ఇన్‌సెట్‌లో నిందితుడు దుర్గాప్రసాద్
సాక్షి, నాగోలు: ఫేస్‌బుక్ ఖాతాలతో మహిళల మొబైల్ నంబర్లు సేకరించి నగ్నచిత్రాలు పంపించాలంటూ బ్లాక్ మెయిల్‌కు పాల్పడుతున్న వ్యక్తిని రాచకొండ సైబర్‌క్రైం పోలీసులు శనివారం అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. రాచకొండ సైబర్ క్రైం పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నగరంలో నివసించే మోటా దుర్గాప్రసాద్ (23) ప్రైవేట్ ఉద్యోగి. ఇంటర్నెట్‌లో నీలి చిత్రాలు చూస్తుంటాడు. సోషల్ మీడియా ప్లాట్‌ఫాం నుంచి అమ్మాయిల ఫోన్ నంబర్లను సేకరించి వాట్సాప్ ద్వారా అసభ్యకర దృశ్యాలను పంపించేవాడు. మహిళలకు వీడియో కాల్స్ చేసి వారి నగ్న చిత్రాలను పంపించాలంటూ బ్లాక్‌మెయిల్ చేసేవాడు. ఇందుకు నిరాకరించిన మహిళల మొబైల్ నంబర్లను పోర్న్ వెబ్‌సైట్‌లో, ఇంటర్నెట్‌లో పెడతానంటూ బెదిరించేవాడు. ఈ క్రమంలో నగరానికి చెందిన ఓ మహిళా న్యాయవాదిని వాట్సాప్ చాటింగ్‌తో వేధింపులతో గురి చేయడంతో ఆమె రాచకొండ సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశారు. (పోర్న్‌సైట్లలో విద్యార్థినులు, లెక్చరర్ల ఫోటోలు)
ఈ మేరకు సైబర్ క్రైం పోలీసులు కేసు దర్యాప్తు మొదలుపెట్టారు. విశ్వసనీయం సమాచారం, సాంకేతిక ఆధారాలతో నిందితుడు దుర్గా ప్రసాద్‌ను శనివారం అరెస్టు చేశారు. ఇతనిపై నల్లగొండ, సైబరాబాద్ పరిధిలో పలు కేసులు ఉన్నాయని, గతంలో జైలుకు వెళ్లివచ్చినట్లు పోలీసుల విచారణలో తేలింది. అయినా తన ప్రవర్తన మార్చుకోకుండా మహిళలపై వేధింపులకు పాల్పడుతున్నట్లు వెల్లడైంది. ఈ సందర్భంగా రాచకొండ పోలీస్ కమిషనర్ మహేష్ భగవత్ మాట్లాడుతూ.. బాలికలు, మహిళలు సోషల్ మీడియా ప్లాట్‌ఫాంలో జాగ్రత్త వహించాలని, తెలియని స్నేహితుల అభర్యర్థనలను అంగీకరించవద్దని, వ్యక్తిగత వివరాలు కొత్తవారితో పంచుకోవద్దని సూచించారు. (ఇద్దరు మైనర్లపై 11 మంది గ్యాంగ్ రేప్..)
Comments
Please login to add a commentAdd a comment