నిద్రిస్తున్నపిల్లలపైకి దూసుకెళ్లిన వాహనం | 1 children killed in accident at guntur district | Sakshi
Sakshi News home page

నిద్రిస్తున్నపిల్లలపైకి దూసుకెళ్లిన వాహనం

Published Sat, Nov 12 2016 12:38 PM | Last Updated on Wed, Apr 3 2019 7:53 PM

1 children killed in accident at guntur district

సత్తెనపల్లి: కాంక్రీట్ మిక్చర్ కలిపే వాహనం కిందపడి ఓ చిన్నారి మృతి చెందగా.. మరో బాలుడికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన గుంటూరు జిల్లా సత్తెనపల్లిలో శనివారం చోటు చేసుకుంది. స్థానిక అచ్చంపేట రైల్వేగేట్ వద్ద నూతనంగా విద్యుత్ సబ్‌స్టేషన్ నిర్మిస్తున్నారు. అక్కడ పని చేయడానికి వచ్చిన కూలీలు తమ పిల్లలను పక్కనే ఉన్న చెట్టు కింద పడుకోబెట్టారు. ఈ పనుల్లో భాగంగా సిమెంట్ మిక్చర్ వాహనం రివర్స్ తీస్తూ నిద్రిస్తున్న చిన్నారులపైకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో శరత్ అనే మూడేళ్ల చిన్నారి అక్కడికక్కడే మృతి చెందగా.. మరో బాలుడికి తీవ్ర గాయాలయ్యాయి. ఇది గుర్తించిన అక్కడి కూలీలు గాయాల పాలైన చిన్నారిని ఆస్పత్రికి తరలించి పోలీసులకు సమాచారం అందించారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement