కొంతమంది ఆమెను తరచూ సందర్శించేవారనీ, ఆమె నివాసంలో ఉండేవారని తెలుస్తోంది. వీరే ఈ దురాగతానికి పాల్పడి వుంటారని ప్రాథమికంగా అనుమానిస్తున్నారు. ఆమె కుటుంబ సభ్యులు కూడా ఇదే అనుమానాన్ని వ్యక్తం చేశారని ఎస్పీ తెలిపారు. కాగా రెండు నెలల క్రితం( జూన్,12) యూపీ బార్ కౌన్సిల్ మొదటి మహిళా అధ్యక్షురాలు దర్వేష్ యాదవ్(38)ను తోటి న్యాయవాది ఆగ్రా కోర్టు ప్రాంగణంలో కాల్చి చంపి, అనంతరం ఆత్మహత్య చేసుకున్నాడు. మహిళా న్యాయవాదులపై ఘోరమైన దాడులకు సంబంధించిన మరో సంఘటనలో సీనియర్ సుప్రీంకోర్టు న్యాయవాది కుల్జీత్ కౌర్ (60) జూలై 4న నోయిడా సెక్టార్ 31 లోని ఆమె బంగ్లాలో శవమై తేలిన సంగతి తెలిసిందే. -
తాగిన మత్తులో.. రోడ్డుపై బైఠాయించి న్యూసెన్స్
బంజారాహిల్స్: తాగిన మత్తులో కొందరు మహిళలు డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహిస్తున్న ట్రాఫిక్ పోలీసులకు చుక్కలు చూపించారు. మద్యం మత్తులో ర్యాష్ డ్రైవింగ్‌చేస్తూ దూసుకుపోతున్న యువతులను అడ్డుకున్న పోలీసులతో వారు వాగ్వాదానికి దిగడమేగాక రోడ్డుపై బైఠాయించి న్యూసెన్స్‌కు పాల్పడ్డారు. జూబ్లీహిల్స్ రోడ్ నెం. 36, ఫిలింనగర్ ప్రాంతాల్లో ట్రాఫిక్ పోలీసులు వేర్వేరు ప్రాంతాల్లో డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహించారు. బంజారాహిల్స్‌కు చెందిన న్యాయవాది ఓ పబ్‌లో ఫుల్లుగా తాగి ఆడి కారు డ్రైవ్ నడుపుతూ వెళుతుండగా జూబ్లీహిల్స్ రోడ్ నెం.10లోని డైమండ్ హౌజ్ వద్ద పోలీసులు కారును ఆపి, ఆమెకు శ్వాస పరీక్షలు నిర్వహించగా బీఏసీ(బ్లడ్ ఆల్కహాల్ కంటెంట్) 121 పాయింట్లుగా నిర్ధారణ అయింది. ఆమె కారును సీజ్ చేశారు. టోలిచౌకికి చెందిన మరో యువతి బీవీబీపీ చౌరస్తా పాయింట్లో పోలీసులకు పట్టుబడింది. ఆమెకు శ్వాస పరీక్షలు నిర్వహించగా మద్యం మోతాదు 63 పాయింట్లుగా నమోదైంది. పోలీసులు కారును సీజ్ చేసి కేసు నమోదు చేశారు. మోతాదుకు మించి మద్యం సేవించి వాహనాలు నడుపుతూ 104 మంది పట్టుబడ్డారు. ఇందులో 55 ద్విచక్ర వాహనాలు, 49 కార్లు ఉన్నాయి. పట్టుబడిన యువతులకు వారి భర్తలు లేదా తల్లిదండ్రుల సమక్షంలో కౌన్సెలింగ్ నిర్వహిస్తామని పోలీసులు తెలిపారు. ఒక్క జూబ్లీహిల్స్లోనే జరిగిన తనిఖీల్లో 20 కార్లు, 13 బైక్‌లు పట్టుబడటం గమనార్హం. పోలీసులకు ఫిర్యాదు... ట్రాఫిక్ పోలీసులు శ్రీనగర్‌కాలనీ మెయిన్‌రోడ్డులోని సత్యసాయి నిగమాగమం వద్ద డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహిస్తుండగా మోతాదుకు మించి మద్యం సేవించి కారు నడుపుతున్న నవీన్‌కుమార్(36) పోలీసులకు చిక్కాడు. అతను శ్వాస పరీక్షలకు తీవ్ర ఆటంకం కలిగించారు. ఆయనతో పాటు కారులో కూర్చున్న స్నేహితుడు బల్వంతరావు కూడా శ్వాస పరీక్షలు నిర్వహిస్తుండగా న్యూసెన్స్‌కు పాల్పడ్డాడు. నవీన్‌కుమార్‌కు శ్వాస పరీక్షలు నిర్వహించగా ఆల్కహాల్ కౌండ్ 101 ఎంజీ నమోదైంది. విధులకు ఆటంకం కలిగించి న్యూసెన్స్‌కు పాల్పడిన నవీన్‌కుమార్, బల్వంతరావులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాల్సిందిగా ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ జె. నిరంజన్‌రావు బంజారాహిల్స్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
న్యాయవాది హత్య కిరాయి హంతకుల పనే..
మదనపల్లె క్రైం : మదనపల్లె పట్టణం ఎస్బీఐ కాలనీ సమీపంలో బుధవారం జరిగిన మహిళా న్యాయవాది నాగజ్యోతి హత్య కిరాయి హంతకుల పనేనని పోలీసులు నిర్ధారణకు వచ్చారు. కేసు దర్యాప్తును వేగవంతం చేసి నిందితులను పట్టుకునేందుకు నాలుగు బృందాలతో గాలిస్తున్నారు. భార్య భర్తల మధ్య విభేదాలు ఉన్నాయన్న అనుమానంతో..ఈ హత్యను కిరాయి హంతకులతో చేయించి ఉంటారన్న కోణంలో విచారిస్తున్నారు. పక్కా ఆధారాలను రాబట్టేందుకు పోలీసులు వివిధ కోణాల్లో దర్యాప్తు సాగిస్తున్నారు. నిందితులు ఎంతటివారైనా వదిలే ప్రసక్తే లేదని డిఎస్పీ ఎం. చిదానందరెడ్డి, సీఐ సురేష్ కుమార్ గురువారం విలేకర్లకు తెలిపారు. ఆ ఆధారాలే కీలకం నాగజ్యోతి హత్య కిరాయి హంతకుల పనేనని డీఎస్పీ ఎం. చిదానందరెడ్డి తెలిపారు. భార్యా, భర్తల మధ్య విభేదాలు ఉండడం, ఆర్థిక, ఆస్తి తదితర వివాదాల కారణంగా ఈ హత్య జరిగి ఉంటుందని అనుమానం వ్యక్తంచేశారు. పోలీసులు ఆదిశగా విచారణ చేస్తున్నామన్నారు. కుటుంబీకులను కూడా విచారించామన్నారు. అయితే పోలీసులకు సంఘటనాస్థలంలో లభించిన ఆధారాలు కీలకం కానున్నాయి. న్యాయవాది ఎస్బీఐ కాలనీలో షాపింగ్ చేసుకుని బయటకు వచ్చిన ఇంటి సమీపంలో ఉన్న సీసీ కెమెరాలో ఫుటేజీలను పోలీసులు పరిశీలిస్తున్నారు.హత్య తరువాత నిందితులు కత్తితో నడచుకుంటూ వెళ్లడం స్థానికులు చూశారు. కొందరి ముఠా సభ్యుల పేర్లు చెప్పినట్లు తెలుస్తుంది. వీరిలో గతంలో భూ దందాలు, సెటిల్ మెంట్లు, దాడులు, హత్యాయత్నాలకు పాల్పడినవారు, కొందరి నాయకుల అనుచరులుగా ఉన్నట్లు తెలియడంతో పోలీసులు ఆదిశగా దర్యాప్తు సాగిస్తున్నారు. గతంలోనే హత్యాయత్నం నాగజ్యోతిపై గతంలో కొందరు నాలుగు పర్యాయాలు ఆమె ఇంటిలోనే హత్యాయత్నానికి పాల్పడ్డారని తెలసింది. మరోవెపు నిందితుల తరఫున కేసును వాదించబోమని స్థానిక బార్ అసోసియేషన్ నాయకులు గురువారం తీర్మానించారు. -
మదనపల్లెలో మహిళా న్యాయవాది దారుణ హత్య
సాక్షి, మదనపల్లె : చిత్తూరు జిల్లా మదనపల్లెలో పట్టపగలే ఓ మహిళా న్యాయవాది దారుణ హత్యకు గురైన ఘటన స్థానికంగా బుధవారం కలకలం రేపింది. మహిళా న్యాయవాది నాగజ్యోతిపై గుర్తు తెలియని దుండగులు కత్తులతో దాడి చేశారు. సుమారు 11 కత్తిపోట్లుకు గురైన ఆమె సంఘటనా స్థలంలోనే ప్రాణాలు విడిచారు. వివరాల్లోకి వెళితే.. మదనపల్లెలో ప్రముఖ న్యాయవాది జితేంద్రకు, ఆయన భార్య నాగజ్యోతికి కొంతకాలం నుంచి మనస్పర్థలు ఉన్నాయి. దీంతో ఆమె భర్తకు దూరంగా ఉంటున్నారు. కాగా బుధవారం మధ్యాహ్నం మూడు గంటల సమయంలో నాగజ్యోతి స్కూటీపై ఎస్బీఐ కాలనీ నుంచి ప్రశాంత్ నగర్‌కు వస్తుండగా ఒక్కసారిగా దుండగులు కత్తులతో దాడి చేయడంతో, తీవ్రంగా గాయపడ్డ ఆమె అక్కడికక్కడే మరణించారు. అయితే భార్యాభర్తల మధ్య వివాదమే ఈ హత్యకు కారణమని పోలీసులు భావిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి, మృతదేహాన్ని పోస్ట్‌మార్టంకు తరలించారు. -
మహిళా న్యాయవాది ధర్నా
అన్నానగర్: భర్తతో కలపాలని కోరుతూ కోర్టు ఆవరణలో ధర్నాకు దిగిన మహిళా న్యాయవాదిని పోలీసులు అరెస్టు చేశారు. తంజావూరు శ్రీనివాసపురానికి చెందిన అన్భళగన్ (33). ఇతని భార్య శరణ్య (27) తంజావూరు కోర్టులో న్యాయవాదులుగా పని చేస్తున్నారు. కుటుంబ సమస్యల కారణంగా భార్య, భర్త విడిపోయి జీవిస్తున్నారు. ఈ స్థితిలె భార్య నుంచి విడాకులు కోరుతూ అన్భళగన్ తంజావూరు కోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు. ఇలాఉండగా తనను భర్తతో కలపాలని కోరుతూ బుధవారం సాయంత్రం శరణ్య తంజావూరు కోర్టు ఆవరణలో ధర్నా చేపట్టింది. రాత్రి 8 గంటల సమయంలో పోలీసులు ఆమెను బలవంతంగా వ్యాన్‌లో ఎక్కించి మహిళా పోలీస్‌స్టేషన్‌కు తీసుకెళ్లి అర్ధరాత్రి ఆమెను ఇంట్లో వదిలిపెట్టారు. అనంతరం గురువారం శరణ్య మళ్లీ ధర్నాకు దిగింది. మధ్యాహ్నం ఆమెను పోలీసులు అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచారు. గతంలో ఆమె ఇదేవిధంగా ధర్నా చేపట్టిన సమయంలో నమోదైన ప్రభుత్వ విధులకు ఆటకం కలిగించిన కేసు, ఆత్మహత్య బెదిరింపు కేసులను విచారించిన న్యాయమూర్తి తంగమణి, శరణ్యకు మే 10వతేదీ వరకు రిమాండ్ విధిస్తూ తిర్పునిచ్చారు. పోలీసులు ఆమెను తిరుచ్చి సెంట్రల్ జైలుకు పంపారు. -
మహిళా సాధికారత ఎండమావే.
ఏజెన్సీ జిల్లా భద్రాద్రి కొత్తగూడెంలో ‘మహిళా సాధికారత’ఎండమావిలాటిందేనని నిర్భయ ఆర్గనైజేషన్ ఫర్ ఉమెన్ వ్యవస్థాపక అధ్యక్షురాలు, జిల్లా కేంద్రానికి చెందిన న్యాయవాది మల్లెల ఉషారాణి అన్నారు. మహిళలకు అన్ని రంగాల్లో ప్రాధాన్యం కల్పించటం కేవలం చట్టాలకే పరిమితమయిందని, ఆది ఆచరణలోకి వచ్చిన, సద్వినియోగం చేసుకున్న రోజు ‘మహిళలకు’ నిజమైన పండగని అన్నారు. ‘మహిళా సాధికారత–సమానవకాశాలు’ పై ఉషారాణి ‘సాక్షి’కి ప్రత్యేక ఇంటర్యూ ఇచ్చారు. –కొత్తగూడెం ప్ర: జిల్లాలో మహిళా సాధికారత పరిస్థితి..? జవాబు: మహిళలు స్వేచ్ఛగా నిర్ణయాలు తీసుకుని, ఇంటా బయట తగిన గౌరవం పొంది, సమాన హక్కులు కల్గి లింగ వివక్షత లేకుండా, గౌరవ ప్రదంగా జీవించినప్పుడు పూర్తి స్థాయిలో మహిళా సాధికారత’జరిగినట్లు. కానీ దేశంలో ఎక్కడా ఆ దాఖలాలు కనిపించటం లేదు. ప్ర: అందుకు కారణాలు ఏమిటి? జ: మన దేశం మొదటి నుంచి పురుషాధిక్యత గల దేశం. టెక్నాలజీ పరంగా ఎంత అభివృద్ధి చెందినా ఆ మూలాలు పోవడంలేదు. ప్రతీ మహిళ దీనిపై తనకు తాను ప్రశ్నించుకోవాలి. ముందడుగు వేయాలి. అప్పుడే సాధికారత సాధ్యమవుతుంది. ప్ర: తీసుకోవాల్సిన చర్యలు.? జ: ఏజెన్సీ జిల్లాగా పేరుగాంచిన భద్రాద్రి కొత్తగూడెంలో అమాయక గిరిజనులతో పాటు నిరక్షరాస్యులే అధికంగా ఉన్నారు. వారికి మహిళా చట్టాలపై ఎటువంటి అవగాహన లేదు. స్వచ్ఛంద సంస్థలు, ప్రభుత్వం ముందుకు రావాలి. ప్రతి ఒక్కరికీ చట్టం, న్యాయాలపై అవగాహన కల్పించాలి. మారుమూల గ్రామాలలో ని వారి వద్దకే న్యాయం, చట్టాలను తీసుకెళ్లాలి. ప్ర: మహిళలకు సమానవకాశాలు..? జ: మహిళలకు సమానవకాశాలను కొన్ని రంగాలలోనే ప్రభుత్వం కేటాయించింది. రాజకీయ, ఆర్థిక, సామాజిక రంగాలలో పూర్తి స్థాయి రిజర్వేషన్‌ను కచ్చితంగా, నిష్పక్షపాతంగా అమలు పర్చిన రోజు మహిళలకు సమానవకాశాలు లభించి పురుషులతో సమాన స్థాయిలో హోదాను పొందుతారు. ప్ర: మహిళలపై హింస, దాడులను అరికట్టాలంటే ఏం చేయాలి? జ: మహిళలపై లైంగిక దాడులు, హింస పెరుగుతూనే ఉన్నాయి. నెలల వయసు చిన్నారి నుంచి వృద్ధుల వరకు బాధితులుగా మిగులుతున్నారు. విచ్చలవిడిగా అందుబాటులోకి వచ్చిన టెక్నాలజీ, హింసా ప్రవృత్తి గల సినిమాలు కారణమవుతున్నాయి. వీటిపై ప్రభుత్వం నియంత్రణ చేయాలి. దాడులు జరగకుండా పకడ్బందీగా చర్యలు తీసుకోవాలి. ప్రభుత్వాలు తమ పథకాలను కోట్ల నిధులను ఖర్చు ప్రచారం చేసుకుంటున్నాయి. అంతకు మించి న్యాయం, చట్టం మహిళల చెంతకు చేరే వరకు తగిన ప్రచారం చేయాలి. ప్ర: మీ ఆర్గనైజేషన్ ద్వారా చేసిన కార్యక్రమాలు..? జ: ఢిల్లీలో నిర్భయ సంఘటన జరిగిన తర్వాత 2013లో ‘’నిర్భయ ఆర్గనైజేషన్ ఫర్ ఉమెన్’అనే స్వచ్ఛంద సంస్థను స్థాపించాం. అప్పటి నుంచి మహిళళకు చట్టాలపై అవగాహన కల్పిస్తున్నాం. మహిళలపై జరుగుతున్న అన్యాయాలు, దాడులపై పలు చోట్ల ఫ్యామిలీ కౌన్సెలింగ్‌లను నిర్వహించి ఇప్పటి వరకు సుమారు 80 వరకు కేసులను పరిష్కరించాం. -
మహిళా లాయర్‌పై దాడి
-
తాగేసి కారు నడిపి.. ఇద్దరిని చంపేసింది!
ఓ మహిళా న్యాయవాది మద్యం మత్తులో తన కారుతో ఓ టాక్సీని ఢీకొనడంతో టాక్సీలో ఉన్న ఇద్దరు మరణించారు. బాగా తాగి ఉన్న జాహ్నవి గడ్కర్ (35) అనే ఆ న్యాయవాది తన ఆడి క్యూ3 మోడల్ కారును రాంగ్ రూట్లో నడిపిస్తోందని పోలీసులు తెలిపారు. టాక్సీని ఢీకొట్టేందుకు కొద్ది ముందు ఆమె రెండు బైకులను కూడా ఢీకొట్టబోయి.. తృటిలో తప్పించింది. తాను మద్యం తాగినట్లు వైద్యుల వద్ద ఆమె అంగీకరించిందని డీసీపీ సంగ్రామ్ సింగ్ నిషాన్దార్ తెలిపారు. టాక్సీలో వెళ్తున్న మహ్మద్ సలీం సాబూవాలా (50), మహ్మద్ హుస్సేన్ సయీద్ (57) అనే ఇద్దరు ఈ ప్రమాదంలో మరణించారు. ప్రమాదం కారణంగా టాక్సీ ముందు భాగం, కారు ముందు భాగం కూడా తుక్కుతుక్కుగా మారాయి. రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్‌లో వైస్ ప్రెసిడెంట్ (లీగల్)గా పనిచేస్తున్న గడ్కర్పై పలు సెక్షన్ల కింద కేసులు పెట్టారు. -
సుప్రీం కోర్టు ఆవరణలో ఆత్మహత్యాయత్నం
-
కోర్టు ఆవరణలో విషం తాగిన మహిళా న్యాయవాది
న్యూఢిల్లీ : సుప్రీంకోర్టు ఆవరణలో ఓ మహిళా న్యాయవాది ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించిన ఘటన సోమవారం కలకలం సృష్టించింది. చత్తీస్‌గఢ్‌కు చెందిన న్యాయవాది...తనపై జరిగిన గ్యాంగ్ రేసు కేసులో న్యాయం జరగలేదంటూ విషం తాగి ఈ ఘటనకు పాల్పడింది. ఈ విషయాన్ని గమనించిన స్థానికులు బాధితురాలిని రామ్ మనోహర్ లోహియా ఆస్పత్రికి తరలించారు. గత ఏడాది తనపై బంధువులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారని ఫిర్యాదు చేసినా.. వారిపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవటంతో మనస్తాపం చెందిన ఆమె ఆత్మహత్యాయత్నం చేసింది. మరోవైపు సుప్రీంకోర్టు ఈ వ్యవహారాన్ని సుమోటోగా స్వీకరించింది. ఈ కేసు మంగళవారం విచారణకు వచ్చే అవకాశం ఉంది. -
యాసిడ్ దాడి నుంచి తప్పించుకున్న మహిళా లాయర్
మోటారుసైకిల్ మీద వచ్చిన ముగ్గురు దుండగులు ముఖం మీద యాసిడ్ విసరగా.. ఓ మహిళా న్యాయవాది ఆ దాడినుంచి తృటిలో తప్పుకొన్నారు. సరిగ్గా ఆమె ఇంటినుంచి బయటకు బయల్దేరుతున్న సమయంలోనే ఈ దాడి జరిగింది. సరిగ్గా వాళ్లు యాసిడ్ పోయగానే ఆమె కిందకు వంగడంతో యాసిడ్ అంతా కింద పడిపోయిందని, లలితాశర్మ (30) అనే న్యాయవాదికి ఎలాంటి గాయాలు కాలేదని ఏఎస్ఐ దిలీప్ సింగ్ తెలిపారు. ఆమె కోర్టుకు బయల్దేరుతుండగా ఓ నిందితుడు మోటార్ సైకిల్ మీద వచ్చాడని, అతడితో పాటు మరో ఇద్దరు కూడా ఉన్నారని చెప్పారు. చిన్నపాటి గాయాలు కావడంతో ఆమెను మహాత్మాగాంధీ ఆస్పత్రికి తరలించామని, నిందితులను ఇప్పటికే గుర్తించినందున వారి కోసం గాలింపు మొదలుపెట్టామని ఆయన అన్నారు. నిందితులను వెంటనే అరెస్టు చేయాలని జిల్లా బార్ అసోసియేషన్ డిమాండ్ చేసింది.